*_హాస్యభరితం.._*
*_ఈ బ్రహ్మం గారి చరితం!_*
😄😄😄😄😄😄😄
*_బ్రహ్మి..సాప్ట్ వేర్ ఇంజనీర్.._*
*_ఖాన్ తో గేమ్స్ ఆడకు.._*
*_నన్ను ఇన్వాల్వ్_*
*_చెయ్యకండి రావుగారూ.._*
*_కిల్మిల్ పాండే.._*
*_బద్దం భాస్కర్.._*
*_మెక్ డొనాల్డ్ మూర్తి.._*
*_గచ్చిబౌలి దివాకర్.._*
వీటన్నిటి కంటే ముందు
*అరగుండు..*
ఒకటా రెండా..
వెయ్యిపైగా సినిమాలు..
*సహస్ర నామాలు..*
కామాలు,ఫుల్ స్టాప్లు లేని
మూడు దశాబ్దాలకు పైగా
పరుగు..
మధ్యలో *ఆల్డాతో ప్రేమ,పెళ్లి*
*కోవై సరళతో అవి తన్నులా..*
తనకంటే పొడుగైన
హేమతో జోడీ..
*_ఒలింపిక్ జ్యోతిలా_*
*_కప్పు సాసర్ పట్టుకుని ఉండాలా_* అంటూ రుబాబు..
పార్ధుని అడిగి మరీ
పొట్టలో గుద్దించుకుని
షేవింగ్ క్రీమ్ పిండేసిన డాబు
అద్దెలు వసూలు చేసుకునే
_*బెంగాలీ బాబు..*_
అసలు కామెడీకి
ఆయనే నవాబు..
టైమింగే జవాబు..
పేరులోనే ఆనందం..
అది కాస్త ఎక్కువై *_బ్రహ్మానందం_*
ఆయన కనిపిస్తే చాలు
అభిమానులకు మహదానందం..!
నవ్వించడంలో బ్రహ్మీది
సెప"రేటు" స్పార్కు ..
తెలుగు సినిమా కామెడీలో
ఆయనది ఓ బెంచి మార్కు..
తొలితరంలో రేలంగి
ఆ తర్వాత రాజబాబు
ఇప్పుడు *బ్రహ్మానందం..*
ముందు..పిదప ఎందరొచ్చినా
ఈ ముగ్గురే
హాస్యానికి సద్గురూలు..
రామారావు,బాలయ్య..
కళ్యాణ్ రామ్..ఎన్టీఆర్..
ఏయెన్నార్..నాగ్..
సుమంత్..చైతూ..
కృష్ణ..మహేష్ బాబు..
చిరు,పవన్,చెర్రీ..బన్నీ..తేజ్
వారసత్వం ఏదైనా
నవ్వుల నాయకత్వం బ్రహ్మానందమే..
అప్పుడప్పుడు కాస్త విలనీ
హీరోలపై ఎగనీ...
అప్పుడూ హిట్టే..
_*అందరికీ ఆయన ఫేవరెట్టే..!*_
పొట్టి పాంటు..హాఫ్ నిక్కరు..
బనీను..కెట్సు..
ఆలీ మాఫియా లాంటి
ముష్టియాతో చిత్రహింస..
మధ్యలో సిఐ పశుపతి
*నైట్ వాచ్మెన్ పోస్టు..*
పోకిరీ హిట్టులో
ఈ కామెడీ ట్రాకే సీక్రెట్టు..
*_అదుర్స్ భట్టు..._*
అసలు టాలీవుడ్ తెరకి
*బ్రహ్మానందమే పెద్ద అసెట్టు..!*
బ్రహ్మీ..నవ్వంటే నువ్వే..
నువ్వుంటే నవ్వే..
జంధ్యాల తోటలో
విరిసిన పువ్వే..
నువ్వు కనిపిస్తే
ధియేటర్లు కెవ్వుకెవ్వే..
హాస్యబ్రహ్మకు
జన్మదిన శుభాకాంక్షలతో..
💐💐💐💐💐
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286
7995666286
No comments:
Post a Comment