Wednesday, March 4, 2026

మానసిక స్థితి @antharmukhayanam #meditationtelugu#ధ్యానం

మానసిక స్థితి @antharmukhayanam #meditationtelugu#ధ్యానం

Author Name:Inner Peace - Antharmukhayanam

Youtube Channel Url:https://www.youtube.com/@antharmukhayanam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7tpnW4p2NY0



Transcript:
(00:00) అందరికీ నమస్కారం. అంతర్ముఖ యానంలోకి స్వాగతం. [సంగీతం] మానసిక స్థితి. ఈ విషయం షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖ యానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. ముందుగా మా వీడియోలని చూసి ఆదరించి అలానే షణ్ముఖానంద్ గారి పుస్తకాలను అంతర్ముఖ యానం నేటి సమాజానికి బుద్ధిని ధర్మం. వీటిని కొని వారి మంచి అభిప్రాయాలని మాకు తెలియజేస్తున్న వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మానసిక స్థితి.
(00:29) మనందరి మనసు ఎల్లవేళల ఘర్షణ పడుతూ ఉంటుంది. ఈ ఘర్షణ మరొకరితో కాదు మనసు రెండుగా చీలి ఒక భాగం మరొక భాగంతో ఘర్షణ పడుతూ ఉంటుంది. ఒక భాగం సహజ సిద్ధంగా తానేమిటో తన స్వభావం ఏమిటో తాను ఎలా ఉండటానికి అలవాటు పడిందో అలా ఉంటుంది. మరొక భాగం ఈ ఉన్న లేక ఉంటున్న స్థితి నచ్చక మరోలాగా అనగా ఆదర్శాలు సిద్ధాంతాలు ఇజంలు ఊహలు పెట్టుకొని అలా అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.
(00:58) అనగా ఉంటూ ఉన్న స్థితికి ఉండాలనుకునే స్థితికి మధ్య సంఘర్షణ పాపం మనసు చితికిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు మనసు ఉన్న స్థితి హింస స్వార్థం ఉండాలనుకునే స్థితి అహింస నిస్వార్థం. ఈ రెండింటి మధ్య ఘర్షణ మనసు హింసాత్మకంగాను లేక అహింసగాను ఉండలేదు. దీని ఫలితం ఘర్షణ. ధ్యానం మనసుని అలవాటు పడిన స్థితి కాక ఉండాలనుకునే స్థితి కాక అసలు ఉండాల్సిన [సంగీతం] స్థితి అయిన ప్రజ్ఞా స్థితిలో ఉంచుతుంది.
(01:28) ఈ విషయం మీకు నచ్చితే షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖ యానం, అలానే నేటి సమాజానికి బుద్ధిని, ధర్మం. ఈ పుస్తకాలను కొనాలనుకునేవారు పుస్తకానికి 240 చొప్పున 9848368290 [సంగీతం] కిఫన్పే గాని జీపే గాని చేసి అదే నెంబర్ కి గలవాట్ లో నీ పోస్టల్ అడ్రెస్ పెడితే నేను వెంటనే పుస్తకాలని పోస్ట్ చేయగలను. అట్లానే కామెంట్ సెక్షన్ లో మీరు ధ్యానం గురించి మనసు గురించి కోపం గురించి ఇట్లా ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే [సంగీతం] ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే షణ్ముఖానంద గారు రచించిన పుస్తకాల్లో నుంచి చూసి ఆ టాపిక్ కి సంబంధించిన వీడియో చేయగలం ధన్యవాదాలు

No comments:

Post a Comment