Brahmacharya: The Hidden Yogic Science of Energy Transformation & Kundalini Awakening
Author Name:SVL Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@svltelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ORKCjs4EFYQ
Transcript:
(00:00) మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక వెలుగే ప్రమిదిలో ఉన్న నెయ్యి జ్యోతిగా మారి లోకానికి వెలుగునిస్తుంది. కానీ ఆ నెయ్యి ఎక్కడి నుండి వచ్చింది పాలు పెరుగుగా మారి పెరుగు చిలకగా వెన్న వచ్చి ఆ వెన్నను అగ్నిపై మరిగిస్తేనే కదా అది స్వచ్ఛమైన నెయ్యిగా రూపాంతరం చెందింది. సరిగ్గా మన శరీరంలో ఉన్న వీర్యశక్తి కూడా అంతే బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక నిగ్రహం అనుకుంటే మీరు పొరబడినట్లే ఇది మీలోని ప్రాణశక్తిని అద్భుతమైన కాంతిగా మార్చే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ మన శరీరం సప్త ధాతువుల సమ్మేళనం ఇందులో అత్యంత శక్తివంతమైన ధాతువును వృధా చేయకుండా యోగాగ్నిలో
(00:33) తపింపజేస్తే అది ఓజస్సుగా తేజస్సుగా మారుతుంది. శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని దహించాడనే పురాణ గాధ వెనుకున్న అసలు రహస్యం మీకు తెలుసా? అది కామాన్ని దహించడం కాదు కామమనే పదార్థాన్ని జ్ఞానం అనే శక్తిగా రూపాంతరం చెందించడం. అంటే లోపలున్న శక్తిని ఊర్ధ్వము ముఖంగా ప్రవహింపజేసి ఆజ్ఞా చక్రానికి చేర్చడం. ఈ వీడియోలో తెలుసుకోబోయేది కేవలం ఇంద్రియ నిగ్రహం గురించి కాదు.
(00:59) మీలోని నిద్రాణమైన కుండలిని శక్తిని ఎలా జాగృతం చేయాలి మరియు చెల్లాచెదురుగా ఉన్న మీ మనసును భూతద్దంలా కేంద్రీకరించి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడం ఎలా? పుట్టడం తినడం సంతానాన్ని కనడం మాత్రమే జీవితం కాదు ఈ భౌతిక దేహంలో ఉంటూనే పరమాత్మ తత్వాన్ని అనుభూతి చెందడమే మానవ జన్మ పరమార్థం ఇప్పుడు ఆ రహస్యాలను పూర్తిగా విప్పుదాం.
(01:20) బ్రహ్మచర్యం అనేది కేవలం ఒక శారీరక క్రమశిక్షణ లేదా ఇంద్రియ నిగ్రహం మాత్రమే కాదు అది మనలోని ప్రాణశక్తిని అద్భుతమైన కాంతిగా మార్చే ఒక మహోన్నతమైన ప్రక్రియ మానవ శరీర నిర్మాణం కేవలం రక్త మాంసాలతో కూడినది కాదు అది సప్త ధాతువుల సమ్మేళనం మనం పుట్టినప్పటి నుండి పెరిగే క్రమంలో మనం తీసుకునే ఆహారం ఆలోచనలు మరియు జీవనశైలి కారణంగా ఈ సప్త ధాతువులలో అనేక మలినాలు చేరుతూ ఉంటాయి.
(01:47) ఒక గురువు తన శిష్యునిపై అనుగ్రహం చూపించాలన్నా ఆ శిష్యునిలో మార్పు రావాలన్నా మొదట ఆ శిష్యునిలోని ఈ సప్త ధాతువులలో ఉన్న మలినం పరిపక్వం కావాలి. అది వండబడని పదార్థం లాంటిది. పదార్థం ఉడికితేనే అది భోజనానికి యోగ్యమవుతుంది. అలాగే మనలోని ధాతువులు సంస్కరించబడినప్పుడే ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యమవుతుంది.
(02:11) అది పరిపక్వం కానంతవరకు సాక్షాత్తు గురువు కూడా ఏమి చేయలేడు. ఎందుకంటే పాత్రశుద్ధి లేనిదే జ్ఞానం అనే పాలు నిలవవు. మన శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. ఈ పంచభూతాలకు శారీరక పునాది ఈ సప్త ధాతువులే పృథ్వి తత్వానికి సంబంధించిన అత్యంత సూక్ష్మమైన పరమాణువులు మన మూలాధార చక్రంలో నిక్షిప్తమై ఉంటాయి. దీనిని ఒక అద్భుతమైన ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు.
(02:36) ఆవుపాలను మనం నేరుగా తీసుకుంటే అవి కేవలం పాలు మాత్రమే కానీ వాటిని వేడి చేసి తోడు పెడితే అది పెరుగుగా మారుతుంది. ఆ పెరుగును కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నను మళ్ళీ నిప్పుపై మరిగిస్తే అది స్వచ్ఛమైన నెయ్యిగా రూపాంతరం చెందుతుంది. చివరకు ఆ నెయ్యి ప్రమిదలో జ్యోతిగా మారి లోకానికి కాంతినిస్తుంది. మనలోని బ్రహ్మచర్యం లేదా వీర్యశక్తి కూడా సరిగ్గా ఇలాగే క్రమంగా మార్పు చెందాలి.
(03:03) పాలు ఎలాగైతే కాంతినిచ్చే జ్యోతిగా మారాయో మనలోని శారీరక శక్తి కూడా ఆధ్యాత్మిక సాధన ద్వారా ఓజస్సుగా తేజస్సుగా మారాలి. మూలాధారంలో నిద్రాణమై ఉన్న ఈ శక్తి స్వాధిష్టానానికి అక్కడి నుండి మణిపూరక అనాహత మరియు విశుద్ధి చక్రాల వరకు ప్రయాణించినప్పుడు అది క్రమంగా కాంతిగా రూపాంతరం చెందుతుంది. ఆ శక్తి ఎప్పుడైతే ఆజ్ఞా చక్రానికి అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉన్న స్థానానికి చేరుకుంటుందో అప్పుడు సాధకునిలో ఒక అద్భుతమైన ప్రకాశం మొదలవుతుంది.
(03:32) శివుడు మన్మధుడిని తన మూడవ కంటితో దహించాడనే పురాణ గాధ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే మన్మధుడు అంటే కామం లేదా భౌతిక వాంఛ శివుడు తనలోని సప్తధాతువును లేదా వీర్యశక్తిని ఊర్ధ్వము ముఖంగా ప్రవహింపజేసి దానిని కాంతిగా మార్చుకున్నాడు. అంటే [సంగీతం] ఆయన పదార్థాన్ని శక్తిగా రూపాంతరం చెందించాడు. కామాన్ని ప్రేమగా ప్రేమను భక్తిగా భక్తిని జ్ఞాన ప్రకాశంగా మార్చడమే నిజమైన బ్రహ్మచర్యం యొక్క అంతరార్థం.
(04:01) ఇది కేవలం దేహాన్ని కష్టపెట్టడం కాదు దేహంలోని శక్తిని ఉన్నతీకరించడం ఈ అత్యున్నత స్థితిని చేరుకోవడానికి అష్టాంగ యోగం ఒక గొప్ప మార్గదర్శినిగా నిలుస్తుంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన మరియు సమాధి అనే ఎనిమిది అంగాలు ఇందులో ఉన్నాయి. వీటిలో తపస్సు అనేది చాలా కీలకమైనది. తపస్సు అంటే కేవలం అడవులకు వెళ్లి కూర్చోవడం కాదు తపస్సు అంటే ఒక లక్ష్యం కోసం మనల్ని మనం మలచుకోవడం ఒక ఫలితం కోసం వేచి చూడటం ప్రాణాయామంలో భస్త్రిక వంటి వేగవంతమైన శ్వాస ప్రక్రియలు చేయడం ద్వారా మనలోని ప్రాణశక్తి ఉష్ణాన్ని పుట్టించి వెన్నెముక ద్వారా ఊర్ధ్వము
(04:40) ముఖంగా ప్రయాణించడం మొదలవుతుంది. పాలు పెరుగుగా పెరుగు నెయ్యిగా మారినట్లే మనలోని ధాతువు కూడా ఈ యోగ అగ్నిలో తపించి జ్యోతిగా మారుతుంది. అయితే బ్రహ్మచర్యం విషయంలో అతిగా ప్రవర్తించకూడదు లేదా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళకూడదు బలవంతంగా బ్రహ్మచర్యాన్ని రుద్దడం వల్ల లేదా ఇంద్రియాలను హింసించడం వల్ల శరీరంలోని నాడులకు తీవ్రమైన ఇబ్బంది కలగవచ్చు దీని వల్ల మానసిక అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది.
(05:10) ప్రకృతి సహజమైన సమతుల్యత చాలా ముఖ్యం. సంతానం కోసం లేదా శరీరం అదుపు తప్పినప్పుడు సంయమనం పాటిస్తూనే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి. సమాధి స్థితికి మరియు సంసారానికి మధ్య ఒక సున్నితమైన సమతుల్యతను కాపాడుకోవాలి. దీనికి ఆహార నియమాలు ప్రాణప్రదమైనవి. మనం తినే ఆహారమే మన మనసును నిర్మిస్తుంది. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల చిత్తం స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది.
(05:36) మాంసాహారం మద్యం వంటి తామసిక ఆహారాలు మనలోని పశు ప్రవృత్తిని ప్రేరేపించి బ్రహ్మచర్యానికి మరియు ఆధ్యాత్మిక సాధనకు పెద్ద ఆటంకంగా మారుతాయి. [సంగీతం] అతిగా మసాలాలు లేని సాధారణ ఆహారం పప్పు అన్నం తాజా కూరగాయలు వంటివి సాధకుడికి అత్యంత శ్రేష్టమైనవి. ఇవి నాడీ వ్యవస్థను శాంతపరిచి ధ్యానానికి సహకరిస్తాయి. ఎవరైతే నిజమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారి శరీరంలో మరియు మనసులో ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి అంటే వైటాలిటీ ఏర్పడుతుంది.
(06:09) అటువంటి వ్యక్తి ఎవరిని ఏది ఆశించడు ఎవరి ముందు మోకరిల్లడు. అతని లోపల ఉన్న ఆత్మస్థైర్యమే అతని వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని గుర్తింపును తెచ్చిపెడుతుంది. లోకం అతని వైపు ఆకర్షించబడుతుంది. ఇక ధ్యానం విషయానికి వస్తే చాలామంది ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకుని గంటల తరబడి కూర్చోవడం అని భావిస్తారు. కానీ నిజమైన ధ్యానం అంటే ఏకాగ్రత మరియు ఎరుక.
(06:35) దీనిని వివరించడానికి గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే ఒక ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. ఒక పల్లెటూరి అమ్మాయి తలపై నీళ్ళ బిందెను పెట్టుకొని చేతులతో పట్టుకోకుండానే తన స్నేహితురాళ్లతో మాట్లాడుతూ నవ్వుతూ మైళ్ల దూరం నడుస్తుంది. ఆమె శరీరం కదుడుతున్న ఆమె మాటల్లో నిమగ్నమైనా ఆమె పూర్తి అంతర్గత శ్రద్ధ లేదా ధ్యానం [సంగీతం] ఆ బిందెపైనే ఉంటుంది.
(07:00) ఒక్క క్షణం ధ్యానం తప్పినా ఆ బిందె కింద పడిపోతుంది. అలాగే అడవిలో గడ్డి మేస్తున్న ఆవును గమనించండి. అది గడ్డి మేస్తున్నట్లు కనిపిస్తున్న దాని దృష్టి ఎప్పుడు తన దూడ ఎక్కడుందో అనే దానిపైనే ఉంటుంది. మనం కూడా లోకంలో రకరకాల పనులు చేస్తున్న వృత్తి ధర్మాలు నిర్వహిస్తున్న మన అంతరాత్మలో పరమాత్మ పై నిరంతర దృష్టి ఉండటమే అసలైన [సంగీతం] ధ్యానం.
(07:24) దీనినే సహజ సమాధి అని కూడా అనవచ్చు. సూర్యరశ్మి ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నా అది దేనిని కాల్చదు. ఎందుకంటే ఆ కిరణాలు వెదజల్లబడి ఉన్నాయి. కానీ అదే కిరణాలను ఒక భూతద్దం ద్వారా ఒకే చోట కేంద్రీకరిస్తే అది కాగితాన్ని దహించగల శక్తిని పొందుతుంది. మన మనసు కూడా అలాగే ఉంటుంది. వేల కొద్ది ఆలోచనలతో చెల్లాచెదురుగా ఉన్న మనసు బలహీనంగా ఉంటుంది.
(07:48) కానీ ఆ ఆలోచనలన్నింటిని మళ్ళంచి ఒకే కేంద్రంపై నిలిపితే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న అనంతమైన శక్తులు మేల్కొంటాయి. అప్పుడు అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయి. ధ్యాన సాధనలో ముద్రలు కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. యోగశాస్త్రం ప్రకారం కేచరి, ఖాచి కోచి, అఘోరి మరియు ఉన్మణి అనే ఐదు ముఖ్యమైన ముద్రలు ఉన్నాయి. వీటిలో ఉన్మణి ముద్ర అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది.
(08:14) బాహ్య ప్రపంచం నుండి దృష్టిని మళ్ళంచి నాసికాగం పై లేదా భ్రూమ మధ్యంపై దృష్టి నిలిపి సాధన చేయడం వల్ల క్రమంగా మనలోని చైతన్యం ఉన్నత స్థాయిలకు చేరుకుంటుంది. మన ఉనికి అనేది కేవలం ఈ శరీరం కాదు అది ధ్వని యొక్క ప్రతిధ్వని సంగీతంలోని సప్త స్వరాలు ఎలాగైతే చంద్రుని నుండి పుడతాయని చెబుతారో మనలోని ఆత్మ కూడా ఒక రకమైన పవిత్ర కంపనం.
(08:38) ధ్యానంలో శ్వాసను గమనించడం అత్యంత ప్రాథమిక సూత్రం శ్వాస మన ప్రాణానికి ఆధారం ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా వదలడం వంటి కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా మనలోని ఇడా పింగళ మరియు సుషుమ్న నాడులు మేల్కొంటాయి. ఈ నాడుల శుద్ధి జరిగినప్పుడే కుండలిని శక్తి జాగృతమవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునే వారికి కేవలం పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదు.
(09:03) అనుభూతి లేదా అనుభవం అనేది అతి ముఖ్యం. నిప్పు గురించి మీరు ఎన్ని వేల పుస్తకాలు చదివినా ఎన్ని గంటల ప్రసంగాలు విన్నా అది కాల్చుతుందనే కఠినమైన సత్యం మీకు నిప్పును తాకినప్పుడే అర్థమవుతుంది. అలాగే విపరీతమైన దాహం వేసినప్పుడు ఒకచోట కూర్చుని నీళ్ళు నీళ్ళు అని వేలసార్లు జపించడం వల్ల మీ దాహం తీరదు. మీరు లేచి వెళ్లి నీటిని వెటికి తాలాలి.
(09:27) అలాగే దైవ చింతనలో లేదా ఆధ్యాత్మికతలో కేవలం మంత్రాలు చదవడం పూజలు చేయడం కంటే [సంగీతం] ఆ దైవిక శక్తిని మీ లోపల అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ముఖ్యం. భగవంతుడు ఎక్కడో ఆకాశంలోనో దేవాలయాల్లోనో మాత్రమే లేడు ఆయన మీ శ్వాసలో మీ స్పందనలో ఉన్నాడు. ఆ స్పందనను పట్టుకోవడమే సాధన. కుండలిని శక్తి అనేది ఏదో ఆశ్రమాలకు వెళితేనో లేదా డబ్బులు చెల్లిస్తేనో లభించే వస్తువు కాదు అది ప్రతి మానవునిలోనూ మూలాధార చక్రంలో నిద్రాణమై ఉన్న ఒక దివ్య శక్తి ఆ శక్తిని నిద్రలేపాలంటే నిరంతర సాధన పవిత్రమైన బ్రహ్మచర్యం మరియు ఒక సమర్థుడైన గురువు యొక్క కృప అవసరం. మనలోని అరిషెడ్ వర్గాలను
(10:06) జయించి మనసును ప్రశాంతం చేసుకున్నప్పుడు ఆ శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. జీవితం అంటే కేవలం పుట్టడం తినడం సంతానాన్ని కనడం మరియు చనిపోవడం కాదు. ఈ భౌతిక దేహంలో ఉంటూనే పరమాత్మ తత్వాన్ని అనుభూతి చెందడం పదార్థాన్ని శక్తిగా మార్చుకొని చిరంజీవత్వాన్ని లేదా మోక్షాన్ని పొందడమే మానవ జన్మ యొక్క పరమార్థం.
(10:30) ఈ ప్రయాణంలో బ్రహ్మచర్యం ఒక మెట్టు అయితే ధ్యానం అనేది ఆ గమ్యాన్ని చేర్చే వాహనం ఈ రెండింటిని సమన్వయం చేసుకున్నవాడే నిజమైన యోగి మరియు సాధకుడు అందువల్ల మన జీవనశైలిని మార్చుకోవాలి. అనవసరమైన ఆలోచనలకు వ్యసనాలకు దూరంగా ఉంటూ మనలోని శక్తిని వృధా చేయకుండా సంరక్షించుకోవాలి. ఆ శక్తిని ధ్యానం ద్వారా మలిచి జ్ఞాన కాంతిని పొందాలి. మన లోపల వెలిగే ఆ జ్యోతి మనకే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా వెలుగునిస్తుంది.
(11:01) ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని వదిలేయడం కాదు జీవితాన్ని మరింత అర్థవంతంగా శక్తివంతంగా జీవించడం బ్రహ్మచర్య దీక్షతో ధ్యాన బలంతో మనల్ని మనం మలచుకుంటే ఈ సృష్టిలోని రహస్యాలన్నీ మనకు విధితమవుతాయి. ఇదే మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన గొప్ప సంపద. దీనిని అర్థం [సంగీతం] చేసుకుని ఆచరణలో పెట్టడమే మనం చేయవలసిన మొదటి పని బ్రహ్మచర్యం అనగానే అందరూ సంసారాన్ని వదిలేయాలని అడవులకు వెళ్ళాలని భ్రమపడుతుంటారు.
(11:30) కానీ మన భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమం అనేది అన్ని ఆశ్రమాల కంటే గొప్పదిగా చెప్పబడింది. సంసారంలో ఉంటూనే బ్రహ్మచర్యాన్ని ఎలా పాటించవచ్చు సంతానం ఎలా కలగాలి అనే అంశాల గురించి యోగశాస్త్రంలో వివరించబడింది. నిజానికి బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక కలయకకు దూరంగా ఉండటం మాత్రమే కాదు బ్రహ్మణి చరతి ఇతి బ్రహ్మచారి అంటే ఎవరి మనసు ఎప్పుడు పరబ్రహ్మ తత్వంలో విహరిస్తుందో వారే బ్రహ్మచారులు సంసార జీవితంలో ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా ఒక వ్యక్తి బ్రహ్మచారిగా ఉండవచ్చు.
(12:06) దీనినే గృహస్థ బ్రహ్మచర్యం అంటారు. ప్రకృతి నియమం ప్రకారం సృష్టి కొనసాగాలి అంటే సంతానం అవసరం. అందుకే మన శాస్త్రాలు సంతానోత్పత్తిని ఒక యజ్ఞంగా పరిగణించాయి. కేవలం ఇంద్రియ సుఖం కోసం కాకుండా ఒక ఉత్తమమైన జీవిని ఈ లోకానికి అందించాలనే సంకల్పంతో చేసే కలయక బ్రహ్మచర్యానికి విఘాతం కలిగించదు. సంతానం కోసం చేసే ప్రయత్నం ఒక పవిత్రమైన కార్యం.
(12:31) దీనికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఋతుకాలంలో సరైన సమయంలో సాత్వికమైన ఆలోచనలతో కూడిన కలయిక వల్ల జన్మించే సంతానం ఉత్తమ గుణాలతో పెరుగుతారు. ఇలాంటి నియమబద్ధమైన జీవనాన్ని గడిపే గృహస్తుడు అడవిలో ఉండి మనసు నిండా కోరికలు నింపుకున్న సన్యాసి కంటే ఎంతో మిన్న సంసారంలో ఉంటూనే తన శక్తిని అనవసరంగా వృధా చేయకుండా కేవలం సంతానం కోసం మాత్రమే వినియోగిస్తూ మిగిలిన సమయంలో ఆ శక్తిని ఊర్ధ్వ ముఖంగా ధ్యానం ద్వారా మళ్ళంచేవాడే నిజమైన సాధకుడు.
(13:03) శ్రీరామకృష్ణ పరమహంస ఒక చక్కని ఉదాహరణ చెబుతారు. ఒక గృహిణి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. వంట వండుతుంది పిల్లలను చూసుకుంటుంది అతిథులకు సేవ చేస్తుంది. కానీ ఆమె మనసులో ఇది నా ఇల్లు కాదు నా శాశ్వత నివాసం వేరే ఉంది అనే ఎరుక ఉంటుంది. అలాగే సంసారంలో ఉన్న వ్యక్తి తన భార్యా పిల్లల పట్ల బాధ్యతగా ఉంటూనే లోపల తన ఆత్మతో అనుసంధానమై ఉండాలి.
(13:26) బురదలో ఉన్న తామర పువ్వు ఎలాగైతే బురదను అంటించుకోదో సంసారంలో ఉంటూ కూడా తామరాకుపై నీటి బొట్టులా జీవించడం నేర్చుకోవాలి. బ్రహ్మచర్యం అనేది ఒక కఠినమైన ఇనుప కంచె కాదు అది ఒక క్రమశిక్షణ. సంతానం కలిగిన తర్వాత కూడా దంపతులు పరస్పర అంగీకారంతో సంయమనం పాటిస్తూ కేవలం స్నేహపూర్వకమైన ఆధ్యాత్మికమైన బంధాన్ని కొనసాగించవచ్చు. దీనివల్ల వయస్సు పెరిగే కొద్దీ శారీరక శక్తి క్షీణించకుండా అది మానసిక ప్రశాంతతగా మేధస్సుగా మారుతుంది.
(13:57) ఆధునిక కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే సంసారం అడ్డంకి కాదు మనలోని అదుపులేని కోరికలే అడ్డంకి. మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పితం చేస్తూ బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వహిస్తే సంసారమే ఒక తపస్సు అవుతుంది. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి ధ్యానం చేయడం సాత్విక ఆహారం తీసుకోవడం ఉన్నతమైన ఆశయాల కోసం జీవించడం వల్ల ఆ ఇల్లే ఒక ఆశ్రమంగా మారుతుంది.
(14:22) ఇక్కడ బ్రహ్మచర్యం అంటే వీర్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు ఆ వీర్య శక్తిని ఓజస్సుగా మార్చి బుద్ధిని ప్రకాశింప చేసుకోవడం కాబట్టి సంతానం కలగడం అనేది ప్రకృతి ధర్మం దానిని ధర్మబద్ధంగా నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చు
No comments:
Post a Comment