Wednesday, March 4, 2026

నిశబ్దం యొక్క శక్తి Gautama Buddha Wisdom in Telugu Life Changing Motivation

నిశబ్దం యొక్క శక్తి Gautama Buddha Wisdom in Telugu Life Changing Motivation

Author Name:Live to Learn - Learn to Live

Youtube Channel Url:https://www.youtube.com/@LiveToLearnToLive

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HqilDZp-15Q



Transcript:
(00:00) నమస్కారం లివ్ టు లెర్న్ లెర్న్ టు లివ్ ఛానల్ కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నీవు నిశశబ్దంగా ఉండడం నేర్చుకుంటే శబ్దం ఎప్పటికీ నేర్పలేని ప్రతిదీ నీవు అర్థం చేసుకుంటావు. నిశబ్దానికి నీ లోపలి గంధరగోళాన్ని కూడా శాంతింప చేసే శక్తి ఉంటుంది. గౌతమ బుద్ధుడు చెప్పినట్లు నిశబ్దం యొక్క శక్తి చాలా లోతైనది.
(00:25) అది క్షణంలో నీ ఉద్వేగాలను ఆందోళనలను గంధరగోళాలను శాంతింపచేస్తుంది. అది నిన్ను ఇతరులు తామే మాట్లాడాలని కోడుకునే వ్యక్తిగా మారుస్తుంది. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులకు బోధిస్తూ ఇలా అన్నాడు. ప్రపంచంలో అతి పదునైన కత్తి మన నాలుక. అతి ప్రమాదకరమైన ఆయుధం మన మాటలు. ఇవి ఎలాంటి రక్కపాతం జరగకుండానే ఒక మనిషిని లోపల నుంచి అంతం చేసే సామర్థ్యం ఉన్న ఆయుధాలు.
(00:55) మాటలు మన అతి పెద్ద బలం అవుతాయి. అతి పెద్ద బలహీనత కూడా అవుతాయి. తేడా ఒకటే ఏమి ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. సరైన సమయంలో సరైన ఉద్దేశంతో మాట్లాడే మాటలు మనల్ని గొప్ప ఎత్తులకు తీసుకెళ్తాయి. తప్పు సమయంలో అన్న మాటలు మన జీవితాన్నే నాశనం చేస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు కథ ద్వారా నిశబ్దం యొక్క శక్తి ఏమిటి? నిశబ్దంగా ఉండటం ద్వారా మన జీవితాన్ని లోపల నుంచి ఎలా మార్చుకోవచ్చో చెప్పబోతున్నాను.
(01:28) ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మా ఉద్దేశం మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఒకప్పుడు జపాన్ లో రిసై అనే చాలా ప్రసిద్ధ బౌద్ధ భిక్షువు ఉండేవాడు. అతను అడవిలో ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు. అతని జ్ఞానం ధ్యానం అద్భుతమైనవి కాబట్టి జపాన్ మొత్తంలో అతను ప్రసిద్ధి చెందాడు.
(01:53) ఒకరోజు ఒక రాజకుమారుడు వచ్చి ఇలా అన్నాడు. ఓ భిక్షువా నాకు సంపద, కీర్తి, సౌఖ్యం, సుఖ సంతోషాలు అన్ని ఉన్నాయి. అయినా నాలో ఎప్పుడూ అలసట, అశాంతి, అస్థిరత ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? రిసై అతని మాటలు ప్రశాంతంగా విని ఇలా అన్నాడు. నీ ప్రశ్నకు సమాధానం నీ దగ్గరే ఉంది. కానీ నీవు దాన్ని వెతకడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు.
(02:18) ఇప్పుడు నేను చెప్పే పని నీవు చేస్తే నీ అశాంతి అంతా పోతుంది. రాజకుమారుడు అన్నాడు నా మనశశాంతి కోసం ఏమైనా చేస్తాను. రిసై అన్నాడు వచ్చే 15 రోజులు నా ఆశ్రమంలో ఉండు సాధారణ మనుషులా జీవించు ఎక్కువలో ఎక్కువ నిశబ్దంగా ఉండు ఒక్క మాట కూడా మాట్లాడకు కేవలం నిన్ను నీవు గమనించు రాజకుమారుడు అంగీకరించాడు. మొదటి రోజు అతనికి మనసు మరింత అస్థిరంగా అనిపించింది.
(02:46) ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేవలం నిశబ్దంగా కూర్చున్నాడు. ఆ రోజు రాత్రి ఏదో విచిత్రమైన శాంతి లోపల అనిపించింది. రెండో రోజు ఒంటరిగా కూర్చుని ప్రకృతిని గమనించాడు. చెట్లు మొక్కలు పూలు పక్షులు జీవితంలో మొదటిసారి వాటి అందాన్ని క్షుణణంగా గమనించాడు. ఆ సౌందర్యం లోపల కొత్త తాజాదనాన్ని నింపింది. 10 రోజులు ఇలాగే గడిచాయి.
(03:15) అతనిలోని అశాంతి ఆందోళన టెన్షన్ పూర్తిగా మాయమైంది. 11వ రోజు ఉదయం లోతైన ధ్యానంలోకి జారుకున్నాడు. రోజంతా కళ్ళు మూసుకొని నిశబ్దంలో ఉన్నాడు. ఆలోచనలు లేవు ఆందోళన లేదు కేవలం అంతర్గత శాంతి 15వ రోజు భిక్షువు దగ్గరికి వచ్చి నమస్కరించి అన్నాడు. స్వామి ఇప్పుడు నాకు సమాధానం దొరికింది. నేను అవసరం కంటే ఎక్కువ మాట్లాడేవాడిని అనవసరంగా మాట్లాడి నా శక్తిని వృధా చేసేవాడిని పగలంతా మాట్లాడి రాత్రంతా దాని గురించి ఆలోచించేవాడిని అందుకే నా మనసు ఎప్పుడూ కలవరంలో ఉండేది.
(03:54) కానీ ఈ 15 రోజులు నా జీవితంలో అతి శాంతియుతమైన క్షణాలు మొదటిసారి నేను జీవిస్తున్నాను అనిపించింది. నిశబ్దంగా ఉంటే ధ్యానం స్వయంగా జరుగుతుంది. రిసై నవ్వుతూ అన్నాడు. ఈ ప్రపంచంలో చాలామంది అవసరం కంటే ఎక్కువ మాట్లాడుతారు. కోపంలో పోటీలో అలవాటులో ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. తమ అమూల్యమైన శక్తిని కోల్పోతారు. ఒకసారి శిష్యులు బుద్ధుడిని అడిగారు.
(04:20) మీరు ఎందుకు ఎక్కువ సమయం నిశబ్దంగా ఉంటారు? బుద్ధుడు అన్నాడు నిశబ్దమే అంతర్గత శాంతి ద్వారం నిశబ్దమే స్వయం జ్ఞానానికి మొదటి మెట్టు ఒక మనిషి ఎంత తక్కువ మాట్లాడతాడో అంత తక్కువ తప్పులు చేస్తాడు. ఫ్రెండ్స్ నిజమైన అవగాహన నిశబ్దంలో ఉంటుంది. మాట్లాడకపోతే నీవు జన సమూహంలో ఉండి ఒంటరిగా ఉన్నట్లు బజార్లో నిల్చుని హిమాలయ శిఖరంపై ఉన్నట్లు అనిపిస్తుంది.
(04:49) నిశబ్ద కల నేర్చుకున్నవాడు అంతర్గత యాత్ర మొదలు పెట్టినట్లే అతనికి పరిపూర్ణత అనిపిస్తుంది. మొదటి అడుగు నిశబ్ద శక్తిని స్వీకరించడం అప్పుడు నీ శక్తి ఆదా అవుతుంది. భయాలు తొలతాయి. అంతర్గత శాంతి అనుభవం అవుతుంది. ఎక్కడైనా అసౌకర్యంగా అనిపిస్తే కళ్ళు మూసుకుని లోపలికి మునిగిపో అక్కడ నీకు శాంతి దొరుకుతుంది. ఎందుకంటే జీవితం యొక్క లోతైన మూలం బయట కాదు నీ లోపల ఉంది.
(05:17) ఫ్రెండ్స్ మనం ఒకరినొకరు చెప్పడంలో నిపుణులమైపోయాం. కానీ వినడం మర్చిపోయాం. నిశబ్దం మనల్ని చిన్నవాళ్ళను చేస్తుందని భయపడతాం. కానీ సత్యం ఏమిటంటే నిశబ్దమే మనల్ని గొప్పవాళ్ళను చేస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రయత్నం చేయండి. అవసరం లేని మాట మాట్లాడాలనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగండి ఇది నిజంగా అవసరమా ఇది ఎవరికైనా మేలు చేస్తుందా? ఇది నా శక్తిని ఆదా చేస్తుందా? అని మీకు మీరు అడగండి.
(05:47) చివరిగా ఒక చిన్న మాట ఈ లోకంలో చాలా శబ్దం ఉంది కానీ మీ లోపల ఒక చిన్న నిశబ్దపు దీపం వెలిగించండి. ఆ దీపం ఒక్కసారి వెలిగితే మీ జీవితం మొత్తం ఒక దివ్య ప్రకాశంతో నిండిపోతుంది. ఇంతకీ మీరు ఈ రోజు నుంచి ఈ చిన్న ప్రయోగం చేస్తారా ఒక రోజు పాటు అవసరం లేని మాట మాట్లాడకుండా ఉండగలరా చేయగలిగితే క్రింద కామెంట్ లో నేను చేయగలను అని రాయండి.
(06:16) ఈ కథ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలుల కోసం మన లివ్ టు లెర్న్ లెర్న్ టు లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ జై హింద్

No comments:

Post a Comment