ఆత్మగౌరవం - Self Respect
Author Name:Bhoopala Ragam
Youtube Channel Url:https://www.youtube.com/@BhoopalaRagam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MAeFukvAbg0
Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతున్నారా? చులకనగా చూస్తున్నారా? లేదా ఏదైనా వ్యవహారంలో మీకు ఇష్టం లేక నో చెప్పాలనుకున్నా మొహమాటానికి పోయి ఎస్ అని చెప్తున్నారా? అయితే మీకు కావలసిన ముఖ్యమైన గుణం ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? మనకి మనం ఇచ్చే విలువ మనమఏంటో మన వర్త్ ఏంటో తెలుసుకోవడం మనకు నచ్చని విషయాలకు కరాకండిగా నో చెప్పడం ఎవరైనా మనల్ని తక్కువగా చూస్తే సహించకపోవడం అది ఈగో కాదు ఆటిట్యూడ్ కాదు పొగరు అంతకన్నా కాదు అది మనకు మనం ఇచ్చుకునే
(00:47) గౌరవం ఇతరులు మనల్ని గౌరవించేలా చేసుకోవడం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రాంభూపాల్ మన ఛానల్ భూపాల రాగం కి మరొక మంచి టాపిక్ తో మీ అందరికీ కి స్వాగతం. మీరు ఆఫీస్ లో సిన్సియర్ గా పని చేస్తారు. లేట్ అవర్స్ కూడా పని చేస్తారు. అవసరమైతే వీకెండ్స్ లో కూడా మీ బాస్ కి నో చెప్పలేక పని చేస్తారు. అలా చాలా కాలం తర్వాత పని ఒత్తిడి వల్ల మీరు బాగా అలసిపోతున్నారు.
(01:13) మీ పర్సనల్ లైఫ్ కూడా బాగా మిస్ అవుతున్నారు. ఒకరోజు మీ బాస్ ఈ వీకెండ్ కూడా వర్క్ చేయాలి అంటాడు. అప్పటికే బాగా విసికిపోయిన మీరు కామ్గా సారీ సార్ వారమంతా డెడికేటెడ్ గా వర్క్ చేస్తాను కానీ వీకెండ్ నా పర్సనల్ టైం సార్ అంటారు. కొంతసేపు నిశశబ్దం ఏమవుతుంది అనుకుంటున్నారు జాబ్ పోతుందనా నో అప్పటి నుంచి మీ బాస్ మరింత రెస్పెక్ట్ ఫుల్ గా మీతో ఉండడం మొదలు పెడతారు.
(01:41) దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యువర్ సైలెంట్ సూపర్ పవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు మంచి గుణం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకు మీరే విలువ ఇస్తే మీకు మీరే స్ట్రాంగ్ అనిపిస్తారు. బౌండరీస్ ఏర్పడతాయి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరైనా మీతో మిస్ బిహేవ్ మిస్ యూస్ చేయడం తగ్గుతుంది. మనశశాంతిగా ఉంటుంది. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే టెన్షన్ తగ్గుతుంది.
(02:07) ఇతరుల నుండి గౌరవం లభిస్తుంది. మిమ్మల్ని మీరే గౌరవించుకుంటే ప్రపంచం కూడా గౌరవిస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ సానుకూల అంశాలు మంచి రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి. కెరీర్ లో గ్రోత్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల డెసిషన్స్ క్లియర్ గా తీసుకోగలుగుతారు. ఇతరుల ప్రభావం సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్స్ బాగా తగ్గుతుంది.
(02:31) ఎందుకంటే మీరు కేర్ చేయరు. ఉదాహరణకి మన వీడియోస్ కి ఎక్కువగా లైక్స్ రాకున్నా నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చేస్తాను అనుకోవడం అయితే అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ తో అంతా మంచిదేనా సెల్ఫ్ రెస్పెక్ట్ తప్పుగా వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది తెచ్చే తంటాలు ఏంటో చూద్దాం. సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం ఎక్కువైతే ఈగోగా మారుతుంది. అహంకారం పెరుగుతుంది. నేను గొప్ప నేను ఇంపార్టెంట్ అనే స్థాయి నుంచి నేనే గొప్ప నేనే ఇంపార్టెంట్ అనే స్థాయికి వెళ్తుంది.
(03:07) కాంప్రమైజ్ కాలేకపోవడం వల్ల రిలేషన్షిప్స్ లో ఇష్యూస్ వస్తాయి. అవతలి వాళ్ళను బట్టి పట్టు విడుపులు ఉండాలి. వేరేవాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇతను బాగా ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు పొగరబోతూ అనుకుంటారు. లోన్లీనెస్ పెరుగుతుంది. అందరినీ దూరం చేసుకుంటే చివరికి ఒంటరిగా మిగిలిపోతాం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కానీ బ్యాలెన్స్ కూడా ఉండాలి.
(03:32) మిమ్మల్ని మీరు గౌరవించుకోండి కానీ ఇతరులను కూడా గౌరవించండి. అవసరమైనప్పుడు నో చెప్పండి. కానీ నేర్చుకోవడానికి ఓపెన్ గా ఉండండి. ఆత్మగౌరవానికి వినయం తోడైతే మీరు ఒక బలమైన శక్తిగా వ్యక్తిగా ఎదుగుతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ప్లస్ హ్యూమిలిటీ ఈక్వల్ టు స్ట్రాంగ్ పర్సనాలిటీ గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారో ప్రపంచం కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తుంది.
(04:00) అందుకే మీ విలువను తగ్గించుకోవద్దు. ఎందుకంటే ఆత్మగౌరవం ఒక గుణం మాత్రమే కాదు అది మీ వ్యక్తిత్వం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం జై హింద్
No comments:
Post a Comment