Friday, April 3, 2026

చిన్నబోయిన మదికి 
చిన్ని మెప్పుల మాటలా 
వన్నె తరిగిన మోమున 
వెన్నెల వాన కురిసేలా....

వెతల చీకటికి 
వెలుగుల ధారలా...
వీడని నీడలు 
వెరచి పారిపోయేలా...

రేయిని ఆగిన 
తలపుల వాగుకు 
తలుపులు తీసి కమ్మని 
హాయిని దారిగా చూపేలా...

తీరము చెప్పిన 
తీరని కోరికలేవో 
తీరికగా విని 
తీర్చే మాటను ఇచ్చేలా..

మూగిన మబ్బుల 
దాటుకు వచ్చి 
ఆగిన కిరణపు కాంతికి 
దాగిన చీకటి తోక ముడిచేలా

తోసుకు వచ్చిన వెలుతురులో 
మనకై వచ్చిన వేడుకగా 
మోసుకు వచ్చిన కానుకలన్నీ 
తీసుకుపొమ్మని  చెప్పే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment