Saturday, April 4, 2026

ప్రతి రోజు వినాల్సిన 6 భగవద్గిత పాఠాలు | Bhagavadgita | Telugu Geeks

ప్రతి రోజు వినాల్సిన 6 భగవద్గిత పాఠాలు | Bhagavadgita | Telugu Geeks

Author Name:Telugu Geeks

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2cqY0MNEikc



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ ఎమోషన్స్ అనే రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఆఫీస్ లో మీ బాస్ ఒక మాట అన్నాడు మీ రోజంతా పాడైపోతుంది. ఇంట్లో చిన్న గొడవ జరిగింది అంతే మీ ప్రశాంతత అంతా గాలిలోకి ఎగిరిపోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీ సంతోషం మీ చేతిలో లేదు. ఎవరో బయట వ్యక్తుల చేతుల్లో ఉంది. వాళ్ళు ఏ బటన్ నొక్కితే మీరు అలా రియాక్ట్ అవుతున్నారు.
(00:23) సేమ్ ఇలాగే కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వకముందు అర్జునుడు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు. శత్రువుల్లో బంధువులు ఉన్నారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క కథ ఎమోషన్స్ అండ్ మెమరీస్ అన్ని ఉన్నాయి. ఎన్నో రకాల ఎమోషన్స్ మధ్య చిక్కుకుపోయి రథం మీదే కుప్పకూలిపోయాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మైండ్సెట్ గురించి చెప్పాడు అదే స్థిత ప్రజ్ఞత.
(00:47) స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరో తెలుసా? ఒక పెద్ద సముద్రం లాంటివాడు. ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం ఎలాగైతే పొంగకుండా ఉంటుందో ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది పొగిడినా తన బ్యాలెన్స్ ని కోల్పోని వాడే స్థితప్రజ్ఞుడు. సో ఈరోజు వీడియోలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక ఆరు అద్భుతమైన భగవద్గీత సూత్రాల గురించి మాట్లాడుకుందాం.
(01:08) వీటిని గనుక మీరు అర్థం చేసుకుంటే మీ లైఫ్ లో ఎలాంటి తుఫాన్ వచ్చినా సరే మీరు ఒక కొండలాగా నిలబడగలరు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. యుద్ధరంగంలో ఉన్న అర్జునుడు తన చుట్టూ ఉన్న ఈ పరిస్థితులను చూసి మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయాడు. అప్పుడు కృష్ణుడు ఈ సముద్రం అనే ఎగ్జాంపుల్ ని ఇచ్చాడు. ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం తన హద్దులను దాటదు.
(01:45) అది ఎప్పుడూ నిశ్చలంగా నిండుగా గంభీరంగా ఉంటుంది. అలాగే బయట ప్రపంచం నుండి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది నిన్ను విమర్శించినా నీ లోపల ఉన్న ప్రశాంతత ఆ సముద్రంలా కదలకూడదని అర్జునుడికి బోధించాడు కృష్ణుడు. మన జీవితం కూడా ఒక సముద్రం లాంటిదే ప్రతిరోజు మన మీదకి రకరకాల ఎమోషన్స్ అనే నదులు వస్తూనే ఉంటాయి. ఆఫీస్ లో టెన్షన్ అనే ఒక నది పక్కవాడు మనల్ని తక్కువ చేసి మాట్లాడడం ఇది ఇంకో నది.
(02:08) స్థిత ప్రజ్ఞుడు అంటే ఈ నదులన్నీ తనలోకి వచ్చిన తను మాత్రం చెదరకుండా ఉండేవాడు. సాధారణంగా మనం చిన్న చిన్న విషయాలకే రియాక్ట్ అయిపోయి మన ప్రశాంతతని మనం కోల్పోతుంటాం. కానీ మీరు గనుక ఆ మాటల్ని పట్టించుకోకుండా సముద్రంలా గంభీరంగా ఉండడం అలవాటు చేసుకుంటే ఏ సమస్య మిమ్మల్ని ముంచలేదు. వేరేవాడు మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు దాన్ని మనసులోకి తీసుకోవాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది.
(02:33) మీ కామ్నెస్ ని దెబ్బతీసే అధికారం ఎవ్వరికీ ఉండదు మీకు తప్ప. కృష్ణుడు భగవద్గీతలో ఈ మాట ఎందుకు చెప్పారంటే మనం ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ గురించి లేదా ఒక వ్యక్తి అన్న మాట గురించి పదే పదే ఆలోచించినప్పుడు మనకి తెలియకుండానే ఆ విషయం మీద ఒక బలమైన కోపం పెరిగిపోతుంది. ఆ కోపం మన బుద్ధిని కమ్మేసి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే స్పందించేలా అంటే రియాక్ట్ అయ్యేలా చేస్తుంది.
(03:01) ఇలా వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల మనం మన ఆత్మ నియంత్రణని అంటే సెల్ఫ్ కంట్రోల్ ని కోల్పోతున్నాం. ఇది కృష్ణుడు చెప్పిన మాట. అడవిలో ఒక వేటగాడు వెళ్తుంటే పొరపాటున ఒక పాము తోక మీద కాలు వేశడు. ఆ పాము వెంటనే తిరిగి వాడిని కరిచింది. వేటగాడు కోపంతో తన దగ్గర ఉన్న కత్తితో ఆ పాముని నరికేయాలని ప్రయత్నించాడు. కానీ హడావిడిలో పాముని సరిగ్గా కొట్టలేకపోయాడు.
(03:22) పైగా ఆ పాము వాడి చేతికి చుట్టుకొని మళ్ళీ ఆ వేటగాడిని కరిచింది. వేటగాడు ఇంకా కోపంతో ఊగిపోతూ దాన్ని కొట్టబోయి తన చేతిని తానే నరుక్కున్నాడు. పాము కరిచినప్పుడు శరీరంలోకి వెళ్ళిన విషం కంటే మనోడు పాము కరిచిందని వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని చంపాలి అని అనేసి చేసిన పనుల వల్ల వాడికి ఎక్కువ నష్టం జరిగింది. తన చేతినే కోలిపోయాడు.
(03:44) పాము కరిచినప్పుడు ప్రశాంతంగా ఉండిఉంటే విషం శరీరంఅంతా పాగేది కాదు తన చెయ్యిని తాను కోలిపోయేవాడు కాదు. మన జీవితంలో కూడా ఎదుటివాడన్న మాట లేదా జరిగిన ఒక తప్పు ఆ పాముకాటు లాంటిది. అది జరిగినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయి అరిచిన గొడవ పడిన ఆ విషం ఉంది చూసారా అది మన రోజంతా పాగిపోతుంది పాడు చేస్తుంది. స్థితప్రజ్ఞుడు ఆ పాముకాటుని గమనిస్తాడు కానీ వెంటనే పిచ్చిగా రియాక్ట్ అవ్వడు.
(04:07) మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నేను ఇప్పుడు రియాక్ట్ అవ్వాలా లేక రెస్పాండ్ అవ్వాలా అని ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మీరు వెంటనే రియాక్ట్ అయితే ఆ సిచువేషన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది అదే మీరు గనక ఆగి రెస్పాండ్ అయితే మీరు ఆ సిచువేషన్ ని కంట్రోల్ చేస్తారు. ఆ చిన్న పాజ్ ఉంది చూసారా రియాక్షన్ కి రెస్పాన్స్ కి మధ్యలో ఒక పాజ్ ఉంటుంది.
(04:28) అదే మీ ఎమోషనల్ మెచూరిటీని పెంచుతుంది. శ్రీకృష్ణుడు ఈ మాట ఎందుకు చెప్పారంటే లోకం తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు నిన్ను నెత్తిన పెట్టుకున్న వాళ్లే రేపు నిన్ను కిందకి లాగడానికి చూస్తారు. అందుకే స్థితప్రజ్ఞుడు పొగిడినప్పుడు ఉప్పొంగి పోకూడదు నిందించినప్పుడు కుంగిపోకూడదు. ఈ రెండిటిని సమానంగా స్వీకరించి మన మనశశాంతిని మన కామ్నెస్ ని మనం కాపాడుకుంటేనే మనం అసలైన జ్ఞాని అసలైన స్థిత ప్రజ్ఞుడు అవుతామని కృష్ణుడు బోధించారు.
(05:00) ఒక 24 క్యారెట్ బంగారు బిస్కెట్ ఉందనుకుందాం. దాన్ని ఒకరు చూసి అబ్బా మిలమిల మెరుస్తుంది ఇది చాలా విలువైనది అని పొగుడుతారు. ఇంకొకరు వచ్చి దాని మీద ఉమ్మేసి దీని వల్ల ప్రపంచాలు కొట్టుకు సాస్తున్నాయి అని నిందించారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ బంగారం తన విలువను మార్చుకుంటుందా లేదు పొగిడినా బంగారమే తిట్టిన అది బంగారమే అది దానికి ఉన్న సహజత్వాన్ని అది వదిలిపెట్టదు.
(05:21) అలాగే ఒక అద్దాన్ని తీసుకోండి దాని ముందు ఒక అందమైన పువ్వును పెడితే అది పువ్వుని చూపిస్తుంది. ఒక మురికి గుడ్డను పెడితే ఆ మురికి గుడ్డనే చూపిస్తుంది. కానీ ఆ అద్దం పువ్వుని చూసి మురిసిపోదు మురికిని చూసి అసహ్యించుకోదు. అది దేన్ని జడ్జ్ చేయదు కేవలం ఒక సాక్షిలా ఒక విట్నెస్ లా చూస్తుంది. అలాగే మనలో చాలామంది పొగడ్త అనే డ్రగ్ కి బానిసలైపోయాం.
(05:41) సోషల్ మీడియాలో లైక్ వస్తే పండగ చేసుకుంటాం ఒక్క నెగిటివ్ కామెంట్ వస్తే రోజంతా బాధపడిపోతుంటాం. అంటే మన విలువను పక్కవాడి కామెంట్ నిర్ణయిస్తుంది. స్థిత ప్రజ్ఞత అంటే ఎదుటివాడు నిన్ను పొగిడితే అది వాడి ఒపీనియన్ అని అలాగే నిన్ను నిందిస్తే అది వాడి పర్స్పెక్టివ్ అని నువ్వు అర్థం చేసుకోవడం. ఇవేవి కూడా నీ వ్యక్తిత్వాన్ని మార్చకూడదు.
(06:02) మీరు లోపల ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో మీకు తెలిసినప్పుడు బయట వచ్చే ఈ శబ్దాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే థాంక్యూ అని చెప్పి వదిలేయండి. ఎవరైనా మిమ్మల్ని తిడితే మీ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఇదేమనా పనిక వస్తుందేమో చూసి వదిలేయండి. కానీ ఆ రెండిటిని మాత్రం మీ తలక ఎక్కించుకోకండి. శ్రీకృష్ణుడు ఈ మాట ఎందుకు చెప్పారంటే బయట వాతావరణంలో చలి వేడి ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో మన జీవితంలో సుఖ దుఃఖాలు కూడా అలాగే వచ్చిపోతూ ఉంటాయి.
(06:32) ఇవేవి శాశ్వతం కావు. కాబట్టి వాటికి అతిగా రియాక్ట్ అవ్వకుండా ఓపికతో భరించడం మనం నేర్చుకోవాలి. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట. మీకు ఇక్కడ ఒక గొప్ప మంచి సూట్ అయ్యే కథ చెప్తాను వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక గొప్ప శిల్పు ఉండేవాడు ఆయన అద్భుతమైన విగ్రహాలని చెక్కేవాడు. ఒకరోజు ఆయన ఊరి చివర ఉన్న ఒక పెద్ద బండరాయిని చూసి దాన్ని ఒక దేవతా విగ్రహంగా మార్చాలనుకున్నాడు.
(06:54) ఆయన తన దగ్గర ఉన్న ఉలిని తీసుకొని ఆ రాయిని చెక్కడం మొదలు పెట్టాడు. కానీ ఆ రాయి ప్రతి దెబ్బకి విలవిలలాడిపోతూ నన్ను కొట్టకు నాకు చాలా నొప్పుగా ఉంది నన్ను వదిలేయరా బాబు అని ఏడ్చింది. అప్పుడు శిల్పి జాలిపడి ఆ రాయిని వదిలేసి పక్కనే ఉన్న మరో రాయిని చెక్కడం మొదలు పెట్టాడు. ఈ రెండో రాయికి కూడా ఉలి దెబ్బలు చాలా గట్టిగా తగులుతున్నాయి అండ్ నొప్పు వస్తుంది కానీ ఆ రాయి అనుభవించింది.
(07:16) అది ఒక్క మాట కూడా అనలేదు. ఈ నొప్పి టెంపరరీనే దీని వెనుక ఒక అద్భుతమైన విజన్ ఉంది అని అది అర్థం చేసుకుంది. సో నొప్పిని ఓర్చుకుని అలాగే నిటారుగా నిలబడింది. కొన్ని రోజుల తర్వాత ఆ రెండో రాయి ఒక అందమైన విగ్రహంగా మారింది. దాన్ని ఊరి మధ్యలో గుడి లోపల ప్రతిష్టించారు. మరి మొదటి రాయి ఏమైందో తెలుసా దాన్ని అదే గుడి మెట్ల దగ్గర వేశారు.
(07:37) ఇప్పుడు ప్రతిరోజు జనం ఆ మెట్టురాయి మీద కాలు వేసి తొక్కుకుంటూ లోపలికి వెళ్లి విగ్రహంగా మారిన రెండో రాయికి పూజలు చేస్తున్నారు. ఆ మెట్టురాయి ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది కానీ ఏ ప్రయోజనం లేదు. మన జీవితంలో ఎదురయ్యే విమర్శలు అవమానాలు ఆ ఉలి దెబ్బలు లాంటివి మీరు మొదటి రాయిలా ప్రతి చిన్న దెబ్బకి కుంగిపోతే లోకం మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది.
(07:59) అదే రెండో రాయిలాగా ఆ నెగిటివిటీని భరించి మీ లోపల ఒక స్ట్రాంగ్ ఇమ్యూనిటీని మీరు గనక బిల్డ్ చేసుకుంటే మీరు ఒక విగ్రహంలా అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా నిలబడతారు. మీ మనసుని ఆ రెండో రాయిలాగా తయారు చేసుకోండి. బయట పరిస్థితులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఇది నా ఎదుగుదలకే అని బలంగా నమ్మండి. ఎవరో అన్న మాటలకి మీ ప్రశాంతతను వదులుకోకండి.
(08:25) శ్రీకృష్ణుడు ఈ మాట ఎందుకు చెప్పారంటే మనిషి పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను ఎలా ధరిస్తాడో ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది అని శ్రీకృష్ణుడు చెప్పారు. అంటే ఇక్కడ మార్పు అనేది ప్రకృతి సహజం చావు పుట్టుకలే కాదు మన జీవితంలో వచ్చే లాభ నష్టాలు కష్ట సుఖాలు కూడా బట్టలు మార్చుకున్నంత సహజంగా మారిపోతూ ఉంటాయి.
(08:49) దేనికి అతిగా అతుక్కుపోవద్దు అని దీని అర్థం. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు నన్ను హెచ్చరించేలాగా అలాగే చాలా బాధలో ఉన్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చేలాగా ఒకే ఒక్క మాట చెప్పండి అని తన మంత్రులను అడిగాడు. చాలామంది చాలా రకాలుగా చెప్పారు కానీ రాజుగారికి ఏది నచ్చలేదు.
(09:09) అప్పుడు ఒక ముసలి జ్ఞాని రాజు దగ్గరికి వచ్చి ఒక ఉంగరాన్ని ఇచ్చాడు మహారాజా మీరు ఎప్పుడైనా తీవ్రమైన ఎమోషన్ లో ఉన్నప్పుడు అంటే బాగా ఆనందంగా ఉన్నప్పుడు లేదా బాగా బాధలో ఉన్నప్పుడు ఈ ఉంగరం లోపల ఒక మెసేజ్ పెట్టాను అది తీసి చదవండి అని అన్నాడు. కొన్నాళ్ళ తర్వాత పక్కదేశం రాజు దండెత్తి వచ్చి రాజుగారిని ఓడించి అడవిలోకి తరిమేసాడు.
(09:30) ప్రాణాలు కాపాడుకోవడానికి రాజుగారు ఒక గుహలో దాక్కున్నాడు. శత్రువుల గుర్రాల సప్పుడు వినిపిస్తుంది. ఏ నిమిషమైనా దొరికిపోతాను అని భయపడిపోతున్నాడు. విపరీతమైన బాధలో ఉన్నాడు. రాజుగారికి అప్పుడు ఆ ఉంగరం గుర్తొచ్చింది. తీసి చూస్తే ఆ ఉంగరంలో ఉన్న మెసేజ్ ఏంటంటే ఇది కూడా గడిచిపోతుంది. దిస్ టూ షల్ పాస్ ఆ మాట చూడగానే రాజుగారికి ఒక తెలియని ధైర్యం వచ్చింది.
(09:50) అవును నా రాజ్యం పోయింది నిజమే కానీ ఈ కష్టం కూడా శాశ్వతం కాదు కదా అని అనుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ సైన్యాన్ని పోగు చేసి తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్నాడు. ఊరంతా పండగ చేసుకుంటున్నారు రాజుగారు ఏనుగ అంబాని మీద ఊరేగుతున్నారు విపరీతమైన గర్వం విపరీతమైన ఆనందం కలుగుతుంది. అప్పుడు మళ్ళీ ఉంగరం గుర్తొచ్చింది తీసి చూశడు మళ్ళీ అదే మాట ఇది కూడా గడిచిపోతుంది.
(10:14) దిస్ టూ షల్ పాస్ వెంటనే ఆయన గర్వం తగ్గిపోయింది మళ్ళీ కామ్గా మారిపోయాడు. మన జీవితంలో ఏది పర్మనెంట్ కాదు. ఈరోజు మీకు చాలా కష్టంగా ఉండొచ్చు రేపు అద్భుతమైన సక్సెస్ రావచ్చు సక్సెస్ వచ్చినప్పుడు గర్వపడటం ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోవడం ఇవి రెండు స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు కావు. పరిస్థితి ఏదైనా సరే ఇది కూడా గడిచిపోతుంది దిస్ టూ షల్ పాస్ అని గుర్తుంచుకోండి.
(10:35) ఈ క్లారిటీ ఉంటే మీరు ఏ మార్పుకైనా సిద్ధంగా ఉంటారు. ఆఫీస్ లో ప్రాజెక్ట్ పోయినా రిలేషన్షిప్ లో బ్రేకప్ అయినా అది మీ జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే అని గ్రహించండి. మార్పుని ఎదిరించడం ఆపేసి దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి. మన మనసులో కలిగే ఆలోచనలు లేదా బయట జరిగే సంఘటనలు సిచువేషన్స్ ఇవేవి మనం కాదు. ఒక జ్ఞాని తన జీవితాన్ని ఒక సాక్షిలా గమనిస్తాడు తప్ప వాటిలో కొట్టుకుపోడు సంతోషం వస్తే మురిసిపోడు బాధ వస్తే ద్వేషించడు.
(11:11) ఒక మూడో వ్యక్తిలా తన మనసుని తానే గమనించుకుంటాడు అని శ్రీకృష్ణుడు బోధించారు. నేను చిన్నప్పుడు చదివిన ఒక స్టోరీ ఉంది అది దీనికి బాగా సెట్ అవుతుంది. ఒక ఊర్లో ఒక ధర్మ సత్రం ఉంది పాతకాలంలో గెస్ట్ హౌసులని ధర్మసత్రం అని అనేవారు. దానికి ఒక యజమాని ఉండేవాడు. ప్రతిరోజు ఆ సత్రానికి రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. ఒకరోజు ఒక పెళ్లి బృందం వచ్చింది సత్రం అంతా నవ్వులు పాటలతో సందడిగా ఉంది.
(11:35) యజమాని వాళ్ళని చూసాడు ఓకే అని అనుకున్నాడు సంతోషపడ్డాడు వదిలేసాడు అంతే వాళ్ళతో కలిసి ఊరేగింపుకు వెళ్ళలేదు. తర్వాత రోజు ఒక శవయాత్ర బృందం వచ్చింది. సత్రం అంతా ఏడుపులు ఆర్తనాదాలతో నిండిపోయింది. మళ్ళీ ఓనర్ చూసి బాధపడ్డాడు కానీ వాళ్ళతో కలిసి ఏడవలేదు. ఆ తర్వాత రోజు కొందరు దొంగలు వచ్చారు ఆ తర్వాత రోజు కొంతమంది సాధువులు వచ్చారు ఎవరు వచ్చినా ఆ యజమాని వాళ్ళకి గది ఇచ్చి పంపించేసాడే తప్ప వాళ్ళు చేసే పనుల్లో తను భాగం అయ్యేవాడు కాదు ఎందుకో తెలుసా వచ్చేవాళ్ళు అతిథులు గెస్ మాత్రమే తను యజమాని ఓనర్ అని అతనికి తెలుసు అతిథులు వస్తారు వెళ్తారు కానీ సత్రం అక్కడే ఉంటుంది. మీ మనసు ఆ
(12:10) సత్రం లాంటిది మీ ఆలోచనలు ఎమోషన్స్ ఆ అతిథులు లాంటివారు కోపం ఒక అతిధి బాధ ఒక అతిధి సంతోషం ఒక అతిధి ఏడుపో ఒక అతిధి అవి వస్తాయి కొంచెం సేపు ఉంటాయి మళ్ళీ వెళ్ళిపోతాయి కానీ మీరు ఆ అతిథులు కాదు మీరు ఆ సత్రానికి అంటే మీకు మీ బాడీకి మీ మైండ్ కి మీరు ఓనర్ యజమాని మీకు కోపం వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది అని ఆ గదిలో దూరిపోకండి నా మనసులోకి కోపం అనే అతిథి వచ్చాడు కాసేపట్లో వెళ్ళిపోతాడు అని ఒక సాక్షిలా ఒక విట్నెస్ లా గమని గమనించండి ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్స్ నుంచి విడిపడి ఒక యజమానిలా ఒక ఓనర్ లాగా మీరు చూస్తారో అప్పుడు ఆ ఎమోషన్స్
(12:46) మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. మీరు ఆ సీన్ లో ఉండరు. ఆ సీన్ ని మీరు బయట నుంచి చూస్తూ ఉంటారు. ఇదే అసలైన మెంటల్ స్ట్రెంత్ ఇదే ఒక స్థిత ప్రజ్ఞుడికి ఉండే భయంకరమైన అలవాటు. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. వీడియో ముగించుకునే ముందు ఈ ఆరు పాయింట్లని ఫాస్ట్ గా రివైజ్ చేసేద్దాం. ఎవరైనా నోట్ చేసుకునేవాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి.
(13:05) ముందుగా ద ఓషయన్ స్ట్రాటజీ ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం తన హద్దు దాటదు. బయట విమర్శలు ఎన్ని వచ్చినా మీ కామ్నెస్ ని ఆ సముద్రంలా కదల్చనివ్వద్దు. చిన్న విషయాలకే రియాక్ట్ అయ్యి మీ కామ్నెస్ ని కోల్పోకండి. మీ మనసుని కామ్గా ఉంచితే ఏ సమస్య మిమ్మల్ని ముంచలేదు. స్టాప్ బీయింగ్ రియాక్టివ్ నెగిటివ్ విషయాల గురించి పదే పదే ఆలోచిస్తే కోపం బుద్ధిని కమ్మేస్తుంది.
(13:25) వెంటనే స్పందిస్తే ఆ సిచువేషన్ నిన్ను కంట్రోల్ చేస్తుంది ఆగి ఆలోచించు ఒక పాజ్ తో రెస్పాండ్ అయితే మీ దగ్గర నుంచి స్థిత ప్రజ్ఞుడు అనే గొప్పవాడు బయటిక వస్తాడు. ప్రేస్ అండ్ బ్లేమ్ బోత్ ఆర్ ద సేమ్ పొగిడినా నిందించినా బంగారం తన విలువను మార్చుకోదు ఎదుటివాడు కామెంట్ కూడా మిమ్మల్ని మార్చకూడదు. ఎమోషనల్ ఇమ్యూనిటీ సుఖ దుఃఖాలు చలి వేడిలా వచ్చి వెళ్లే అతిథులు మాత్రమే.
(13:49) వాటిని ఓపికతో భరించడం నేర్చుకుంటేనే మీకు విజయం లభిస్తుంది. యక్సెప్టెన్స్ ఆఫ్ చేంజ్ పాత బట్టలు తీసి కొత్తవి వేసుకున్నంత సహజం ఈ మార్క్ సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అతిగా అతుక్కోవద్దు. ద విట్నెస్ మైండ్సెట్ నీ మనసు ఒక సత్రం లాంటిది ఎమోషన్స్ వచ్చి వెళ్ళే అతిథులు మాత్రమే నువ్వు మాత్రమే నీ శరీరానికి నీ మైండ్ కి యజమానివి సో యజమానిలా బిహేవ్ చెయ్ అతిథుల్లా మారకు.
(14:11) చివరిగా ఒక మాట స్థిత ప్రజ్ఞత అంటే ఎమోషన్స్ లేని రాయిలా మారిపోవడం కాదు. మనసులో ఎన్ని అలజడ్లు ఉన్నా ఆ అలజడిని ఒక సాక్షిలా గమనిస్తూ ప్రశాంతంగా ఉండగలగడం మీ ఎమోషన్స్ అనే రిమోట్ కంట్రోల్ ని వేరే వాళ్ళ చేతిలో పెట్టకు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ జ్ఞానాన్ని ఇచ్చింది యుద్ధం ఆపడానికి కాదు యుద్ధాన్ని గెలవడానికి మీరు కూడా మీ జీవిత యుద్ధంలో గెలవాలంటే ఈ ఆరు సూత్రాలని పాటించండి.
(14:34) పరిస్థితులు ఎలా ఉన్నా మీ లోపల ఒక చిన్న చిరునవ్వుతో నిలబడండి ఎందుకంటే యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ నాట్ ఏ స్లేవ్ టు దెమ జై హింద్.

No comments:

Post a Comment