లివ్-ఇన్ ఎంచుకోవాలా లేక పెళ్ళా? Should You Choose Live-in Or Marriage?
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Q_t67Phk73E
Transcript:
(00:00) పెళ్లా లేక లివినా అన్నప్పుడు మీ ఉద్దేశం నిబద్ధత లేకుండా కలిసి ఉండాలనుకుంటున్నారు అంతే అవునా నాకు అనిపించినప్పుడు వెళ్ళిపోతాను అంటున్నారు అవునా అది ఎవ్వరికీ మంచిది కాదు అలా నిబద్ధత లేకుండా కలిసి ఉండటం మంచిదని నేను అనుకోను పెళ్లి అంటే ఎవరో పూజారి వచ్చి మంత్రాలు చదవాలని అనట్లేదు నేను కానీ అది నిబద్ధత గల బంధమై ఉండాలి.
(00:26) నిబద్ధత లేకపోతే అక్కడ నిజమైన గౌరవం ఉండదు. సాన్నిహిత్యం ఉన్నప్పుడు అవతలి వ్యక్తి శరీరాన్ని మనసుని వాళ్ళకు సంబంధించిన ప్రతిదాన్ని గౌరవించాలి. అవునా వేడుక చేసుకోవాలా వద్దా అనేది కావాలంటే అది ఎంచుకోవచ్చు కానీ ఒకరికొకరు నిబద్ధతతో ఉండాలా వద్దా అనే విషయంలో మాత్రం ఏ ఎంపిక లేదనే అనుకుంటున్నాను. అప్పుడు కలిసి ఉండటంలోని ఆనందం ఎప్పటికీ తెలుసుకోలేరు.
(00:44) అది ఎప్పుడూ లెక్కలానే ఉంటుంది. నీ నుంచి నేను ఏం పొందుతాను అని. ఎప్పుడైతే నీ నుంచి నేను ఏం పొందుతాను అని ఆలోచన ఉంటుందో ఆ బంధం ఎప్పటికీ అందంగా ఉండదు.
No comments:
Post a Comment