Saturday, April 4, 2026

జీవితాన్ని మార్చే పునర్నవ రహస్యం ఇదే | The Secret of Rebirth & Transformation | Satyagrahi

జీవితాన్ని మార్చే పునర్నవ రహస్యం ఇదే | The Secret of Rebirth & Transformation | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LFEpeQc-r4U



Transcript:
(00:00) ఒక్క నిమిషం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి మీరు ఇప్పుడు జీవిస్తున్న జీవితం నిజంగా మీరు కోరుకున్నదేనా లేక ఏదో తెలియక ఒక చక్రంలో ఎరుక్కుపోయి కేవలం రోజులు గడుపుతున్నారా చాలా మందికి లోపల ఒకటి ఉంటుంది నేను ఏదో సాధించాలి అద్భుతంగా బతకాలి అని కానీ బయటికి వచ్చేసరికి మాత్రం అవే పాత అలవాట్లు అవే బద్ధకం అదే నెగిటివిటీ పొద్దున్నే లేవగానే ఫోన్ చూడటం అనవసరమైన విషయాల మీద టైం వేస్ట్ చేయడం రాత్రి పడుకునే ముందు ఛా ఈరోజు మొత్తం వేస్ట్ చేశాను అని చెప్పేసి మళ్ళీ బాధపడటం ఇది మీ ఒక్కరి సమస్య కాదు ఇది ఒక తరం
(00:34) ఎదుర్కుంటున్న మానసిక సంక్షోభం. మీరు గమనించారో లేదో మనల్ని మనం ప్రేమించుకోవడం కంటే మనల్ని మనం ద్వేషించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. మార్పు కావాలని కోరుకుంటాం. కానీ పాత అలవాట్లను వదలడానికి భయపడతాం. ఆ పాత అలవాట్లు ఎలా ఉంటాయంటే ఒక తుప్పు పట్టిన ఇనుప గొలుసు లాంటివి. అవి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వవు అలాగని చెప్పేసి అక్కడే ఉండనివ్వవు.
(00:57) లోపల ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మీ కళ్ళ ముందే మీ సమయం కరిగిపోతుంది. ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో మీరు ఉండిపోతారు. అదే అసలైన సమస్య. మీరు మీ పాతవర్షణని మోస్తూ కొత్త భవిష్యత్తుని వెతుకుతున్నారు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. అసలు మనం ఎందుకు ఇలా తయారవుతున్నాం ఎందుకు మార్పు అనేది ఇంత కష్టంగా అనిపిస్తుంది? స్వామి చిన్మయానంద గారు ఒక మాట అనేవారు.
(01:17) మనం బయట ప్రపంచాన్ని జయించాలనుకుంటాం కానీ మనల్ని మాత్రం అస్సలు పట్టించుకోము అని చెప్పేసి మన సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే మనం గతాన్ని ఒక గుణపాఠంలా చూడకుండా ఒక భారంగా మోస్తున్నాం. చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న సమాజం, మన స్నేహితులు మనం చూసే సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు ఇవన్నీ మన మైండ్లో కొన్ని బలమైన ముద్రలు వేస్తాయి.
(01:38) నువ్వు ఇంతే నీ వల్ల కాదు నీకు ఆ అలవాటు పోదు అని చెప్పేసి మనకి మనమే ఒక సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటాం. నిజానికి మన అలవాట్లు మనల్ని నిర్మిస్తాయి. కానీ దృదృష్టవశాత్తు మనం చెడు అలవాట్లకు ఇచ్చే ప్రాధాన్యత మంచి అలవాట్లకు ఇవ్వము. ఎందుకంటే చెడు అలవాటు వెంటనే ఒక చిన్న పాటి సుఖాన్ని ఇస్తుంది. కానీ లో లోలోపల మిమ్మల్ని ఒక శవంలా మారుస్తుంది.
(02:01) ఆ పాత ఆలోచనలు ఆ పాత పద్ధతులు మీ మెదడులో ఒక గీతలా పడిపోయాయి. మీరు ఎంత వద్దనుకున్నా మీ మనసు అటువైపు లాగేస్తూనే ఉంటుంది. బేసికల్గా ఒక ముకలో చెప్పాలంటే మనం మారాలి అంటే మన పాత వర్షన్ని మనం అక్కడే తగలబెట్టేయాలి. కానీ మనం ఆ పాత రూపాన్ని వదలలేక దాంతోనే కాపురం చేస్తూ కొత్త జీవితం కావాలని చెప్పేసి కలలు కంటూ ఉంటాం. ఈ ఘర్షణే మిమ్మల్ని మానసికంగా కొంగదీస్తుంది.
(02:26) ఇప్పుడు అసలైన ఘట్టానికి వద్దాం. ఈ చక్రం నుండి బయటపడటం ఎలాగా? దీనికి ఒకే ఒక మార్గం అదే పునర్నవ. పునర్నవ అంటే మళ్ళీ కొత్తగా పుట్టడం. ఒక పాము తన పాత చర్మాన్ని వదిలేసినట్లు, ఒక చెట్టు తన పాత ఆకుల్ని రాల్చినట్లు మీరు కూడా మీ పాత గుర్తింపును వదిలేయాలి. మొదటిగా మీరు చేస్తున్న తప్పులను ధైర్యంగా ఒప్పుకోండి.
(02:48) అవును నేను సమయాన్ని వృధా చేస్తున్నాను. అవును ఈ అలవాట్లు నా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి అని మిమ్మల్ని మీరు నిజాయితీగా చూసుకోండి. స్వామి చిన్నమయనంద గారు ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు నీ మనసుకి నువ్వు మాస్టర్ అవ్వాలి కానీ దానికి బానిస అవ్వకూడదు అని చెప్పేసి నేను ఈరోజు ఈ చెడు వాటిని వదిలేస్తున్నాను అంటే వదిలేయాలి అంతే అంతేగాని వదిలేస్తాను అనుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెట్టావంటే నీ మనసుకి నువ్వు బానిస అవుతావు కానీ యజమానివి అవ్వవు.
(03:13) అందులోనూ మార్పు అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. అది ప్రతీ క్షణం మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. పాత అలవాట్లు అనేవి ఒక చీకటి గది లాంటివి. ఆ గది నుండి బయటికి రావాలంటే మీరు తలుపులు తెరిచి వెలుగులో అడుగు పెట్టాలి. ఆ వెలుగే మీ సంకల్పం. మీలో ఉన్న ఆ పాత మనిషిని ఇక్కడే వదిలేయండి. గతాన్ని సరిదిద్దలేము కానీ వర్తమానాన్ని నిర్మించుకోవచ్చు కదా మీరు కేవలం మీ ఆలోచనలను మార్చుకుంటే సరిపోదు. మీ చేతలను కూడా మార్చుకోవాలి.
(03:41) ఈ క్షణం నుంచి మీరు ఒక కొత్త మనిషి ఈ మాటలు నమ్మండి. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అద్భుతమైన ప్లాన్ అక్కర్లేదు. చిన్న మార్పులు చాలు. నేను మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. ఈరోజు ఒక డైరీ తీసుకోండి అందులో మీరు వదిలేయాలనుకుంటున్న మిమ్మల్ని నాశనం చేస్తున్న మూడు అలవాట్లను రాయండి. వాటి పక్కన పెద్ద అక్షరాలతో మరణించింది అని కూడా రాయండి అంటే డెడ్ అని చెప్పి కూడా రాయండి.
(04:06) ఆ క్షణం నుంచి ఆ పాత వ్యక్తి చనిపోయాడని ఫిక్స్ అవ్వండి. రేపు ఉదయం మీరు నిద్ర లేచినప్పుడు మీరు ఒక కొత్త వ్యక్తిగా మేల్కొనాలి. గుర్తుంచుకోండి మోటివేషన్ అనేది మిమ్మల్ని మొదలు పెట్టేలా చేస్తుంది. కానీ క్రమ శిక్షణ అనేది మాత్రం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీ ప్రతిరోజు ఒక కొత్త ఆరంభం కావాలి. మీరు చేసే ప్రతి పనిలో ఒక క్లారిటీ ఉండాలి. మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ పక్కన పెట్టి మీకు ఉపయోగపడే విషయాల మీద దృష్టి పెట్టండి.
(04:31) మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీకు మీరే ఒక గురువుగా మారండి. ఈ వీడియో గనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం కచ్చితంగా లైక్ చేయండి అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి బాయ్ ఓం

No comments:

Post a Comment