Friday, April 3, 2026

 గుండెలన్నీ బండలై 
ఉండిపోయే క్షణాలే 
మండిపోతున్న భూమిలో 
ఎండిపోయెను మమతలు

యుద్ధమంటే  అక్షరాలా?
ఆధిపత్యాలు  నక్షరాలా?
అందరూ ఉట్టి వీక్షకులా?
అమాయకులకు శిక్షలా?

కూలదోసినవి తిరిగి 
కట్టగలరా క్షణంలో?
కట్టుబట్టలతో మిగిలిన 
కన్నీటి బ్రతుకుల రక్షణేది?

కొన్ని కుటిల తంత్రాలకు 
ఎన్ని జటిల సమస్యలు?
మిన్ను విరిగి మీద పడితే 
మన్నుకేది మనుగడ?

అడుగడునా విధ్వంసం 
అణ్వాయుధాల ప్రభావం 
అడలి పోవును జీవజాలం 
అల్లాడిపోవును భూతలం

విచక్షణ లేని వర్తన చూసి 
విచలితమై పోతివా?
వినలేవా ఆర్తనాదాల వినతులు 
కనలేవా కృపను జగతిని..🙏

కర్మసాక్షికి నివేదనగా 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment