మిమ్మల్ని తిడుతున్నారా అయితే వినండి | Turn Disrespect into Your Power | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ubkpionNwIU
Transcript:
(00:00) ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ మనసులోకి వచ్చే మొదటి ఆలోచన ఏంటి ఈరోజు ఏం సాధించాలి అనుకుంటారా లేకపోతే ఈరోజు ఎవరెవరితో మాటలు పడాలి అని చెప్పేసి భయపడుతూ ఉంటారా చూడండి మనందరి జీవితాల్లో ఒక దశ వస్తుంది. ఇంట్లో వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే బంధువులు కూడా మన మీద వెటకారంగా సెటైర్లు లేస్తూ ఉంటారన్నమాట.
(00:20) వీడు ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదా అని చెప్పేసి ఇంకా ముఖ్యంగా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు కూడా మీరు ఒక అదృశ్యమైన గోడ వెనుక ఉన్నట్లు అందరూ మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ అవమానం ఉందే అది నిప్పు కంటే వేగంగా కాలుస్తుంది. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి మనుషుల మధ్య ఉన్నాను ఆ నవ్వులు ఆ వెటకారాలు విన్నప్పుడు రక్తం మరిగిపోయేది.
(00:40) కానీ లోపల ఏదో ఒక చోట భయం నిజంగా నేను దేనికి పనికి రానా వీళ్ళందరూ అంటున్నట్లు నా జీవితం ఇంతేనా అని మీలో మీరే కుంగిపోతుంటారు. దీన్నే మనం సోషల్ యంజైటీ అంటున్నాం. నలుగురిలోకి వెళ్ళాలంటే భయం ఎవరైనా ఏదైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియని తడబాటు మీలోని ఆత్మవిశ్వాసం మెల్లమెల్లగా ఆవరైపోతుంటే మీరు ఒక చీకటి గదిలో మిమ్మల్ని మీరు బంధించుకుంటున్నారు.
(01:02) గుర్తుంచుకోండి లోకం మిమ్మల్ని కొడుతున్న దెబ్బల కంటే ఆ దెబ్బల వల్ల మీ మనసుకి మీరు చేసుకుంటున్న గాయం చాలా పెద్దది. మనకి ఈ బాధ ఎందుకు కలుగుతుందో తెలుసా ఎందుకంటే మనం మన విలువ ఇతరుల కళ్ళల్లో వెతుకుతున్నాం. అవతలి వ్యక్తి మనల్ని గొప్ప అంటేనే మనం గొప్ప వాళ్ళం అని చెప్పి నమ్ముతున్నాం. బాబాగారు ఒక మాట అనేవారు అందరిని ప్రేమించండి అందరికీ సేవ చేయండి అని కానీ దాని అర్థం అందరి మాటలని తలకెక్కించుకోమని కాదు.
(01:30) మనుషులు మిమ్మల్ని ఎందుకు విస్మరిస్తారో తెలుసా? రెండు కారణాలు ఉంటాయి. ఒకటి మీలో ఉన్న ఎదుగుదల వారికి భయాన్ని కలిగిస్తుంది. రెండు మీరు ఇంకా ఏమి సాధించలేదని వారికి ఉన్న అహంకారం. ఈ సమాజం ఎప్పుడూ ఒక సిద్ధాంతం మీద నడుస్తుంది. నువ్వు గెలిస్తే నీ వెనుక పరిగెడుతుంది. నువ్వు [సంగీతం] పడిపోతే నీ మీద నడుస్తుంది. సో మీరు పడుతున్న ఈ మానసిక వేదనకి కారణం ఆ విమర్శలని మీరు ఒక శిక్షలా భావించడమే.
(01:55) వారు విసిరే మాటలనే బానాలు మీ హృదయాలకు తగులుతున్నాయి అంటే మీరు ఇంకా ఆ బాణాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు పక్కవాడి అబద్ధాలు మీకు నిజంలా అనిపిస్తాయి. మీరు మిమ్మల్ని తక్కువ చేసుకున్న ప్రతిసారి లోకానికి మిమ్మల్ని తొక్కేయాలని ఒక అహంకారం ఇచ్చినట్లు అవుతుంది. ఈ భయం ఈ ఆందోళన మీ బలాన్ని తగ్గించేస్తాయి.
(02:17) ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. మిమ్మల్ని అందరూ తిడుతున్నారా అవమానిస్తున్నారా అయితే సంతోషించండి ఎందుకంటే మీరు గెలవబోయే గొప్ప యుద్ధానికి ఇది మొదటి అడుగు. అవమానం అనేది ఒక ఫ్యూల్ లాంటిది. దాన్ని మీ గుండెల్లో దాచుకుంటే మిమ్మల్ని మీరు కాల్చుకుంటారు. అదే దాన్ని మీ ఎదుగుదలకు వాడుకుంటే అది మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది.
(02:37) మొదట మీరు చేయాల్సింది మౌనం. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు వారికి సమాధానం చెప్పడానికి మీ శక్తిని వృదా చేయకండి. మీ నోటితో ఇచ్చే సమాధానం కంటే మీ సక్సెస్ ఇచ్చే సమాధానం చాలా గట్టిగా ఉంటుంది. బాబాగారు చెప్పినట్లు సబ్ ఏక్ హై అందరూ ఒకటే. మిమ్మల్ని విస్మరించే వారు కూడా మీ ఎదుగుదలకి తోడ్పడే పాత్రదారులే అని గుర్తించండి.
(03:00) వారు విసిరే రాళ్లను ఏరుకోండి. ఆ రాళ్లతోనే మీ విజయానికి పునాది వేయండి. అవమానం జరిగిన చోటే అద్భుతం జరగాలి. మీరు నలుగురిలోకి వెళ్ళడానికి భయపడటం మానేయాలంటే మీ పని మీద మీరు ప్రేమ పెంచుకోవాలి. మీ లక్ష్యం ముందు ఈ లోకం మాటలు చాలా చిన్నవిగా అనిపించాలి. గాలివానం వచ్చినప్పుడు చెట్లు ఆకులు ఊగుతాయి కానీ వేర్లు బలంగా ఉంటే చెట్టు పడిపోదు.
(03:23) మీ వీర్లు మీ ఆత్మవిశ్వాసం మీద ఉండాలి. పక్కవాడి ప్రశంసల మీద కాదు జీవితాన్ని మార్చుకోవడం అంటే ఏదో రాత్రికి రాత్రి జరిగిపోయే మ్యాజిక్ కాదు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఈరోజు నుంచి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన ప్రతి ఒక్క ముఖాన్ని గుర్తుంచుకోండి. కానీ ద్వేషంతో కాదు కృతజ్ఞతతో ఎందుకంటే వారు మిమ్మల్ని విమర్శించకపోతే మీకు పట్టుదల వచ్చేది కాదు కదా ప్రతిరోజు మీ పనిలో మీరు నిమజ్నం అవ్వండి.
(03:52) లోకం ఏమంటుందో అని ఆలోచించే సమయాన్ని నేను ఇంకా ఎలా మెరుగుపడాలి అని ఆలోచనలకు కేటాయించండి. గుర్తుంచుకోండి సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి దానంతర అదే వెళ్ళిపోతుంది. అలాగే మీరు మీ రంగంలో వెలుకుతున్నప్పుడు ఈ విమర్శలన్నీ మాయమైపోతాయి. నేటి నుంచే మారాలి. రేపు అనేది ఒక భ్రమ. ఈ క్షణమే మీలో ఒక కజి మొదలవ్వాలి. మిమ్మల్ని చూసి నవ్విన వారే రేపు మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు చప్పట్లు కొట్టాలి.
(04:16) ఇది మీరు వారికి ఇచ్చే అసలైన గౌరవం. భయాన్ని వదిలేయండి. బాధను తీసుకోండి మీ జీవితం ఒక సాక్ష్యంలా ఉండాలి. రేపు మీరు సక్సెస్ అయినప్పుడు మీ కథ వినే వారికి నాకు కూడా అన్ని అవమానాలు జరిగాయి నేను కూడా గెలవగలను అనే ధైర్యం కలగాలి. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. వెనక్కి తిరిగి చూడకండి ముందుకు సాగండి విజయం మీకోసం ఎదురుచూస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి బాయ్.
(04:44) ఓం ఓం
No comments:
Post a Comment