Friday, April 3, 2026

మన పనులు మనం చేసుకుంటే తప్పేంటి? || @sridevi_vlogs515

మన పనులు మనం చేసుకుంటే తప్పేంటి? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zgHZNrTAbqU



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ లొకేషన్ ఏంటి శ్రీదేవి గారు అంటున్నారా మేమైతే అడవిల్లో ఉన్నామండి జీడి మామిడి చెట్లు ఇవే ఈ లొకేషన్ బాగుందని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఇవన్నీ బండరాలు అన్నమాట ఎంతసేపు ఈ బిజీ లైఫ్ లో మనం పనులు పనులు డబ్బు డబ్బు అని వెంటపడటం కాదండి అప్పుడప్పుడు ఇటువంటి ప్రకృతిలోకి కూడా రావాలి.
(00:27) మనసుకు దగ్గరగా ఉండే మనుషులని చూడాలి వారితో పాటు కొంత టైం స్పెండ్ చేయాలి అప్పుడే నిజమైన లైఫ్ ఏంటో అన్నది మనకు తెలుస్తుంది. ఈరోజు నేను అదే సిచువేషన్ లో ఉన్నాను మారేడుమిలి లోపల ఊర్లో వచ్చాము వాళ్ళకి రగ్గులు కొన్ని తినుబండరాలు ఏవో ఇచ్చి నాకు ఈ ప్రకృతిలో వీడియో చేయాలనిపించింది అందుకనే చేస్తున్నా అన్నమాట బాగుంటే గనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి రాను రాను మగాడికి విలువ తగ్గిపోయిందండి మగవాళ్ళ బ్రతుకు ఏమిటో కూడా తెలియట్లేదు ఒక్కసారి ఆలోచించుకుంటే గనుక మగవాడి జీవిత జీవితమే ఒక వ్యర్థం అని చెప్పి ధర్మాసనాలు కూడా తేల్చేసినయి ఇటీవలనే ఒక తీర్పు
(01:10) వెలువడింది అదేమిటి అంటే భార్య పనిమనిషి కాదు భర్తలో పనులు చేయకపోతే అంటే ఇంట్లో పనులు చేయకపోతే మీరు జైలుకే అని చెప్పి తీర్పులు ఇచ్చిందన్నమాట ఇందులో ఎంతవరకు ధర్మం ఉంది అసలు భార్యా భర్తల బంధంలో కోర్టుల జోక్యం ఏంటి ఆ కోర్టుల ప్రమేయంతో కాపురాలని ఇంకా నాశనం చేస్తున్నారా దాంపత్య జీవితం నాశనం అయపోవడానికి కోర్టులో విడాకులు అంటే చీటికి మాటికి కొట్టుకోవడం తిట్టుకోవడం చిన్న చిన్న రీజన్స్ తో వీళ్ళు కోర్టులకి వెళ్తున్నారు చదువుకున్నవాళ్ళు కదండీ వాళ్ళు చక్కగా విడాకులు ఇప్పిస్తున్నారు.
(01:50) మరి భార్యా భర్తలని కలపవలసిన వాళ్లే విడాకుల ప్రమేయంతో ముందుకు ఎందుకు వెళ్తున్నారు కాపరాలని ఎందుకు నాశనం చేస్తున్నారు మనం ఇదివరకు రోజుల్లో చూసుకుంటే మన పెద్దవాళ్ళు భార్యాభర్తల మధ్యన గొడవలు జరిగితే మూడో మనిషి ప్రమేయం ఉండకూడదు అని చెప్పేవారు అలాగే వారికి వారు నాలుగు రోజులు పోట్లాడుకునేవారు కనీసం ఐదో రోజైనా కలుసుకునేవారు తర్వాత ఒకరి అవసరం ఒకరికి తెలిసేది అని చెప్పి సర్దుబాటులు చేసేవారు సర్దుకోవాలమ్మా అని చెప్పేవారు మగవాళ్ళకి సర్దుబాటుతనం ఉండదు కాబట్టే ఎంతసేపు ఆడవాళ్ళకి భూదేవంత ఓర్పు ఉంటది కాబట్టే సర్దుకోవాలి సర్దుకోవాలి సరిపెట్టుకో అమ్మ అని చెప్పేవారు
(02:29) దానివల్లే కాపురాలి నిలబడేవి మరి ఈ రోజుల్లో విడిపోవటానికి ఎన్నో దారుల్ని అమర్చారు మన ధర్మాసనాలే మన ప్రభుత్వం వారే మరి ఇటువంటి తీర్పుల వల్ల ఇటువంటి నిర్ణయాల వల్ల ఇటువంటి ధర్మాసనాల వల్ల కాపురాలు ఎంతవరకు నిలబడతాయి మీరే ఆలోచించండి దాంపత్య త్య జీవితంలో మనం ఎలా ఉండాలి ఉండకూడదు భార్య పాత్ర ఏంటి భర్త పాత్ర ఏంటి అని మనకి మన భారతీయ శాసనాలు మన పురాతన అలవాట్లు అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు తేల్చి చెప్పేసినయి దాన్ని పట్టుకొనే చిన్న చిటక గొడవలైనా సరే ఊర్లో పంచాయతీలో పెద్ద మనుషులో ఆ కుటుంబ సభ్యుల మధ్యన ఆ గొడవని సర్దుబాటు చేసుకునేవారు.
(03:12) మరి ఈ రోజుల్లో ఆ పరిస్థితులు లేవు ఏమన్నా అంటే ముందు కోర్టు నోటీసులు అలాగే నా భర్త తాగుబోతాడు తిరుగుబోతాడు గాలిగా తిరుగుతున్నాడు ఇంట్లో పనులు చేయట్లేదు నా మీదే పెట్టేసాడు ఉద్యోగం సద్యోగం లేదు నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు అని ఇందులో నిజమైన కేసులు 1% ఉంటే తప్పుడు కేసులు 99% ఉన్నాయన్నమాట మరి ఆ తప్పుడు కేసులు పెట్టే భార్య భర్త నుండి భరణం కోరుకుంటుంది ఇక నయ్యో నా భర్త పిల్లలు కనట్లేదు అని చెప్పి కూడా ముందు ముందు కేసులు వేస్తారు.
(03:49) మరి ఇవెక్కడ రోజులు నిజంగా మగాడికి జీవితమే లేదండి అసలు భార్య పనిమనిషి ఏంటి పనిమనిషి అంటే ఎవరు జీతం తీసుకుంటున్న వాళ్ళు పనిమనిషి భార్య మరి ఇంటికి చాకిరి ఎందుకు చేస్తది తన కుటుంబం తన భర్త తన పిల్లలో తన అత్తమామలో తన తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళకి అతిథులు అని చెప్పి కొన్ని పోకడలో మనకు ఉన్నాయి వాళ్లే పని మనిషి అంటే మరి ఎలాగా మరి భర్త అంటే బానిస పొద్దున్న నుంచి గొడ్డి జాగర ఉద్యోగాలు సద్యోగాలు చేసి కాయ కష్టం చేసి కూలి పనులు చేసి పిల్లల్ని భార్యని పెంచాలి మరి భర్త గురించి ఎవరు పట్టించుకుంటారు మరి కూలీనాలి చేయడం తర్వాత ఇంట్లో చాకిరి కూడా చేయడం అంట్లు
(04:29) బట్టలు ఉతకడం లాంటివి కూడా మగవాళ్ళకే చెప్పాలని చూస్తున్నారు. మరి కోర్టులు ఈ విధంగా తీర్పు ఎందుకు ఇచ్చినాయి అసలు దీన్ని బట్టి మన ముందున్న జనరేషన్స్ ఎలా మారతారు అసలు సంసారాలు నిలుస్తాయా కాపురాలు చేస్తారా ఆడపిల్లలు ఇప్పటికే మాట అనట్లేదు ఈ రోజుల్లో భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం వల్ల కనీసం ఇంటిలో వంట కూడా చేసుకొని తినలేకపోతున్నాం అంటే మీరు నమ్ముతారా మీకంతా తెలుసు ఎందుకంటే అందులో మీరు ఉన్నారు కాబట్టి మరి కుటుంబ బాధ్యతలు ఎవరు చేపడతారు సరైన పోషన్ ఏంటి పిల్లలకి భర్తకి మీకు ఇంటిలో పండగ పబ్బం ఏంటి ఇంటికివచ్చిన అతిథులు ఏంటి
(05:09) మీరు ఎప్పుడు వచ్చినా ఇంటికి తాళాలు వేసి ఉండడం ఏమిటి మరి ముందున్న జనరేషన్ లో మనల్ని చూసి ఏం నేర్చుకుంటాయి అసలు ఇవన్నీ ఏంటి ఇప్పటికే ఆడపిల్లలు పెళ్లి చేసుకోం మాకు పెళ్లి అవసరం లేదు మాకు మగాడితో పని లేదు అని చెప్పి విర్రవీగుతున్నారు దానికి సపోర్ట్ గా తల్లిదండ్రులు కూడా ఉన్నారు పెద్ద పెద్ద చదువులు ఉద్యోగాలు చేస్తున్నారు.
(05:34) ఇంకా చెప్పాలంటే లివింగ్ రిలేషన్స్ అని చెప్పి ఇంకా వరస్ట్ గా ఉందిలే అండి సమాజం దానికి తోడు ధర్మాసనాలే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి. దీని పోకళ్ళు చూసుకొని ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మగవాడు పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికీ సగానికి సగం మంది చెప్పాలంటే 70% మగవాళ్ళు పెళ్లి చేసుకోకూడదని గట్టిగా నిర్ణయాలు తీసుకున్నారు.
(05:56) ఒక్కసారి మగవాళ్ళ మొహం చూస్తే ఉసూరు మనకుంటూ బాధ వేస్తుంది అన్నమాట. అంతెందుకు నేను మగవాళ్ళకి సపోర్ట్ గా వీడియోలు చేస్తానని నాకు ఆడవాళ్ళైనా సబ్స్క్రైబర్స్ అసలు ఉండరండి ఇందులో నేనేం తప్పేం మాట్లాడట్లేదు అంతా నిజమే చెప్తున్నాను ఎందుకు అంటే సమాజం నాశనం అయపోవడానికి ఆడది పునాదులు వేసేసింది. దాని మీద పేక మేడలు కట్టుకుంటుంది.
(06:19) అవి ఎప్పుడు కూలిపోతాయో తెలీదు. ఆ రోజునే ఈ సమాజం నాశనం అయిపోతుందని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఆడది గాడి తప్పినప్పుడు సమాజం గాని ఆ ఊరు గాని ఇల్లు గాని కుటుంబం గాని తన భర్త పిల్లలు గాని నాశనమే ఆడది ఎప్పుడైతే ఆడతనంతో ప్రవర్తిస్తుందో ఆవిడ గౌరవాలు ఎప్పుడు దక్కించుకుంటుందో ఆ స్త్రీమూర్తి అప్పుడే ఈ ఆకాశం భూమి పంచభూతాలు ఉన్నంత సేపు ఆడవాళ్ళ గౌరవం కూడా ఈ చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది అన్నమాట దయచేసి ఆ విలువల్ని చెడగొట్టుకోకండి ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ సంప్రదాయాలని ఫాలో అవుతున్న ఆడవాళ్ళు కుటుంబ బాధ్యతలు చేపెట్టి చక్కగా
(07:02) భర్త పిల్లలు అని వాళ్ళ బాధ్యతల్ని ఎప్పుడు నిలుపుకుంటారు చూసారా అటువంటి ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఈరోజు 80% మనం చెప్పుకున్న ఆడవాళ్ళు ఈ టైపే ఉన్నారు పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్ రిలేషన్ అని 35 30 ఇయర్స్ వచ్చినా కూడా 40 వచ్చినా కూడా పెళ్లిలు చేసుకోకుండా డ తిరగటం తర్వాత జాబ్ పేరుతో బలాదురుగా తిరగటం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ సీరియల్స్ చూసుకుంటూ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ గురించి మూతులు కొరుక్కోవటం తన ఇంట్లో వంట చేసుకోకుండా ఉండటం భర్త పిల్లల్ని పట్టించుకోకుండా ఉండటం ఇలాంటి పెంక ఆడోలు ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం
(07:39) దయచేసి వీడియో పూర్తిగా చూడండి. మగవాడి బాధ అర్థం చేసుకోలేనిది ఇది అంతు చిక్కనిది అందరూ అంటారు ఆడదానికి ఇల్లు లేదు ఆడ పిల్లే గాని ఈడ పిల్ల కాదు అంటారు ఒక ఇంటి పేరు లేదు అంటారు కానీ మరి మగవాడి గురించి ఎవరైనా ఆలోచించారా నిజంగా మగవాడికి అసలు జీవితమే లేదండి ఆడదానికి సొంత ఇల్లే లేదు అంటున్నారు మగవాడికి సొంత జీవితమే లేదు పుట్టినప్పటి నుంచే పౌరుషంతో పెంచుతారు నువ్వు మగాడివిరా ఏడవకూడదు అంటారు బాధ దిగమింగుకోమంటారు ఎవడికైనా సరే ఎదురు నిలబడమంటారు కుటుంబ బాధ్యతలు వేస్తారు చదువుకున్నంతసేపు వాడిని ఎంతసేపు క్రమశిక్షణలో పెడుతూ
(08:22) ఉంటారు గాలిగా తిరిగిన ఏం తిరిగినా ఫోకస్ పెడతారు కొన్ని బాధ్యతలు అప్పుచెప్తూ ఉంటారు తర్వాత తల్లిదండ్రులని చూసుకోమని చెప్పి ఉద్యోగం అని అంటారు వాళ్ళకి జీతాలు ఇవ్మంటారు ఇంటికి పెద్ద కొడుకు అంటారు అప్ప చెల్లెలు బాధలు చూడండిరా బాధ్యతలు పట్టుకోండిరా అంటారు. తర్వాత తల్లిదండ్రుల బాధ్యతలు అంటారు పెళ్లి అయిన తర్వాత భార్యా బిడ్డలు అంటారు చుట్టాలు అంటారు పిల్లలు అంటారు వాళ్ళకి ఒక్క బాధ కాదండి చచ్చేంతవరకే బాధే కానీ ఏ బంధం ఆయన సొంతం కాదు సారీ అండి ఎందుకు డిస్టర్బెన్స్ గా ఉందంటే ఇన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ఈ గిరిజన్లు కోడు వ్యవసాయం చేసుకొని ఇళ్లక
(09:03) వెళ్తున్నారు అన్నమాట అవే ఆటోలు బల్లు ఆ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మగవాడిని అర్థం చేసుకునే వాళ్ళు లేరు అంటే సొంత జీవితమే లేదు ఎందుకంటే ఏ రిలేషన్ తన సొంతం కాదు తల్లి తన సొంతం కాదు తండ్రి కాదు తర్వాత తల్లే సర్వస్వం అనుకొని భార్య దగ్గరికి వెళ్తాడు భార్య కూడా సొంతం కాదు ఎందుకంటే భార్యకి బిడ్డలు పుట్టిన తర్వాత భర్త మీద ప్రేమ కరిగిపోయి మంచిలాగా బిడ్డల మీదే ఆ ప్రేమ అంతా చూపిస్తూ భర్తని పట్టించుకోదు తల్లిదండ్రులు కూడా అంతమంది పిల్లల్లో ఎవరి మీద ఎలా ప్రేమ ఉంటదో కూడా చెప్పలేం ఎందుకంటే ఇదివరకు రెండు కళ్ళు ఒకటే ఐదేళ్ళు ఒకట ఒకటే అనేవారు ఇప్పుడు
(09:41) అలా లేదండి తల్లిదండ్రులు కూడా చాలా కనింగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ స్వార్థం ఉంది ఎక్కడ డబ్బు ఉంది ఎక్కడ అవసరం ఉందో అలాగే మెలుగుతున్నారు. ఇక చూసుకుంటే మగవాళ్ళు పిల్లల దగ్గర కూడా ప్రేమ పొందలేరు. ఇంతకీ ఆ భార్య ఉంటే వేడో వెచ్చ ఎంత ముద్ద పెడద్ది ఆ భార్య చనిపోయినా వెళ్ళిపోయినా మగాడికి కుక్క బతికే అని చెప్పాలి.
(10:06) మన వీడియోస్ అన్నీ నేను మగవాళ్ళ గురించి చెప్తూ ఉంటాను అంటే అందులో ధర్మం ఉందండి ఆడవాళ్ళ గురించి కూడా నేను వీడియోస్ చేశాను చూడండి అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చాలామంది మగవాళ్ళు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్స్ గానే ఉండిపోతున్నారు ఇది ఎవరి పాపం ఇది ఎవరి పాపం మీరే చెప్పాలి తల్లిదండ్రులు ఎవరిని కదిపినా ప్రతి తల్లిదండ్రి కళ్ళమ్మట నీళ్లే నా కొడుకుకి పెళ్లి అవ్వటం లేదు ఎందుకు అవ్వట్లేదు ఆడపిల్లలు పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు సరేనా అబ్బాయిలు లేరు ముదురుపోయారు అలాగే అమ్మాయిలయతే అమ్మాయిలు వయసు అయిపోయినా వాళ్ళు కుదురలేరు ఎందుకు పెళ్లిలు చేసుకోవడానికి
(10:43) ఇష్టపడట్లా అని నిజంగా నికార్సుగా ఉన్న మగవాళ్ళకి అస్సలు అవ్వట్లేదండి వ్యవసాయం చేసుకుంటున్నారని చేతి పనులు చేసుకుంటున్నారు అని చెప్పి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు ముందుకు రావట్లే అందరూ బ్రహ్మచారులుగా ఉండిపోతున్నారు ఆ కామెంట్స్ పెడుతూ ఉంటారు నాకు ఎంత బాధగా ఉంటదో అసలు ఎందుకు పుట్టామ అసలు ఈ జీవితం ఏంటి మేడం నాకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు జీవితం అంతా ఇలాగే ఉంటాను కరెక్ట్ చెప్పారు మేడం మీరు అంటే మీరు కరెక్ట్ చెప్పారని అనిపించుకోవటానికి కాదండి నేను వీడియో చేసేది దయచేసి మగవాళ్ళు పెళ్లి చేసుకోండి
(11:17) బ్యాచిలర్స్ గా ఉండొద్దు ఈరోజు మనకి అన్ని బాగుంటాయి ఎందుకంటే కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నప్పుడు ఒంట్లో సత్తు ఉన్నప్పుడు ఉడుకు రక్తం మీద ఉన్నప్పుడు అన్ని మనమే చేసుకోగలం రేపు అన్నటి రోజున కాళ్ళు చేతులు పని చేయకపోయినా మనకి ఏ రోగం రొప్పవచ్చినా మనకి ఒక తోడు ఉండాలి అది బిడ్డలా భార్య అని ఆఖరి రోజుల్లో వృద్ధాశ్రమాలే గత అవుతాయండి ఒక్కసారి ఆలోచించండి ఈ ధర్మాసనాలు తీర్పులు అవి మీరు పట్టించుకోవద్దు ఒక ఇప్పుడు 90 మంది ఎదవలు ఉంటే అందులో 10 మంది మంచి ఆడపిల్లలన్నా ఉంటారు వాళ్ళని ఏరి కోరి మీరు చేసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఒంటరి జీవితం అసలు వద్దు
(11:54) ఎందుకు అంటే అదొక నరకం అన్ని బాధ్యతలు చేస్తాం సంతోషంగా ఉంటాం కానీ మనకోసం మనం ఏం చేసుకోలేం మనకోసం మనం టైం పెట్టలేం మనకోసం మనం బతకలేం అది నరకం మాట భగవంతుడు ఇచ్చిన అదొక శాపం అది తీసుకోవద్దు మీరు ముందుకు వెళ్ళండి. పచ్చడి సంసారంతో భార్యా బిడ్డలతో చక్కగా మెలగండి. ఇక్కడ భార్యా భర్తల బంధం గురించి ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు అవన్నీ చెల్లవేండి ఎందుకంటే అవి పట్టించుకోవలసిన పద్ధతి మనక ఏమీ లేదు పెళ్లి అంటే వేద మంత్రాలు తాలి బొట్టు జిలకర్ర బెల్లంప మంది పెద్దలు వాళ్ళ ఆశీర్వాదాలు అక్షింతలు ఇలా చూసుకుంటే వేద మంత్రాలతో సంప్రదాయమైన
(12:36) పెళ్లిళ్లు సాక్షాత్తు ఆ మంత్రాలకు దేవతలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కోర్టులు ఇచ్చిన తీర్పులతో ఒక సంతకంతో ఒక తెల్ల పేపర్ తో విడాకలు అయిపోవు భార్యా భర్తలు విడిపోవడం అంటూ జరగదు మీ దృష్టిలో పెళ్లి అంటే జిలకర్ర బెల్లం మాంగల్యం పెద్దల ఆశీర్వచనం అది ముందుకి తీసుకువెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఒక ఎద్దులు బండి వెళ్తున్నప్పుడు కాడ ఎద్దులు ఉంటాయి కదండీ రెండు సమానంగా బాధ్యతలు స్వీకరించే అది ముందుకు వెళ్తేనే ఆ జీవితం అన్న ప్రయాణం సాఫీగా సాగుద్ది.
(13:08) ఒక ఎద్దు ఇటు లాగి ఒక ఎద్దు అటు లాగితే ఆ సంసారం గాడిలో పడిపోద్ది. ఇది గుర్తుంచుకొని భార్యా భర్తలు ఇద్దరూ సమంగా పని చేసుకోండి ఎలాగో సమంగా జాబులు చేస్తున్నారు సమంగా పిల్లల్ని పెంచుకోండి సమంగా బాధ్యతలు తీసుకోండి. ఇటువంటివన్నీ మీరు చేసుకుంటే ఏ కోర్ట్లు ఏ ధర్మాసనాలు ఏ పెద్దలు ఎవ్వరు మీకు తీర్పులు చెప్పనవసరం లేదు మీ సమస్యను మీరే చక్కబెట్టుకునే అవకాశం మీకు భగవంతుడు ఇచ్చాడు.
(13:33) ఎందుకంటే మనిషికి అచంచలమైన శక్తి ఉంది ఏదైనా మాట్లాడే గొడవలు తెచ్చుకోవడం నోటికి ఏమ వచ్చినట్టు కాదండి అదే ఓర్పు పొందే నిదానంగా సమస్యను చక్కపెట్టుకోవచ్చు మాటలతో అంటే చేతలతో అనది మాటలతో కూర్చొని మాట్లాడుకుంటే ఒకరి మనసు ఒకరు గెలుచుకోవచ్చు ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని ప్రవర్తించండి భార్యా భర్తలు నిండు నూరేలు చక్కగా దాంపత్య జీవితం సాగిస్తారు ఒకరు బాధ్యతలు ఒకరు పట్టుకోండి ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకోండి అలాగేజ జీవితాన్ని కాచి వడపోసిన వాళ్ళ సలహాలు తీసుకోండి.
(14:07) ఎప్పుడూ విడిపోవటాక అయితే డెసిషన్స్ తీసుకోవద్దు. కలిసి ఉండటానికే ప్రయత్నించండి. ఇక్కడ వదిలేసుకోవడం గొప్ప కాదండి. సర్దుకొని చెయ్యి పట్టుకుండటం గొప్ప. ఒక్కసారి వేద మంత్రాల నడుమున తాలి కట్టి పసుపు తాడు, జీలకర్ర, బెల్లం పెట్టి, నీ చెయ్యి నేను పట్టుకుంటున్నాను. నీ బాధ్యత నాది అని అన్నప్పుడు అలాగే ఆ అమ్మాయి కూడా ఆ భర్త మాంగల్యం మెడలో పడినప్పుడు ఆటోమేటిక్ గా ఆ హక్కులు బంధాలు ప్రేమలు బాధ్యతలు ఎనలేని బాంధవ్యం ముడివేసుకుంటది.
(14:38) ఇది తెలుసుకొని మీరు ముందుకు వెళితే మీ కాపురం పదిలంగా వందఏళ్ల దాంపత్యం కొనసాగిస్తారు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది. [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment