Sunday, April 5, 2026

పీరియడ్స్ సమయంలో జపం చేస్తే ? Is it good or bad doing japa in menstrual periods time for women

పీరియడ్స్ సమయంలో జపం చేస్తే ? Is it good or bad doing japa in menstrual periods time for women

Author Name:OmShyamaa

Youtube Channel Url:https://www.youtube.com/@omshyamaa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_bZsic_4zfk



Transcript:
(00:01) సోదరీమణలు నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు వాళ్ళు చేసేటువంటి జపసాధన గురించి వాళ్ళు చేసేటువంటి పూజలు గురించి చెప్తూ వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు అడిగి అడగడం నేను వాళ్ళకి నివృత్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు రెండు మూడు ప్రశ్నలు అడిగిన తర్వాత మూడో ప్రశ్న నాలుగో ప్రశ్న ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అదేంటంటే నెలసరి సమయంలో చేయొచ్చా అంటే ఒక రెండు మూడు ప్రశ్నలు అడగగానే ఈ ప్రశ్న నా దగ్గరికి ఇంకా రాలేదని ఎదురు చూస్తా ఉంటాను అన్నమాట ఎవరనా సోదరి
(00:46) అడుగుతా ఉంటే ఎందుకంటే అంత కామన్ అయిపోయింది అన్నమాట అడగడం ప్రతి ఒక్కళ్ళకి చెప్పే బదులుగా వాళ్ళ కోసం వీడియో చేస్తే మంచిదని ఆలోచించి ఈ వీడియో చేయడం జరిగింది. నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో మీకున్నటువంటి ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. అయితే మీ నెలసరి సమయంలో మీరు జపం చేయొచ్చా లేదా అనే విషయం తెలుసుకునే ముందు కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
(01:27) మేము చిన్నతనంలో ఉన్నప్పుడు చెరుకు గడలు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఎంత ఇష్టం అంటే చెరుకు గడలు దొరక్కపోతే గేదెల దగ్గర జొన్న దంట్లు వేసేవాళ్ళు జొన్న దంట్లు వేస్తే గేదెలు ఏం చేసేవంటే ఆకు వరికి తినేసి పాపం ఆ దంటు తినలేక పక్కన పడేసాయ అన్నమాట చిన్న వయసు ఎలిమెంటరీ స్కూల్ వయసు ఆరో తరగతి వచ్చే వరకు కూడా ఆ జొన్న దంటు వాటిలో కొన్ని చాలా తీయగా ఉండేవి.
(02:07) మా అందరికీ నాకు గాని మా స్నేహితులందరికీ గాని అలవాటు ఏంటంటే ఆ జొన్నదంట్లు తీర్చుకొని వాటిని వలుచుకొని చెరుకు గడలు తిన్నట్టుగా భావించి తినేవాళ్ళం కొన్ని సవ్వగా ఉండేవి కొన్ని తీపిగా ఉండేవి మొత్తానికి అదిఒక ఒక రకమైన టేస్ట్ అన్నమాట ఆ తీయదానం దొరికేది కానీ ఈ ప్రయత్నంలో మాకు ఏం జరిగాయి అంటే జొన్న దంటు యొక్క ఆ దంటు పీకినప్పుడుదా దాని యొక్క పైన పెచ్చు లాగినప్పుడు సన్నగా రేజర్ బ్లేడ్ లాగా వచ్చేవి అన్నమాట అవి ఎంత పొదునుగా ఉండేవి అంటే కనీసం ఒక్క ఒక్కసాటయనా ఒక్క పెదవైనా తెగుతుంది లేదా చేతులైనా తెగేవి అన్నమాట అంత
(02:56) పొదునుగా ఉంటాయి. గాయం కాకుండా మేము జొన్నదంటే తినగలిగే వాళ్ళం కాదు ఒక్కోసారి విపరీతంగా తెగాయి చెయ్యి మొత్తం రక్తం మయం అయిపోయేది అన్నమాట రక్తం అయిపోతే ఈ చెయ్యి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే మేము చేసిన పనులకి ఆ చెయ్యి మంటతో పాటు దెబ్బలు కూడా తగిలాయి దెబ్బలు తగిలితే తగిలినయి కానీ ఆరోజు చెయ్యి తెగింది కాబట్టి ఆ చేతికి కట్టేసేవాళ్ళు లేదా ముందు రాసేవాళ్ళు నోట్లో అన్నం పెట్టే వాళ్ళు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళు అంటే మనం మినిమం చేసుకునే పనులు కూడా మనం చేయకుండా అమ్మ
(03:42) చేసి పెట్టేది. అదిఒక రకమైన సుఖం దొరికేది. తెల్లవారి స్కూల్ మానేయాలంటే ఇదిఒక మంచి ఎత్తుగడ అబ్బో చెయ్యి నెప్పిగా ఉంది ఇంకా మానలేదు అని చెప్పి వేషం వేస్తే ఫోన్లు వేయేవాళ్ళ ఇంటికాడే ఉండు రేపు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు పొలం వెళ్ళిపోయేవాళ్ళు చక్కగా బయటిక వచ్చేసి ఆడుకునేవాళ్ళం అన్నమాట అదే బుద్ధి మేము ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా పోలేదు ఎలాగంటే ఏదనా దెబ్బ తగిలి ఎప్పుడన్నా దెబ్బ తగులుతా ఉండేది ఆ దెబ్బ తగిలితే గాయమయి బాగా రక్తం వచ్చినప్పుడు దాన్ని కడుక్కునే
(04:27) ముందే ఫోన్లో ఫోటో తీసేసేవాళ్ళం నేను ఫోటో తీసేవాడిని ఫోటో తీసింది జాగ్రత్తగా పెట్టుకునేవాడిని లీవ్ ఏదనా కావాలంటే ఇప్పుడు ఆ గాయం కడిగిన తర్వాత అంత తీవ్రంగా కనపడదు కానీ బ్లీడ్ అవుతా ఉన్నప్పుడు దాన్ని చూడంగానే పాపం మన బాస్ కి అంటే మన ఉద్యోగంలో మన అధికారులకి జాలి కలుగుతుది కాబట్టి ముందు ఆ ఫోటో తీసి దాన్ని వాళ్ళకు పంపించేసి లీవ్ అడగడానికి సాకుగా వాడేవాళ్ళం అన్నమాట అంటే శరీరంలో నుంచి ఇలాంటి బ్లడ్ వచ్చి అవకాశం దొరికితే రెస్ట్ తీసుకోవడానికి ఇదిఒక మంచి
(05:13) అవకాశంగా భావిస్ స్తా ఉంటాం అలాంటిది నెలలో ఒక నాలుగు రోజులు మీకు అలాగా రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ప్రకృతికి కల్పించింది. ఎంతలాగంటే అమ్మవాసి టైంలో అమ్మవారు కూడా రెస్ట్ తీసుకుంటారు కనీసం పూజారులు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్లరుఅన్నమాట మన సంస్కృతిలోనే ఉంది. ఆ నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళు రెస్ట్ తీసుకోమనే మన సంస్కృతి చెప్తుంది ప్రకృతి చెప్తుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోమనే చెప్తారు.
(05:56) మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేసి పని చేయమని గాని జపాలు చేయమని గాని అడగరు ఎందుకంటే మీ పరిస్థితి బాగోదు కాబట్టి ఆ సమయంలో దాదాపుగా ఎవరు కూడా మీకు పనులు కూడా చెప్పరు. మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం రెస్ట్ తీసుకోవడానికి ఎక్స్ట్రా నాలుగు రోజులో ఐదు రోజులు రెస్ట్ తీసుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం అంతేకాకుండా ఆ సమయంలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడింది.
(06:35) తమోగుణం మనసులో మానసికంగా కూడా ఒత్తిడిని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ఆలోచన ధోరణ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. సైన్స్ ప్రకారంగా కూడా చూస్తే ఆ సమయంలో వాళ్ళకి ఆందోళన ఎక్కువ విపరీతమైనటువంటి ఆలోచనలు కూడా ఎక్కువ అని చెప్పడం జరిగింది. నిజానికి ఒక రీసెర్చ్ వాళ్ళు జైల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు క్రైమ్ చేసినటువంటి డేట్లు రికార్డ్ చేస్తే అవన్నీ కూడా వాళ్ళు పీరియడ్స్ సంబంధించిన సమయంలోనే ఎక్కువగా క్రైమ్స్ చేసినట్టుగా చెప్పారు అన్నమాట ఆ సమయంలో
(07:19) తమోగుణం ఎక్కువ ఉండడం వల్ల అలాంటి నిర్ణయాలు వాళ్ళు ఆ సమయంలో తొందరగా తీసుకునేటువంటి ప్రభావం ఉందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ హార్మోనల్ ప్రాబ్లం అంటారు మనం తమోగుణం అని చెప్పి అంటామంటారు. మొత్తానికి ఆ నాలుగు రోజులు మీరు రెస్ట్ తీసుకోమనే ప్రపంచం మొత్తం కోడేక వస్తుంది. తప్పనిసరి పరిస్థితిలో కొన్ని అవకాశం లేని వాళ్ళు బాధ్యతలు ఇరుక్కుపోయిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా మీరు రెస్ట్ తీసుకోబనే చుట్టుపక్కల వాళ్ళు ఆ శాస్త్రాలు గాని మీ చుట్టుపక్కల కుటుంబాలు వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులు గాని ఎటువైపు చూసినా కూడా మిమ్మల్ని రెస్ట్
(08:02) తీసుకోమనే చెప్తారు. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు చేసే సాధన చేసే జపం ఏదో మిగిలిన 20 రోజులు నిష్టగా చేయండి. ఈ నాలుగు రోజులు ఐదు రోజులు మీరు ఆపేయడం వల్ల భగవంతుడికి మీ మీద కోపం రాదు మీకు కలగబోయేటువంటి సాధన పురోగతి ఆగిపోయేది లేదు ఎటువంటి నష్టమ లేదు భగవంతుడే మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్తున్నాడు. దాని గురించి మీకు తర్జ్జన వర్జన ఎందుకో అర్థం కావట్లేదు.
(08:38) దాని గురించి మీరు అసలు తర్జన వర్జన పడాల్సిన అవసరం లేదు. మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం బ్రహ్మాండంగా రెస్ట్ తీసుకోండి ఛాన్స్ అది ఏ పని చేయకుండా అవకాశం ఉండి ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఉండండి మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కామ్గా మనసు ఏదైతే ప్రశాంతంగా ఉంటదో అది మాత్రమే చేయండి. కాబట్టి నన్ను అడుగుతున్నటువంటి మా సోదరణమలందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకు ఆ సమయంలో తమోగుణం ఎక్కువగా ఉండి ఒత్తిడి ఎక్కువగా ఉండి అలజడి ఎక్కువగా ఉంటుంది.
(09:21) శరీరంలో తమోగుణం ఎక్కువైనప్పుడు అప్పుడు చేసేటువంటి జపం యొక్క ఫలితం కూడా తామసికంగానే ఉంటుందన్నమాట. కాబట్టి అది ఎక్కువగా ఉండి ఉదృతంగా ఉంటది కాబట్టి ఆ క్షణాల్లో మీరు ఆపేసుకొని ప్రశాంతంగా వేరే పనులు చేసుకోండి లేదా ప్రశాంతంగా ఏదన్నా బుక్ చదువుకోండి మ్యూజిక్ వినండి ఇంకేదైనా చేసుకోండి. మీ శరీరాన్ని మనసుని రిలాక్స్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
(09:55) ఈ నాలుగు రోజులు చేయపోతే మీకు భగవంతుడు మీ మీద కోపపడడం మీ కావలసినటువంటి ముంద వెనకడుగు పడే అవకాశం ఉండదు మీరు చేయాలనుకుంటే మిగిలిన 20 రోజులు ఇంకొంచెం గంట ఎక్కువగా చేసుకోండి ఇంకొంచెం తీక్షణ పెంచి చేసుకోండి ఆ నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే మీ కెమిస్ట్రీయే ఆ నాలుగు రోజులు కరెక్ట్ గా ఉండదు కరెక్ట్ గా అంటే వేరే వైపు ఉంటుంది అన్నమాట అది పూర్తిగా తమోగుణం వైపు ఉంది కాబట్టి అప్పుడు జాగ్రత్త వహించేసి శరీరాన్ని మనసుని దాన్ని కామ్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి.
(10:33) ఈ వీడియో మీకు నచ్చినట్లైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాల్ని అలాగే షేర్ కూడా చేయండి. ఇది ఇవాల్టి వీడియో జై శ్యామ జై మహాకాళి.

No comments:

Post a Comment