మన జీవితంలో చాలా మందినీ మనం కలుస్తాం.. లేదా మనలను కలుస్తారు...
కొంతమంది మనల్ని ప్రేమిస్తారు.. కొంతమంది మనతో పాటు నడుస్తారు... కానీ...
ఇంకొంతమంది ఉంటారు... మన ముందొక మాట... చాటుకొక మాట... మనకు తెలియకుండానే మన కోసం గుంతలు తవ్వేవారు.
అలాంటి వారి గురించి మనం ఒకసారి ఆలోచించాలి... వాళ్లు నిజంగా జీవితంలో ఎదగగలరా...? స్పష్టంగా చెప్పాలంటే.. వారు ఎప్పటికీ ఎదగరు ఉన్నచోటే... ఉంటారు.
ఎందుకంటే జీవితం ఒక అద్దంలాంటిది.. మనము ఏమి ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది.
మనం నమ్మకద్రోహం చేస్తే... మనకు కూడా ఏదో ఒకరోజు అదే ఎదురవుతుంది. మనం వంచన చేస్తే.. మన జీవితంలో కూడా వంచన ఎదురవుతుంది.
నిజాయితీకి shortcut లేదు...
నమ్మకానికి duplicate లేదు...
మానవత్వానికి alternative లేదు.
మన ముందొక మాట... వెనక ఇంకో మాట మాట్లాడేవారు... వాళ్లు తాత్కాలికంగా గెలిచినట్టు అనిపించవచ్చు... కానీ అది గెలుపు కాదు... అది ఒక మాయ.
ఎందుకంటే...
నిజం ఎప్పుడూ ఆలస్యంగా గెలుస్తుంది... కానీ ఖచ్చితంగా గెలుస్తుంది.
ఒక్కసారి మనం ఆలోచిద్దాం!
ఎవరైనా మన మీద నమ్మకం పెట్టుకున్నారు అనుకుందాం... ఆ నమ్మకాన్ని మోసం చేయడం అంటే... వారి హృదయాన్ని గాయపరచడం.
అది డబ్బుతో సరి చేయలేం..అది మాటలతో మానిపించలేం...
మన ప్రయాణం slow గా ఉండొచ్చు...కానీ clean గా ఉండాలి.
జీవితంలో పెద్ద విజయం అంటే ఏమిటో తెలుసా...?
👉 పెద్ద ఇల్లు కాదు,
👉 పెద్ద కారు కాదు,
👉 డబ్బు కాదు.
👉 మన గురించి ఇతరులు చెప్పే మాట...
“ఆ వ్యక్తి చాలా నిజాయితీ గలవాడు”
అదే అసలు విజయం.
కొంతమంది ఇలా అనుకుంటారు...
“చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా ఏమవుతుంది..?” “కొంచెం మోసం చేస్తే ఎవరికీ తెలియదు…”
కానీ గుర్తుంచుకోండి...
మనకు తెలియకపోయినా... మన మనసుకు తెలుసు.ఆ మనసు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు.
మన జీవితంలో మనం కోల్పోయేది డబ్బు కాదు... మనిషి కోల్పోయేది నమ్మకం.
ఒక్కసారి నమ్మకం పోయిందంటే... మళ్లీ అది సంపాదించడం చాలా కష్టం.
అందుకే...
మనం ఎక్కడ ఉన్నా... ఎంత స్థాయిలో ఉన్నా... నిజాయితీని వదలకండి. నమ్మకాన్ని కాపాడండి. మనసును శుభ్రంగా ఉంచండి.
మరొక్కసారి చెబుతున్నాను...
నమ్మకద్రోహం చేసే వారు... వంచన చేసే వారు... మన ముందొక మాట, వెనక ఇంకో మాట మాట్లాడేవారు.
వాళ్లు కొంతకాలం shine అవుతారు...కానీ జీవితాంతం sustain అవ్వలేరు.
కానీ...
నిజాయితీగా నడిచేవారు. మనసు నిండా మంచితనంఉన్నవారు. ఇతరులకు మంచిని కోరుకునేవారు.
వాళ్లు slow గా ఎదుగుతారు... కానీ, strong గా నిలబడతారు.
మిత్రమా... చివరిగా ఒక మాట...
“జీవితంలో గెలవడం అంటే...ష ఇతరులను ఓడించడం కాదు... మన విలువలను కాపాడుకోవడం.”
మంచి మార్గంలో నడవండి... విజయం మీ వెంట వస్తుంది.🙏
No comments:
Post a Comment