Without Guru you can activate your kundalini 👁️ in safe jone and fullfill your desires 🪷
Author Name:చూడామణి1M
Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0c_trGAF9vM
Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ కేవలం భగవన్ నామ స్మరణ వలన కుండలిని జాగృతి అవుతదా అని చెప్పేసి తంబ్నెల్ పెట్టా కదా కుండలిని జాగరణ అవ్వడమే కాదండి మన కోరికలు నెరవేరడం అనేది కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతది. భగవన్ నామ స్మరణ అనేది చాలా ఈజీ అండి దానికి రెస్ట్రిక్షన్స్ నియమాలు నిబంధనలు అనేవి ఏవి ఉండవు వాచికం ద్వారా అయితేనే అంటే శబ్దం చేస్తూ చేసేది అయితేనే కొంచెం ఋతుక్రమం సమయంలో చేయకూడదు మళ్ళీ బ్యాడ్ ప్లేసెస్ ఉంటాయి కదా కొన్ని ప్లేసెస్ లో మనము చేయకూడదు అన్నమాట స్నానము అవన్నీ ఏమి ఉండదండి స్నానానికి
(00:46) సంబంధించింది ఏది ఉండదని రెండేరెం రెస్ట్రిక్షన్స్ అండి భగవన్ నామ స్మరణ అనేది వాచికం అంటే శబ్దం చేస్తూ బయటికి నోటి ద్వారా శబ్దం చేస్తూ రామ రామ అని ఇట్లా చేస్తూ రెండు ప్లేసులలో చేయకూడదు ఒకటే ఒకటి ఏందంటే ఋతుక్రమం సమయంలో స్త్రీలు చేయకూడదు వాచికం ఇంకోటి ఏందంటే ఆ మన వాష్రూమ్ లో చేయకూడదు ఈ రెండే రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి ఇంకా ఏ రెస్ట్రిక్షన్ ఉండదన్నమాట నార్మల్ గా ఇంట్లో పని చేస్తూ కూడా వాచికం చేయొచ్చు రామ రామ రామ అనుకుంటూ కూడా అంట్లు దోమడము వాకిలు ఉడిచడం ప్రతిఒక్క పని చేసుకోవచ్చు అర్థమవుతుందా అండి ఇక మనసులో భగవన్ నామ
(01:30) స్మరణకి ఆ రెండు రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు ఇప్పటిదాకా నేను చెప్పిన కదా ఋతుక్రమం సమయంలోనూ మళ్ళీ వాష్రూమ్ లోనూ ఆ రెస్ట్రిక్షన్ కూడా ఉండదు వాష్రూమ్లో ఉన్నప్పుడు కూడా ఆ మీ మనసులో భగవన్ నామ స్మరణ జరుగుతుంటది ఒక్కొక్కసారి అది తప్పు కదా అని అనుకోమాకండి మనసుకు ఎటువంటి అంటు ముట్టు మై అనేది ఏది ఉండదున్నమాట మనసులో స్తోత్రాలు కూడా మన ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటాయి.
(02:02) ఒక్కొక్కసారి ఏందంటే మనం భక్తిలో ఎక్కువగా లీనమైపోతూ మన ఇష్టదైవం పట్ల ఆకర్షణకు గురైతున్నప్పుడు మనం చేసే మంత్రమైన నామమైనా మనం చేయకుండానే అది రన్ అవుతూ ఉంటదిఅన్నమాట అది సంభోగ భార్యాభర్తలు సంభోగ సమయంలో కూడా మనసులో భగవన్ నామస్మరణ జరుగుతూ ఉంటది అంతేకాదు వాష్రూమ్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ స్త్రీలు ఋతుక్రమం సమయంలో కూడా ఇవన్నీ పట్టింపులు ఏమి ఉండవున్నమాట కాబట్టి భయపడమాకండి అట్లా ఎందుకు ఎందుకు జరుగుతుంది వాష్రూమ్ లో ఉన్నా కదా అయ్యో ఇప్పుడుఎందుకు భగవన్ నామ స్మరణ జరుగుతుంది సంభోగ సమయంలో అని చెప్పేసి ఇలాంటి అనుమానాలు ఏమి వద్దు మనసుకు అంటూ ముట్టు
(02:39) మైలా అనేది ఏది ఉండదు కాబట్టి మీకు గనుక స్తోత్రాలు కూడా మీకు ఏమైనా నోట అయిపోతే మీ మనసులో స్తోత్రాలు కూడా చేసుకోవచ్చు స్నానం భోనం ఏది అవసరం లేదు అర్థమైందా అయితే భగవన్ నామ స్మరణ ద్వారా కుండలిని జాగృతి అవుతదండి కుండలిని జాగృతి అంటే ఆ ఈ YouTube ఛానల్లలో కొంతమంది భయపట్టిస్తున్నారు అన్నమాట భయపడవలసిన అవసరం ఏం లేదండి గురువు లేకున్నా కూడా మనకు కుండలిని జాగృతి అవుతది సురక్షితమైన పద్ధతి ఏందంటే మంత్ర జపం భగవన్ నామస్మరణ మంత్ర జపం అంటే ఉపదేశం తీసుకొని చేస్తేనే మంత్ర జపమా లేదు ఉపదేశం తీసుకోకపోయినా పర్వాలేదు ఓం నమఃశివాయ అని ఉంది. ఫస్ట్ డే
(03:24) మీరు శివాలయంలో స్టార్ట్ చేసుకోండి ఒక మాల చేసుకొని చేసుకోండి మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో ఆ ఆలయంలో ఒక మాల స్టార్ట్ చేసుకోండి మేము ఆలయం కూడా వెళ్లలేని పరిస్థితులలో ఉన్నామంటే మీ పూజ గదిలోనే స్టార్ట్ చేసేయండి అండి ఆలస్యం అమృతం విషం అండి మీకు చేయాలని ఉబలాటం కలుగుతుంది కానీ గుడికి వెళ్ళే పరిస్థితి లేదు అన్నప్పుడు మీ పూజ గదిలోనే మీరు మంత్రం స్టార్ట్ చేసేసుకోండి అర్థమైందా దుర్గా భక్తులయితే ఓం దుర్గాయే నమః ఇట్లా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదే దేవాయ ఇట్లా అన్నమాట ఇట్లా మీరు ఆ మంత్రమైన ఆ అట్లా జపించుకోవచ్చు గురువు ఉండాలి గురువే
(04:02) ఉపదేశం ఇయ్యాలని ఏం లేదు మీకు అవైలబిలిటీగా ఉంటే గురువులు మాకు ఉన్నారు మాకు దగ్గరలో అంటే మీరు గురుపదేశం తీసుకోండి కానీ ఎందుకు ఆలస్యం చేయాలని ఒకవేళ గురువు దొరక దొరికే పొజిషన్ లేదు ఆ ఇంట్లో కుటుంబం సహకరించదు అన్నప్పుడు మీరు ఇంట్లోనే స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే సమయం తక్కువ మనకు 100 సంవత్సరాల ఆయుష్యు మాత్రమే కదా అందులో మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలవదు ఇప్పటివరకు భగవన్ నామస్మరణ స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేసేసుకోండి.
(04:32) అయితే కుండలిని జాగరణ ఎట్లా అవుతది అంటే భగవన్ నామ స్మరణ నార్మల్ గా మనము గుర్తొచ్చినప్పుడల్లా స్టార్టింగ్ లో చేస్తాం తర్వాత మనం ఎక్కువగా మనసు అనేది గ్రహిస్తూ ఉంటది ఇంకా అబ్సర్వ్ చేసుకుంటూ ఉంటది భగవన్ నామాన్ని చేసుకొని చేసుకొని మెల్లి మెల్లిగా మనం ఇంక ఎక్కువ చేస్తూ ఉంటాం మనకు తెలవకుండానే మన ప్రమేయం లేకుండానే భగవన్ నామ స్మరణ మనం చేస్తూ ఉంటాం తర్వాత అసలు మనం మనం చేయకుండానే భగవన్ నామ స్మరణ అనేది మనసులో మనసే చేస్తుంటది అన్నమాట మన మైండ్ వేరే ఆలోచిస్తున్న మనసు భగవన్ నామ స్మరణ చేస్తుంటది అది మనకు వినిపిస్తుంటది అన్నమాట భగవన్ నామ స్మరణ అంటే ఏంటి
(05:14) పవిత్రమైన నామము ఆ భగవంతుడు గుర్తొస్తాడు మనకు రామ అన్నప్పుడు రాముడు గుర్తొస్తాడు ధనస్సు పట్టుకొని విల్లు పట్టుకొని ఇవన్నీ అంటే రాముడి ఇమేజ్ వచ్చేస్తది మన ముందు అవునా ఓం నమో వెంకటేశాయ అన్నప్పుడు వెంకటేశ్వరస్వామి స్వామి గుర్తుకొస్తాడు. ఇట్లా ఇది ఇది కూడా ఒక సాధన కిందికి అన్నమాట. ఇంకా ఈ సాధనలో అయితే నియమ నిబంధనలే ఉండవు.
(05:41) ఇది ఎట్లెట్లా హైయర్ స్టేజ్ కి వెళ్తుంటదో అంటే ఆ ఈరోజు మూడు సార్లు జపించడం వాళ్ళు రేపు 10 సార్లు అట్లా అంటే వెంట వెంటనే రేపు ఎల్లుండి అని కాదు గానీ ఒక్కొక్క మెల్లిగా స్లో ప్రాసెస్ లో ఏం జరుగుతది అంటే మీరు అధికంగా జపించడం అనేది జరుగుతది. అధికంగా జపించడం ద్వారా ఏం జరుగుతది అంటే మీ మూలాధార చక్రంలో ఉన్న కుండలిని మాత అనొచ్చు సర్పం అనొచ్చు ఆమె నిద్ర లేస్తది అన్నమాట ఇది సురక్షితమైన పద్ధతి అండి అసలు భయపడవలసిన అవసరమే లేదు సేఫ్ జోన్ అన్నమాట భగవన్ నామ స్మరణ మంత్ర జపము వలన కుండలిని జాగరణ జరిగినప్పుడు భగవంతుడే మనకు గురువు అవుతాడు అన్నమాట మనం ఏ జపం అయితే
(06:21) చేస్తున్నామో మన ఇష్టదైవం రామ అనుకోండి రాముడే గురువు అవుతాడు రాముడే అప్పుడే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తాడు అన్నమాట అయితే కుండలిని జాగరణ అనేది సేఫ్ జోన్ లో వెళ్తది కొంతమంది ఆ ప్రాణాయామాల ద్వారా కుండలిని జాగరణ చేసుకుంటారు అన్నమాట ప్రాణాయామాలు అంటే భక్తి అనేది ఏం కాదు కతే ప్రాణాయామాలు ఉంటాయి కొన్ని కుండలిని కుండలిని ఉద్రేకపరిచి కుండలిని జాగరణ అయిపోతది అన్నమాట అలాంటివి ఎప్పటికీ నిలబడవండి అంటే మనసులో భగవంతుడి పట్ల భక్తి ప్రేమ ఉండి భగవన్ నామ స్మరణ మంత్ర జపము భక్తి పూజ వీటితోని అయ్యే కుండలిని జాగరణ ఏదైతే ఉంటదో భగవంతుడే మనకు గురువై
(07:06) ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట ఈ ప్రాణాయామాల ద్వారా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్లి శక్తిపాతం చేయించుకునే కుండలిని జాగరణ చేపించుకుంటారు కొంతమంది అదొకటి ఇవి నిలబడవండి నిలబడవు ఏందంటే ఇట్లా భగవన్ నామస్మరణ భక్తి మార్గంలో లో భక్తి మార్గం ద్వారా కుండలిని జాగరణ స్తోత్ర పారాయణాల ద్వారా కుండలిని జాగరణ అయినప్పుడు భగవంతుడే మనకు గురువయి రక్షణగా మన వెనకాల ఉండి మన లోపలనే ఉండి మనకు ఏమైనా ఆలోచనలు వస్తుంటే కూడా దీని మీద అనుమానాలు ఏమైనా వస్తుంటే కూడా వాటికి జవాబులు ఇస్తూ మనల్ని ముందరికి తీసుకెళ్తాడు.
(07:45) ఈ కుండలిని జాగరణ ఆ అయ్యింది అని ఎట్లా తెలుస్తదిఅంటే శరీరంలో ఫస్ట్ వేడి ఉత్పన్నం అవుతదండి. ఆ మూలాధార చక్రంలో అమ్మ నిద్ర లేస్తుంది కళ్ళు తెరిచింది అనగానే హీట్ ఉత్పన్నం అవుతది అన్నమాట ఇక మీరు రోజుక ఇన్ని మాలలు చేస్తున్నారు అన్నప్పుడు ఫాస్ట్ గానే కుండలి నిజారణ అవుతది ఫస్ట్ ఏం జరుగుతదిఅంటే అమ్మ నిద్ర లేవగానే మనకు హీట్ హీట్ బాడీ హీట్ హీట్ అనిపిస్తుంటదండి పూనకం వచ్చే వాళ్ళకి కూడా చూడండి పూనకం అంటే కూడా కుండలిని జాగరణే కిందికే లెక్క అండి కుండలిని జాగరణే కిందికి లెక్క కాదు పూనకం వచ్చినప్పుడు కూడా బాడీ మొత్తం హీట్ అయిపోతదండి పునకం
(08:23) అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారు దిగిపోయిన తర్వాత వెళ్ళంతా వేడిగా అయిపోతది అందుకనే వాళ్ళకి కళ్ళు తాగించడం కూల్ డ్రింక్ తాగించడం ఇలాంటివి చేస్తారు నేనైతే అరిటి పండ్లు తింటా అండి కొబ్బరి నీళ్లు తాగుతా ఎందుకంటే నేను కళ్ళు తాగడం అలాంటివి చేయను అన్నమాట అలాంటివి చేయను కాబట్టి ఆ కూల్ డ్రింక్ కూడా తాగకూడదు నేను కాబట్టి నేను ఏంటంటే కొబ్బరి నీళ్లు ప్రిఫర్ చేస్తా ముందే పెట్టుకుంటా అన్నమాట మొన్న మైసమ్మ గుడికి వెళ్ళా కదా ఓడి బియ్యం పోసా ఇట్లా గుడిలో అడుగు పెట్టగానే మైసమ్మ తల్లి వచ్చేసింది.
(09:00) అట్లా బాడీ హీట్ అయిపోయింది అన్నమాట తర్వాత ఏం చేసిందంటే నేను అరటి పండ్లు ఎప్పుడు ఉంటాయండి నా దగ్గర నా ఆటో ఇమ్యూన్ డిసీస్ కి సంబంధించి అరిటి పండ్లు ఎక్కువ తినాలి కాబట్టి అట్టి పండ్లు తినగానే కడుపులో చల్లబడతది అన్నమాట అట్లా కడుపులో చల్లబడడం కోసం ఏం చేస్తారంటే చాలామంది గ్రామీణ వాళ్ళు కళ్ళు తాగిపిస్తారు పూనకం అయిపోయిన తర్వాత అదన్నమాట ఒళ్ళు హీట్ ఎక్కుతదండి హీట్ ఎక్కుతుంటది మెల్లిమెల్లిగా మనం ఆహారాన్ని మార్చాలిగా అర్థమవుతుంది అనుకుంటా ఆహారాన్ని మార్చాలి చలవ చేసే ఆహారం తినాలి.
(09:31) కుండలేని జాగరణ అయ్యింది అని ఎట్లా తెలుస్తది అంటే ఒళ్ళు రోమాతం అవుతూ ఉంటది భగవంతుడి పట్ల ఆకర్షణ అవుతది కన్నీళ్లు వస్తూ ఉంటాయి అక్కడక్కడ కంపనాలు వస్తూ ఉంటాయి ఇంకా పరమాత్మ మీకు ఇమేజ్ గుర్తుకొస్తూ ఉంటది మాటిమాటికి పరమాత్మ ఇమేజ్ మీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటది. ఇంకోటి ఏందంటే భగవన్ నామ స్మరణ అనేది మీకు ప్రమేయం లేకుండానే మీ మనసులో జరుగుతూ ఉంటది ఆజపాజపం జరుగుతది.
(09:56) తర్వాత విశుద్ధి చక్రం అనేది మీరు వాచకం కూడా చేస్తూ ఉంటారు కదా మనసులో చేస్తూ ఉంటారు కదా ఈ కుండలిని జాగరణ అమ్మ ఏం చేస్తదంటే అమ్మ నిద్రలేసి కింద అరిషడ్ వర్గాలు ఇంద్రియాలకు జరుగుతూనే ఉంటది మళ్ళీ ఇక్కడ మీకు అనాహత చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞ చక్రం మూడు ఏకధాటిలో ఒకే సమయంలో యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటది. అందరికీ కాదు ఎంత చేస్తున్నారు ఎంత శాతం చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఆధారపడి ఉంటదిన్నమాట.
(10:33) ఇట్లా మనసులో మీకు సమాధానాలు దొరుకుతుంటాయి. ఆ పీనల్ గ్లాండ్ యక్టివ్ అయ్యి ఆజ్ఞ చక్రం దగ్గర పరమాత్మ ఇమేజ్ ని ఖచ్చితంగా చాలా బాగా చూడగలుగుతారు. ఏ దేవుడు అంటే ఆ దేవుడిని చూడగలుగుతారు. మళ్ళీ విశుద్ధి చక్రము అంటే ఈ భగవన్ నామస్మస్ భక్తి మార్గంలో అండి కొంచెం జనాలు జన సందోహంలో ఉండకుంటేనే మనము రాకెట్ లాగా దూసుకు వెళ్ళిపోయే ఆస్కారం ఉంటదండి. అంటే జన సందోహంలో ఉన్నప్పుడు వాక్కు అశుద్ధి అయ్యే ఆస్కారం ఉంటదండి మనం తప్పుగా మాట్లాడే ఆస్కారం ఉంటది తెలవకుండానే కాబట్టి కొంచెం భక్తులు సాధకులు కొంచెం ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి మెయిన్ విషయాలు ఏమైనా ఉంటే పిల్లిలు పేరంటాలు వెళ్ళినా కూడా మౌనంగా
(11:17) ఉండడానికి చూడండి అంటే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావ అని ఆలోచించి మాట్లాడండి. అది ఇక విశుద్ధి చక్రం యక్టివేషన్ అవుతుంది అన్నప్పుడు మీరు అన్న మాట నిజం అన్నమాట అవుతది ఆ ఈ పని అయితది అని మీరు అనగానే అది నిజంగా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతది అది అవుతది అన్నమాట మీకు తెలిసిపోతుంటది ఆ ఇంకోటి ఏందంటే విశుద్ధి చక్రం యాక్టివ్ అయినప్పుడు ఏం జరుగుతది అనేది ఎట్లా జాగ్రత్తలు పాటిస్తే విశుద్ధి చక్రంలో ఉన్న అమ్మవారు సిద్ధి దేవత ఎప్పుడు జాగృతవస్థలో లో ఉండి మీ వాక్ సిద్ధి మీకు మీరు ఏది మాట్లాడితే అది నిజం నిజం జరిగిపోతూ ఉంటదిన్నమాట అట్లా కావడానికి
(12:01) ఎలాంటి జాగ్రత్తలు పాటించాలఅనేది ఒక వీడియో రేపు వస్తదండి చాలా బాగుంటది చూడండి. అయితే విశుద్ధి చక్రము అనేది ఎందుకు యాక్టివ్ అవుతది అంటే ఇట్లా మీరు ఎప్పుడు భగవన్ నామ స్మరణ చేస్తూ ఉంటారు వాచకం కూడా చేయొచ్చుఅని చెప్పాగా ఇల్లు ఉడుస్తూ వాకులు ఉడుస్తూ కూడా ఆ సిగ్గుపడకుంటే చేయొచ్చు ఆ ఈ ఇలాంటి విషయాలలో సిగ్గును పక్కకు పెట్టేసేయండి మీరు అర్థమైందా నేనైతే ఎప్పుడో సిగ్గును పక్కకు పెట్టేసిన అన్నమాట భక్తి విషయంలో ఎట్లా అంటే నేను చక్కగా భజనలు వాడుకుంటా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ వినిపిస్తది ఆ మళ్ళీ కూర్చుంటూ లేస్తూ వంట చేస్తూ భజనలు
(12:41) కూడా వాడుతూ ఉంటా అనమాచారి కీర్తనలు కూడా వాడుతూ ఉంటా ఒక్కొక్కసారి కీర్తనలు భజనలు పాడేంత చేతన కానప్పుడు రామ నారాయణ అనుకుంటూ వంట చేస్తూ ఉంటా అన్నమాట కూరగాయలు కోస్తూ ఉంటాయి ఇవన్నీ పక్కన వాళ్ళు వాళ్ళు అందరూ వింటారు. ఆ విన్నా కూడా ఏమి సిగ్గు పడాల్సిన అవసరం లేదు మనం ఏం తప్పు చేయట్లేదు కదా భక్తిగా మనం చేసేది అది మనం సిగ్గుపడితే సిద్ధి దేవత సిగ్గు పడుతుంది నన్ను నేను జాగృతం అవుతుంటే ఈమె సిగ్గుపడుతుంది ఏంది అని కాబట్టి సిగ్గు పడమాకండి అయితే విశుద్ధి చక్రము అనేది యాక్టివేషన్ అవుతున్నప్పుడు ఇట్లా మనకు వాక్సిద్ధి అనేది వస్తూ ఉంటది అన్నమాట మీరు వాక్కు
(13:23) ద్వారా ఇంతకుముందు ఏదైనా కూడా మాట్లాడడానికి జంకకపోయేవారు అంటే ఇప్పుడు పక్కింటా ఉంది ఆమె ఎలాంటిది ఆమె మంచిది కాదు వచ్చి ఏంది అసలు ఆమె ఆమె జీవితం ఏంది అసలు అట్లా ఆమె ఆమె గుణం ఏంది అసలు బాలేదు అంటే వేరే వాళ్ళ గురించి మనం ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళం అంటే ఆమె బ్యాడే నిజంగానే బ్యాడే మనమేమి తప్పు అబద్ధంగా ఏమ అనట్లేదు కానీ ఇప్పుడు మన లోపల పరమాత్మ జాగృతమైనప్పుడు విశుద్ధి చక్రం జాగ విశుద్ధి చక్రంలోని సిద్ధి దేవత జాగృత వస్థలోకి వస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతదిఅంటే మనం పక్కింటవాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా ఎవ్వరి గురించి కూడా
(14:04) వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళ అయినా కూడా వాళ్ళ గురించి మాట్లాడడానికి మనం ఇష్టపడమ అన్నమాట మన నాలుక మడతాపడిపోతుంటది అన్నమాట ఆ ఎందుకంటే మీరు భగవదావతారంగా మారిపోతూ ఉన్నారు అన్నమాట కాబట్టి మీరు చెడ్డవాళ్ళ గురించి కూడా వాళ్ళు చెడ్డవాళ్ళు అని మీరు మాట్లాడలేకపోతారు తప్పు కదా నాకెందుకు నేను పరమాత్మతో కనెక్ట్ అయిఉన్నా నాకు భగవంతుడే ముఖ్యం ఇంట్లో కూడా భర్తో భార్యో ఆ ఇట్లా కంపరం కలిగించే వాళ్ళు కొంతమంది ఉండరు అంటే ఎట్లా అంటే ఊరికూరికే గునుగడం ఊరికూరికే తిట్టడం భర్త అనేవాడు ఉంటే ఆ విసిగించడం ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపించవన్నమాట
(14:50) కుండలిని జాగరణ అయింది అనడానికి ఇది చాలా చక్కటి వినండి చక్కటి ఇవి చెప్తున్నా ఇతరుల అభిప్రాయాలు గాని ఇతరుల ద్వేషాలు గాన అవన్నీ మన మీద ప్రభావితం చూప మనం స్ట్రాంగ్ గా అవుతూ ఉంటాం అన్నమాట ఏమన్నా అనుకొని నాకేంది నాకు పని ఉంది నా ఇంట్లో పనింతా చేసుకొని నేను పూజ చేసుకోవాలి పూజ చేసుకొని ఒక భజన కార్యక్రమం పెట్టుకోవాలి భజన చేసుకోవాలి ఒక కీర్తన పాడుకోవాలి విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి ఈ మాటలు ఈతన అనే మాటలన్నీ నేనుఎందుకు పట్టించుకుంటా నాకు అనవసరమా అసలు మనం కొంచెం కొంచెం కూడా ఫీల్ గాని దశక వస్తాం అనాహత చక్రం జాగృతి అయినప్పుడు
(15:31) మనం ఫీల్ అవ్వమ అన్నమాట ఇతరుల ఆ ఇతరులు అవమాన పరిచిన నిందలేసిన ఇతరులు మన పట్ల కోపంగా చూసిన మనం మెల్లిమెల్లిగా పరమాత్మ వైపుకు ఆకర్షితం అవుతాం కాబట్టి ఇంట్లో బాధ్యతగా అన్ని బాధ్యతగా ఇల్లు నీటిగా అన్ని పెట్టుకొని చక్కగా మన పూజ కార్యక్రమాలు మన భజన కార్యక్రమాలు స్తోత్ర పారాయణలు ఇవే ఆలోచనతో మనం సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటే సేవా కార్యక్రమాలు ఇవే ఆలోచనతో ఉంటాం కానీ వేరేవాళ్ళు మన మీద దృష్టి పెట్టిన మనం వాళ్ళ మీద దృష్టి పెట్టమ అన్నమాట అది అర్థమవుతుంది అనుకుంటా ఇది మీకు మీ భగవాన్ నామస్మరణ అత్యుత్తమ దశలోకి వెళ్తుంది సిద్ధి దేవతలు మీ శరీరం రూపంలో జాగృత
(16:12) అవుతున్నారని ఇది సంకేతాలు అన్నమాట అందుకని మీరు ఆ ఒకవేళ ఎవరైనా వచ్చి మిమ్మల్ని తిట్టినా కూడా మీరు క్షమించేసేయాలంట క్షమాగుణం అనేది భగవత్తత్వం అది క్షమాగుణం అనేది ఏందంటే అది చేతగానితనం కాదు అది భగవత్తత్వం అన్నమాట క్షమించేసేసి మనం మన పనిలో మనం ఉండాలన్నమాట అంతే అలా ఉండడం వల్ల ఏం చేస్తది అంటే మనం వాళ్ళను రిటన్ గా ఏమైనా అన్నప్పుడు అది మన భక్తులం అయిపోయినాం కదా సిద్ధి దేవతలు జాగృతం అయినప్పుడు ఆ వాక్ సిద్ధి వచ్చినప్పుడు అది నిజమైపోతది కాబట్టి వాళ్ళకు వాళ్ళక ఏమన్నా కావాలని అని మనం అన్నామ అనుకోండి
(16:56) నువ్వు నాశనం అయపో అని వాళ్ళకి నిజంగానే ఏదో ఒకటి జరుగుతదండి అప్పుడు జరిగినప్పుడు ఆ కర్మ అనేది నువ్వు అన్నందుకే జరిగింది కాబట్టి నీ నెత్తి మీద పడతది అన్నమాట కాబట్టి మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలన్నమాట ఆవాక్ శుద్ధి వాక్ శుద్ధి ఉంటే వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి దేవత సంతోషంగా నిలబడి చక్కగా నృత్యం చేస్తది ఓకేనా ఏ సిద్ధి దేవత అయినా వాక్ సిద్ధి దేవత అనే కాదు అనాహత చక్రంలో పరమాత్మ అయిన మళ్ళీ మూలాధార చక్రంలో కాళీమాత నృత్యం చేసుకుంటూ కాళీ అవతారంలోనే మణిపూర చక్రం వరకు వస్తది.
(17:35) మణిపూర చక్రంలోకి వచ్చిన తర్వాత ఆమె దుర్గా అవతారం ఎత్తుతది. అట్లా అవతారాలు మార్చుకుంటూ సహస్రార చక్రం వరకు వచ్చేసరికి పార్వతీ దేవిలాగా మారి సహస్రార చక్రంలో శివుడు కూర్చొని ఉంటాడు ఆయనతోని ఐక్యం అవుతది అన్నమాట కాబట్టి మనము ఎట్లా ఉండాలంటే మనము మనల్ని ఎవరనా ఏమనా అన్నా కూడా వదిలేయాలి అంతే అనవసరమైన యొద్దు ఎందుకంటే అవన్నీ అవన్నీ టాస్కులు అన్నమాట వాటిఅన్నిటిని దాటుకొని వెళ్ళిపోతూ ఉండాలి మనం భక్తి మార్గంలో ముందుకి ఇట్లా భగవన్ నామ స్మరణ అనేది జపిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతది అంటే భగవన్ నామ స్మరణ కావచ్చు జపించడం కావచ్చు స్మరణ అంటే మనసులోపల స్మరించుకోవడం ఇట్లా
(18:18) బయటికి బయట ఏంటి ఇంట్లో పని చేస్తూ కూడా నేను ఇల్లుడుస్తూ రామ రామ అంటున్నా మరి అది ఫలితం ఉంటదా ఉండదా అనే డౌట్లు వద్దు అర్థమవుతుందా ఎందుకంటే రామ రామ అని ఇల్లుడుస్తూ రామ రామ అన్నా కూడా రాముడు మీ వైపుకు చూపు సారిస్తాడు అన్నమాట అంటే విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి ఆ రామ అనే పదంలో నుంచి ఒక వైబ్రేషన్ అనేది విడుదల అవుతది అన్నమాట అదే భగవతి ఎనర్జీ భగవత్ శక్తి అర్థమవుతుందా మెల్లి మెల్లిగా బ్రహ్మరంద్రం ఓపెన్ అవుతది మనకి సహస్రార చక్రంలో ఉన్న బ్రహ్మరంద్రం ఓపెన్ అయ్యి మనకి అక్కడి నుంచి మనకు కాస్మిక్ ఎనర్జీ అంటే భగవత్ శక్తి యూనివర్సల్ పవర్ అది మన
(19:00) శరీరం లోపలికి ఫుల్ఫిల్ అవుతూ ఉంటదిన్నమాట మెల్లి మెల్లిగా స్లో ప్రాసెస్ లో ఎవరు ఎంత చేస్తే అంత అయితే తే అతిగా చేసి తొందరగా కుండలిని జాగరణ మీద పెద్దగా మీరు ఆసక్తి పెట్టుకోమాకండి ఆ మీరు భగవంతుడి మీద ఆసక్తి పెట్టుకోండి కుండలిని జాగరణ వేగంగా అవుతది. కుండలిని జాగరణ మీద ఆసక్తి పెట్టుకుంటే పరమాత్మ అబ్సర్వేషన్ చేస్తు ఈమె కుండలిని మీద సిద్ధుల మీద ఆసక్తి ఉంది అని చెప్పేసి పరమాత్మకు అర్థమైపోతుంటది.
(19:27) ఆ కాబట్టి అట్లా ఉండకూడదు మనం పరమాత్మ మీదనే ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. ఆ అయితే ఇట్లా మనము భగవన్ నామ స్మరణ చేస్తూన్న కొద్దికి భగవతి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటది యూనివర్స్ నుంచి రిలీజ్ అయింది మన బ్రహ్మరంద్ర గుండా మన శరీరం లోపలకే ఫామ్ అయిపోతూ మన కర్మలను ధ్వంసం చేస్తూ కుండలిని మాత నిద్ర లేస్తది అన్నమాట అయితే ఇట్లా మెల్లిమెల్లిగా ఎట్లా ఎంతవరకు ఫామ్ అవుతది అంటే ఇక మన చర్మ గ్రంధులు మన చెవులు అన్ని శుద్ధీకరణ అవుతూ ఉంటాయి అన్నమాట అనాహ హత ధనులు వినిపించడము ఇంకా చర్మ శుద్ధీకరణ జరిగినప్పుడు ఈ తేజ తేజోవంతంగా తయారవుతాం అన్నమాట ఆ ఎట్లా
(20:10) అంటే అమ్మవారిలాగా కనిపిస్తాం ఇక్కడ అందంగా అని కాదు అమ్మవారిలాగా కనిపిస్తాం అన్నమాట సాక్షాత్తు అమ్మవారేనా అన్నట్టుగా ఉంటదిన్నమాట మాట తీరైనా కూడా ఆ చూపు అయినా కూడా చూసే విధానం అయినా అమ్మవారిలాగానే చూస్తుంది అమ్మవారిలాగానే మాట్లాడుతుంది సాక్షాత్తు అమ్మవారిలాగానే ఉంది అనే విధానం ా మనం మారిపోతూ ఉంటామ అన్నమాట పురుషులయితే సాక్షాత్తు పరమశివుడులాగా కనిపిస్తాడు అన్నమాట ఈ విధంగా కుండలిని జాగరణ జరుగుతది సేఫ్ జోన్ లో గురువు లేకపోయినా కూడా మనల్ని పరమాత్మే గురువయి మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట ఓకేనా ఇక ఎవరైతే ఇంకా భగవన్ నామ స్మరణ స్టార్ట్
(20:53) చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు భగవన్ నామస్మరణ స్టార్ట్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణయ్య
No comments:
Post a Comment