Sunday, August 2, 2026

 ఫ్రెండ్‌షిప్ "డే" వద్దు... ఆజన్మాంత "స్నేహం" ముద్దు! 
(భారతీయ యువత ఆలోచించాల్సిన సత్యం)

ఈ రోజు "ఫ్రెండ్‌షిప్ డే" అని సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు, కార్డులు, బ్యాండ్లు సందడి చేస్తున్నాయి. కానీ ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి... ఒక పశ్చిమ దేశంలో వ్యాపార ప్రయోజనాల కోసం పుట్టిన "ఆగస్టు మొదటి ఆదివారం" అనే దినోత్సవం మన భారతీయులకు ఎందుకు?

విదేశీ సంస్కృతికి, మన భారతీయ జీవన విధానానికి ఉన్న వ్యత్యాసం ఇదే:అక్కడ బంధాలకు ప్రేమ చూపించడానికి "ఒక్క రోజు" సరిపోతుందేమో... కానీ, మన భారతదేశంలో స్నేహం అంటే "ఆజన్మాంతం నిలిచే ఒక పవిత్ర బంధం!" 

మన సంస్కృతిలో స్నేహం అంటే ఏమిటి?మన సనాతన ధర్మంలో స్నేహానికి అత్యున్నత స్థానం ఉంది.సృష్టిలోనే అత్యంత పవిత్రమైన స్నేహానికి నిదర్శనం శ్రీకృష్ణుడు - కుచేలుడు!

అధిపతి అయినా,అకించనుడైనా... రాచరికాలు, పేదరికాలు, అంతరాలు వీడి ఒకరికొకరు తోడుగా నిలబడటమే నిజమైన స్నేహం.

మనం విదేశీ దినోత్సవాల వెనుక పరిగెత్తడం కంటే: శ్రీకృష్ణ జన్మాష్టమిని, కుచేలుని పవిత్ర స్మరణలను నిజమైన "స్నేహితుల దినోత్సవం"గా జరుపుకుందాం.

No comments:

Post a Comment