Sunday, August 2, 2026

మనస్సు మీ శత్రువా? అష్టావక్ర మహర్షి చెప్పిన ఆశ్చర్యకరమైన సత్యం | Ashtavakra Gita Ep.2

మనస్సు మీ శత్రువా? అష్టావక్ర మహర్షి చెప్పిన ఆశ్చర్యకరమైన సత్యం | Ashtavakra Gita Ep.2

Author Name:Dhyana Jagath

Youtube Channel Url:https://www.youtube.com/@Dhyanajagath

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VwlDM_FkqZw



Transcript:
(00:00) మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా [సంగీతం] నా మనసు నా మాట వినడం లేదు. ధ్యానం చేయడానికి కూర్చుంటే ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండదు. గతం గుర్తుకు వస్తుంది. భవిష్యత్తు గురించి భయం మొదలవుతుంది. చేయాల్సిన పనులు గుర్తుకు వస్తాయి. ఎవరో చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ మనసులో తిరుగుతుంది. అప్పుడు మనం ఒక నిర్ణయానికి వస్తాం.
(00:25) ఈ మనసే నా శత్రువు అందుకే [సంగీతం] దాన్ని ఆపాలని ప్రయత్నిస్తాం. నిశశబ్దం చేయాలని ప్రయత్నిస్తాం. దానితో యుద్ధం చేస్తాం [సంగీతం] కానీ ఒక్కసారి ఆలోచిద్దాం 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మనసుతో యుద్ధం చేస్తున్నాం. ఎవరైనా గెలిచారా ఒక ఆలోచనను ఆపాలని ప్రయత్నిస్తే ఇంకో 10 ఆలోచనలు వస్తాయి. కోపం వద్దని అనుకుంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది.
(00:53) [సంగీతం] భయం వద్దని అనుకుంటే ఇంకా భయం పెరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈరోజు అష్టావక్ర మహర్షి [సంగీతం] మనల్ని ఆశ్చర్యపరిచే కొన్ని సత్యాలను చెప్తున్నాడు. [బెల్] సమస్య మనసులో లేదు. సమస్య మన మనసును చూసే విధానంలో ఉంది. ఈ ప్రపంచంలో మనిషి జయించాలని ప్రయత్నించిన వాటిలో అత్యంత కష్టమైనది ఏదైనా ఉంది అంటే [సంగీతం] తన మనసు పర్వతాలను ఎక్కాడు, సముద్రాలను దాటాడు, అంతరిక్షానికి వెళ్ళాడు.
(01:31) కృతిమ మేదస్సును సృష్టించాడు కానీ [సంగీతం] తన మనసును మాత్రం ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. [సంగీతం] ప్రతి యుగంలో ఒకే ప్రశ్న. మనసును ఎలా జయించాలి? [సంగీతం] కానీ అష్టవక్ర మహర్షి ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. ముందు మనసు అంటే ఏమిటో తెలుసుకున్నావా? మనం సాధారణంగా మనసు అంటే మనమే అనుకుంటాం. నా మనసు బాధపడుతుంది.
(01:58) నా మనసు సంతోషంగా ఉంది నా మనసు కోపంగా ఉంది. అంటే [సంగీతం] మనమే మనసు అన్న భావన. కానీ అష్టావక్ర గీతలో ఈ ఆలోచననే ప్రశ్నిస్తున్నారు. అష్టావక్ర మహర్షి జనక మహారాజుతో ఇలా అంటారు. విముక్తి కావాలంటే ఇంద్రియ విషయాలను విషంలా చూడాలి. క్షమ, నిజాయితి, దయ, సంతోషం, సత్యాన్ని అమృతంలా స్వీకరించాలి. [సంగీతం] ఇది చాలా లోతైన మాట.
(02:30) గమనించండి ఆయన మనసును ద్వేషించు అని చెప్పలేదు. మనసును చంపు అని కూడా చెప్పలేదు ఆయన చెబుతున్నది మనసును అశాంతిగా చేసే వాటిని అర్థం చేసుకో [సంగీతం] స్వామి చిన్మయానంద గారు ఈ శ్లోకాన్ని వివరిస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తారు. మనసు అంటే ఆలోచనల ప్రవాహం ఆలోచనలు ఎంత వేగంగా వస్తే మనసు అంత చంచలంగా కనిపిస్తుంది. ఆలోచనలు తగ్గితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
(02:58) అందుకే మనసు శత్రువు కాదు. అశాంతిని పెంచే అలవాట్లే మన సమస్య. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ తీసుకున్నారని అనుకుందాం. ఒక WhatsAppట్ మెసేజ్ రెండు Instagram రీల్స్ మూడు YouTube నోటిఫికేషన్స్ న్యూస్, Facebook, ఈమెయిల్స్ 10 నిమిషాల్లో మీ మనసులో వందల ఆలోచనలు. ఇప్పుడు మీరు ధ్యానం చేయడానికి కూర్చుంటారు.
(03:26) అప్పుడు అంటారు నా మనసు చాలా [సంగీతం] చంచలంగా ఉంది. నిజంగా మనసు చంచలమా లేక మనమే దానికి వందల విషయాలు తినిపించామా ఒక చిన్న పిల్లవాడికి రోజంతా చాక్లెట్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవ్వండి. ఆ తర్వాత అతన్ని ఒకచోట నిశశబ్దంగా కూర్చోమని చెప్పండి కూర్చుంటాడా కాదు అది ఆ పిల్లవాడు తప్ప లేక మనమే ఇచ్చిన ఆహారం కారణమా మనసు కూడా అలాగే రోజంతా అనవసరమైన సమాచారం భయాలు [సంగీతం] పోలికలు కోరికలు పోటీలు ఇవన్నీ నింపి రాత్రికి ప్రశాంతంగా ఉండు అంటున్నాం అది ఎలా సాధ్యం మనసు మన శత్రువు కాదు మనం దానికి కి ఏం ఆహారం
(04:12) పెడుతున్నామో [సంగీతం] అదే మన అనుభవంగా మారుతుంది. కానీ ఇక్కడే అష్టావక్ర మహర్షి [సంగీతం] ఇంకా ఆశ్చర్యపరిచే విషయం చెప్తున్నారు. ఆయన ప్రకారం నువ్వు మనసు కూడా కాదు నువ్వు మనసును గమనిస్తున్న సాక్షివి. ఈ ఒక్క సత్యం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటివరకు మనసును శత్రువుగా భావించి దానితో జీవితమంతా పోరాడుతున్నామని చూశం.
(04:42) కానీ అష్టావక్ర మహర్షి ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు. పోరాడేది ఎవరు? మనసుతో ఎవరు పోరాడుతున్నారు? మనసేనా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఇప్పుడే ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి ఒక ఆలోచన వస్తుంది. ఈరోజు పని పూర్తయిందా మరో ఆలోచన రేపు ఏమవుతుంది మరో ఆలోచన నేను సరిగ్గా చేస్తున్నానా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి.
(05:14) [సంగీతం] ఈ ఆలోచనలను గమనిస్తున్నది ఎవరు? ఆలోచన ఒకటి దాన్ని చూస్తున్న ఇంకొకటి అవి రెండు ఒకటే అయితే నాకు ఆలోచనలు వస్తున్నాయి అని ఎలా చెప్పగలుగుతున్నాం అష్టవక్ర మహర్షి ఇలా అంటారు నువ్వు భూమి కాదు నీరు కాదు అగ్ని కాదు గాలి ఆకాశం ఇవేమీ కాదు ఇవన్నిటికీ సాక్షిగా ఉన్న చైతన్యమే నువ్వు ఇక్కడ భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అంటే కేవలం ప్రకృతిలోని మూలకాలు మాత్రమే కాదు ఈ శరీరం ఈ ఇంద్రియాలు ఈ మనసు ఈ బుద్ధి ఇవన్నీ కూడా ప్రకృతికే చెందినవి అయితే [సంగీతం] నువ్వు
(06:02) ఎవరు వాటిని గమనిస్తున్న నిశశబ్ద సాక్షి సినిమా తెర ఉదాహరణ తీసుకుందాం తెర మీద [సంగీతం] యుద్ధం జరుగుతుంది ప్రేమ కథ వస్తుంది వర్షం పడుతుంది అగ్ని అంటుకుంటుంది. కానీ తెరకు ఏమైనా జరిగిందా లేదు తెర అన్నింటిని చూపిస్తుంది. కానీ దేనితోనూ కలవదు మన నిజ స్వరూపం కూడా అలాంటిదే మనసులో కోపం వస్తుంది భయము ఆనందం విషాదం వస్తూ ఉంటాయి.
(06:37) కానీ వాటిని గమనిస్తున్న సాక్షికి ఏమీ జరగదు. స్వామి చిన్మయానంద గారు ఒక వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. సూర్యకాంతి గదిలోని అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తుంది. కానీ ఆ వస్తువుల వల్ల సూర్యకాంతికి ఎలాంటి మార్పు రాదు. అదేవిధంగా మనలోని చైతన్యం శరీరాన్ని మనసును భావోద్వేగాలను ఆలోచనలను ప్రకాశింపజేస్తుంది. కానీ వాటితో కలిసిపోదు. అది ఎప్పుడూ సాక్షిగానే ఉంటుంది.
(07:10) మనం ఒక ఆలోచన వచ్చిన వెంటనే అది నేను అని నమ్మేస్తాం. నాకు కోపం వచ్చింది నేను బాధలో ఉన్నాను నేను భయపడుతున్నాను. కానీ అష్టావక్ర మహర్షి చెప్తున్నారు అవి నీ అనుభవాలు మాత్రమే నీ [సంగీతం] స్వరూపం కాదు ఆకాశంలో మేఘాలు వస్తాయి వెళ్తాయి ఆకాశం మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మనసులో ఆలోచనలు వస్తాయి వెళ్తాయి. సాక్షి మాత్రం మారడు.
(07:41) మీ మొబైల్ లో రోజుకు వందల నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ కొన్ని ముఖ్యమైనవి కొన్ని అస్సలు అవసరం లేనివి. ప్రతి నోటిఫికేషన్ తెరుస్తామా లేదు కదా అలాగే ప్రతి ఆలోచనను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి ఆలోచనను కూడా నమ్మాల్సిన అవసరం లేదు వెరీ ఇంపార్టెంట్ [సంగీతం] అది వస్తుంది వెళ్ళిపోతుంది కానీ మనం ప్రతి ఆలోచనను పట్టుకొని [సంగీతం] దానితో కలిసి ప్రయాణం మొదలు పెడతాం.
(08:08) అక్కడే మన అశాంతి మొదలవుతుంది. మనసు మన శత్రువు కాదు ఆలోచనలు మన శత్రువులు కాదు అయితే మన బాధకు కారణం ఏమిటి? ఎందుకు ఒక చిన్న మాట రోజంతా మనల్ని బాధిస్తుంది. ఎందుకు ఒక చిన్న అవమానం సంవత్సరాల పాటు మనసులో మిగిలిపోతుంది. ఎందుకు ఒక ప్రశంస వస్తే ఎంతో ఆనంద పడతాం. ఒక విమర్శ వస్తే కృంగిపోతాం. అష్టవక్ర మహర్షి ఇక్కడ బంధనానికి మూల కారణాన్ని చూపిస్తున్నారు.
(08:42) నేను చేస్తున్నాను మనం చిన్నప్పటి నుంచే ఒక భావనతో పెరిగాం. నేనే చేశాను నేనే గెలిచాను నేనే ఓడిపోయాను నావల్లే జరిగింది నాకే జరిగింది. ఈ నేను అనే భావన మన జీవితాన్ని నడిపించడం ప్రారంభిస్తుంది. ఒకరోజు ఎవరైనా మన పనిని పోగొడితే మనకు ఆనందం ఎవరైనా విమర్శిస్తే మనకు బాధ. ఎందుకు? ఎందుకంటే మనం ఆ పనినే మన స్వరూపంగా భావిస్తున్నాం.
(09:14) అష్టవక్ర మహర్షి ఏం చెప్తున్నాడు అంటే ధర్మం అధర్మం సుఖం దుఃఖం ఇవన్నీ మనసుకు చెందినవి నీవు కర్తవి కాదు భుక్తవు కాదు నువ్వు ఎప్పుడూ స్వతంత్రుడవే ఇది ఈ గ్రంథంలోని అత్యంత విప్లవాత్మకమైన బోధనలో ఒకటి ఆయన పనులు చేయొద్దు అని చెప్పడం లేదు. ఆయన చెప్పేది పనులు జరుగుతున్నప్పుడు నీ నిజ స్వరూపాన్ని మరిచిపోకు స్వామి చిన్మయానంద గారు ఏమంటున్నారంటే మనలోని అహంకారం రెండు రూపాల్లో పనిచేస్తుంది.
(09:52) మొదటిది నేను చేస్తున్నాను రెండవది నేనే అనుభవిస్తున్నాను. ఈ రెండు కలిసినప్పుడే అహంకారం పూర్తవుతుంది. ఒక కథలోకి వెళ్దాం. ఒక గొప్ప నటుడు రంగస్థలంపై రాజు పాత్ర పోషిస్తున్నాడు. నాటకం మొదలైంది. అందరూ అతన్ని రాజుగానే చూస్తున్నారు. [సంగీతం] అతను కూడా ఆ పాత్రలో పూర్తిగా లీనమయ్యాడు. కానీ నాటకం అయిపోయాక కూడా తను నిజంగానే రాజునని నమ్మితే ఏమవుతది ప్రజలు నవ్వుతారు ఎందుకంటే అది కేవలం ఒక పాత్ర.
(10:27) అలాగే ఈ జీవితంలో మనకు తండ్రి పాత్ర తల్లి పాత్ర ఉద్యోగి పాత్ర యజమాని స్నేహితుడు గురువు పాత్ర ఇలా ఎన్నో పాత్రలు ఉన్నాయి. సమస్య పాత్రలు పోషించడం కాదు పాత్రనే నేను అని నమ్మడం పాత్రనే నేను అని నమ్మడం అహంకారం ఎలా పుడుతుంది ఒక ఆలోచన వచ్చింది నేను మంచివాడిని మరో ఆలోచన వచ్చింది వాళ్ళు నన్ను గౌరవించాలి. మరో ఆలోచన నేను ఓడిపోకూడదు.
(11:01) ఈ ఆలోచనలన్నీ ఒక కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ కేంద్రమే అహంకారం అది నిజమైన నేను కాదు అది మనసు సృష్టించిన ఒక కథ మీరుఇస్గ లో ఒక వీడియో పెట్టారు 10వేల మంది చూశారు అందరూ పొగిడారు. మనసు చెప్తుంది చూశవా నువ్వు ఎంత గొప్పవాడివో మనసొటి రోజు వీడియో 1000 వ్యూస్ మాత్రమే వచ్చాయి. అదే మనసు చెప్తుంది నువ్వు పనికి రావు రెండు సందర్భాల్లోనూ మారింది ఎవరు మీరా లేక మనసు చెప్పిన కథనా నీవు ఒకే ఒక్క సాక్షివి నీవు ఎప్పుడూ స్వతంత్రుడివి నిన్ను నువ్వు సాక్షిగా కాకుండా వేరేదానిగా భావించడమే బంధనం ఎంత గొప్ప వాక్యం బంధనం బయట లేదు
(11:49) మనసులో కూడా లేదు తప్పు గుర్తింపులో ఉంది. అహంకారం ఒక పాత్ర మాత్రమే అయితే దాని నుండి విడిపోవడం ఎలా? రోజు ఆఫీస్ లో ఇంట్లో సమాజంలో జీవిస్తూ సాక్షిగా ఎలా ఉండాలి? అష్టావక్ర మహర్షి ఎక్కడ అడవులకు వెళ్ళమని చెప్పలేదు. కుటుంబాన్ని వదిలేయమని చెప్పలేదు. ఉద్యోగం మానేయమని చెప్పలేదు. ఆయన చెప్పింది నీ దృష్టిని మార్చు.
(12:18) పని అదే కుటుంబం అదే ప్రపంచం అదే మారాల్సింది నీవు నిన్ను చూసుకునే విధానం. ఒక కథలోకి వెళ్దాం. ఒక పెద్ద అద్దం ఉందని ఊహించండి. ఆ అద్దం ముందు వందలాది మంది నిలబడ్డారు ఒకరు నవ్వుతున్నారు మరొకరు ఏడుస్తున్నారు ఇంకొకరు కోపంగా ఉన్నారు. అద్దం అందరిని చూపిస్తుంది. కానీ ఎవరి భావోద్వేగాన్ని తనలో దాచుకోదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అద్దం అదే విధంగా ఉంటుంది.
(12:44) మన నిజ స్వరూపం కూడా అలాంటిదే కోపం వస్తుంది వెళ్ళిపోతుంది భయం వస్తుంది వెళ్ళిపోతుంది కానీ సాక్షి ఎప్పుడూ మారడు. ఆలోచనలతో యుద్ధం చేయడం కాదు ఆలోచనలు వస్తున్నా వాటిని గమనిస్తున్న సాక్షిగా నిలవడం. ఆలోచన వచ్చింది దాన్ని చూడండి పట్టుకోకండి మరో ఆలోచన వచ్చింది. దాన్ని చూడండి అది కూడా వెళ్ళిపోతుంది. ఆకాశం మేఘాలను ఆపడానికి ప్రయత్నించదు.
(13:15) సముద్రం ప్రతి అలతో పోరాడదు. అలాగే సాక్షి ప్రతి ఆలోచనలతో పోరాడడు. మన రెగ్యులర్ లైఫ్ లో ఒక ప్రయోగం చేద్దాం. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా మనసులో ఒక ప్రశ్న వేసుకోండి. ఈ కోపాన్ని గమనిస్తుంది ఎవరు భయం వచ్చినప్పుడు ఈ భయాన్ని గమనిస్తుంది ఎవరు బాధ వచ్చినప్పుడు బాధను చూస్తున్నది ఎవరు ఈ ప్రశ్నకు మాటలతో సమాధానం చెప్పకండి కేవలం గమనించండి.
(13:48) కొన్ని క్షణాల్లో ఒక నిశశబ్దం కనిపిస్తుంది. ఆ నిశశబ్దమే అష్టావక్ర మహర్షి చూపిస్తున్న దారి మీరు ట్రాఫిక్ లో ఉన్నారు ఎవరో హారం కొట్టారు మనసు వెంటనే స్పందిస్తుంది. కొన్నిసార్లు కోపం రావచ్చు కానీ ఆ క్షణంలో ఒక్క అడుగు వెనక్కి తీసుకొని చూడండి. కోపం మనసులో జరుగుతుంది. దాన్ని గమనిస్తున్న మరో నిశశబ్దవునికి ఉంది. అదే మీ అసలు స్వరూపం. అష్టవక్ర మహర్షి మనకు కొత్త జ్ఞానాన్ని ఇవ్వడం లేదు.
(14:20) ఆయన మనం ఎప్పటి నుంచో ఉన్న నిజాన్ని గుర్తు చేస్తున్నారు. నీవు ఈ శరీరం కాదు మనసు కాదు ఆలోచనలు కాదు నువ్వు సాక్షి చైతన్యం ఈ సత్యాన్ని ఒక్కసారి తెలుసుకోవడం జ్ఞానం ప్రతి క్షణం అదే సత్యంలో నిలవడం ధ్యానం అదే విముక్తి వైపు ప్రయాణం. ఈ రోజు నుంచి మనసుతో యుద్ధం చేయకండి దాన్ని అర్థం చేసుకోండి ఆలోచనలు ఆపడానికి ప్రయత్నించకండి వాటిని గమనించడం ప్రారంభించండి.
(14:52) మనసును జయించని వాడు ప్రపంచాన్ని జయించడు. తనను తాను తెలుసుకుంటాడు. అదే అష్టావక్ర మహర్షి బోధన. అష్టావక్ర గీత ఒక పుస్తకం కాదు ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతి ఎపిసోడ్ మీ జీవితాన్ని మరో మెట్టు లోతుగా తీసుకెళ్తుంది. ఈ బోధనల గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తెలియజేయొచ్చు. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment