Friday, August 20, 2021

భావోద్వేగాల నియంత్రణ

🌸 భావోద్వేగాల నియంత్రణ 🌸

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు:

🎈భావోద్వేగాలు మన అదుపులో ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి..

🎈ఇతరులలోని ప్రతికూల విషయాలు అనగా negative విషయాలు వదిలి అనుకూల విషయాలు మాత్రమే అనగా positive విషయాలు మాత్రమే తీసుకోవాలి..

🎈మనము ఇష్టపడే విషయాలు ఇతరులలో గుర్తించి గౌరవించాలి..

🎈మనల్ని చికాకుపెట్టే వారితో మనకు గతంలో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకోవాలి..

🎈ఉద్వేగాలను ఉపయోగించుకోవాలి. కాని వాటికి మనము బలి కాకూడదు..

🎈ఎదుటివారు ఎమోషన్ బ్యాలెన్స్ కోల్పోయి ప్రవర్తించినప్పుడు
మనము మౌనంతో అక్కడినుంచి దూరంగా వెళ్లిపోవాలి..

🎈మన భావోద్వేగాలను రగిలించే వ్యక్తి మనకు గురువు...

🎈మనము ఆనందంగా అద్భుతంగా ఉంటే ఇతరుల భావోద్వేగాలు మన ఆరా దాటి లోపలికి రాలేవు..

🎈ఇతరుల ఎమోషన్స్ తో ఆడుకుంటే అవి మనకు శాపాలు అవుతాయి..



Source - Whatsapp Message

మనఃశ్శాంతిని పొందాలంటే

మనఃశ్శాంతిని పొందాలంటే

అన్నింటినీ గమనించు కానీ
అన్నిటిలో భాగం అయిపోవద్దు

జరిగిపోతున్నవి అన్నీ మంచికే
కొన్నిసార్లు సంతోషం వస్తుంది
కొన్నిసార్లు బాధ వస్తుంది
కొన్నిసార్లు కోపం వస్తుంది
కొన్నిసార్లు అసూయ వస్తుంది

వీటినన్నిటినీ నీ సమస్యలుగా మార్చుకోవాల్సిన
అవసరమేమీ లేదు

ఒక రైల్వేస్టేషన్ వెయిటింగ్
రూమ్ లో ట్రెయిన్ కోసం ఎదురుచూసేటప్పుడు
నువ్వు ఎలా అయితే ఉంటావో అలా ఉంటే సరిపోతుంది..

అక్కడకి ఎంతోమంది
వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు..

మంచోళ్ళు చెడ్డోళ్ళు...
పుణ్యాత్ములు పాపాత్ములు

వారితో నీకేపట్టింపూ ఉండదు
వారితో సంబంధమే లేనట్టు
నీ కుర్చీలో నువ్వు కూర్చుని ఉంటావు అంతే

నువ్వు నీ రైలు కోసం ఎదురుచూస్తున్నావు
ఈ వచ్చీపోయే మనుష్యులు
ఎవ్వరూ నీకోసం రావట్లేదు
అసలు వారెవ్వరో కూడా నీకు తెలియదు

వాళ్ళు మంచివారో చెడ్డవారో అని
బేరీజు వేసుకోవాలని కూడా
నీకు అనిపించదు,
నువ్వు అనుకోవు

అలా ఎవరేంటి అని నువ్వు నిర్ణయించుకునేది ఎప్పుడంటే ఇది నీ ఇల్లు అని నువ్వనుకున్నప్పుడు మాత్రమే...

మీ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

'మనిషి మాంసాహారం ఎందుకు తినకూడదు' అని అనడానికి కొన్ని కారణాలు...

మాంసాహారం తినకూడదు:-

'మనిషి మాంసాహారం ఎందుకు తినకూడదు' అని అనడానికి కొన్ని కారణాలు...
1. ప్రకృతి సిద్ధమైన కారణాలు
2. శరీర నిర్మాణ కారణాలు
3. మానసిక కారణాలు
4. ఆధ్యాత్మిక కారణాలు

1. ప్రకృతి సిద్ధమైన కారణాలు:-
మాంసాహార జంతువులు మాంసాహారం మాత్రమే భుజిస్తాయి., శాకాహార జంతువులు శాకాహారాన్ని మాత్రమే భుజిస్తాయి. మనిషి మాంసాహారా, శాకాహారా అని తెలుసుకోవాలంటే - మనిషికి, మాంసాహార జంతువులకు గల అలవాట్లను పోల్చి చూద్దాం.
➡️ మాంసాహార జంతువులైన పిల్లి, కుక్క, పులి ఇవన్నీ నీటిని నాలుకతో తాగుతాయి. శాకాహార జంతువులైన ఆవు, గేదె మరియు మనిషి పెదవుల సహాయంతో నీటిని తాగుతారు.
➡️ మాంసాహార జంతువులకు పుట్టిన పిల్లలు 2,3 రోజులకు కానీ కళ్ళు తెరువవు. కానీ మానవ శిశువు పుట్టిన వెంటనే కళ్ళు తెరుస్తుంది.
➡️ మాంసాహార జంతువుల గోళ్లు వంపు తిరిగి ఉంటాయి. శాకాహార జంతువులకు గోళ్ళు ఒంపు తిరిగి ఉండవు.
➡️ మాంసాహార జంతువులకు మాంసం చీల్చటానికి 'కోరపళ్ళు' ఉంటాయి. మనిషికి 'కోరపళ్ళు' ఉండవు.
ఈ తేడాలను గమనిస్తే మనిషి 'ప్రకృతి సిద్ధంగా శాకాహారి' అని, మాంసాహారం తినటం ప్రకృతి విరుద్ధం అని తెలుస్తోంది.

2. శరీర నిర్మాణ కారణాలు:-
మనిషి జీర్ణాశయంలో ఆహారం 3 లేక 4 గంటలు మాత్రమే నిలువ ఉంటుంది. ఆ సమయం మాంసాహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి సరిపోదు. అసంపూర్ణంగా జీర్ణమైన మాంసాహారంలో 'టాక్సిన్ అమినో ఆమ్లాలు' (విష పదార్థాలు) ఉత్పన్నమవుతాయి. వీటి ఉత్పత్తి వల్ల కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయవు. జీవ రసాయనిక చర్యలు కుంటుపడి గ్యాస్ సమస్య పెరుగుతుంది. "అసంపూర్ణ జీర్ణం సకల రోగాలకు మూలం", అందువల్ల మాంసాహారం మానవ శరీరానికి నిషిద్ధం.

3. మానసిక కారణాలు:-
ఒక కోడిని కోసేటప్పుడు, అది ఎంతో బాధతో గిలాగిలా కొట్టుకుంటుంది, భయంతో రెక్కలు టపటపలాడిస్తుంది. అతి భయం వల్ల దాని శరీరంలో కొన్ని విష పదార్థాలు ఉత్పన్నమవుతాయి. ఈ విష పదార్థం కోడి యొక్క శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అంటే ఆ కోడి తింటున్నప్పుడు దాని భయాన్ని కూడా తింటున్నామన్నమాట. ఇదే పరిస్థితి ఏ జంతువుని తిన్నా జరుగుతుంది. ఆ జంతువు యొక్క భయాలే మనలోని 'మానసిక ఆందోళనలు'.

4. ఆధ్యాత్మిక కారణాలు:-
➡️ చనిపోయిన శరీరాన్ని 'మృత కళేబరాలు' అంటారు. అలాంటి మృత కళేబరాలను మన శరీరంలో పడవేసి 'దేవాలయం' వంటి శరీరాన్నీ 'స్మశాన వాటిక'గా చేసుకోకూడదు.
➡️ మనకు కనబడే స్థూల శరీరం చుట్టూ, ఎనర్జీ బాడీ ఉంటుంది. మాంసాహారం తినడం వలన ఈ ఎనర్జీ బాడీ క్షీణిస్తుంది. ఆ కారణంగా 'రోగ నిరోధక శక్తి' తగ్గిపోతుంది, దీని వల్ల రోగాలు సంభవిస్తాయి.
➡️ మనలో ప్రవేశించే విశ్వప్రాణశక్తి మాంసాహారం వల్ల ఉత్పన్నమయ్యే 'నెగటివ్ ఎనర్జీ' ఆటంకపరుస్తుంది. అందుకే "మాంసాహారం తినకూడదు".

Source - Whatsapp Message

Thursday, August 19, 2021

అథ్బుత జీవిత సత్యం. చీమ - బాతు- హంస, రామకృష్ణ పరమహంస అంటారు.

నేటి అథ్బుత జీవిత సత్యం.

చీమ - బాతు- హంస
🍁🍁🍁🍁

రామకృష్ణ పరమహంస అంటారు. ... నేను జీవితంలో కొన్నిటిని చెపుతాను. వాటిని ఆదర్శంగా పెట్టుకో. ఇంతకన్నా ఆదర్శమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు. అంటారు.

అవి ఏమిటి?

మొదటిది చీమ. చీమను నీవు ఆదర్శంగా తీసుకో.

కొంచెం పంచదార, కొంత ఇసుక కలిపి అక్కడ పోస్తే చీమ పంచదార రేణువులను మాత్రమే తీసుకువెళుతుంది. ఇసుక రేణువులను వదిలివేస్తుంది.

ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచి పెట్టడం నేర్చుకోవాలి.

సారవంతమైన విషయమును లోపల పదిలపరచుకోవడం నేర్చుకోవాలి.

రెండు.... బాతులా బ్రతుకు

. బాతు తెల్లగా ఉంటుంది. కానీ బాతు బురదలో ఉంటుంది. ఆ బాతు మీద బురద చుక్క వచ్చి పడుతుంది. అది శరీరమును దులుపుకుం టుంది. వెంటనే బురద చుక్క జారి కింద పడిపోతుంది.

తెల్లటి మల్లెపువ్వులా ఉండే బాతు ఎప్పుడూ బురదలో ఉంటుంది. కానీ దానికి బురద అంటడం లేదు.

మనలో చాలామంది ... నేను ఫలానా వాళ్ళతో తిరిగి ఇలా పాడైపోయాను. నేను ఇలా పాడైపోవడానికి కారణం వాళ్ళే. నా సాంగత్యం మంచిది కాదు. నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను... అని అంటూ ఉంటారు.

కానీ అలా అనకూడదు. బురదలో ఉన్న బాతుకి బురద అంటలేదు. మరి నీకెందుకు చెడ్డ గుణములు అంటుకోవాలి? నీవు మనసులో స్వచ్ఛంగా ఉంటే , ఇతరులను మార్చగలవేమో కానీ ఇతరులు నిన్ను మార్చలేరు. నీ దగ్గర ధీశక్తి లేనప్పుడే నీవు ఇతరులు చెప్పిన మాటలకు లొంగిపోతావు. నీది పిరికి మనసు. అటువంటపుడు నీవు తొందరగా దుర్గుణములకు వసుడవు అయిపోతావు. నీ మనసు బలహీనమై నది. దానిని పదిలం చేసుకోవడం మానివేసి, శక్తిమంతము చేసుకోవడం మానివేసి, చీడా పీడా తొలగించడం మానివేసి, నీవు పాడవడాని కి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు. అది మరొక పెద్ద దోషం. కాబట్టి నీవు బాతులా ఉండడం నేర్చుకో.

మూడు.... హంస... నీవు హంసలా ఉండడం నేర్చుకో.

హంస పాలను, నీటిని కలిపి పెడితే పాలను తీసుకుని నీటిని విడిచిపె డుతుంది. జగట్టునందు బ్రహ్మమును దర్శనం చేసి, జగత్తును విడిచిపెట్టడం అలవాటు చేసుకో.
ఈ మూడింటిని అలవాటు చేసుకుంటే ఇంతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు.

సేకరణ. మానస సరోవరం. శుభదినం🙏

Source - Whatsapp Message

Wednesday, August 18, 2021

భర్తృహరి సుభాషితం ఏంచెప్పింది?

శుభోదయం


మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ


శివానుగ్రహం


భర్తృహరి సుభాషితం ఏంచెప్పింది?
➖➖➖

వాడు నన్ను సాయం అడిగాడా..? వాడికి నేను సహాయం చేయటానికి..!

వాడికి నేను అడగకుండానే సహాయం చేశాను. కానీ వెధవకు కృతఙ్ఞత లేశమంతయినాలేదు!
....ఇలాంటి మాటలు మనం చాలా వింటుంటాం!

ఎదుటి వాడికి సహాయం చేసి వాడినుండి తిరిగి మనం ఏదో ఒకటి ఆశిస్తున్నాం !

ఏదీ లేక పోతే కనీసం కృతఙ్ఞత ఆశిస్తున్నాం...
ఇది...
"ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం" లాంటిది.
it is simply a transaction, not help...

ఆశించి చేసేది సహాయం అవుతుందా...? ఒక్క సారి ఆలోచించండి!

ఒక చక్కని భర్తృహరి సుభాషితం చూడండి...

"పద్మాకరమ్ దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలమ్ నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి సన్తఃస్వయమ్ పరహితే విహితాభియోగః"

ఏమి ఆశించి సూర్యుడు తామర కొలను వికసింప చేస్తున్నాడు...?

ఏమి ఆశించి చంద్రుడు కలువలను వికసింప చేస్తున్నాడు...?

ఏమి ఆశించి మేఘం నీటిని మానవాళికి అందిస్తున్నది?

ఏమి ఆశించ కుండా పరులహితం కోరేవాడే సత్పురుషుడు!

మనకు మనం ఎప్పుడూ గొప్పవాళ్లు గానే మనం భావిస్తాం, మన మంచి మనకు ఎప్పుడూ గుర్తుంటుంది (అది మనకు మాత్రమే)

మనం నిజంగా గొప్పవాళ్ళమే అయితే, నిజంగా మనం సత్పురుషులము అని మన మనస్సాక్షి ఒప్పుకుంటే, మనం చేసేది సహాయమే అని మనం భావించేటప్పుడు,
ఎదుటివాడు అడగకుండానే ఎందుకు సహాయం చేయకూడదు..?

జీవితమే ఒక ప్రయాణం! ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులెందరో కానీ ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడిక శాశ్వతం. గెలిచేది నువ్వే.., ఒడేది నువ్వే..., గెలుపుకి పొంగి పోకుండా, ఓటమికి కుంగిపోకుండా, ధర్మ బద్ధంగా ఫలాపేక్ష లేకుండా, తోటి వారికి సహాయపడుతూ సాగిపోవడమే జీవితం.....



🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Source - Whatsapp Message

50 - 55 దాటిన వారికి .........

50 - 55 దాటిన వారికి ..........
.
1 ఈ సమయం ఇన్నాళ్ళూ సంపాదించినదీ, దాచుకున్నదీ తీసి ఖర్చు పెట్టె వయసు. తీసి ఖర్చు పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి. దాన్ని ఇంకా దాచి అలా దాచడానికి మీరు పడిన కష్టాన్ని, కోల్పోయిన ఆనందాలనూ మెచ్చుకునేవారు ఎవరూ ఉండరు అనేది గుర్తు పెట్టుకోండి
.
2. మీ కొడుకులూ, కోడళ్ళూ మీరు దాచిన సొమ్ముకోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో? ఈ వయసులో ఇంకా సంపాదించి సమస్యలనూ, ఆందోళనలూ కొని తెచ్చుకోవడం అవుసరమా ?
ప్రశాంతంగా ఉన్నది అనుభవిస్తూ జీవితం గడిపితే చాలదా ?
.
.

3. మీ పిల్లల సంపాదనలూ, వాళ్ళ పిల్లల సంపాదనల గురించిన చింత మీకు ఏల? వాళ్ళ గురించి మీరు ఎంత వరకూ చెయ్యాలో అంతా చేశారుగా? వాళ్లకి చదువు, ఆహారం, నీడ మీకు తోచిన సహాయం ఇచ్చారు. ఇపుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళమీద నిలబడ్డారు. ఇంకా వాళ్ళకోసం మీ ఆలోచనలు మానుకోండి. వాళ్ళ గొడవలు వాళ్ళను పడనివ్వండి .
.

4. ఆరోగ్యవంతమైన జీవితం గడపండి. అందుకోసం అధిక శ్రమ పడకండి. తగిన మోతాదులో వ్యాయామం చెయ్యండి. ( నడక, యోగా వంటివి ఎంచుకోండి ) తృప్తిగా తినండి. హాయిగా నిద్రపోండి. అనారోగ్యం పాలుకావడం ఈ వయసులో చాలా సులభం, ఆరోగ్యం నిలబెట్టుకోవడం కష్టం. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ఉండండి. మీ వైద్య అవుసరాలూ, ఆరోగ్య అవుసరాలూ చూసుకుంటూ ఉండండి. మీ డాక్టర్ తో టచ్ లో ఉండండి. అవుసరం అయిన పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. ( ఆరోగ్యం బాగుంది అని టెస్ట్ లు మానేయకండి )
.

5. మీ భాగస్వామికోసం ఖరీదైన వస్తువులు కొంటూ ఉండండి. మీ సొమ్ము మీ భాగస్వామితో కాక ఇంకెవరితో అనుభవిస్తారు? గుర్తుంచుకోండి ఒకరోజు మీలో ఎవరో ఒకరు రెండో వారిని వదిలిపెట్టవలసి వస్తుంది. మీ డబ్బు అప్పుడు మీకు ఎటువంటి ఆనందాన్నీ ఇవ్వదు. ఇద్దరూ కలిసి అనుభవించండి.
.

.


6. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడకండి. ఇప్పటివరకూ జీవితం లో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు. ఎన్నో ఆనందాలూ , ఎన్నో విషాదాలూ చవి చూశారు. అవి అన్నీ గతం. మీ గత అనుభవాలు మిమ్మల్ని వెనక్కులాగేలా తలచుకుంటూ ఉండకండి , మీ భవిష్యత్తును భయంకరంగా ఊహిచుకోకండి. ఆ రెండిటివలన మీ ప్రస్తుత స్థితిని నరకప్రాయం చేసుకోకండి. ఈరోజు నేను ఆనందంగా ఉంటాను అనే అభిప్రాయంతో గడపండి. చిన్నసమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి .
.

.
7. మీ వయసు అయిపొయింది అనుకోకండి. మీ జీవిత భాగస్వామిని ఈ వయసులో ప్రేమిస్తూనే ఉండండి. జీవితాన్ని ప్రేమిస్తూనే ఉండండి. కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉండండి. మీ పోరుగువారిని ప్రేమిస్తూ ఉండండి.
.
"జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ ఉన్నన్ని నాళ్ళూ మీరు ముసలివారు అనుకోకండి. నేను ఏమిచెయ్యగలనూ అని ఆలోచించండి. నేను ఏమీ చెయ్యలేను అనుకోకండి"

8. ఆత్మాభిమానం తో ఉండండి ( మనసులోనూ బయటా కూడా ) హెయిర్ కట్టింగ్ ఎందుకులే అనుకోకండి. గోళ్ళు పెరగనియ్యిలే అనుకోకండి. చర్మసౌందర్యం మీద శ్రద్ధ పెట్టండి. పళ్ళు కట్టించుకోండి. ఇంట్లో పెర్ఫ్యూమ్ లూ సెంట్లూ ఉంచుకోండి. బాహ్య సౌందర్యం మీలో అంతః సౌందర్యం పెంచుతుంది అనే విషయం మరువకండి. మీరు శక్తివంతులే !
.

.
9. మీకు మాత్రమె ప్రత్యేకం అయిన ఒక స్టైల్స్ ఏర్పరచుకోండి . వయసుకు తగ్గ దుస్తులు చక్కటివి ఎంచుకోండి. మీకు మాత్రమె ప్రత్యేకం అయినట్టుగా మీ అలంకరణ ఉండాలి. మీరు ప్రత్యేకంగా హుందాగా ఉండాలి.

.
10. ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండండి. న్యూస్ పేపర్లు చదవండి. న్యూస్ చూడండి. పేస్ బుక్ , వాట్సాప్ లలో ఉండండి . మీ పాత స్నేహాలు మీకు దొరకవచ్చు.
.

.
11. యువతరం ఆలోచనలను గౌరవించండి. మీ ఆదర్శాలూ వారి ఆదర్శాలూ వేరు వేరు కావచ్చు . అంతమాత్రాన వారిని విమర్శించకండి. సలహాలు ఇవ్వండి, అడ్డుకోకండి. మీ అనుభవాలు వారికి ఉపయోగించేలా మీ సూచనలు ఇస్తే చాలు. వారు వారికి నచ్చితే తీసుకుంటారు. దేశాన్ని నడిపించేది వారే !

.
12. మా రోజుల్లో ... అంటూ అనకండి. మీరోజులు ఇవ్వే !
మీరు బ్రతికి ఉన్నన్ని రోజులూ " ఈరోజు నాదే" అనుకోండి
.
.

అప్పటికాలం స్వర్ణమయం అంటూ ఆరోజుల్లో బ్రతకకండి.
తోటివారితో కఠినంగా ఉండకండి. జీవితకాలం చాలా తక్కువ. పక్కవారితో కఠినంగా ఉండి మీరు సాధించేది ఏమిటి? పాజిటివ్ దృక్పధం, సంతోషాన్ని పంచే స్నేహితులతో ఉండండి. దానివలన మీ జీవితం సంతోషదాయకం అవుతుంది. కఠిన మనస్కులతో ఉంటె మీరూ కఠినాత్ములుగా మారిపోతారు. అది మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీరు త్వరగా ముసలివారు అవుతారు.
.

.
13. మీకు ఆర్ధికశక్తి ఉంటె, ఆరోగ్యం ఉంటె మీ పిల్లలల్తో మనుమలతో కలిసి ఉండకండి. కుటుంబసభ్యులతో కలిసి ఉండడం మంచిది అని అనిపించవచ్చు. కానీ అది వారి ప్రైవసీకీ మీ ప్రైవసీకీ కూడా అవరోధం అవుతుంది. వారి జీవితాలు వారివి. మీ జీవితం మీది. వారికి అవుసరం అయినా, మీకు అవుసరం అయినా తప్పక పిల్లలతో కలిసి ఉండండి.

.
.

14. మీ హాబీలను వదులుకోకండి . ఉద్యోగజీవితం లో అంత ఖాళీ లేదు అనుకుంటే ఇప్పుడు చేసుకోండి. తీర్థ యాత్రలు చెయ్యడం, పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో కుక్కనో పెంచడం, తోట పెంపకం, పేకాట ఆడుకోవడం, డామినోస్, పెయింటింగ్ ... రచనా వ్యాసంగం .... పేస్ బుక్ ... ఏదో ఒకటి ఎంచుకోండి.
.
15. ఇంటిబయటకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. కొత్త పరిచయాలు పెంచుకోండి. పార్కుకి వెళ్లండి, గుడికి వెళ్ళండి , ఏదైనా సభలకు వెళ్ళండి. ఇంటిబయట గడపడం కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
.

.
16. మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. పిర్యాదులు చెయ్యకండి. లోపాలను ఎత్తిచూపడం అలవాటు చేసుకోకండి. విమర్శించకండి . పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రవర్తించండి. సున్నితంగా సమస్యలను చెప్పడం అలవాటు చేసుకోండి.
.

.
17. వృద్ధాప్యం లో బాధలూ , సంతోషాలూ కలిసి మెలసి ఉంటాయి. బాధలను తవ్వి తీసుకుంటూ ఉండకండి. అన్నీ జీవితంలో భాగాలే

18. మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించండి
.

మీరు బాధపెట్టిన వారిని క్షమాపణ కోరండి
.

మీకూడా అసంతృప్తిని వెంటబెట్టుకోకండి.
.

అది మిమ్మల్ని విచారకరం గానూ , కఠినం గానూ మారుస్తుంది
ఎవరు రైటు అన్నది ఆలోచించకండి.
.

19. ' ఒకరిపై పగ పెట్టుకోవడం అంటే విషం తాగి ఎదుటివాడు చావాలి అని కోరుకోవడం"
.

అందుచేత క్షమించు, మర్చిపో, జీవితం సాగించు.
.

20. నవ్వండి
నవ్వించండి.
బాధలపై నవ్వండి
ఎందరికన్నానో మీరు అదృష్టవంతులు.
దీర్ఘకాలం హాయిగా జీవించండి.
ఈ వయసువరకూ కొందరు రాలేరు అని గుర్తించండి.
మీరు పూర్ణ ఆయుర్దాయం పొందినందుకు ఆనందించండి.

Source - Whatsapp Message

మిత్రధర్మం

మిత్రధర్మం

🤝🤝🤝👬🧍🏻👬🤝🤝🤝

విను మిత్రుండును రజతముగనకము బుద్ధియును నాల్గు కారణములు మర్త్యుని దారిద్య్రము వాయుట
కని దేవ గురుండు సెప్పె నన్నిటి లోనన్‌.

- తిక్కనామాత్యుడు (మహాభారతం, శాంతిపర్వం: 3-484)

‘స్నేహితుడు, వెండి, బంగారం, జ్ఞానం’- ఈ నాలుగు పేదరికం నుంచి గట్టెక్కడానికి తోడ్పడే ముఖ్యమైన సంపదలు. వీటన్నిటిలోనూ ‘మిత్రుని సహాయమే’ ఎక్కువగా వెల కట్టలేనిది.

‘స్నేహం’ అనేది బాల్యం నుంచే మనిషి జీవితంలో చెరగని ముద్ర వేస్తుంది. అందుకే, ‘మంచి స్నేహితుడు’ లభించడమనేది ఒక వరం వంటిది.

స్నేహితుణ్ని ఎంచుకోవడానికి విధిగా పాటించవలసిన జాగ్రత్తలను ‘మహాభారతమే’ మనకు ప్రబోధించింది.

‘మంచి మిత్రుని అండ దొరికిన వారు సమాజంలో గౌరవ సంపదలతో వర్ధిల్లుతుంటారు’ అన్నది ఆర్యోక్తి. అయితే, ‘దరిద్రునికి ధనవంతునితో, విజ్ఞానికి మూర్ఖునితో, నెమ్మదస్తునికి క్రూరునితో, ఉత్తమునికి దుర్మార్గునితో స్నేహమనేది ఎప్పుడూ పొసగదు’ అని ‘ఆదిపర్వం’ (5-204) ఉద్ఘాటించింది.

‘చదువు, సంపద, నడవడికలలో సమానులకు మాత్రమే మైత్రి పొసగుతుంది’ (ఆదిపర్వం: 5-205).

‘ఒకే స్వభా వాన్ని కలిగి, అన్యోన్యంగా ఉండే మిత్రులకు ఒకవేళ ఆస్తిపాస్తులు, డబ్బు వంటి విషయాల్లో ఏమైనా అభిప్రాయ భేదాలు ఏర్పడినా, వాటన్నిటినీ పక్కనపెట్టి విలువైన స్నేహం వైపే మొగ్గు చూపుతుండాలి’ (అరణ్యపర్వం: 5-409) అన్న ప్రామాణికతను మరిచిపోరాదు.

‘మిత్రునికి అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే తన తెలివితేటలను ఉపయోగించి అయినా అతణ్ని ఆ విపత్తు నుంచి గట్టెక్కించాలి’ (శల్యపర్వం: 2-299).
ఇదే ‘మిత్రధర్మం’. ‘

ఎంతో మేలు చేసి సంపాదించుకున్న మంచి మిత్రుని వల్ల సిద్ధించే ప్రయోజనాలను కాదని అతనిని దూరం చేసుకోవడం ఇరువురికీ క్షేమం కాదు. ఈ ‘మిత్ర సంపద’ మిగతా సంపదలన్నిటి కంటేకూడా ఎంతో గొప్పది’ (శాంతిపర్వం: 3-526).

అలాగే, ‘సమస్యలలో ఉన్నప్పుడు మిత్రుడు తనకు చేసిన మేలును మరిచిపోకుండా, అవసరం వచ్చినప్పుడు తిరిగి అతనికి మేలు చేస్తుండాలి. తమకు సహాయం చేసిన వాళ్ల ఋణాన్ని తీర్చుకోవడానికి తిరిగి సహాయం చేసేవాడే ‘కృతజ్ఞుడు’.

‘మిత్రద్రోహాన్ని’ మించిన పాపం మరొకటి ఉండదు. మిత్రద్రోహులనూ, కృతఘ్నులనూ, గుర్తుపట్టి వారిని ఎప్పుడూ నమ్మకుండా దూరం పెడుతుండాలి’ (శాంతిపర్వం: 3-525).

చేసిన మేలును మరచిపోయి నవారిని, ఆ మేలు చేసిన వారికి కీడు చేసేవారినీ ‘కృతఘ్నులు’ అంటారు.

తనకు అంతటి స్థాయి రావడానికి, సంపదలన్నిటినీ సమకూర్చుకోవడానికి, సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించడానికి, జీవితాం తం తనకోసం పాటుపడిన దాతకు అవసరాలన్నీ తీరిన పిమ్మట కీడు చేసే కృతఘ్నుని శవాన్ని తాకడానికి కుక్కలు కూడా అసహ్యించుకుంటాయి’ (ఉద్యోగపర్వం: 2-77).

అందుకే, ‘కృతఘ్నత’ అనేది పనికి రాదనీ, ఇది అనేక అనర్థాలకు దారితీస్తుందనీ మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి.

‘మంచివాళ్లతో స్నేహం చేస్తే మంచి జరిగినట్లే, చెడ్డవారితో సహవాసం చేస్తే చెడు ఫలితాలే అనుభవంలోకి వస్తాయి’
(అరణ్యపర్వం: 1-6)

ఆరు నెలలు కలిసి ఉంటే వాడు వీడూ, వీడు వాడూ అవుతాడనే నానుడిలోనూ వాస్తవం లేకపోలేదు.

అసత్యవాది సాంగత్యంలో ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడవుతాడు. ఎంతో మహిమతో ఉండే విష్ణు సహస్ర నామావళిని బోధించిన భీష్ముడంతటి వాడు కూడా దుర్యోధనుని సాంగత్యం వల్ల గోవులను దొంగిలించడానికి సిద్ధపడ్డాడు. అందుకే ‘దుష్టులతో స్నేహం’ ఎన్నటికీ పనికిరాదని మన సనాతన ధర్మం నొక్కి చెప్తున్నది.

స్నేహం చేయడానికి ముందే ఆ వ్యక్తి గుణగణాలనూ, నడవడికనూ చక్కగా బేరీజు వేసుకోవాలి. తమ అవసరాలు తీర్చుకోగానే కీడు చేసేవారిని ఏ మాత్రం దగ్గరకు రానీయకుండా జాగ్రత్త పడుతుండాలి. అప్పుడే, జీవితానికి మేలు, మిత్ర ధర్మానికి సార్థకత చేకూరుతాయి.

🤝🤝🤝👬🧍🏻👬🤝🤝🤝

Source - Whatsapp Message

ముత్తయిదువ లక్షణాలు

హిందూ మహిళలకు మాత్రమే

ముత్తయిదువ లక్షణాలు

మొత్తం అయిదు అలంకారాలు ఉన్న
స్త్రీని ముత్తైదువ అంటారు.అవి..

1) కాళ్ళకి పట్టీలు, మెట్టెలు
2) చేతులకి గాజులు
3) మెడలో మంగళసూత్రం
4) తలలో పువ్వులు
చివరగా
5) నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ..

1) మొదటగా కాళ్ళకు పట్టిలు మెట్టెలు ఎందుకో చూద్దాం:

కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది ..

ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది..
ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.

అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది.

అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి.

ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.
గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది.

అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.

ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు..

గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..

మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు.


ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.

అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి,గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని.పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.

అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి.

అందునా పొలం పనులు , కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.

ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది

మూడవది మెడలో మంగళసూత్రం..

దీని చివరున్న బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.
అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.

ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేదిఉపయోగపడుతుంది.
ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.క్యాన్సర్ కి ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.

ఇక నాల్గవది తలలో పూవులు..

వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.కలయసమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.

ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం..

పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.
ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.

ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!

అవే పద్ధతులు నేటికీ పాటించడం ద్వారా కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని డెవలప్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవనం కొనసాగించు కోవచ్చు.

Source - Whatsapp Message

27, 28, 32, వయసు గల పెళ్ళి కాని ఆడపిల్లలు ఇంట్లో ఉండిపోతున్నారు

తల్లి దండ్రుల యొక్క మిక్కిలి మహత్వాకాంక్ష కారణం గా
27, 28, 32, వయసు గల పెళ్ళి కాని ఆడపిల్లలు ఇంట్లో
ఉండిపోతున్నారు.

మరి ఇప్పటికి కూడా తల్లి దండ్రులు మేల్కొనక పోతే పరిస్థితి
మరింత దారుణంగా మారుతుంది.

మన సమాజం పిల్లల వివాహ విషయంలో ఎంత జాగ్రత
పడుతుందంటే, పరస్పర బంధుత్వాలు ఏర్పడడంలేదు.

సమాజంలో నేడు 27, 28, 32, సంవత్సరాల వయసు గల అనేక మంది అమ్మాయిలు ఇంట్లో ఉండిపోయారు, ఎందుకంటే, వీరి కలలు,
కోరికలు ఆర్థిక స్థోమత ను మించి ఉంటున్నాయి. ఈ రకమైన అనేక ఉదాహరణలు ఉన్నాయి.

ఇలాంటి వారి కారణంగా సమాజం యొక్క శోభ ఎంతగానో చెడిపోతుంది.

మానవునికి అన్నిటికన్నా గొప్ప సుఖము సంతోషకరమైన వైవాహిక జీవితము.

డబ్బు కూడా అవసరమే కానీ కొంత పరిమితి వరకు.

ధనం కారణంగా మంచి సంబంధాలను తిరస్కరించడం తప్పు.
మొదటి. ప్రాధాన్యత మంచి కుటుంబము, మరియు మంచి బంధుత్వము ఉండాలి.

అధిక ఆస్తి పాస్తుల భ్రమలో మంచి సంబంధాలను దూరం చేయడం
పొరపాటు. ఆస్తులు కొనుక్కోవచ్చు, కానీ గుణము ను కాదు.

నా అభిప్రాయము ఏమిటంటే, మంచి కుటుంబము మరియు అబ్బాయి మంచివాడు అని చూడాలి, కానీ చాలా అనే భ్రమలో మంచి సంబంధమును చేజార్చుకోకూడదు.

సంతోషకర వైవాహిక జీవితము గడపాలి.

30 సంవత్సరాల తర్వాత జరిగే వివాహము వివాహము కాదు, ఒప్పందము అవుతుంది, మరియు ఆరోగ్య స్థితి ప్రకారం చూసినా కూడా అందులో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

నేడు ఇంకా అందులో కూడా జాతకాలు ( కుండలీ ) కలువడము అనే కారణంగా చెడు పరిస్థితి నెలకొంది.

ఎవరికైతే జాతకాలు కలిసినా, కుటుంబము మరియు అబ్బాయి బాగు లేడు, అలాగే అబ్బాయి లో చాలా మంచి గుణాలు ఉన్నాయి కానీ జాతకము కలువలేదు, అలాగే అంతా సవ్యంగా ఉన్నప్పటికీ జాతకాలు కలువలేదని మనం సంబంధము వదులుకుంటాము.

మీరు గమనించి చూడండి, ఎవరికైతే 36 లో 20 లేదా 36 కు 36
గుణాలు కలిసినా కూడా వారి జీవితంలో బాధలు కలగడం లేదా !

ఎందుకంటే మనం అబ్బాయి గుణగణాలు చూడలేదు, జాతకం లో
గుణాలు కలవడం చూసాము.

పండితులు , విద్యావంతులైన ఆధునిక సమాజమును ఒక శతాబ్దం
వెనకకు త్రోసివేయడం, జాతకాలు కలువడము అనే భ్రమలో మంచి సంబంధాలు కలువడం లేదు, నేడు ఈ జాతకాల బిజినెస్ కోట్ల రూపాయల లో సాగుతుంది.

ఉదయం టెలివిజన్ ఆన్చేయగానే శర్మ /శాస్త్రి గారు మీ భవిష్యత్తు
చెప్పడం ఆరంభిస్తాడు. మరి వారికి వారి కుమారుడు లేదా కూతురు యొక్క భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు.

ప్రస్తుతము సమాజంలో జనాలు అమ్మాయి కి సంబంధం కొరకు అబ్బాయిలలో ఇరువది క్యారెట్ల బంగారం కొనుగోలు చేయడానికి వెళ్తారు. చూస్తూ చూస్తూ నాలుగు ఐదు సంవత్సరాలు గడిచి పోతాయి.

ఉన్నత విద్య లేదా ఉద్యోగం పేరుతో కూడా సమయం గడిపేస్తారు.

అబ్బాయి ని చూసే విధానం కూడా సమయం గడచి పోవడానికి ఒక విచిత్రమైన ఉదాహరణ అయింది.
స్వంత ఇల్లు ఉన్నదా లేదా? ,ఒకవేళ ఉంటే ఫర్నీచర్ ఎలా ఉంది?
ఇంటిలో ఎన్ని గదులు ఉన్నాయి? కారు ఉన్నదా లేదా? ఉంటే ఎలాంటి కారు?
నడవడి, ఆహారపుటలవాట్లు ఎలా ఉన్నాయి?
అన్నదమ్ములు అక్క చెల్లెండ్లు ఎందరు?
ఆస్తి పంపకాలప్పుడు అమ్మా నాన్న లు ఎవరి దగ్గర ఉంటారు?
అక్క చెల్లెండ్లు ఎందరు ,వారి వివాహాలు జరిగాయా?
తల్లి దండ్రుల స్వభావము ఎలాంటిది?
ఇంటివారు సమీప బంధువులు ఆధునికత గలవారా ,కాదా?
అబ్బాయి ఎంత హైట్ ( ఎత్తు ) ఉంటాడు.
రంగు రూపము ఎలా ఉంటాడు,
చదువు, సంపాదన, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది?
అబ్బాయి -అమ్మాయి సోషల్ మీడియా పై యాక్టివ్ గా
ఉంటారా లేదా. ?
ఆమెకు స్నేహితులు ఎందరు?

అన్ని విషయాలు అడగడం పూర్తి అయిన తరువాత కూడా కొన్ని
ప్రశ్నలు అడగడంలో, మరియు సోషల్ మీడియాపై మాట్లాడుతూ
ఉంటే సమయం గడిచి పోతుంది.
పరిస్థితి గురించి ఏమనాలి? 30 సంవత్సరాల వయసు లో
తల్లి దండ్రుల కండ్లు తెరుచుకుంటాయి.
ఇక నాలుగు -ఐదు సంవత్సరాల ఈ పరుగులాట పిల్లల
యౌవనమును కాలరాయడానికి చాలు
ఈ కారణంగా మంచి సంబంధాలు చేజారిపోతాయి.
మరి తల్లి దండ్రులే తమ పిల్లల కలలను నష్టపరుస్థారు.ఒకప్పుడు కేవలము వంశము చూసి బంధుత్వాలు కలిసేవి. అవి
దీర్ఘ కాలంగా నిలిచి ఉండేవి. వియ్యంకుడు వియ్యపురాలు మధ్య గౌరవ మర్యాదలు ఉండేవి. కష్ట సుఖాలలో పాలు పంచుకునేవారు.
బంధుత్వాల పట్ల అవగాహన ఉండేది. సిరి సంపదలు తక్కువ ఉన్నప్పటికీ ఇల్లు ముంగిలి ఆనందాలతో మెరిసేవి.
ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగితే, కింద మీద మాట్లాడితే పెద్దలు పరస్పరము సర్ది చెప్పేవారు.
తలాక్ ( విడాకులు ) అనే మాట సంబంధాలలో లేనేలేదు.
దాంపత్య జీవితము సుఖ దుఃఖాల అనుభవాలతో సాగి పోయేది
వృద్దాప్యములో ఒకరికొకరు తోడుగా ఉండేవారు.

అలాగే మనుమలు మనమరాండ్లలో సంస్కార బీజాలను
నాటేవారు. ఇప్పుడు ఆ సంస్కారాలు ఎక్కడ?

కండ్లలో లజ్జ సిగ్గు కనుమరుగైపోయింది.
బంధుత్వాల లో ఒప్పందాలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

అబ్బాయి - అమ్మాయి మన సమాజం నకు చెందిన వారు కాకున్నా
కూడా నడిచిపోతుంది. ఇలాంటి విషయాలు కూడా ముందుకు
వస్తున్నాయి.

నేడు సమాజంలోని అమ్మాయిలు- అబ్బాయిలు బహిరంగంగానే
ఇతర మతాల వైపు వెళ్తున్నారు, అంతే కాకుండా సమాజంలో ని
మంచి అమ్మాయిలు -అబ్బాయిలు నా మాదిరిగా లేరుఅని అనడం
నాకు తగిన వారు కాదు అని చెప్పడం.
కారణమేమంటే అమ్మాయిలు ఆధునికత యొక్క పరాకాష్ట ను
అధిగమించారు.
ఎప్పుడైతే ఈ అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ వివాహాలు
చేసుకుంటారో, అప్పుడు ఈ జాతకాలు కలువడము తో పని
ఏముంది? అప్పుడు ఈ జాతకాల కు ఏమి విలువ ఉండదు.

తల్లి దండ్రులు దీనినే అంగీగరిస్తున్నారు. అపుడు ఏ జాతకాలు,
స్టేటస్ (స్థాయి ) డబ్బు, ఆదాయము ఇవేవీ మధ్య లో రావు.

ఇప్పటికి కూడా తల్లి దండ్రులు మేల్కొనక పోతే పరిస్థితులు ఇంకా
విషమించి పోతాయి.

సమాజంలోని ప్రజలు అర్థం చేసుకోవాలి, అమ్మాయిల వివాహం
22, 23, 24, సంవత్సరాల వయసు లో జరగాలి. అలాగే
అబ్బాయిల వివాహం 25, 26, సంవత్సరాల లో జరగాలిఅని
గ్రహించాలి.
అందరిలో అన్ని మంచి గుణాలు దొరకవు.

ఇల్లు, బండీ( బైక్ ) మేడల కన్నా ముందు వ్యవహారమ ను తరాజు వేయాలి తల్లి దండ్రులు కూడా ఆర్థిక విషయాల మెరుగు లో కొట్టుక పోతున్నారు. పైసలు పరుగులాటలో బంధువులు మైళ్ళ కొద్ది దూరం వెనుకబడి పోతున్నారు.

ఇల్లు వాకిళ్ళు ముక్కలవుతున్నాయి. ప్రేమ ఆప్యాయతలు ఎండి పోతున్నాయి.

ఈ తరం కుటుంబాలు ఎలాంటి తమాషా చేశాయి అంటే రాబోవు
తరాలు " సంస్కారాలను "కేవలము పుస్తకాలలో చదువుకుంటారు.

"సమాజం ఇపుడు మేల్కొనవలసిన అవసరం ఎంతైనా ఉంది."

" లేదంటే బంధుత్వాలు విరిగి పోతుంటాయి ".

ధన్యవాదములు. 👏👏👏👏👏👏

Source - Whatsapp Message

దోషాలు నివారించే - గోమతి చక్రాలు

దోషాలు నివారించే - గోమతి చక్రాలు

గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక. ఒక్క గోమతి చక్రాన్ని తాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నర దృష్టి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడా పోతాయి.

గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే 'నాగ చక్రం' అని 'విష్ణు చక్రం' అని కూడా అంటారు. ఇది నత్త గుళ్ళని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని 'నత్త గుళ్ళ' స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. గోమతి చక్రం ముందుభాగం తెల్ల గాను, కొన్ని ఎర్ర గాను ఉంటాయి. తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి,ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి.

గోమతిచక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి.. ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్రప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి. గోమతిచక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి . సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి.జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావటం ,వివాహాం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి.

పూజా విధానం
గోమతి చక్రాలను సిద్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని శుద్ధి చేసుకుని పరిశుబ్రమైన బట్టతో తుడవాలి. గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి. గోమతిచక్రాలను లలితా సహస్త్ర నామం జపిస్తూ కుంకుమతో గాని హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. గోమతి చక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని, వరలక్ష్మి వ్రతం రోజు గాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు. పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి. గోమతిచక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.
ఉపయోగాలు.
రెండు గోమతి చక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే ధనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. రెండు గోమతి చక్రాలను ఒక తెల్లని గుడ్డలో వేసి దానిని మీ గుమ్మానికి కట్టండి, నరగోష పటా పంచలైపోతుంది.
మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద రాసి నీటిలో వేయటం గాని, వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.
నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది. గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు. నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాల నుంచి నివారించబడతారు.
ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది. 5 గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి. పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.
ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన వ్యాదిగ్రస్తుడి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులపై విజయం

Source - Whatsapp Message

Tuesday, August 17, 2021

రమణ మహర్షి బోధనలు

🍁రమణ మహర్షి బోధనలు🍁

📚✍️ మురళీ మోహన్

👉1) ఆత్మ శరీరంలో ఎదురు రొమ్ముకు కుడివైపున ఉంది.

2) ‘‘నేను’’ అనేది ఒక మహా మంత్రం. ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది. ఇది భగవంతుని మొదటి నామం.

3) హృదయమే శక్తి కేంద్రం. హృదయం నుండి సహస్రారానికి అమ్రత నాడి ఉంది. ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటుంది. జ్ఞానిలో తెరుచుకుని ఉంటుంది. ఇది తెరుచుకోవడమే జ్ఞానం. ఇది తెరుచుకోవడమే మోక్షం.

4) ధ్యానం అంటే ఏమిటి? మనల్ని నిరంతరం వెంటాడే శతకోటి అలోచనల దృష్టి మరల్చి ఒక్క ఆలోచనపై దృష్టి పెట్టడమే ధ్యానం. ఇలా అభ్యాసం చేయగా చేయగా మనస్సుకు శక్తి కలుగుతుంది.

రమణ మహర్షి చెప్పే ధ్యానంలో ప్రత్యేకత ఏమంటే ధ్యానించే వాడినే ధ్యానించాలి. అంటే ధ్యానించేవాడు... ఎవరికి వారే ‘‘నేను’’ కనుక ఆ ‘‘నేను’’ ను పట్టుకోవాలి. ఆ నేను ఎక్కడుందో ఆ మూలాన్ని పట్టుకోవాలి.

5) ఆత్మ విచారణకు సాంప్రదాయకంగా అనేక మార్గాలు ఉన్నాయి. ఈ విచారణలో ఆత్మను, అనాత్మను గురించి విచారించడం జరుగుతుంది. ఈ సాంప్రదాయ మార్గాలకు మనసు ఒక పరికరం. అసలు దోషి అయిన ‘‘నేను’’ ఈ విచారణలో భద్రంగా ఉండి ఎటూ తేలదు...

రమణులు చెప్పిన విచారణ అయిన ‘‘నేనెవరు’’ ఇందుకు పూర్తిగా విభిన్నమైనది. ‘‘నేనెవరు’’ అని తనను తాను వేసుకునే సూటి ప్రశ్న సకల దోషాలకు మూలమైన ‘‘నేను’’ పైనే గురిపెడుతుంది. ఇక్కడ ఇక ‘‘నేను’’ తప్పించుకోవడానికి వీలులేదు.అంటే ‘‘నేనెవరు’’ అనే సూటి ప్రశ్న నేను పైనే నిలబడుతుంది. దాంతో ఇక్కడ అసలు దోషి ‘‘నేను’’ దొరికిపోతాడు.

6) ‘‘నేనెవరు’’ అనే విచారణతో మనస్సు అణుగుతుంది. ఈ ‘‘నేను’’ అనే ఆలోచన మనసులో విచారించే ఇతర ఆలోచనల అన్నింటిని అణగదొక్కి చివరకు మనసే తన ఉనికిని కూడా కోల్పోయి అణిగిపోతుంది. ‘‘నేను’’ అనే ఆలోచన అన్ని ఆలోచనలను నశింపచేసి, తాను నశించును.

7) ‘‘నిజమైన నేను’ ’ఆది అంతంలేని అనంతసాగరం లాంటిది. ఈ అనంత సాగరంలో ‘‘మాయా నేను’’ నీటి బుడగలా ఏర్పడుతుంది.ఈ నీటి బుడగనే జీవుడు(మొదటి ఆలోచన)లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు. నిజానికి ఈ బుడగకూడ నీరే,నీరులో బాగమే. ఇది బద్దలైనపుడు పూర్ణసాగరంలో కలిసిపోతుంది. ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడ సాగరంలో ఒక భాగంగానే ఉన్నది. ఈ సరళ సత్యాన్ని విస్మరించి - ఎన్నో సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి.

8) ఆత్మజ్ఞాన అన్వేషికి ‘‘నేను’’ ను విచారించుటే సూటి అయిన మార్గం. అన్నింటికి కారణమైన ‘‘నేను’’ ను విచారించకుండా మనసు, బుద్ధి, ఇంద్రియాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తే లాభం లేదు. ‘‘నేను’’ పోయిందా, "నేను’’ ను ఆధారం చేసుకుని బతుకుతున్న ఇవన్నీ ఎగిరిపోతాయి. ‘‘నేను’’ అనేది మహా మంత్రం. ‘‘నేను’'అనేది దేవుడి మొదటి పేరు. ఇది ‘‘ఓంకారం కన్నా మహా శక్తి వంతమైనది.

9) ‘‘నేను’’ అనే ఆలోచన పుట్టిన తరువాతే, క్షణం, క్షణం మారే వేలకొద్ది ఆలోచనలు పుడుతున్నాయి. ఇన్ని ఆలోచనలకు మూలమైన, ఇన్ని ఆలోచనలను ఆలోచిస్తున్న ఈ ‘‘నేనెవరు’’ ను నిరంతరం ఆలోచిస్తే ఆ నిజమైన ‘‘నేను’’ అనుభవమవుతుంది.

10) నిద్రపోయే ముందు, నిద్రనుండి మేల్కొన్నవెంటనే ‘‘నేనెవరు’’ను ప్రశ్నించుకోవాలి. ఈ రెండు సమాయాల్లో అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక్క తృటి కాలం పాటు ఉంటుంది. ఇవి ధ్యానానికి ఉత్తమ సమాయాలు. మనస్సు అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది.🤘

Source - Whatsapp Message

అగరుబత్తి (పరిమళం)

🌹 అగరుబత్తి (పరిమళం)🌹

కొత్తగా పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చి, కొన్ని రోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లేటపుడు తన తండ్రి కూతురుకు ఒక అగరుబత్తి డబ్బాను కానుకగా ఇచ్చాడు..

అది చూసిన తల్లి ముఖం చీదరించుకుని.., మీ నాన్న ఎప్పుడూ ఇంతే, మహా పిసినారి.. అంటూ లోపలికి వెళ్లి మంచి బ్లౌస్ పీసులు రెండు మరియు దానిపైన డబ్బులతో ఉన్న ఒక కవరును పెట్టి కూతురుకు ఇచ్చి అత్తారింటికి పంపించింది.. తను కూడా ఏమి అనకుండా అత్తారింటికి వెళ్లిపోయింది.

మరుసటిరోజు అత్తారింట్లో ఉదయమే దేవుని ఇంట్లోకి వెళ్లి దీపం పెట్టి తండ్రి ఇచ్చిన అగరుబత్తిని వెలిగించింది..
డబ్బాలో నుండి అగరుబత్తిని తీసేటప్పుడు అందులో నుంచి ఒక కాగితపు చీటి బయటపడింది..
అది తీసి చూస్తే తండ్రి చేతిరాతతో రాసిన ఒక సందేశం కనిపించింది. అది చదివి తను ఒక్కసారిగా బిక్కి బిక్కి ఏడవడం మొదలుపెట్టింది.. తను ఏడవటం చూసి ఒక్కసారిగా అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.. ఏమైందీ.. ఏమైందీ అంటూ అడగసాగారు.. తను తన చేతిలో ఉన్న చీటిని అత్త చేతిలో పెట్టింది..

ఆ చీటిలోని 'సందేశం' ఇలా ఉంది..

అమ్మా.. నీవు పెళ్ళయిన తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చి.. తిరిగి వెళుతున్నప్పుడు, నీ తండ్రిగా నీకు ఏమి కానుక ఇవ్వాలని చాలా ఆలోచించాను..

దేవుని దయవలన నీ మనస్సుకు తగిన భర్త , అంతఃకరణం చూపించే అత్తమామలు నీకు లభించారు..
ఇప్పుడు నేను నీకు ఒక సుగంధభరితమైన అగరుబత్తి డబ్బాను నీకు కానుకగా ఇస్తున్నాను... ఇదేమిటి అని ఆశ్చర్యం కలిగింది కదూ.. మీ నాన్న బాగా కంజూస్ అనుకుంటున్నావ్ కదా..
కాదు.. కాదు..

మీ అమ్మ, పెళ్ళి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు అందరినీ ఎలా కలుపుకుని పోయి ఏ విధంగా వ్యవహరించిందో.. నువ్వు కూడా అదే రీతిగా అందరినీ కలుపుకుపోవాలి..

ఏ విధంగా ఐతే అగరుబత్తి కాలుతూ, తాను బూడిద ఐనా పరవాలేదు తన సుగంధాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుందో. . అదే విధంగా నువ్వు కూడా అందరి మన్ననలు పొందుతూ , నీ ఇంట్లో మాత్రమే కాదు, చుట్టు పక్కల ఇండ్లలో కూడా మంచి పేరు తీసుకురావాలి.. ఈ నా చిన్న కానుక ఎల్లప్పుడు నీకు గుర్తుండాలి.. నీ జీవితం సాఫీగా సాగాలి...ఇది మీ నాన్న కోరిక..

ఇది చదివి అత్త కళ్ళు చెమ్మగిల్లాయి.. కోడలిని కౌగలించుకుని, ఇటువంటి సంస్కారవంతమైన ఇంటి నుండి మాకు కోడలు రావడం , ఇటువంటి మంచి సంబంధికులను పొందడం.. నిజంగా మేము ధన్యులం... 🙏

🙏సర్వేజనాః సుఖినోభవంతుః🙏

Source - Whatsapp Message

ఆనందం

🍁ఆనందం🍁

✍️ మురళీ మోహన్

🤘� తన జీవితంలో ఒక్క క్షణం కూడా ఆనందం తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అది సాధ్యం కానేకాదు, ప్రపంచంలోని అత్యంత బాధామయ వ్యక్తికి కూడా ఆనందం అంటే ఏమిటో తెలుసు. అతను ఆనందాన్ని పొందలేడని కాదు. అతను బాధను ఎలా అయితే పొందగలడో, అలాగే ఆనందాన్ని కూడా పొందగలడు.

ప్రస్తుతం ఆ భాధామయ వ్యక్తి సమస్య ఏమిటంటే అతను దాన్ని నిలుపుకోలేకపోతున్నాడు. నిజానికి అతను చాలా బాధలో ఉన్నాడు. ఎందుకంటే అతను ఆనందాన్ని కోల్పోయాడు. అవునా, కాదా? మనుషులు ఎంతో బాధలో ఉండటానికి ఒక కారణం, ‘నిన్న ఎంతో బాగుండింది, కానీ ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయింది?’ అని అనుకోవటమే. అది వారి బాధని అనేక రెట్లు పెంచుతుంది, అవునా, కాదా? అంటే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో, కనీసం ఒక్క క్షణమైనా, ఆనందాన్ని అనుభవించారు.

మిమ్మల్ని మీరు ఒక్క క్షణమైనా ఆనందపరుచుకోగల సామర్ధ్యం మీకు ఉందంటే, మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఆనందపరుచుకోగల సామర్ధ్యం కూడా మీకు ఉంటుంది

నేను “మిమ్మల్ని మీరు” అని ఎందుకు అంటున్నానంటే, మిమ్మల్ని మీరే బాధపెట్టుకోగలరు లేదా ఆనందపరుచుకోగలరు. మీరు అనుభూతి చెందేది మీలోనే, మీ బయట కాదు. మీరు ఆనందంగా ఉండటానికి మీ అవగాహనలో రావలసిన ప్రాధమిక మార్పు ఇదే.

అంతర్గతానందం ఎలా పొందాలని అందరూ అడుగుతారు. నేను వారిని అడుగుతాను, ‘మీకు బాహ్యనందం అంటే ఏమిటో తెలుసా?’ అని. మద్యం తీసుకోవటం వలన మీకు ఆనందంగా అనిపించి ఉండవచ్చు. మీరు దాన్ని ‘బాహ్య ఆనందం’ అని అనుకుంటుండవచ్చు. కానీ మీరు ఏమి చేసినా సరే, ఎప్పుడూ మీ లోపలే మీకు ఆనందంగా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ మీలోనే అనిపిస్తుంది, అవునా, కాదా? ఎప్పుడూ మీ బయట కాదు.

మీరు ఇప్పుడు బాధగా ఉండటానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే, మీరు ఆనందపడకుండా, ఆనందాన్ని వెతుకుతున్నారు. మీరు ఆనందాన్ని అనుభూతి చెందేది మీలోనే అని అర్ధం చేసుకోకుండా, ఏదో ఆనందం బయట ఉన్నట్లు మీ శక్తినంతటినీ బయట ఉన్నవాటి మీద కేంద్రీకరిస్తున్నారు.

మీరు సంతోషంగా లేకపోవటానికి కారణమేమిటంటే మీ ఆనందానికి ఆధారమైన ‘మీ’ నుండి మీరు దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఆనందాన్ని వీధిలో ఎక్కడో వెతుక్కోడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారన్న వాస్తవమే బాధని సృష్టిస్తుంది. ఎందుకంటే ఆనందం ఇక్కడ, అంటే మీ లోపల ఉంది, కానీ మీరు ఎక్కడికో వెళుతున్నారు. మీరు దాని నుండి దూరంగా వెళుతున్నారు.

మీరు ఆనందాన్ని పొందగలరు. కాకపోతే మీరు దాన్ని కొన్ని క్షణాలు మాత్రమే సృష్టించుకుంటున్నారు. మిగతా సమయమంతా మీరు ఎంతో బాధను సృష్టించుకుంటున్నారు.

మీలో మీకు కావలసిన విధంగా ఒక్క క్షణాన్నైనా సృష్టించుకోగల సామర్ధ్యం మీకు ఉంటే, మీకు కావలసిన విధంగా మరొక క్షణాన్ని సృష్టించుకోగల సామర్ధ్యం మీలో ఉండదా? మరొకటి, మరొకటి, ఇంకొకటి.. అదృష్టవశాత్తు, జీవితమంటే ఇంతే, ఒకసారి ఒక్క క్షణమే. క్షణాలు ఒక్కసారే గుంపుగా వచ్చి, మీ మీద దాడి చేయట్లేదు. అవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగానే వస్తున్నాయి. మీకు ఈ క్షణంలో ఆనందంగా ఉండడం ఎలానో తెలిస్తే, మీరు ఇక ఆపై ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు. అది ఎలానో మీకు తెలియకపోతే, మీరు ఎప్పటికీ ఆనందంగా ఉండరు. 🤘�

Source - Whatsapp Message

కష్టజీవి శ్రీకృష్ణుడు

🍁కష్టజీవి శ్రీకృష్ణుడు🍁

✍️ మురళీ మోహన్

"🙏శ్రీకృష్ణుడు కష్టజీవి ఏమిటీ?!" హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు.
ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు

ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా, పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు.

శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు.

చూశారా! పురిటికందుకే ఎన్ని కష్టాలో!

కేవలం కొన్నిరోజుల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన.

అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. శ్రీకృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది.

కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరమో ఆలోచించండి.

ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకరయుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ శ్రీకృష్ణుడే జయించాడు.

కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది.

యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు.

అనంతరం రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ, ఒక హత్యానేరాన్నీ మోశాడు.

ఎన్నో కష్టాలు పడి, పరిశోధించి, శమంతకమణిని సాధించి తెచ్చి, తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు.

జాంబవతిని పెళ్ళాడేముందు, ఆమె తండ్రియైన జాంబవంతునితో భయంకరయుద్ధం చేశాడు.

అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు, మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది.

జీవితమే ఒక పోరాటమయింది శ్రీకృష్ణునికి.

చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే,

చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు.

తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు.

ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు.

కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా,

శ్రీకృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె!

శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు. యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది.

తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగుపెంటలైపోతున్నా,

విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు.

అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి.

శ్రీకృష్ణుని జీవితం పూలపానుపేమీ కాదు; దారుణమైన ముళ్ళబాట. ఆయన జీవితం కులాసాగా గడిచిందో, అష్టకష్టాలతో గడిచిందో ఈసారి మీరే చెప్పండి.

మనకు చిన్న కష్టం వస్తే చాలు, ఎంతో బాధపడి పోతాం. ఆ కష్టాలకు బాధ్యుడు దేవుడేనని నిందిస్తాం. కాని, భగవంతుడు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా మానవరూపం దాల్చి, మానవులకంటే ఎక్కువ కష్టాలూ, సమస్యలూ అనుభవించి చూపించాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాల్లో వందోవంతు కష్టాలు పడిన మానవులు ఎవరైనా ఉన్నారా?
నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే! కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే! అనుభవించడం కష్టం. కాని, శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు.🙏

Source - Whatsapp Message

A rare conversation between Ramkrishna Paramahansa & Swami Vivekanand

🕉️A rare conversation between Ramkrishna Paramahansa & Swami Vivekanand🕉️

📚✍️ MURALI MOHAN

🙏Swami Vivekanand:- I can’t find free time. Life has become hectic.

Ramkrishna Paramahansa:- Activity gets you busy. But productivity gets you free.

Swami Vivekanand:- Why has life become complicated now?

Ramkrishna Paramahansa:- Stop analyzing life.. It makes it complicated. Just live it.

Swami Vivekanand:- Why are we then constantly unhappy?

Ramkrishna Paramahansa:- Worrying has become your
habit. That’s why you are not happy.

Swami Vivekanand:- Why do good people always suffer?

Ramkrishna Paramahansa:- Diamond cannot be polished without friction. Gold cannot be purified without fire. Good people go through trials, but don’t suffer.
With that experience their life becomes better, not bitter.

Swami Vivekanand:- You mean to say such experience is useful?

Ramkrishna Paramahansa:- Yes. In every term, Experience is a hard teacher. She gives the test first and the lessons afterwards.

Swami Vivekanand:- Because of so many problems, we don’t know where we are heading…

Ramkrishna Paramahansa:- If you look outside you will not know where you are heading. Look inside. Eyes provide sight. Heart provides the way.

Swami Vivekanand:- Does failure hurt more than moving in the right direction?

Ramkrishna Paramahansa:- Success is a measure as decided by others. Satisfaction is a measure as decided by you.

Swami Vivekanand:- In tough times, how do you stay motivated?

Ramkrishna Paramahansa:- Always look at how far you have come rather than how far you have to go. Always count your blessing, not what you are missing.🤘

Source - Whatsapp Message

కర్మ ఎవరిని బంధిస్తుంది – శరీరాన్నా, ఆత్మనా

కర్మ ఎవరిని బంధిస్తుంది – శరీరాన్నా, ఆత్మనా

కర్మ ఫలితం అనుభవించాల్సిందే, తప్పదు అని చెప్తున్నారు. మరి కర్మ ఫలితం ఎవరిని బంధిస్తుంది, శరీరాన్నా, ఆత్మనా, సరైన సందేహమే కదా! దీనికి దాదాశ్రీ ఇలా సమాధానం చెప్పారు.

అసలు శరీరం అంటేనే కర్మ ఫలితం కదా, ఇక దాన్ని మళ్ళీ బంధించడం ఏముంటుంది, ఉదాహరణకి ఒకరు జైల్లో ఉన్నారనుకో, బంధనం దేనికి, జైలుకా లేక లోపలున్న వ్యక్తికా, అలాగే ఈ శరీరమే కారాగారం అయితే, ఆ లోపలున్న వ్యక్తికే బంధనం అన్నమాట! అయితే ఈ వ్యవహారంలో ఆత్మకు ఏ సంబంధం ఉండదు. అది స్వేచ్చగా, స్వతంత్రంగా ఉంటుంది. కానీ అపోహల ద్వారా పుట్టే అహంకారం – ఇగో ఉంటుందే, అది కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. నువ్వే పరిశుద్ద పరమాత్మవు అయి వుండి కూడా సుబ్బారావనో, సుబ్బమ్మ అనో అనుకుంటూ ఉంటావే అది అహంకారం. ఇదిగో ఆ అహంకారమే కర్త్రుత్వానికి దారి తీసి, కర్మ ఫలితం అనుభంవించేలా చేస్తుంది. ఆ అహంకారం వీడినప్పుడు నువ్వు మళ్ళీ యధాస్థితికి వెళ్తావు, ఇక బంధనం ఉండదు.

అసలు కర్మ కి – ఆత్మకి ఉండే సంబంధం ఎలాంటిది

కర్తృత్వం లేక పొతే రెండూ వేరు పది పోతాయి. దేని స్థానంలో అది ఉంటుంది. కర్తృత్వం లేకుండా కర్మ లేదు. అది ఉంటేనే ఇది ఉంటుంది. నువ్వు కర్తవు కానప్పుడు నువ్వేం చేసినా నువ్వు కర్మకు బద్దుడవు కావు. ఆత్మా, కర్మ వేరుగా ఉన్నప్పటికీ ఈ కర్తృత్వం అనేది వాటిని కలుపుతున్నట్లు అనిపిస్తుంది. ఈ చేసే ‘నేను’ లేకపోతె రెండూ వేర్వేరు గానే ఉంటాయి.

మనకి బయటి ప్రపంచంలో కనపడి జరిగే ప్రతి విషయం ఫలితమే. కర్మ ఎప్పుడో జరిగిపోయింది. దాని ఫలితమే మనం చూస్తున్నాం. ఉదాహరణకు మీరు పరీక్ష రాసి పేపర్ ఇచ్చేశారు. ఇక ఫలితం రావడమే తరువాయి. పరీక్ష పేపర్ ఇచ్చాం అంటే ఏదో ఫలితం రావాల్సిందే కదా – ఇక దాని గురించి దిగులు ఎందుకు? అంటే మనం ఫలితం ఒకలా రావాలని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాం అన్నమాటేగా! ప్రపంచం మొత్తం ఇలాగే ఫలితాల గురించే మధన పడుతోంది.

కర్మ, ఫలితాల ఈ చక్రానికి మరి ఆది ఏది ఇది ఎలా మొదలైంది

ఓ పూసల దండ ఉంది, దానికి ఆది ఏది,తుది ఏది? అలాగే ఈ చక్రంలో మొదలు, తుదలు లేదు. అలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎక్కడ మొదలైంది అంటే ఎప్పుడు వివేకం లేదా ప్రజ్ఞ మొదలైందో అక్కడ మొదలైంది, ప్రజ్ఞ ముగిసినప్పుడు ఇది కూడా ముగుస్తుంది. అలా కాదంటే దీనికి మొదలే లేదు. ప్రజ్ఞ ఉన్నప్పుడే నేను చేశాను అన్న భావన, దాన్ని బట్టి కర్మ, దాన్ని బట్టి ఫలితం.

జన్మాంతరాల నుంచి చేసిన ఈ కర్మలన్నీ ఒకే జన్మలో ఫలితం ఇవ్వవు కదా – అంటే వీటిని జన్మజన్మల నుంచి అనుభవిస్తూ వస్తున్నామా, ఈ కర్మలన్నీ ముగిస్తేనే కదా మోక్షం.

ఒక జన్మలో ఫలితాలన్నీ అనుభవించేసాక ఆ శరీరం పతనం అవుతుంది. కానీ ఈ జన్మలో చేసిన కర్మలు మళ్ళీ బంధిస్తాయి కదా – మరింక మోక్షం ఎక్కడిది, ఎప్పుడు కర్తృత్వం అంతమై, నేను పరిశుద్ధ ఆత్మను అనే అపరిమితమైన ఆనందం పొందగాలుగుతామో అప్పుడు ఈ కర్మ – ఫలితాల చక్రం నుంచి బయటకు వస్తాం. ఆలా కాక నేను చేశాను అని అనుకున్నంతసేపూ ఆ ఫలితాలకు బాధ్యత వహించి జననమరణాల చక్రంలో తిరుగాడుతూనే ఉంటాం!

Source - Whatsapp Message

కర్మ - ఖర్మ

🍁కర్మ - ఖర్మ🍁

✍️ మురళీ మోహన్

🤔తలరాతని తప్పించుకోలేమా?
అసలు తలరాత అంటే ఏమిటీ?

ఆయుష్షు తీరో, జవసత్వాలుడిగో నశించిపోయిన భౌతిక శరీరాలు వారసత్వం భరించలేక మరోశరీరానికి కర్మల్ని బదిలీచేస్తాయి. శరీరాలు నశించిన కర్మశేషాలు నశించవు. వెన్నంటే వస్తాయి, వెంటాడుతునే ఉంటాయి. ఆ కర్మశేషాలనుభవించడానికి మరల మరల జన్మించడం.
మనకి ఆ కర్మశేషాలు గుర్తుండక పోవచ్చు కానీ, మరిచిపోయినంత మాత్రాన మనవి కాకుండా పోవు. ఇదే విధి లేదా తలరాత లేదా లలాటలిఖితం.

కర్మలకు మరణం లేదు. మనిషి మరణించినా కర్మలు మరోజన్మకు పయనిస్తాయి. గతజన్మ కర్మలు కంటికి కనిపించవు. కానీ, ఈ జన్మలో అనుభూతమౌతాయి. పూర్వజన్మల కర్మబీజ ఫలాలే విధిరాతలు. గతజన్మల కర్మలశేషఫలంకు అంటే విధికి , నేటి కర్మల ఫలితంకు అనుసంధానింపబడి సాగుతుంది ఈజన్మ జీవనయానం.
సాధారణంగా కష్టకాలంలో లేదా దుఃఖ సమయంలో గాని, అనుకునేరీతిలో జీవనం సాగనప్పుడు, అనుకోని అవాంతరాలప్పుడు అనిపిస్తుంటుంది - ఇదంతా మన తలరాత అని. మనచేతిలో ఏదీలేదు, తలరాత ఎలా వుందో అలా జరుగుతుంది, తప్పించుకోలేమని భావిస్తాం. ఇదో నిరాశావాదం. ప్రారబ్ధమే మనిషిని నడిపిస్తే, అంతా విధిరాత ప్రకారమే జరిగితే ఇక మనిషి చేయాల్సింది ఏమీ లేదా? విధి చేతిలో మనం కీలుబొమ్మలమైతే ఇక మనం చేయగలిగింది ఏముందీ? ఇది నా తలరాత అని అనుకున్నంతకాలం ఆవేదన తప్పదు, నిరాశ వీడదు.

జన్మించిన ప్రతీజీవి విధికి తలవొగ్గక తప్పదు. కానీ, ప్రతిఒక్కరికి విధిని ఎదిరించేశక్తి వుంది. విధి బలీయమైనదే కావొచ్చు... కానీ, దానిని మార్చుకోవచ్చు... వజ్ర సంకల్పంతో, నిరంతర సాధనతో, అకుంఠిత భక్తితో. ఇందుకు ఉదాహరణంగా కొన్ని గాధలు గుర్తుచేసుకుందాం -

విధిరీత్యా అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహమాడి, తన ఆత్మ విశ్వాసంతో, వజ్ర సంకల్పంతో యముణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి - సత్యవంతుల కధ మనందరికీ విధితమే.
పదహారు ఏళ్ళు మాత్రమే ఆయుష్షు ఉన్న మార్కండేయుడు తన అకుంఠితభక్తితో యముణ్ణి జయించి, శివుని ఆశిస్సులతో చిరంజీవత్వాన్ని పొందలేదా?
చదువునందు రాణించలేక, తను చెప్పింది అవగాహన చేసుకోలేకపోతున్న శిష్యుని హస్త సాముద్రికాన్ని పరిశీలించి, నాయనా! నీకు విద్యారేఖ లేదు, చదువుకునే యోగం లేదు, కాబట్టి నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లి, తగిన వృత్తిని స్వీకరించడం మంచిదని చెప్పిన గురువుగారి మాటలకు మనస్సు భారమై, ఇంటికి బయలుదేరి, మార్గమధ్యంలో దప్పికై, ఓ రాతిగిలక బావి దగ్గర ఆగి, దాహం తీర్చుకుంటూ, తాడు ఒరిపిడికి అరిగిన ఆ రాతిగిలకను చూసి, బలహీనమైన తాడువల్ల రాయే అరగగా, నేను సాధనతో విద్యను ఆర్జించలేనా అన్న దృఢ నిశ్చయంకు వచ్చి, పదునైన రాతిముక్కతో చేతిపై విద్యారేఖను గీరుకోని, తిరిగి గురువు చెంతకు వెళ్ళి, నిరంతర సాధనతో అనతికాలంలోనే విద్యను అభ్యసించి, సంస్కృత వ్యాకరణం వ్రాసిన పాణిని దృఢ సంకల్పం తన రాతను మార్చలేదా?

అందరం ఒకటి గుర్తుంచుకోవాలి - మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయం. విధిరాతలు స్వయంకృతం. స్వీయకర్మలే మన విధిరాతలు. అంటే మన విధిరాత విధాతలం మనమే. గతజన్మల కర్మశేషాలే నేటి విధిరాతలయినట్లు, నేటి కర్మలే మరుజన్మ విధిరాతలు. కర్మలు చేయడం అనివార్యం. ఆ కర్మలలో కొన్ని ప్రారబ్దాలుగా మూటకట్టుకోవడం నిజం. అవి అనుభవించడానికి జన్మించడం తప్పదు. ఇలా పుట్టడం ... గిట్టడం ... తప్పదా ఈ చక్రపరిభ్రమణం ... రాదా ముక్తి?
వస్తుంది ... ఎప్పుడు? గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు... ' స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః'
ఈశ్వరార్పణ బుద్ధితో, భగవత్ కైంకర్యబుద్ధితో కర్మలు చేస్తే జ్ఞాన మోక్ష సిద్ధులు ప్రాప్తమౌతాయి.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర మివామ్బసా
ఎవరు కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి, ఆసక్తి లేకుండా తన కర్మలు ఆచరిస్తారో, అటువంటి వారు నీటిచే అంటబడని తామరాకు వలె పాప ఫలితంచే ప్రభావితులు కారు.

ప్రతీ ఒకరు చింత చింతన వీడి సానుకూల దృక్పధం ఏర్పరుచుకోవాలి.

ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం కలిగి ఉండాలి.
సానుకూల భావం సాధనా సోపానం.
సంకల్పం దృఢమైతే సాఫల్యం సమక్షంలోనే.👍

Source - Whatsapp Message

శ్రీ దత్తాత్రేయ స్వామి 24 గురువులు

🕉️శ్రీ దత్తాత్రేయ స్వామి 24 గురువులు🕉️

📚✍️ మురళీ మోహన్

🙏 దత్తుడు త్రిమూర్తి స్వరూపమైన విశ్వగురువు. శిష్యునికి భగవంతుని వెలుగు ఎవరి ద్వారా వస్తుందో వారే గురువు.


గురువులో గకార సిద్ధివాచకం, రకార పాపనాశకం, ఉకార విష్ణువాచకాలు ఉన్నాయి.


గురువులో రెండు ఉకార వాచకాలు పాపనాశనాన్ని చేసి సిద్ధిని ఇచ్చే వ్యాపకత్వముతో కూడి శుధ్ధి చేయువారు గురువు.అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం ఎవరి ద్వారా కలుగుతుందో వారు గురువు (వారు లేదా వాటి ద్వారా)మరో అర్థం ఎవరి నుంచి మేలు పొందినా వారిని గురువు అనాలి. అంటే మేలు చేసినవారు కూడా గురువే


దత్తాత్రేయుడికి 24 మంది గురువులు.. వీరంతా లోకంలో ఉన్నవారే.


ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఒక్కో విషయాన్ని గ్రహించి వారిని/వాటిని తన గురువులుగా దత్తాత్రేయుడు స్వీకరించారు.


దీనిలో పరమార్థం మనం మన చుట్టు ఉన్న ప్రకృతిలోని జీవులు, వస్తువులోని మంచిని గ్రహించి జీవనాన్ని సన్మార్గంలో నడుపుకోవాలని తెలియజేస్తుంది.


దత్తాత్రేయ అవతారంలో ఎందరినో ఉద్దరించాడు.ఆధ్యాత్మిక సిద్ధి, యోగవిద్యను ఎందరికో ఉపదేశించాడు. వీరిలో ప్రహ్లాదుడు,యదురాజు, పరుశరాముడు,కార్తవీర్యార్జునుడు,మహాసతి మదాలస పుత్రుడైన అలర్క వీరిలో ప్రధానమైన వారు.


ఇక అవధూత పరంపరకు ఆద్యుడు. దత్తాత్రేయున్ని అవధూత శిరోమణి, ఆదిగురువు అని కూడా పిలుస్తారు.అవధూత అంటే స్వస్వరూపంగా అవస్థితమైన మహాత్ముడు. దీనిగురించి గోరక్ష సిద్ధాంతంలో విశేషంగా పేర్కొన్నారు.


ॐॐॐॐॐॐॐॐॐ

దత్తాత్రేయుని 24 మంది గురువులు.

ॐॐॐॐॐॐॐॐॐ

యాదవ వంశానికి మూలపురుషుడైన యదువు అనే రాజు దత్తాత్రేయుని చూచి స్వామీ మీరెలా సదానంద, చిదానంద స్వరూపులై ఉండ గలుగుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు దత్తాత్రేయుల వారు ఇలా సెలవిచ్చారు.


యదు రాజా ! నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుండీ జ్ఞానం సంపాదించాను. చెప్తాను విను.


ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. కొన్నింటి నుండి ఎలా ఉండాలో తెలుసుకున్నాను, కొన్నింటి నుండి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను.


ఆ విధంగా తానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో గురువైనప్పటికీ, అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతీ అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా అయ్యాడు.


జగత్తుకూ, ప్రకృతికీ తానే గురువైనా మనందరిలో ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి జగద్గురువైన దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24 తత్త్వాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు అవి...

1)🎇 ఆకాశం

2) 🌏భూమి

3) 🔥అగ్ని

4) 💦జలం

5) 🌬️వాయువు

6) 🌞సూర్యుడు

7) 🌝చంద్రుడు

8)🐦 పావురం

9) 🐍కొండ చిలువ

10) 🐝తేనెటీగ

11) 🦋భ్రమరం ( తుమ్మెద )

12) 🌊సముద్రం

13) 🦅రాబందు

14) 🕷️సాలీడు

15)🐘 ఏనుగు

16) 🦌జింక

17) 🐟చేప

18) 👼పసి పిల్లవాడు

19) 🧏‍♀️కన్య

20) 🐍పాము

21) 🤠లోహపు పనివాడు

22) 🐻ఎలుగుబంటి

23) 🧛‍♀️వేశ్య

24) 🦗చిమ్మట

ఇవన్నీ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , పంచ తన్మాత్రలు, మిగిలిన నాలుగు మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలు. ఆ ఙ్ఞానమూర్తి అవ్యక్త రూపంలో వీటన్నిటిలో ఉన్నట్టుగా చెప్తారు.


ఈ ప్రకృతి తత్త్వాలను దత్తాత్రేయుడు ఎలా గురువుగా స్వీకరించాడో... తెలుసుకుందాం.

🕉🌞🌏🌙🌟🚩

1. మొదటి గురువు - 🌏భూమి:-

దత్తాత్రేయుడు తాను భూదేవి నుండి ఓర్పు వహించడం, కర్తవ్య నిర్వహణా ధర్మం, కార్య నిర్వహణలో ఎన్ని కష్టానష్టాలు వచ్చిన ఓర్చుకోని నిలబడడం, తన ధర్మం తాను తప్పకపోవడం లాంటి ఎన్ని విషయాలనో తాను గ్రహించానంటాడు జగద్గురువైన దత్తాత్రేయుడు. భూదేవి కన్నా ఓర్పు ఈ విశ్వంలో ఎవరికి ఉంటుంది. మానవుడు దుర్మార్గుడు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ఓర్పు వహించి భరించేదే భూమాత.


మనం ఎన్నో తప్పులు చేసి భూదేవిలో భాగమైన ఈ ప్రకృతి నడిచే సక్రమమైన వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి ఉత్పాతాలు సృష్టించినా ఉపేక్షించి, కొడుకు ఎన్ని తప్పులు చేసినా కన్నతల్లి తన కడుపులో దాచుకున్నట్టు, ఓర్పుతో మనని ఉద్ధిరించే ప్రయత్నం చేస్తుంది తల్లి భూదేవి. ఇంకా భూదేవి నుండి నేర్చుకోవాల్సిన గుణం క్షమా గుణం.


భూమిపై ఉండే పర్వతాలు మరియు వృక్షాల లాగా ఇతరులకు ఎలా ఉపయోగపడాలో నేర్చుకోవలంటాడు దత్తాత్రేయుడు.

2. రెండవ గురువు - 🌬️వాయువు:-

గాలి మనకు ప్రవిత్రత, వాసన లేని గుణం అంటే ఎలాంటి విపరీత భావాలూ లేకపోవడం మరియు అందరిలో తొందరగా కలిసిపోవడం లాంటి ఎన్నో గుణాలు నేర్పుతుంది. గాలి అన్నిటితో కలిసినా తన సహజలక్షణాన్ని ఎలాగైతం కోల్పోదో మనిషి కూడా అలాగే మనం కూడా ఎంతమందితో కలిసినా మన సహజ లక్షణాన్ని కోల్పోకూడదు.


ఎలాగైతే గాలి అదుపు తప్పి అతివేగంతో వీచి ప్రకృతిలో మహా విధ్వంసం సృష్టిస్తుందో అలాగే అదుపు లేని మనస్సు కూడా అలాగే ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తుంది, అలాంటి మనస్సుని పరమాత్మ వైపు మరల్చడం చాలా కష్టం. అందుకే మన మనస్సుని సాధ్యమైనంత వరకు మన అదుపులో పెట్టుకొని పరమాత్మ వైపు నడిపించే ప్రయత్నం చేయాలి.

3. మూడవ గురువు - 🎇ఆకాశం

🙏విశ్వమునంతా కప్పి ఉంచే ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశాన్ని మబ్బులు కమ్మి దాన్ని కనబడకుండా చేస్తాయి. అయినా ఆకాశం ఆ మబ్బుల చేత ప్రభావంఏ కాదు. తన స్థితిని తాను విడచిపెట్టదు. అలాగే ఆత్మకూడా ఈ ప్రాపంచిక విషయాల చేత కప్పబడినా తన అసలు స్థితిని మరవకూడదని దత్తాత్రేయ స్వామి అంటారు.


ఆకాశం విశ్వంలో ప్రతి చోట వ్యాపించి ఉంది. దానికి కనపడని వస్తువూ, విషయమూ లేదు. అలాగే పరమాత్మ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన చూడని విషయమూ, ఆయనకు తెలియని విషయమంటూ లేదు.


ఆకాశం మనకు నీలి రంగులో కనిపించినా, అసలు ఆకాశానికి రంగేలేదు. అలాగే పరమాత్మ ఒక రూపంలో మనకు కనబడ్డా రూపరహితుడు ఆ పరమాత్మ. ఎలాగైతే ఆకాశంలో ఎలాంటి పదార్థం ఉండకుండా పూర్తి ఖాళీగా ఉంటుందో, అలాగే ఒక ఙ్ఞాని తన ప్రవచనాలలో కూడా ఎలాంటి భావాలను ఉంచుకోకూడదని అంటాడు దత్తుడు.


4. నాలుగవ గురువు - 💦జలము:-

ఋషి లేదా ఙ్ఞాని జలము లాంటి వాడు. ఙ్ఞాని నీరుగా స్వచ్ఛమైన మనసు కలవాడు. నీరులాగా కోమలమైన గుణం కలిగి, ఎలాగైతే నీరు సరిగా ప్రవహిస్తున్నప్పుడు మంచి మంచి శబ్దాలు చేస్తుందో అలాగే ఙ్ఞాని కూడా తన నోటి ఎన్నో మంచి మాటల ధారలను ప్రవహింపజేస్తాడు.


ఎలాగైతే నీటిలోని మురికి బట్టలు కాసేపటికి శుభ్రమవుతాయో అలాగే మలినమైన మనస్సు గల మనం మహాత్ముల ( ఙ్ఞానుల ) సాంగత్యం కలగగానే మన మనసులు నిర్మలమవుతాయి. ఎలాగైతే నీరు ఎలాంటి అహం భావము లేకుండా జాతి, కుల, మత బేధాలు లేకుండా అందరి దాహార్తిని తీరుస్తుందో అలాగే ఙ్ఞాని కూడా కుల, మత, జాతి, వర్ణ బేధాలు విడిచిపెట్టి అందరికీ సమానంగా ఙ్ఞానాన్ని పంచాలి. అందుకే ఙ్ఞాని సమత్వ బుద్ధి కలిగి అందరిలో ఙ్ఞాన దీపాలను వెలిగించాలి.



✍️ మురళీ మోహన్

5. ఐదవ గురువు - 🔥అగ్ని:-

అగ్ని సమస్తాన్ని కబళించి ఆహారంగా స్వీకరిస్తుంది. అపవిత్ర పదార్థాలను స్వీకరించినా కానీ తాను మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలాగే మనం కూడా సమస్తమైన ఙ్ఞానాన్ని నేర్చుకోవాలి కానీ మనం అపవిత్రులం కాకూడదు. అగ్ని నుండి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.


ఙ్ఞాని కూడా అగ్నిలా పవిత్రుడు. ఎలాంటి కల్మషమూ లేని వాడు. ఙ్ఞాని అరిషడ్వర్గాలకు అతీతుడు.

6. ఆరవ గురువు - 🌝చంద్రుడు:-

చంద్రుడు కృష్ణ పక్షంలో తన కళలు క్షీణిస్తున్నా చల్లటి వెన్నెల వెలుగును ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఙ్ఞాని కూడా తనకు ఏం జరుగుతున్నా ఇతరులకు మంచి చేసే ప్రయత్నమే చేస్తాడు. మహాత్ములు కూడా గుణంలో చాలా చల్లనివారు.


చంద్రుడు శుక్ల పక్ష, కృష్ణ పక్షాల్లో పెరిగుతూ , క్షీణిస్తున్నా తన అసలు గుణ స్వరూపాలలో మార్పు చెందడు. అలాగే మహాత్ములు కూడా వారు పుట్టినప్పటి నుండి మరణించే వరకు వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వారి యొక్క సహజ గుణంలో, స్వభావంలో మార్పును రానివ్వరు.

7. ఏడవ గురువు - 🌞సూర్యుడు:-

🙏సూర్యుడి ప్రతిబింబం ఎన్ని పదార్థాల్లో కనిపించినా సూర్యుడు మాత్రం ఒక్కడే. అలాగే పరమాత్మ కూడా ఎన్ని రూపాల్లో కనిపించినా పరమాత్మ మాత్రం ఒక్కడే. ఇలా సూర్యుడి నుండి చాలా విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.


సూర్యుడు తన వేడిమితో సముద్రాలలో ఉన్న నీటిని ఆవిరి చేసి వర్షం రూపంలో మళ్ళీ ఆ నీటిని భూమికి చేరేటట్టు చేస్తాడు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో సూర్యుడు ప్రత్యక్షంగా నీటిని అంటడు కదా. అలాగే మహాత్ములు కూడా మన నుండి ప్రాపంచిక పదార్థాలు స్వీకరించినా. వాటిపై మోజు పెంచుకోక మరల వాటిని ఏదో రూపకంగా మనకే ఇచ్చివేస్తారు.

8. ఎనమిదవ గురువు - 🐦పావురం:-

దీనికి సంబంధించిన విచిత్రమైన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో పావురాల జంట నివసిస్తూ ఉండేది. వాటికి కొంత కాలం తరువాత సంతానంగా రెండు పావురాలు జన్నించాయి. శైశవ దశలో ఉన్న ఆ పావురాల కోసమని ప్రతిరోజూ ఈ పావురాల జంట ఆహారం తీసుకొని వచ్చేవి.


అలా ఒకనాడు పిల్లల కోసం ఆహారం తేవడానికి వెళ్ళిన పావురాల జంట తిరిగి వచ్చెసరికి తమ సంతానం వేటగాడి వలలో ఉండడం చూసి చాలా దుఃఖించాయి. ప్రాణప్రదంగా పెంచుకున్న వాటిని వీడి ఉండలేక ఆ పావురాల జంట కూడా అదే వలలో పడి వేటగాడికి ఆహారంగా మారాయి.


మనిషి కూడా ప్రాపంచిక విషయాలపై బాగా ఆసక్తి పెంచుకొని పరమాత్ముని మార్గం నుండి వైక్లబ్యమును పొందుతారు. మోక్ష మార్గాన్ని విడిచి ఐహిక విషయసుఖాలకై ప్రాకులాడతారు. పుత్రులు, మిత్రులు, భార్య , బంధువులే కాకుండా పరమాత్మ అనేవాడు ఒకడున్నాడనే ధ్యాస కూడా ఉండకుండా ప్రాపంచిక సుఖాలలో మునిగితేలుతూంటాడు.అప్పుడు సద్గురువు లేదా ఆ పరమాత్మనే ఆశ్రయించి మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలి.ఆ పావురాల జంట లాగా మనిషి మూర్ఖంగా ప్రవర్తించ కూడదని హితవు పలుకుతాడు దత్తాత్రేయుడు.



9. తొమ్మిదవ గురువు -🐍 కొండచిలువ:-

కొండ చిలువ తనకు ఎదురుగా ఏది వచ్చినా దానిని మింగేస్తుంది. అది మంచిదో, కాదో, చేదుగా ఉందా, తియ్యగా ఉందా అసలు తినవచ్చో, తినకూడదో అని కూడా చూడదు.


అలాగే మనిషి కూడా తన జీవితంలో వచ్చిన సుఖదుఃఖాలు, లాభనష్టాలు లాంటి ద్వంద్వాలు ఎన్ని వచ్చినా చలించక సమానంగా స్వీకరించాలంటాడు దత్తాత్రేయుడు.

10. పదవ గురువు - 🐝తేనెటీగ:-

తేనటీగ పువ్వుల నుండి ప్రతి రోజూ తేనెను సేకరిస్తుంది. కానీ ఈ మొత్తం ప్రక్రియలో అది పువ్వులకు ఎటువంటి హాని కలిగించకుండా తన పని తాను చేసుకుపోతుంది.


అలాగే మహాత్ముడు లేదా ఋషి కూడా ఆన్ని గ్రంథాల నుండి ఙ్ఞానాన్ని సంపాదించాలి. ఇల్లిల్లూ తిరిగి భిక్ష స్వీకరిస్తున్నప్పుడు గృహస్థులను ఇబ్బందులకు గురిచేయకూడదంటాడు దత్తుడు. ఙ్ఞాని తేనెటీగ లాగా పిసినారి వాడై ఉండకూడదు.




11. పదకొండ గురువు - 🐻ఎలుగుబంటి:-

తేనెటీగలు తాము సేకరించిన తేనెను భద్ర వరచుకుంటాయి. కానీ ఆ తేనెని ఎప్పుడు కూడా తినవు, అసలు ఇతరులకు వాడే ప్రయత్నమే చేయవు. అలా దాచిన తేనెని అడవి ఎలుగుబంట్లు తింటాయి.


యోగి అనే వాడు ఎప్పుడూ ఏదీ దాచుకునే ప్రయత్నం చేయకూడదు. తరువాతి క్షణానికి కూడా ఏదీ దాచుకోకూడదంటాడు దత్తుడు. తినడానికి నోరుని, తిన్న అన్నాన్ని భద్రపరచుటకు కడుపును మాత్రం ఉపయోగించాలి.. అలా కాకుంటే వస్తువుల మీద వ్యామోహం పుడుతుందేమో అని దీనిలో అంతరార్థం. యోగి పిసినారి వాడై ఉండకూడదు.


పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోని మనం, పోయే ముందు కూడా ఏమీ తీసుకెళ్ళం. అందుకే వస్తువ్యామోహం వద్దంటాడు దత్తాత్రేయుడు. ఎలాగైతే తేనె లేనిదే తేనెటీగలకు గుర్తింపు లేదో, ఆత్మ లేనిదే శరీరానికి కూడా గుర్తింపు ఉండదు. సమయం వచ్చినప్పుడు ఎలాగైతే ఎలుగుబంటి తేనెని తీసుకెళ్తుందో, అలాగే మరణ కాలం వచ్చినప్పుడు యముడు కూడా మనని తీసుకెళ్తాడు.


అప్పుడు మనతో పాటు మనం ఏమీ తీసుకెళ్ళలేం. చచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువును తీసుకెళ్ళిన మనిషి ఎవడైనా ఉన్నాడా? అందుకే వస్తువ్యామోహం తగ్గించి పరమాత్మ పైన ప్రేమను పెంచుకోవాలంటాడు దత్తాత్రేయుడు.



12. పన్నెండవ గురువు - 🦅రాబందు:-

దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో ఒక రాడందు చనిపోయిన పశుపక్షాదుల శవాలపై ఆధారపడి జీవిస్తూండేది. ఒకనాడు యథా ప్రకారం ఒక పశువు యొక్క శవంలోని మాంసం కొంత తిని, మరికొంత తన నోట కరచుకొని తన గూటిపైపుకు ప్రయాణించ సాగింది.


కానీ అది ప్రయాణిస్తున్న మార్గంలో బాగా ఆకలిగా ఉన్న గ్రద్దలు మాంసపు ముక్కను పట్టుకెళుతున్న ఈ రాబందును చూశాయి. వెంటనే ఆ మాంసపు ముక్క కోసం ఈ రాబందుపై దాడి చేశాయి. ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేక ఆ రాబందు ఆ మాంసపు ముక్కను వదిలేసింది. ఆ గ్రద్దలు ఆ మాంసపు ముక్కపై పడి తమ ఆకలిని తీర్చుకున్నాయి. మాంసపు ముక్క వదిలాక గానీ రాబందు తప్పించుకొని తనను తాను కాపాడుకో గలిగింది.


మనిషి ఎప్పటివరకైతే ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడతాడో అప్పటి వరకు తాను సుఖపడడు సరికదా తన చుట్టూ ఉన్నవారికి కష్టాలు, దుఃఖాలు తెచ్చిపెడతాడు. ఎప్పటివరకైతే ప్రాపంచిక వస్తువుల వెనుక పరిగెత్తుతాడో అప్పటివరకు తాను సుఖపడడు. ఎప్పుడైతే తాను ఆ విషయాలపై వ్యామోహాన్ని వదిలిపెడో అప్పుడే పరమపదాన్ని చేరుకోవడంలో ముందుకు సాగుతాడు.


మనం చూసిన కథలో ఎంతవరకైతే రాబందు తన దగ్గర మాంసం ముక్క ఉంచుకుందో అప్పటివరకు తాను ఆ గద్దల చేత వెంటాడబడింది. కానీ ఆ మాంసపు ముక్కని వదిలిపెట్టిన క్షణాన అది రక్షింపబడింది. అలాగే మనిషి కూడా ఎంతవరకైతే తాను ప్రాపంచిక వస్తువిషయాలపై మక్కువ పెంచుకుంటాడో అప్పటివరకు తాను ఈ భవసాగరంలో మునుగితేలుతూనే ఉంటాడు. కానీ వాటిపై వ్యామోహం వదలగానే అమితమైన ప్రశాంతతను పొంది పరమాత్మను చేరడంలో ముందుకు సాగిపోతాడు.


జీవి తను పరమాత్మను చేరడంలో కూడా పరమాత్మ సాయాన్నే అర్థించాలి. ఆయన కృపలేనిదే ఆయనను చేరడం అసంభవం. భాగవతంలో కుంతీదేవి శ్రీకృష్ణుడితో " పరంధామా! ఈ భవసాగరంలో మునిగితేలుతూ వీటిపై ఆసక్తి పెంచుకున్న మేము నిన్ను ఎలా చేరుకుంటామయ్యా! ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ మనిషి జన్మ ఎత్తలేము. ఎత్తినా నిన్ను చేరటంలో కొంతమాత్రమే ముందుకుపోగలుగుతాం. నిన్ను చేరాలంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి తండ్రి? కాస్త దయ చూపించవయ్యా!! " అని ఆర్తితో వేడుకుంది.


అప్పుడు కృష్ణుడు కుంతీదేవితో " అమ్మా కుంతీదేవి! బాధపడకు. నన్ను చేరటానికి ఎందుకంత శ్రమ? భక్తితో పిలిచే ఒక్క పిలుపు చాలు! నేను మీకు వశుడనైపోతాను. సాధ్వీ! భక్తి ఉంటే నన్ను చేరటంలో నేనే మీకు సహాయపడతాను. వేరే ఏ శక్తి అవసరం లేదు. కేవలం భక్తి ముఖ్యం " అని సెలవిస్తాడు. కానీ మనకు కనీసం ఒక్క క్షణమైనా భక్తితో పరమాత్మపై దృష్టి కేంద్రీకరించడం కష్టతరమైన విషయంగా మారిపోయింది.


మనం రోజూ చదివే స్తోత్రాలవలన దేవుడు మనకు వశుడైపోతాడనుకోవడం కన్నా మూర్ఖత్వం ఉండదు. ఆ స్తోత్రాలు చదివేటప్పుడు భక్తి ఇంకా ఆర్తి ముఖ్యం. అంతేగానీ పొగడ్తలకు లొంగేవాడు పరమాత్ముడెందుకవుతాడు? స్తోత్రం చదివితే చదివిన ఫలం లభిస్తుందేమో గానీ పరమాత్మ లొంగుతాడా? పరమాత్మ లొంగేది కేవలం భక్తికి, ఆర్తికి మరియు మనకు ఆయన మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వలన మాత్రమే.






13. పదమూడవ గురువు -🌊 సముద్రం:-


సముద్రం నిశ్చలంగా ఉంటుంది. కేవలం ప్రకృతి ప్రకోపించినప్పుడు తప్పించి అది సంవత్సరంలో ఎక్కవ సమయం ప్రశాంతంగానే ఉంటుంది. బాగా వర్షాలు పడి నదుల్లోని ఎక్కువగా నీరు చేరినా లేదా కరువు కోరల్లో చిక్కి నదులు ఎండినా సముద్రాల్లో నీరు పెరగదు, తరగదు.


అలాగే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు సంభవించినా కానీ మహాత్ములు చలించరు. ఎందుకంటే వారు ఎప్పుడూ బ్రహ్మానందంలోనే ఉంటారు. అలాంటి నిశ్చలతను అలవరచుకోవాలంటాడు దత్తాత్రేయుడు. అలాగే మహాత్ముల యొక్క ఙ్ఞానాన్ని కూడా పరీక్షించలేము. ఎందుకంటే సముద్రంలో దాగిన ముత్యాలు మనకు చూడగానే కనిపిస్తాయా ? ఓపికతో వెతికితే గానీ కనిపించవు. అలాగే మహాత్ముల సాంగత్యం ఫలం చేత వారి మనఃఙ్ఞానాన్ని మనం తెలుసుకోగలము.🤘

🕉🌞🌏🌙🌟🚩



14. పద్నాలగవ గురువు - 🐞మిణుగురు పురుగు:-

మిణుగురు పురుగు అగ్నిచేత ఆకర్షించబడి దాని చుట్టూనే తిరుగుతూంటుంది. అలా తిరుగుతూ నే అది ఒకానొక క్షణంలో దానిలోనే పడి అగ్నికి ఆహుతైపోతుంది.


అలాగే మూర్ఖుడైన మనిషి కూడా ప్రాపంచిక విషయాలకు మరియు ఐహిక సుఖాలకు లోలుడై పరమాత్మను చేరలేక జననమరణ చక్రాలలో తిరుగాడుతూనే ఉంటాడు. ఎన్నటికీ మోక్షకారకమైన పరమపదాన్ని చేరుకోలేడు.


అందుకే మనిషి కూడా తన కోరిబకలు, వాంఛలు మరియు ఇంద్రియాలపైన నిగ్రహము పెంచుకోవాలి.



15. పదిహేనవ గురువు -🐘 ఏనుగు:-

సాధారణంగా ఏనుగును చాలా విధాలుగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ముందుగా తవ్విన ఒక పెద్ద గొయ్యిని ఆకులతో ఎవరూ గర్తుపట్టకుండా కప్పివేస్తారు. ఆ తరువాత గొయ్యి వెనకాల వైపు చెక్కతో చేసిన ఒక ఆడ ఏనుగును నిల్చోబెడతారు. అటు వెళుతున్న ఏ మగ ఏనుగైనా ఆ ఆడఏనుగు బొమ్మను చూసి ఆకర్షించబడి దాని దగ్గరకు వెళదామనుకొని ముందు గొయ్య ఉందని చూసుకోకుండా దానిలో పడిపోతుంది. ఇలా అంత పెద్ద ఏనుగు కూడా కామ వాంఛ చేత పట్టుపడిపోతుంది.


అలాగే మనిషి కూడా తన కామవాంఛలను అదుపులో ఉంచుకోవాలని చెప్తాడు దత్తుడు. అలా కామవాంఛలను అదుపులో పెట్టకోకపోవటం చేతనే నేటి ప్రపంచంలో ఆడ పిల్లలపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అలా తన వాంఛలను అదుపులో పెట్టుకోలేనివాడు తన బాగుపడడు సరికదా ఇతరులను బాగా బతకనివ్వడు. తరువాత అనేకానేక బాధలను పడతాడు.



16. పదహారవ గురువు -🦌 జింక:-

🙏మంచి సంగీతానికి జింక వశమైపోతుందంటారు. జింకను పట్టుకోవటానికి వేటగాళ్ళు మంచి సంగీతాన్ని వాయించేవారట. ఆ సంగీతము విని మైమరిచి వేటగాడికి సులువుగా దొరుకిపోతుంది.


అందుకని సాధకుడు ఎప్పుడు ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే సాధకుడనే జింక అరిషడ్వర్గాలనే వేటగాడికి చిక్కుతాడు. అలా అయితే భగవన్మార్గము కోసం మళ్ళీ ఎంతో వేచి ఉండాల్సి వస్తుంది. అరిషడ్వర్గాలను జయించాలంటే నిగ్రహం, ఓపిక, భక్తి, ఆర్తి, ప్రేమ మొదలైనవి ముఖ్యంగా పరమాత్మ పైన నమ్మకం అత్యవసరం.



17. పదిహేడవ గురువు -🐟 చేప:-

🤘చేపకు తన మీద తనకు నియంత్రణ లేకపోవటం చేత గాలానికి చిక్కుతుంది. అలాగే చేప తన నివాసమైన నీటిని వదిలి బ్రతకలేదు. అలాగే మనిషికి కూడా తన ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి. లేకుంటే అనేక చిక్కులలో పడిపోతాడు. అలిగే మనిషి కూడా తన నిజ స్థావరాన్ని వదల కూడదు. తన నిజ రూపాన్ని కూడా మరవకూడదు. అలా మరిస్తే తిప్పలు తప్పవంటాడు దత్తాత్రేయుడు.



18. పద్దెనిమిదవ గురువు -🧛‍♀️ వేశ్య:-

🤘దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పింగళ అనే పేరు గల ఒక వేశ్య నివసిస్తు ఉండేది. అమె తన వేశ్యా వృత్తి చేత తన దగ్గరకు వచ్చే గ్రాహకుల కోరికలను తీర్చి వారిని సంతృప్తిపరచేది. అలా చాలా కాలం తరువాత పింగళ తన వేశ్యా వృత్తిని వదిలేసి ప్రశాంతంగా భగవన్మార్గంలో బ్రతుకుదామని నిశ్చయించుకుంది. అనుకున్నట్టే అదే ప్రయత్నం చేసి తన వేశ్యా వృత్తిని వదిలి భగవంతుణ్ణి చేరింది.


తన కోసం తను బ్రతకకుండా ఇతరుల శ్రేయస్సుకై బతికేవాడే మహాత్ముడు. సుఖం కోసం పింగళ, పింగళ ఇచ్చే సుఖముకై గ్రాహకుల ఎదురుచూసేవారు. కానీ పింగళ గ్రాహకులను నిజంగా ప్రేమించదు. గ్రాహకులు పింగళను ప్రేమించరు. కానీ ఇద్దరూ కలవగానే ప్రేమ అనే నాటకాన్ని మొదలుపెడతారు. ప్రపంచం ఇలా ప్రేమ నాటకాలు ఆడేవారు ఎంతమంది లేరు.


పింగళ లాగా మనిషి కూడా తన సుఖాలను త్యాగం చేసినప్పుడే బ్రహ్మంనందాన్ని పొందుతాడు. అసలైన సచ్చిదానంద స్వరూపాన్ని చేరతాడు. అలా అన్ని వదిలినప్పుడే అసలైన ప్రశాంతతను పొందుతాడు. ఇక అప్పుడు ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఉండవు ఎందుకంటే అన్ని తానే అయినవాడిలో తాను లీనమైపోతాడు కాబట్టి ఇక తనకు తను కాకుండా ప్రపంచంలో ఏమి కనిపించదు. ఇదే అద్వైత తత్త్వం.





19. పంతొమ్మిదవ గురువు - 👼 పసిపిల్లవాడు.


పసిపిల్లలు ఎటువంటి కల్మషం లేనివారై శుద్ధమైన, పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు. కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు వారు కాబట్టి భగవంతునితో సమానులు. వారు సాధుస్వభావులు. ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ చూపరు. కానీ నేటి మానవుడు అరిషడ్వర్గాలతో పరిపూర్ణుడు.


మనిషి కూడా ఒక పసిపిల్లవాడిలోని మంచి గుణాలును తెలుసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. మన మనస్సు గ్లాసు వంటిది. ఒకవేళ దానిలో మట్టి చేరిన తరువాత దానిలో పాలు పోసినా, నీరు పోసినా లేదా అమృతం పోసినా వ్యర్థమే. అలాగే మన మనస్సు కూడా కల్మషం లేకుండా ఉండాలి. లేకుంటే దానిలో ఎంత ఙ్ఞాన ప్రవాహం జరిగినా వృథాయే. అలా మనస్సుని సాధ్యమైనంత వరకు ఎలాంటి కల్మషముల చేత పాడు కాకుండా చూసుకోవాలి.


ఐహిక విషయాలపై మక్కువ పెంచుకున్నవాడికి ఎంత చెప్పినా వాడికి ఙ్ఞానం అంటదు. ఎందుకంటే వాడికి శ్రద్ధ లేదు కదా. ' శ్రద్ధావాన్ లభతే ఙ్ఞానం ' అంటుంది భగవద్గీత. ఒకవేళ అలా కల్మషమయమైనా దానిని సద్గురువైన భగవంతుడినే ఆశ్రయించి బాగుచేయాలంటాడు దత్తాత్రేయుడు. అందుకే మనిషికి భక్తి అనేది చాలా ముఖ్యం.



20. ఇరవైయవ గురువు -🧏‍♀️ కన్య:-

దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఉండేది. ఒకసారి కొంతమంది వారి ఇంటికి ఆతిథులు రావలసి వచ్చింది. కానీ ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులకై వెళ్ళారు. అతిథుల కోసం అన్నం వండుదామని బియ్యాన్ని చెరగడం మొదలుపెట్టింది.


కానీ అలా చేసేటప్పుడు తన గాజులు బాగా చప్పుడు చేయటం మొదలుపెట్టాయి. కానీ అతిథులకు ఆ శబ్దం వలన ఇబ్బందిగా ఉంటుందేమో అని ఒక్కొక్కటిగా తన గాజులు తీసివేయటం మొదలుపెట్టింది. చివరికి ఒక్కో చేతికి కేవలం ఒకే గాజు మిగిలాయి. అలా మళ్ళీ చెరగడం మొదలు పెట్టాక శబ్దం రావటం ఆగిపోయాయి.


ఆ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, సాధన అనేది ఏకాంతంగా సాగాలి. అప్పుడే మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. అనేక తత్త్వాలు లేదా వాదనలు ఓకే చోట ఉండలేవు. చాలా రకాల తత్త్వాలు భోధించే మహాపురుషులు ఒకేచోట ఉండలేరు. వారి భావనలను తప్పని మనం అనలేం. ఎందుకంటే భగవంతుని చేరుటకై అనేకానక మార్గాలున్నాయి. అందుకే మహాత్ములు కేవలం ఏకాంతానికే ప్రాముఖ్యం ఇస్తారు.


మనం ఈ భవబంధాలను కూడా బాగా వంట బట్టిచ్చుకొని వాటి కోసమే పరితపించకూడదు అంటాడు దత్తాత్రేయుడు. వాటికే అత్తుక్కొని ఉండకూడదు. వాటిని పుస్తకాలకు వేసే అట్టలలాగా మాత్రమే ఉంచి తరువాత సమయం వచ్చినప్పుడు వదిలేయాలి. కానీ అలా కాకుండా మనం మాత్రమే వాటినే శాశ్వతం అనుకొని వాటికై పరితపిస్తాము.



21. ఇరవైఒకటవ గురువు -🐍 పాము:-

పాము ఎప్పుడూ ఏకాంతంగా ఇతర జంతువుల సహవాసం కోరదు. తన జీవితంలో ఎక్కువ భాగం ఏకాంతంగానే గడుపుతుంది. అలాగే మహాత్ములకు, ముముక్షువులకు ఏకాంతం అవసరం. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు ఉదాహరణలో కూడా చూశాం.


పాము ప్రతిసారీ తన కుబుసమును అంటే పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని ధరిస్తుంది. అలాగే ఆత్మ కూడా తన జననమరణ చక్రంలో ఎన్నో శరీరాలను ధరించి వదిలేస్తు ఉంటుంది. శరీరానికే మరణం కానీ ఆత్మకు కాదు. కానీ మనం మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోక ఈ శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తాం.


చివరికి మరణ సమయంలో కూడా మనం ఈ శరీరాన్ని వదలడానికి ప్రయత్నం చేయము. యమభటుల ప్రయాస వలన కానీ మన ఆత్మ శరీరం నుండి వడివడదు. ఈ విషయం మనకు భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. అందుకే ఙ్ఞాని ఎప్పుడు మరణం గురించి భయపడడు. ఈ జననమరణ చక్రం నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తూంటాడు.



22. ఇరవై రెండవ గురువు -🤠 లోహపు పనివాడు :-

🤘తన పని చేస్తున్నప్పుడు లోహపు పనివాడు ఎంత శ్రద్ధతో చేస్తాడో అంత బాగా తయారవుతాయి పనిముట్లు. ఒక పనిముట్టును అద్భుతంగా తీర్చిదిద్దాలంటే ఆ పని మీద పట్టు, చేయాలనే ఆసక్తి ఉండాలి. లేకుంటే ఆ పని ఎంత చేసినా లాభం ఉండదు. అలాగే మనిషి కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, అమితాసక్తితో చేయాలి. పూజ కూడా ఏదో తంతుగా, తూతూ మంత్రంగా చేస్తారు చాలా మంది. కానీ అలా చేస్తే ఫలితం ఉంటుందా అనేది మనం ఆలోచించాలి.


పూజను ఒక ప్రక్రియగా భావిస్తారే తప్ప దాని మీద ప్రేమతో చేయరు. పూజ చేసేటప్పుడు కూడా శ్రద్ధాలోపం చాలా చూస్తూంటాం. ఎలాగంటే వారు పూజలో చదివేదొకటి చేసేదొకటి. ఉదాహరణకు శ్రద్ధలేని ఓ వ్యక్తి పూజలో ఉన్నప్పుడు పుష్పం సమర్పయామి అని అంటూనే ఒక పండును ప్రసాదంగా పెట్టాడట. ఒక్క పూజ అనే కాదు ఎన్నో పనుల్లో చాలా మంది ఇలాగే చేస్తారు.


మనసు ఒకటి ఆలోచిస్తుంది చేతలు ( చేసే పని ) మాత్రం వేరేగా ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఏ పనిచేసినా శ్రద్ధ, ఆసక్తి, శ్రమ అనేది ముఖ్యమంటాడు దత్తాత్రేయుడు.


23. ఇరవై మూడవ గురువు -🕷️ సాలెపురుగు:-

👉 సాలెపురుగు తన గూడు ఎంతో అందంగా మరియు ఎంతో నైపుణ్యంతో నిర్మిస్తుంది. దాన్ని కట్టడానికి ఎంతగానో శ్రమిస్తుంది. అలా నిర్మించాక ఆ సాలీడులో చాలా కాలం నివసించి తరువాత అవే సాలెపురుగులు తమ సాలీడును తామే తినేస్తాయి.


భగవంతుడు కూడా అంతే, ఈ మాయా సృష్టిని తానే నిర్మించి, ఆ సృష్టితో ఆటలాడి కొంత కాలం తరువాత మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు. కానీ మనం మాత్రం ఈ సృష్టే నిజమనుకుని భ్రమిస్తూంటాం. కాని ఇదంతా అసత్యమే కేవలం సచ్చిదానంద బ్రహ్మము మాత్రమే సత్యమంటాడు దత్తాత్రేయుడు.


24. ఇరవైనాలుగవ గురువు - 🐛 గొంగళి పురుగు:-

👉గొంగళి పురుగు చిన్నగా ఉన్నప్పుడు దానిని పట్టుకున్న కందిరీగ దానిని తన గూటిలో దాచుకుని దానిని బంధించి దాన్ని కుడుతుంది. ఆ తరువాత దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు తిరుగుతుందో అర్థం కాక భయపడిన గొంగళి పురుగు కాసేపటికి తనను తాను కందిరీగగా భావించుకుంటుంది. ఆ గొంగళి పురుగు కూడా తరువాత క్రమంగా అలా అలా తను కూడా కందిరీగగా మారిపోతుంది.


ఎవరైనా పదే పదే ఒకరి గురించి ఆలోచిస్తూ, ఎప్పుడు వారి గుర్తులే మనసులో ఉంచుకొని పదే పదే వారిని స్మరిస్తుంటారో అలాంటి వారు కొన్నాళ్ళకి వారు ఎవరినైతే ఊహించుకుంటారో, తాము వారు ఒకటేనని భావిస్తారు. ఇలాంటి సంఘటనలు మనం చూసేవుంటాం. అలాగే సాధకుడు కూడా ఎప్పుడూ పరమాత్మను గురించి ఆలోచిస్తే తన పరమాత్మలో లీనమౌతాడు. అందుకే మనిషనే వాడు మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలంటారు దత్తాత్రేయులు.🙏

🕉🌞🌏🌙🌟🚩

🙏

Source - Whatsapp Message

దేశ సేవ

🍁దేశ సేవ🍁

✍️ మురళీ మోహన్

👌శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలని కోరిక, వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 'స్వయంగా సంపాదించే మార్గం చూసుకో! నాతో పొలం పనులకు రా!' అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి.. అయితే శౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి! స్వార్థం మానుకోవాలి! అనేవాడు. కొందరు ఊరి పెద్దలు 'ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థంకావు'. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో! అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది! అన్నారు.

శౌరి రాజధానికి వెళ్ళాడు. ఉద్యానవనంలో రాజు గారిని కలిశాడు. దేశసేవ చేయడానికి ఊరువదిలి వచ్చాను! అన్నాడు. తన గురించి అంతా చెప్పాడు. రాజు శౌరిని అభినందించాడు. కొన్నాళ్ళు నా అతిధిగా వుండు! అన్నాడు. మర్నాడు శౌరి సత్రం ఖాళీ చేశాడు. రాజుగారు వాడిని విడిదికి తీసుకువెళ్ళాడు. అది చాలా విశాలమైన భవంతి. ఇంటినిండా సేవకులు వాళ్ళు ముందుగదిని అలంకరిస్తున్నారు. 'ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో!' నేను నాలుగు రోజులలో వస్తాను! అని వెళ్ళిపోయాడు రాజు. లోపలి గదిలోకి అడుగుపెట్టి, నిర్ఘాంతపోయాడు శౌరి, లోపల ఇరవై గదులు వున్నాయి. అన్నీ బూజు పట్టి ఉన్నాయి. పైగా గబ్బిలాల కంపు! పరదాలు చిరిగి తలుపులు విరిగి, గచ్చులు పగిలి వుంది! పెరడంతా పిచ్చిమొక్కలు! శౌరి పనివాళ్లతో 'లోపలి గదులు శుభ్రం చేయండి!' అన్నాడు. నాలుగు రోజులలో మొత్తం భవంతి శుభ్రపడింది. కొత్తపరదాలు కిటికీలు అమిరాయి పెరడు శుభ్రపడింది. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు నాటబడ్డాయి. ఆరోజు రాజుగారు శౌరి ని చూడవచ్చారు. ఆయన భవంతిని చూసి, 'అద్భుతంగా వుంది! భవంతి స్వరూపమే మారిపోయింది!' అంటూ శౌరిని మెచ్చుకున్నాడు. 'వీళ్ళు ఇరవై గదులను పాడుపెట్టారు ముందుగదినే అలంకరిస్తూ కూర్చున్నారు ముందుగది ఎంత అందగా వున్నా ఏం లాభం! ఇల్లంతా భూతాలకొంపలా ఉన్నప్పుడు' అన్నాడు శౌరి.

నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను, దేశం అంటే రాజధాని నగరం మాత్రం కాదు! ముందుగదిని అలంకరించినట్లుగా రాజధానినే అభివృద్దిపరచుకుని ప్రయోజనం లేదు. నువ్వు అన్ని గదులు బాగుపరిచావు. అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి! అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు. శౌరి శ్రద్దగా ఆయన మాటలు వింటున్నాడు. రాజుగారు మళ్ళీ నోరు విప్పారు. ప్రతివాళ్ళు తమ ఇంటిని, ఊరుని బాగు చేసుకోవాలి! అదే నిజమైన దేశసేవ! అందుకు రాజధానికి రావలసిన పనిలేదు! అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోకి తీసుకురండి. చదువురాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి. పూడికలు తీయండి! రహదారులు బాగు చేయండి! రోడ్లు వెంట చెట్లు నాటండి. శ్రమ దానానికి మించిన దేశసేవ లేదు. దేశసేవ పేరుకోసం కాదు. దేశం కోసం చేయాలి! అన్నారు. శౌరి కళ్ళముందు తెరలు తొలగి పోయాయి. ఈ రోజే మా ఊరికి వెళతాను ఉపన్యాసాలు మాని నడుంకట్టి పని చేస్తాను. అప్పుడు మానాన్న సంతోషిస్తాడు. మా ఊరు, వాడా బాగుపడుతుంది. అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు శౌరి.

Source - Whatsapp Message

అడుగుల వెనక ‘రహస్యం’

👫 అడుగుల వెనక ‘రహస్యం’👫

✍️ మురళీ మోహన్

🤘ఇద్దరు వ్యక్తుల్ని..రెండు కుటుంబాల్ని ఒక్కటి చేసేదే పెళ్లి. హిందూ సంప్రదాయంలో పెళ్లి సమయంలో జరిగే పలు క్రతువులకు ప్రత్యేకమైన అర్ధాలు..పరమార్ధాలు ఉన్నాయి.

వివాహకార్యక్రమం అయిన తరువాత వధూవరుల కొంగులు ముడివేసి ..వధువు చిటికెన వేలును వరుడు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేస్తారు. దీనినే సప్తపది అంటారు ..

ఈ ఏడు అడుగులు వేయించడం వెనుక ఆంతర్యం ఏంటంటే….?

"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు".. మొదటి అడుగుతో ఇద్దరిని ఒక్కటి చేయమని …

"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు" రెండవ అడుగుతో ఇద్దరికీ శక్తిని ప్రసాదించమని..

“త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు" మూడవ అడుగుతో వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించమని..

"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు" నాల్గవ అడుగుతో ఆనందం ప్రసాదించమని..

"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు" ఐదవ అడుగుతో పశుసంపద కలిగించమని..

"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు " ఆరవ అడుగుతో ఆరు రుతువులు సుఖములు ఇవ్వమని..

"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు" ఏడవ అడుగుతో విష్ణువు గృహస్థాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమివ్వమని..
వధూవరులు అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేసి విష్ణువును ప్రార్ధిస్తారు.🙏

Source - Whatsapp Message

నిత్యయుక్తులు అంటే ఉదాహరణ సహితంగా ?

🍁నిత్యయుక్తులు అంటే ఉదాహరణ సహితంగా ?🍁

🤘 మురళీ మోహన్

🙏నిత్యయుక్తా :- ఎప్పుడో రోజులో కొద్దిసేపో, వారానికి ఒకరోజో కాదు. నిత్యము, నిరంతరము భగవంతుని యందే ఉండాలి. రోజూ ఒక గంటో - రెండు గంటలో డ్యూటీ లాగా భగవంతుని స్మరిస్తే అది నిజమైన భక్తికాదు. నిజమైన ఉపాసన కాదు.
పూజ చేసేటప్పుడో, భజన చేసేటప్పుడో, జపధ్యానాలు చేసేటప్పుడో, దేవాలయంలో కూర్చున్నప్పుడో, లేదా ఇలా సత్సంగాలలో పాల్గొన్నప్పుడో భగవంతుని యందు మనస్సు పెట్టి మిగిలిన సమయాలలో ఇక భగవంతుని స్మరణయే లేకుండా ఉంటే అది నిత్యభక్తి కాదు, అతడు నిత్యయుక్తుడు కాదు. సర్వకాల సర్వావస్థలలోను భగవత్ స్మరణను విడిచిపెట్టరాదు. నిజంగా భగవంతుడెప్పుడూ మనను విడిచి ఉండటం లేదు. మనం కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోయినా, బస్సులో ఉన్నా, విమానంలో ఉన్నా, ఏం చేస్తున్నా చివరకు చనిపోయినా సరే ఆయన మనలోనే స్థిరంగా ఉన్నాడు. కాని మనమే ఈ ప్రాపంచిక విషయాలకోసమో, భోగాల కోసమో ఆయనను విడిచిపెడుతున్నాం. అలా ఉండకూడదని భగవానుని ఉపదేశం.
పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్నన్, అశ్నన్, గచ్ఛన్, స్వపన్, శ్వసన్ - కంటూ, వింటూ, తింటూ, తిరుగుతూ, తెస్తూ, ఇస్తూ, లేస్తూ, కూర్చుంటూ సర్వకాల సర్వావస్థలలోను చిత్తం భగవదాయత్తమై ఉండాలి. అంతటా ఆ భగవంతునే చూస్తూ, నిరంతరమూ ఆ భగవంతుని చింతించటమే నిత్యయుక్తః అంటే. అట్టి భక్తుడే శ్రేష్టతముడు అని భగవానుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు.
తేనెటీగ పుష్పాలలోని మకరందాన్ని పీల్చుకుంటుంది. ఈగ కొద్దిసేపు బెల్లం మీద వాలుతుంది. కొద్దిసేపు పెంటకుప్పల మీద వాలుతుంది. పేడపురుగు ఎప్పుడూ పెంటకుప్పలలోనే ఉంటుంది. ఒకవేళ దానిని తెచ్చి పుష్పాలలో వేస్తే చచ్చి ఊరుకుంటుంది. మనం తేనెటీగలాగా ఎల్లప్పుడూ భగవంతునిలోనే చరించాలి. ఈగలాగా కొద్దిసేపు భగవంతునిపైన, కొద్దిసేపు ప్రపంచవిషయాల మీద వ్రాలకూడదు.
నిరంతరము శ్రీకృష్ణుని యందే మనస్సు నిల్పిన గోపికలు నిత్యయుక్తులు. శ్రేష్టభక్తులు. ఒక్క క్షణం కూడా శ్రీకృష్ణుని స్మరించకుండా ఉండలేరు. తమ తిండితిప్పలు మరచిపోతారే గాని శ్రీకృష్ణుని మాత్రం మరచిపోరు. రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా నిత్యము, నిరంతరము శ్రీకృష్ణ సందర్శనాభిలాషులై తపించిపోతూ ఉంటారు. ఆయన కనిపించకపోతే వారికి నిముషమొక యుగంలా ఉంటుంది.
ఒక గోపికకు కృష్ణుని చూడాలనే తపన అధికమైంది. పెద్దల చాటున ఉండవలసిన ఆ గోపిక, స్వతంత్రించి కృష్ణ దర్శనానికి పోయే అవకాశం లేక తపనపడి పోతున్నది. ఎలాగో మనసు బిగబట్టుకొని సాయంకాలం వరకు వేచి ఉన్నది. సాయంత్రం గోధూళి వేళ అయింది. గోవులను తోలుకుంటూ కన్నయ్య వస్తున్నాడు. ఆ గోధూళిలో మసకమసకగా అప్పుడప్పుడు కనిపించి కనుమరుగై పోతున్నాడు కన్నయ్య. అతడిని దర్శించాలంటే నందుని ఇంటికి పోవాలి. ఇదే సరైన సమయం. ప్రమిద - వత్తి తీసుకొని ముట్టించుకొని వచ్చేందుకని నందుని ఇంటికి బయలుదేరింది. నందుని ఇంట ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ ఊరి వారంతా సంధ్యవేళ అక్కడికి వెళ్ళి దీపం ముట్టించుకొని వస్తుంటారు. ఆ గోపిక అలాగే నందుని ఇంట ప్రవేశించి దీపం గూటి వద్దకు వెళ్ళింది. దీప దర్శనంతో పాటు దివ్యమంగళ విగ్రహం ఆ శ్రీకృష్ణుని కన్నులారా దర్శించింది. నందుని ఇంటిలో ఆ సజీవ దీపాన్ని చూస్తూ ఈ నిర్జీవ దీపాన్ని మరచింది. దీపం వద్ద వత్తిని పెట్టి వెలిగించాలనుకున్నది. కాని ఆమె పరధ్యానంతో - శ్రీకృష్ణ ధ్యానంతో తనవ్రేలును పెట్టింది. అగ్నికి దయ ఎక్కడుంటుంది? వ్రేలు కాలిపోతున్నది. ఆ సమయంలో ఆమె దేహాన్నే కాదు, ప్రపంచాన్నే మరచింది. ఆమె మనస్సు మనస్సులో లేదు, ఆమెలో లేదు, ప్రపంచంలో కూడా లేదు. భక్తితో కరిగిపోయిన ఆమె మనస్సు భగవంతునిలో లీనమై పోయింది. ఇది చూస్తున్న యశోద ఒక్క పరుగున వచ్చి ఏమిటమ్మా! ఇది? నిద్రపోతున్నావా? రాత్రి నిద్రపోకుండా మేలుకొని ఉన్నావా? అని ఆమెను కదిపి మందలించింది. అప్పుడు కదిలింది ఆమె మనస్సు. ఆమెకు కాలం తెలియలేదు. వ్రేలు కాలటం తెలియలేదు. బాధ తెలియటం లేదు. తన కృష్ణ సందర్శన కుతూహలం నెరవేరింది. ఇలా గోపికలు నిరంతరం కృష్ణస్మరణలో తరించారు.🙏

Source - Whatsapp Message

త్రికరణాలు

🔴 త్రికరణాలు🔴

✍️ మురళీ మోహన్

🙏మనలో చాలామంది, ఆధ్యాత్మిక సాధన చేయాలని తపిస్తారే తప్ప- అందుకు కావలసిన, ఉండవలసిన సులువులు, మెలకువలు పట్టించుకోరు. చాలావరకు... తెలియదు కూడా. ప్రాథమికంగానే, పునాది దశలోనే తెలుసుకోవలసిన, అనుసరించవలసిన సూత్రాలను విస్మరిస్తూ ఉంటారు. అవి సాధారణంగానే కనిపిస్తున్నా మన ఆధ్యాత్మిక ప్రగతికి అసాధారణంగా దోహదపడతాయి. కొన్నిసార్లు పురోగతికి అవే ప్రథమ ప్రాధాన్యమూ కావచ్చు. అలాంటివాటిలో త్రికరణాలను ఏకీకరణం చేయడం ఒకటి.

ఇది సాధారణమైన సాధన కాదు. అత్యంత ప్రముఖమైన, అత్యవసరమైన సాధన. సాధనలో మనకు ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రత అంటే మనసును పరిపరి విధాల పోనివ్వని, ధ్యేయంవైపు మాత్రమే నడిపించే అత్యంత జాగరూకత. అన్ని కరణాలను ఏకోన్ముఖం, ఏకీకృతం చేసే కీలక వ్యవహారం. సూర్య కిరణాలను ఏక కోణంలోకి మళ్లిస్తే ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. అదే విధంగా మనలోని సర్వ కర్మేంద్రియాల వ్యవహారాన్ని నిలుపుదల చేసి, సర్వ జ్ఞానేంద్రియాల వ్యాపారాన్ని ఆపేసి, మనోదృష్టిని మాత్రం ధ్యేయపరం చేసి, నిశ్చలమైన బాహ్యాంతఃకరణాలను కాలాతీత క్రియలో నిలిపిఉంచడమే- ఏకాగ్రత ధ్యానం, ధ్యేయం.

త్రికరణాలు అంటే- మనో వాక్కాయకర్మలు. మనసు, వాక్కు, చేసే కర్మ. ఒక బండికి ఎన్ని ఎద్దులు కట్టినా, ఎన్ని పగ్గాలు బిగించినా అన్నీ ఒకవైపు, ఒకే వైపు లాగితే బండి బరువుకు అతీతంగా ఆ వైపే పయనిస్తుంది. మూడు పగ్గాలతో మూడు వైపులా లాగితే బండి ఒక్క అంగుళం కదలకపోగా, విచ్ఛిన్నమయ్యే ప్రమాదమూ ఉంది. మనం ఒక విషయాన్ని గురించి మనసులో ఒకరకంగా ఆలోచించి, వాక్కుతో మరోరకంగా చెప్పి లేదా మాట్లాడి, శరీరంతో మరోరకంగా చేస్తే ఆ విషయంమీద మనకు పట్టు ఉండదు. అంటే సత్యాన్ని మనం మూడు రకాలుగా విభజించామన్న మాట. అలాంటప్పుడు ఆ విషయంమీద మనకు, మనసుకు అధికారం ఉండదు. తగిన విధంగా మలచుకునే అవకాశం ఉండదు. ఏకీకృతం కాని త్రికరణాలను (మనసు, శరీరం, వాక్కు) సమన్వయం చేయడం ఎంతో శ్రమ అయిపోతుంది. ఏకాగ్రం చేయవలసిన మనసును మనంగా మూడు రకాలుగా చీల్చవలసిన అగత్యం ఏర్పడుతుంది. ఎందుకంటే వాక్కునైనా, దేహాన్నయినా అదుపు చేయవలసింది, ఆడించవలసింది మళ్ళీ మనసే. ఈ చాంచల్యం, ఈ పని విభజన మనసును చిరాకుపరుస్తాయి. మన ధ్యేయం మనసును ప్రశాంతంగా ఉంచడం. మరోదారి లేకుండా చేసి ఏకోన్ముఖం చేయడం మనసులోని అంశాన్నే కాయం చేస్తే దాని గురించే వాక్కు మాట్లాడితే (వెల్లడిస్తే) మనసుకు విచలితం అయ్యే బాధ తప్పుతుంది. దానికి ఈ చిందులు వేసే బాధలనుంచి, రంగులు మార్చే బాధ్యతల నుంచి విముక్తి కలిగిస్తే ప్రశాంతంగా స్థిమితపడి ధ్యానంవైపు మళ్లుతుంది. శ్వాసను అనుసరించమని ఆ వైపు మళ్లిస్తే బుద్ధిగా మళ్లుతుంది.

సహజంగానే ఎంతో చంచలమైన మనసుకు మళ్ళీ మనమే మూడు దారులు చూపి మూడురకాల కుప్పిగంతులు వేయించడం తగదు. అత్యంత బలీయమైన మనసును మనమే ఇలా బలహీనపరచడం మన ధ్యేయానికే గొడ్డలిపెట్టు. నిజానికి ప్రారంభ సాధకులకు చాలామందికి ఈ సులువు సూత్రం తెలియదు. సాధనకు అత్యంత కీలకమైన ఈ అంశాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా సాధనలో ముందుకు వెళ్తాం. ఈ సూత్రం ఆధ్యాత్మిక సాధనకో, ఏకాగ్రతకో మాత్రమే కాదు- సాధారణ జీవన వ్యాపారంలోనూ త్రికరణాల ఏకీకరణను ఒక ఉన్నతస్థాయి సంస్కారంగా పరిగణిస్తారు. ఏ కార్యసాధనకైనా అది ఉత్తమ ఉపకరణంగా ఉపయోగపడుతుంది.👍

Source - Whatsapp Message

ఆ బాలుడే తరువాతి కాలంలో చాణక్యుడిగా ప్రసిద్ధి పొందాడు.

👌ఒక చిన్న బాలుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ బాలుడు అన్ని విషయాలలో చాలా చురుకుగా, తెలివిగా మరియు చూడడానికి అందంగా ఉండేవాడు. ఆ బాలుని తల్లి ఎప్పుడూ విచారంగా ఉండేది.

ఒకరోజు ఆ బాలుడు తల్లిని , ఎందుకమ్మా ఎప్పుడూ విచారంగా ఉంటావు? అని అడిగాడు. దానికి ఆమె ” ఒక జ్యోతిష్కుడు నీకు ఉన్న ప్రత్యేకమైన పలువరుస (పళ్ళు) కారణంగా నీకు చాలా కీర్తి, ప్రతిష్టలు వస్తాయి అని చెప్పాడు” అని చెప్పింది. దానికి ఆ బాలుడు అందులో విచారించవలసినది ఏముంది? నాకు కీర్తి రావడం నీకు ఇష్టం లేదా? అని అడిగాడు. బాబూ; ఏ తల్లి తన కొడుకు గొప్పవాడు కావాలని కోరుకోదు? నాకు ఇష్టమే, కాని నీకు వచ్చే కీర్తి,ప్రతిష్టల కారణంగా నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతావేమో అని భయంగా ఉంది,అని చెప్పింది.

అదివిన్న బాలుడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొంతసేపటి తరువాత ఇంటి నుండి బయటకు వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకుని తన పలువరుస(పళ్ళు) ఊడిపోయేలా కొట్టుకోసాగాడు. అతని నోటి నుండి రక్తం కారసాగింది.

ఇంటినుండి బయటకు వచ్చిన ఆ తల్లి అది చూసి ఆశ్చర్యంతో, బాధతో ఎందుకలా కొట్టుకుంటున్నావని ఆ బాలుని అడిగింది. అప్పుడు ఆ బాలుడు ఈ పలువరుస(పళ్ళు) కారణంగా నేను నీకు దూరమౌతానంటే, అలాంటి పలువరుస(పళ్ళు) నాకు వద్దమ్మా, నేను నీకు సేవ చేస్తూ నీ ఆశీస్సుల వల్ల మాత్రమే జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు.
ఆ బాలుడే తరువాతి కాలంలో చాణక్యుడిగా ప్రసిద్ధి పొందాడు.🙏

Source - Whatsapp Message