Sunday, December 6, 2020

మంచిమాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు పూజ్య గురుదేవులు మహర్షి ,శంకరాచార్యులు వారు గురు దత్తాత్రేయ స్వామి వారు రాఘవేంద్ర స్వామి వారు షిర్డీ సాయినాథుడు వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలను కోరుకుంటూ సేవలోనే అర్థం పరమార్థం ఉన్నది ,మీకు లభించిన జీవితాన్ని కొంచెం ఇతరుల కోసం ఉపయోగపడేలా చూడాలని కోరుకుంటూ ...మీ AVB సుబ్బారావు 🕉️🌹🌸🛕💐🙏
గురువారం --: 05-11-2020 :--
నేటి AVB మంచిమాటలు
జననానికీ , మరణానికి ఒక టైం ఉన్నట్లే , మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది . అది రానిదే ఎంత ఆరాటపడిన ప్రయోజనం ఉండదు

మిత్రమా మనకు గౌరవం వచ్చాక మన గతం మరువకూడదు , మన అవసరం తీరాక మనకు సాయం చేసిన వ్యక్తిని మరువకుడదు .

నేను తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు బంధానికి విలువ ఇస్తున్నానని అర్థం తప్పు చేయకుండా తలవంచను నమ్మకం లేని చోట వాదించను . నమ్మకమైనా గౌరవమైనా ప్రాణమైనా ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు బతకటం గొప్ప కాదు నిజాయితీగా బతకడం గొప్ప .

అబద్ధాలు చెప్తే ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి పది మందికి నువు కరెక్ట్ అనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజొకటివస్తుంది ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాదిమందిలో నువు దోషిగా నిలబడాల్సిందే .

గొప్పతనం అంటే ఏదో సాధించడం , సంపాదించడం కాదు మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బతకగలిగితే మనము కూడా గొప్పోళ్ళమే

సేకరణ ✒️ మీ ...AVB సుబ్బారావు 9985255805*🌸🌹💐🛕🌷🕉️🤝

Source - Whatsapp Message

No comments:

Post a Comment