Sunday, December 6, 2020

మoచి మాటలు

ఆదివారం --: 08-11-2020 :-- ఈరోజు మoచి మాటలు ..
ఆదివారం రోజు సూర్య భగవానుడిని ప్రార్థిస్తే ఎంతో శుభం

ఒకరు నీకు విలువిచ్చి నిన్ను ప్రతి రోజూ పలుకరిస్తున్నారంటే అర్థం వాళ్ళ చుట్టూ ఎంత మంది ఉన్నా వారి మనసు లో నీ స్థానం చాలా ప్రత్యేకమైనదని అర్థం .

జీవితంలో ఏవి నీ వెనుక రావు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్పా మనం సంపాదించినది ఏది మనది కాదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప .

మన చుట్టూ ఎంత మంది ఉన్నా సరే మన ఆలోచనలు మాత్రం మనకు ఇష్టమైన వారి చుట్టూ తిరుగుతుంటాయి ఎందుకంటే వాళ్ళ స్థానం మన మనసులో కాబట్టి .

నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది , సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది , మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది .

ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు , అందుకే ఒకమాట అనేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి .

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 9985255805

Source - Whatsapp Message

No comments:

Post a Comment