Tuesday, February 16, 2021

ఋభుగీత

ఓం నమః శివాయ:
"ఋభుగీత " (253)
🕉🌞🌎🌙🌟🚩

సర్వప్రపంచ హేయత్వము"
18వ అధ్యాయము

పరమశాంతిని గుర్తించిన తర్వాత దేహము కూడా అనంతాత్మేనని అర్ధం అవుతుంది !

భూత, భవిష్యత్తులు అనేవి నిజంగా నిలిచి ఉండే విషయాలుకావు. మనసును వర్తమానంలో ఉంచి జీవించడం అలవర్చుకుంటే మనం చిన్మయ స్వరూపులుగానే ఉంటాం. అప్పుడు దేహపరమైన చావు, పుట్టుకలు చాలా అల్పమైన విషయాలుగా అనిపిస్తాయి. ఆత్మ అంటే అనుభవంలో ఉన్న శాంతి, ఆనందం. మనసులోని పరమశాంతిని గుర్తించిన తర్వాత దేహము కూడా అనంతాత్మేనని అర్ధం అవుతుంది. వినపడే మాటలు ఇంద్రియపరమైన అనుభవాలు అన్నీ అసత్యాలే అని..! అంటే శాశ్వతమైనవి కావు అని అర్థం అవుతుంది. అప్పుడు జీవనంలో అనవసరమైన అనుభవాలకు, అనుభూతులకు విలువ తగ్గి మనసు సంకల్పరహితంగా ప్రకాశిస్తుంది !

🕉🌞🌎🌙🌟🚩

"ఋభుగీత "(254)
🕉🌞🌎🌙🌟🚩

సర్వప్రపంచ హేయత్వము"
18వ అధ్యాయము

మన సంతోష దుఃఖాలే మన ప్రపంచంగా మారుతుంది !

ఈప్రపంచానికి వెలుగునిచ్చే జ్యోతి ఏదైతే ఉందో ఆజ్యోతికి మూలమైన ఆత్మజ్యోతి మనమేనని తెలుసుకోవాలి. అప్పుడు నిర్గుణమైన, నిరామయమైన, సృష్టికర్త అయిన, సృష్టిభర్త అయిన దైవం మనమేనని స్పష్టమౌతుంది. సృష్టికర్త అంటే భావస్వరూపమైన ఈ ప్రపంచాన్ని మనమే సృష్టిస్తున్నామని భావం. అందుకు కారణమైన మనసును మనమే సృష్టించుకుంటున్నామని అర్ధం. అందులోని బాధలు, సంతోషాలు మనమే సృష్టించుకుంటున్నామని సుస్పష్టం. మన సంతోష దుఃఖాలే మన ప్రపంచంగా మారుతుంది !

🕉🌞🌎🌙🌟🚩

"ఋభుగీత "(257)
🕉🌞🌎🌙🌟🚩

సర్వప్రపంచ హేయత్వము"
18వ అధ్యాయము

ప్రతి పనిని సక్రమంగా శ్రద్ధగా చేయడమే ఆచారం ఉద్దేశ్యం !

ఆచారం అంటే చరించే మార్గం. మనం ఆచరించేదే ఆచారం అవుతుంది. సత్యం తెలిసిన వ్యక్తి ప్రతి పనిలోనూ సదాచారమే ఉన్నప్పుడు ఇక ప్రత్యేకంగా ఆచార వ్యవహారాల ప్రస్తావన లేకుండానే కార్యకలాపాలు సాగుతాయి. ఆచరించడం అంటే సరిగా చరించడం. ప్రతి పని ఎలా చేయాలో అలా సక్రమంగా చేయడం ద్వారా ప్రత్యేక ఆచారాలతో పనిలేదు. ఏ ఆచారమైన మనసుని సంస్కరించేదే. సంస్కరించబడిన మనసు ఏది ఆచరిస్తే అదే ఆచారమౌతుంది. ప్రతి పనిని సక్రమంగా శ్రద్ధగా చేయడమే ఆచారం యొక్క ఉద్దేశ్యం !

🕉🌞🌎🌙🌟🚩

"ఋభుగీత "(258)
🕉🌞🌎🌙🌟🚩

సర్వప్రపంచ హేయత్వము"
18వ అధ్యాయము

పనిలో ఫలాపేక్ష పోతే కోరికలు ఉండవు !

ఫలం అంటే అనుకూలత, ప్రతికూలత రెండూ ఉంటాయి. ఫలం అంటే పరిణామం. ఫలితాన్ని ఆశించడం ఎంత తగ్గితే ఆచార వ్యవహారాల నిబంధనలు అంత తగ్గుతాయి. ఆశలేని చోట సంకల్పాలు తగ్గి దివ్యత్వం వ్యక్తమౌతుంది. జీవన అవసరాలైన ఆకలి, దాహం, నిద్ర , సౌకర్యం వంటి వాటి విషయంలో కలిగే సంకల్పాలు సహజమైనవి. అవి కోరికలు కాదు. జీవన అవసరాలకు మించి కలిగే సంకల్పాలే కోరికలు. చల్లదనం కోరుకోవడం సహజం. కానీ ఏసీనే కావాలనుకోవడం అసహజం. అదే కోరిక. పనిలో ఫలాపేక్ష పోతే కోరికలు ఉండవు !

🕉🌞🌎🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment