Sunday, February 14, 2021

ప్రేమంటే..ఏమిటంటే!!

ప్రేమంటే..ఏమిటంటే!!
----------------------------------
నన్ను నేను ప్రేమించుకోవడాన్ని నీకు నాపై గల ప్రేమ దోహదపడటం...అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకునేలా నీపై నా ప్రేమ ప్రోత్సహించడం,నా బాగోగులపై నీ ఆపేక్ష,నీకోసం నేను శ్రద్ధ తీసుకోవడం,నాకోసం నువ్వు తపించడం,నీకోసం నేను అశాంతుడనవడం,నువ్వూ నేనూ కలిసి,ఒకరి కోసం ఒకరు కలలు కనడం,ఆ కలలు నిజం చేసుకునేందుకు కలిసి శ్రమించడం,అందుకోసం ముందుగా కలసి జీవించేందుకు యత్నించడం,ఆ తపన,తాపత్రయమూ---, ఒకరి కొకరు తమ తలపులలో జ్ఞప్తి తోడనే అమితమైన సంతోషాన్నీ, ఒకరి ఎడబాటుతో ఒకరికొకరు దుఃఖాన్నీ అనుభవించడం! ఒకరికోసం మరొకరు ఆలోచనలలో నిండిపోవడం! పరస్పరం తన ప్రియతమకు బాధ కలిగించని విధంగా శ్రద్ధ తీసుకోవడం,అవసరమైతే తన ప్రియతమ శ్రేయస్సు కోసం త్యాగానికి వెనుకాడకపోవడం--- అదేనేమో ప్రేమంటే!!!!
--- దండమూడి శ్రీచరణ్
9866188266


ప్రేమ అనేది ఒక అద్భుత భావన,అనుభూతి, అనుభవం!అంటే ప్రేమ గొప్ప ఆనందాన్నిస్తుందని కాదు.నిజానికి ప్రేమ విపరీతమైన దుఃఖాన్నిస్తుంది.కానీ ప్రేమ ఉదాత్తమైనది.మనిషిని దేవుడిగా మార్చగలదు. తన మనసును ఎందుకు దేవుడిచ్చాడో తనకు తెలిసేలా చేయగలదు."ప్రేమ,విషాదం కలిసి కరుణ అవుతుంది",అంటాడు కృష్ణశాస్త్రి గారు.నిజమే అది!!
స్వార్ధంతో మొదలైన ప్రేమ నిస్వార్థంగా తాను ప్రేమించినవారి క్షేమానికై త్యాగం చేసే స్థాయికి వెళ్లడమే ప్రేమకు పరాకాష్ట.ఆ స్థాయికి చేరుకున్న వ్యక్తి ఒక యోగికి ఏమాత్రం తీసిపోడు!ప్రేమలో తనను తాను కోల్పోయి,ప్రేమలో లీనమైన వారి జీవితం ధన్యం!!
--- దండమూడి శ్రీచరణ్
9866188266

Source - Whatsapp Message

No comments:

Post a Comment