😜 అన్నీ అదే!
భార్య: మీకు ఏమి పని లేదా? మొదట చాగంటి గారి మహా భాగవతం విన్నారు, అది అయిపోంగానే మాడుగుల వారిది విన్నారు, తరువాత గరికిపాటి వారిది, ఇప్పుడు సుందర చైతన్యానంద స్వామి వారిది. ఎవరు చెప్పిన అదే మహా భాగవతం కధ కదా. ఒకరిది వింటే సరిపోదా?
భర్త: నువ్వు మినప్పిండి రుబ్బి మొదటి రోజు కొంచెం పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలు వేస్తావు, రెండో రోజు గారెలు, మూడో రోజు వడలు, నాలుగవ రోజు సాదా దోశలు, అయిదో రోజు కొంచెం ఉల్లిపాయముక్కలు వేసి ఉల్లి దోశ, ఆరో రోజు పొటాటో కూర వేసి మసాలా దోశ, ఏడో రోజు ఇంత టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఊతప్పమ్, ఎనిమిదో రోజు అదే పిండితో గుంట పునుగులు, తొమ్మిదో రోజు పుల్ల మజ్జిగ కలిపి పుల్లట్లు వేస్తూ ఉంటే నేను రేపు అనేది ఉందో లేదో అని ఆత్రంగా తినటం లేదా. వీటన్నిట్లో ఉన్నది మినప్పిండి అని తెలిసినా ఎంజాయ్ చేస్తున్నామా లేదా. 😳😜
మహా భాగవతం కూడా అంతే.
చాగంటి వారు చెప్పెదాంట్లో భక్తి పాలు ఎక్కువ అందుకు వినాలి, మాడుగల వారిది ఎందుకంటే ఆయన అమృత తుల్య మైన కంఠం లో పోతన గారి పద్యం వినటానికి, గరికిపాటి వారు ప్రస్తుతo సమాజం లో జరుగుతున్న వాటిని మేళవిస్తారు కాబట్టి ఆయనది వినాలి, చివరకు సుందర చైతన్యానందుల వారిది వినాలి, ఎందుకంటే తత్వ చింతనతో పాటు ఆయన చెప్పే దాంట్లో పైన చెప్పినవన్నీ ఉంటాయి.
ఒక్కొక్కరిది ఒక్కొక్క రక మైన పంథా. అన్నీ ఎంజాయ్ చేయాలి.
భార్యకు ఏమి అర్ధం కాలా.
తను చేసే పనిని భాగవతం తో పోల్చి పొగడారా లేక ఒకే పిండితో వారం రోజులు టిఫిన్ చేసి పెడుతున్నాను అని ఎత్తి పొడుపుగా అన్నారా.
ఆలోచనలో పడింది.😃
Source - Whatsapp Message

No comments:
Post a Comment