Saturday, February 13, 2021

*మన వేదాలలో తెలుపబడిన ఏ మంత్రం లోనైనా శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని ముగుస్తాయి,* *దాని అర్థం ఏమిటి ?* *దాని వలన లాభం ఏమిటి ?*

మన వేదాలలో తెలుపబడిన ఏ మంత్రం లోనైనా శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని ముగుస్తాయి,
దాని అర్థం ఏమిటి ?
దాని వలన లాభం ఏమిటి ?

ఒకసారి పరిశీలిద్దాం

ఏదో ఒక సందర్భంలో ... వేద పండితులు ... ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం ...

శాంతి మంత్రంలో శాంతి పదాన్ని మూడు సార్లు ఎందుకు ఉచ్చరిస్తారో తెలియదు, కానీ అది విన్నప్పుడల్లా మనం కూడా ఉచ్చరిస్తాము, కానీ ఎందుకో తెలియదు...

మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది

1. ఆధ్యాత్మిక,
2. ఆది దేవిక,
3. ఆది భౌతిక,.._
ఇక వీటి వివరాలు పరిశీలిద్దాము...

మొదటి శాంతి పదం ... శారీరిక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం (అనారోగ్యం) నుంచీ ఉపశమనం పొందడానికి, దీన్ని ఆధ్యాత్మికం అంటారు,

రెండవ శాంతి పదం ... ఇతర జీవరాశులనుండీ , మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి . దీన్ని ఆధిభౌతికము అంటారు,

మూడవ శాంతి పదం ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి . దీన్ని ఆధిదైవికము అంటారు,

ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ " శాంతి " మంత్రం చివర్లో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు...

Source - Whatsapp Message

No comments:

Post a Comment