Thursday, February 11, 2021

ఇది కథ లాంటి కథ, కథ కాని కథ, ఇది మనందరి కథ

ఇది కథ లాంటి కథ, కథ కాని కథ, ఇది మనందరి కథ

ఎడారిలో నివసించే ఒక పక్షి ఉంది. అది చాలా అనారోగ్యంతో, ఈకలు అన్ని రాలిపోయి, తినడానికి మరియు త్రాగడానికి ఏమీ లేకుండా, నివసించడానికి ఆశ్రయం లేకుండా.... ఇలా చెప్పడానికి అలవి లేని బాధలతో, అనారోగ్యంతో, అష్టదరిద్రాలలో చిక్కుకొని ఉంది.

ఒక రోజు ఒక పావురం అటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు, అనారోగ్యంతో ఉండి జీవితం పై అసంతృప్తి చెందిన ఆ పక్షి పావురాన్ని ఆపి, "మీరు ఎక్కడకి వెళ్తున్నారు“ అని అడిగింది.

అప్పుడు ఆ పావురం, "నేను స్వర్గానికి వెళుతున్నాను" అని బదులిచ్చింది.

వెంటనే జబ్బుపడిన పక్షి, " స్వర్గంలో ఉన్న అనంత శక్తి అయిన ఆ భగవంతుడిని దయచేసి నాబాధలు ఎప్పుడు తీరుతాయో, ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడు బయట పడతానో అడిగి తెలుసుకోండి" అని వేడుకుంది.

పావురం "ఖచ్చితంగా, నేను ఆపని చేస్తాను" అని చెప్పి జబ్బుపడిన పక్షికి వీడ్కోలు పలికి స్వర్గానికి బయలుదేరింది.

పావురం స్వర్గానికి చేరుకుంది. జబ్బుపడిన పక్షి సందేశాన్ని ప్రవేశ ద్వారం వద్ద దేవదూత ఇన్‌ఛార్జితో(Angel) పంచుకుంది.

దేవదూత ఇలా అన్నాడు..."తన జీవితంలో తరువాతి ఏడు సంవత్సరాలు పక్షి ఇలా బాధపడాలి, ఆ పక్షి కి అప్పటి వరకు ఆనందం లేదు."

పావురం, ఆశ్చర్యపోతూ, బాధతో ఇలా అంది "అనారోగ్య పక్షి ఇది విన్నప్పుడు, అది నిరాశకు, నిట్టూర్పుకు గురవుతుంది, దీనికి మీరు ఏదైనా పరిష్కారం సూచించగలరా?" అని వేడుకుంది.

దేవదూత, "ఈ రహస్యం పాటించమని ఆ పక్షికి చెప్పండి" అని కింద ఉన్న మాటలను ఉపదేశించాడు...

Thank you God for everything
"నాకున్న ప్రతిదానికీ దేవునికి కృతజ్ఞతలు. "

పావురం ఆనందంతో వెంటనే అక్కడ నుంచి బయలుదేరి అనారోగ్య పక్షిని మళ్ళీ కలుసుకుని, దానికి దేవదూత చెప్పిన మాటలన్నీ చెప్పి ఆ సందేశాన్ని తెలియచేసింది.....

ఏడు రోజుల తరువాత పావురం మళ్ళీ అటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు,
పక్షి ని చూసి చాలా ఆశ్చ్యపోయింది. ఆ పక్షి చాలా సంతోషంగా ఉంది, దాని శరీరంపై ఈకలు పెరిగాయి, ఎడారి ప్రాంతంలో ఒక చిన్న మొక్క కూడా పెరిగింది, నీటితో కూడిన ఒక చిన్న చెరువు కూడా ఉంది, పక్షి ఆనీళ్ళల్లో ఆడుతూ, పాడుతూ ఉల్లాసంగా నృత్యం చేస్తోంది. పావురం ఆశ్చర్యపోయింది.

రాబోయే ఏడు సంవత్సరాలు పక్షికి ఆనందం ఉండదని ఏంజెల్ చెప్పాడు.... మరి ఏంటి ఈ పక్షి కి ఏడు రోజులలోనే అన్ని కష్టాలు తీరిపోయాయి అని ఆశ్చర్యపోయి, ఈ ప్రశ్నను దృష్టిలో పెట్టుకుని, పావురం స్వర్గ ద్వారం వద్ద ఉన్న దేవదూతను దర్శించడానికి వెళ్ళింది......

పావురం తన ప్రశ్నను ఏంజెల్ కి చెప్పింది. ఏంజెల్ బదులిచ్చారు. "అవును, పక్షికి ఏడు సంవత్సరాలు ఆనందం లేదు, కానీ పక్షి ప్రతిదానికీ " ధన్యవాదాలు " అనే మంత్రం పఠిస్తున్నందున, ప్రతి పరిస్థితిలోనూ, దాని జీవితం మారిపోయింది, 7 సంవత్సరాలలో అందవలసిన...... కృతజ్ఞతకు శక్తి 7 రోజులకే అందేలా కుదించినది.

పక్షి వేడి ఇసుక మీద పడిపోయినప్పుడు అది ఇలా చెప్పింది "ప్రతిదానికీ ధన్యవాదాలు"....
అది ఎగరలేకపోయినప్పుడు, "ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు"
దాహం వేసినప్పుడు మరియు చుట్టూ నీరు లేనప్పుడు, అది ఇలా చెప్పింది,
"ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు"

పరిస్థితి ఏమైనప్పటికీ, పక్షి అనంత విశ్వ శక్తి పైన సంపూర్ణ, పరిపూర్ణ విశ్వాసం ను ఉంచి ఆ పవిత్ర మంత్రాన్ని పునరావృతం చేస్తూనే ఉంది,
"ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు"

అందువల్ల ఏడు సంవత్సరాలలో కరగవలసిన దాని కర్మలు 7 రోజులలోనే కరిగిపోయాయి.
ఈ కథ విన్నప్పుడు, మనం కూడా అనుభూతి, ఆలోచించడం, అంగీకరించడం మరియు జీవితాన్ని చూసే విధానంలో విపరీతమైన మార్పును అనుభవించవచ్చు.



THANK YOU GOD FOR EVERYTHING

"ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు"

ఈ అభిప్రాయాన్ని మన జీవితంలో లేనిదానినీ మార్చడానికి లేదా కొత్తగా సృష్టించు కొనేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది.

ఉదాహరణకి : మనకు తల నొప్పి ఉంటే నా మిగతా శరీరమంతా పూర్తిగా చక్కగా మరియు ఆరోగ్యంగా ఉందని దేవునికి ధన్యవాదాలు చెప్పగానే..........
తలనొప్పి మనను అస్సలు బాధించకుండా మాయమవటం గమనించవచ్చు.

అదే పద్ధతిలో మనం ఈ మంత్రం తో మన సంబంధాలలో (కుటుంబం, స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులు కావచ్చు) ఆర్థిక, సామాజిక జీవితం, వ్యాపారం మరియు మనతో సంబంధం ఉన్న ప్రతిదానిలో ఉపయోగించడం ప్రారంభిస్తే ఎంతటి విపత్కరపరిస్థితి నైనా దైవబలంతో దాటవచ్చు.

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀

Source - Whatsapp Message

No comments:

Post a Comment