Tuesday, February 16, 2021

మంచి మాట..లు

ఆత్మీయ బంధు మిత్రులకు మంగళవారపు మరియు వసంత పంచమి శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు మరియు తిరుత్తని సుబ్రమణ్య స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోసుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ ఆత్మబంధువు. AVB సుబ్బారావు💐 🙏
మంగళవారం --: 16-02-2021 :-- ఈరోజు మంచి మాట..లు

మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు .

మీరు ఎదుటివారితో పిరికి మాటలు మాట్లాకండి వినకండి అవి మీ జీవిత గమనానికి అటంకాలు అవుతాయి . ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరూ పిరికివారవుతారు .

జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది . గమ్యం అనంతం గమనం అనేకం .

సహాయం చేయాలంటే మనం కోటీశ్వరులం అయ్యి ఉండాల్సిన అవసరం లేదు .
మానవత్వం ఉంటే చాలు . సహాయం ఏరూపంలో అయినా బయటకి వస్తుంది . ఒక్కోసారి నీ నోటి నుండి వచ్చే ఒక్క చిన్న మాటే అవతలి వాళ్లకి సంజీవిని అవ్వొచ్చు .
ప్రయత్నించండి ఆచరించండి💐
సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 🕉️💐🤝🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment