Monday, March 1, 2021

మంచి మాట..లు

ఆత్మీయ బంధు మిత్రులకు రవి వారపు శుభోదయశుభాకాంక్షలు, మనకు మన కుటుంబసభ్యులకు బంధుమిత్రులకు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ అందరు బాగుండాలి అందులో మనముండాలి, కలియుగ ప్రభావం తో ప్రతి ఒక్కరం తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాం, మన వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుదాం, మనకు ఎవరివలన అయిన ఇబ్బంది గలిగితే క్షమించేద్దాం, పోయేదేముంది మనకు మనసు ప్రశాంతత లభిస్తుంది, కుదిరితే స్నేహం బలపడుతుంది.. మీ AVB సుబ్బారావు 💐🕉️🤝🙏
ఆదివారం --: 28-02-2021 :-- ఈరోజు AVB మంచి మాట..లు

కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం కచ్చితంగా మారుతున్నారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉంటున్నారు ఎవరిని నమ్మాల్లో తెలియడం లేదు

మంచి తనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో అలాగే మన మంచితనమే మనల్ని కాపాడుతుంది
అన్నది కూడా అంతే నిజం జీవితంలో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు . ఎందుకంటే ప్రతిసారి గతం
గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు .

మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తు ఎక్కువగా ప్రేమించు .

ఎదుటి వారు మిమ్మల్ని తలిచినా తలవక పోయినా మీరు మాత్రం తలుచుకోండి ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటి ఉండకూడదు ప్రేమ అప్యాయతలు మాత్రమే ఉండాలి .

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 9985255805💐🤝🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment