Wednesday, December 8, 2021

*మంచి నియామాలు* అన్నీ *చాలా కష్ఠమెందుకు?*

మంచి నియామాలు
అన్నీ
చాలా కష్ఠమెందుకు? ➖➖➖✍️

మంచి నియమాలు అన్నీ చాలా కష్టంగా ఉంటాయి. తుదకు అవే అనంతమైన అమృత తుల్యమైన సుఖాన్ని ఇస్తాయి.

ఆ సుఖం ఎక్కడి నుండో రాదు. మనలో ఉన్న సాత్త్విక బుద్ధి వలన వస్తుంది.

కాబట్టి సాధన మొదట్లో కష్టంగా ఉందని మానకుండా నిరంతరం కొనసాగించాలి.

విషమి అని అన్నారు కానీ విషం అనలేదు. మొదట్లో విషం మాదిరి తోస్తుంది. అంటే చాలా కష్టంగా ఉంటుంది. దానికి భయపడకూడదు.

ఈ ఆత్మ సాధనకు మన పూర్వజన్మవాసనలు అనేక విఘ్నాలు కలుగచేస్తాయి. మనసును అటు ఇటు మళ్లిస్తాయి. వాటికి లొంగకుండా సాధన చేస్తే అనంతమైన సుఖం మీ సొంతం అవుతుంది.

ఏదైనా వ్యాధి వచ్చింది. చేదు మందు, సూది మందు, ఆపరేషన్ ఇవన్నీ చేస్తారు. వాటికి భయపడి పారిపోతే రోగం ముదురుతుంది. ముందు ఇవన్నీ కష్టంగా ఉన్నా, తుదకు జీవితాంతం సుఖాన్ని కలుగచేస్తాయి.

అలాగే విద్యార్థులు సంవత్సరం అంతా నియమం ప్రకారం చదవడం మొదట్లో కష్టంగానే ఉంటుంది. కాని తుదకు పరీక్షలలో మంచి మార్యులు వచ్చి సంతోషాన్ని కలుగచేస్తాయి.

అలాగే అధ్యాపకుడు సంవత్సరం అంతా కష్టపడి పాఠాలు చెబితే, జీవితాంతం ఆ విద్యార్థులు ఆ ఉపాధ్యాయుని దేవునిలాగా పూజిస్తారు. దీనితో విద్యార్థులకు విద్య వస్తుంది. ఉపాధ్యాయునికి గౌరవం లభిస్తుంది.

అలాగే ఉద్యోగి రోజంతా కష్టపడి పని చేస్తే, ఆ ఉద్యోగికి పై అధికారి మెప్పు, జీతంలో పెరుగుదల, పదోన్నతి లభిస్తాయి. ఇవన్నీ మొదట్లో కష్టంగా ఉంటాయి. అంతంలో సుఖాన్ని కలుగచేస్తాయి.

దీనికి మంచి ఉదాహరణ- మనకు భాగవతంలో ఉంది….

దేవతలు, దానవులు పాలసముద్రమును మధించారు. ముందు హాలాహలం అంటే విషం పుట్టింది. కాని వారు అధైర్యపడలేదు. ఆ విషాన్ని మహాశివుడు సేవించాడు. దేవదానవులు వారి కృషి కొనసాగించారు. అమృతం పుట్టింది.

మనలో ఉన్న మంచి చెడు- దేవతలు దానవులు. వాటి మధ్య జరిగే ఘర్షణ పాలసముద్రం చిలకడం. ముందు కష్టాలు వస్తాయి. ఓపికగా భరించాలి. కష్టాలను భగవంతునికి అర్పించాలి. తుదకు అనంతమై సుఖం లభిస్తుంది.

మనం చేసే కృషిని మంధర పర్వతం కింద ఉన్న కూర్మావతారంలో ఉన్న పరమాత్మ పర్యవేక్షించినట్టు, మనలో అంతర్లీనంగా ఉన్న ఆత్మస్వరూపుడు పర్యవేక్షిస్తుంటాడు.

ఈ భావనతో సాధన చేస్తే, సాత్విక సుఖం లభిస్తుంది. ✍️

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

సేకరణ

No comments:

Post a Comment