Friday, March 11, 2022

"జీవిత" పయనం

🌀"జీవిత"పయనం

ఫ్రెండ్స్ మనకు ఎంతటి సమస్య వచ్చినా ఎదుర్కోటానికి మన కళ్ళు కాళ్లు చేతులు అన్ని సిద్ధంగా ఉంటాయి కానీ మన మెదడు మొద్దుబారిపోతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మనసుకు పంపిస్తుంది ఆ సంకేతాలను.

అప్పుడు చూడాలి మనసు ఏంటేంటో ఆలోచనలు చేస్తు ఉంటుంది.పరువు మర్యాద వాళ్లు ఏమనుకుంటారో వీళ్లు ఏమనుకుంటారో అటు లేనిపోని భయాలను సృష్టిస్తుంది.

అలా బాధపడేవాళ్ళను అడుగుతున్నాను
ఎవరో ఏదో అనుకుంటారని బాధపడుతున్నారు కదా అసలు ఆలా అనుకునే వాళ్ల గురించి పట్టించుకోవాలా. పట్టించుకోవాలి అంటారా.
ఎందుకు పట్టించుకోవాలి మన మంచి కోరేవాళ్లు
మన వాళ్లయితే అలా అనుకోరు కదా అసలు.
మన గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి
ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. వాళ్ల గురించి ఆలోచించటం బాధపడటం అవసరమా. అసలు ఆలా మనం బాధపడటానికి కారణం ఎవరు ఆలోచించండి ఆలోచించిన అర్థం అవ్వలేదా.ఇంకెవరండి
మన మెదడు దాని మాట వినే మన మనసే కారణం నిజామా కదా నేను చెప్పింది.

నా జీవిత పయనం లో అయితే
నలుగురు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోని.ఎమన్నా తెలిసినా బాధపడుతూ నా టైం వేస్ట్ చేసుకోను.
నాకు తోచినట్టు నేను ఉంటాను నేనేంటో నాకు తెలుసు.ప్రతి ఒక్కరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనసు బాధపడుతూ గొంతెత్తి అరుస్తుంటే దాని గొంతు నొక్కేస్తా.
మనసు నా మాట వినాలి కానీ
దాని మాట నేను వినేదేటి.
అలా వింటూ కూర్చుంటే ఆడిస్తుంది నాను .
మన మనసే మన మాట వినకపోతే
ఈ ప్రపంచంలో ఇంకెవరు మన మాట వింటారు చెప్పండి.

ఫ్రెండ్స్ మన మనసు చాలా చంచలమైంది.
దీని గురించి ఎంతైనా రాయచ్చు. దానికున్న చపలత్వం అంతా ఇంతా కాదు. మన కళ్ళ ముందే మనకి తెలియకుండానే ఎన్నో రంగులు మారుస్తుంది. ఒకప్పడు మంచి మార్గంలో నడిచి శిఖరాలని అధిరోహిస్తే మరొకప్పుడు వక్రమార్గంలోకి తిప్పి పాతాళానికి తోస్తుంది. ఒక్కోసారి బాధలతో దీనంగా ఉన్నట్టు ఉంటుంది మరోసారి అదే సంతోష తరంగాలలో ఈదులాడుతుంది. క్షణిక మైన ప్రాపంచిక సుఖాలే శాశ్వతం అంటుంది అంతలోనే దేవుడు భక్తి అంటూ భజనలు చేస్తుంది, ఒక్కోసారి పిరికిదానిలా పలాయనం చిత్తగిస్తుంది అదే మరోసారి పర్వత శిఖరంలా ధైర్యంగా నిలబడుతుంది.

అదే మనసు ఒకప్పుడు ప్రేమ, కరుణ రసాలు కురిపిస్తే మరొకప్పుడు ద్వేష క్రోధాగ్నులతో రగిలిపోతుంది అది తల్చుకుంటే విరాగియై కీకారణ్యగుహలలో ప్రవేశించగలదు.

అదే మనసు లజ్జ విడిచి వేశ్యగృహాల లోనూ దూరగలదు. ఒక్కోసారి ఇతరులని నిందించి, వారిపై ఆరోపణలు చేసి ఆనందిస్తుంది అదే తిరిగి దీనురాలై అలిగి, ఒంటరిగా పడి విలపిస్తూ ఉంటుంది. ఒకోసారి మహాదాత గానూ మరోసారి పరమ లోభి గాను ప్రవర్తిస్తుంది. ఒకప్పుడు దీనంగా మరొకప్పుడు అహంకారిగా కనపడుతుంది. కామిగా,యోగిగా, భోగిగా, నిర్మలంగా, మలినంగా, ఒకటేంటి అవసరాన్ని బట్టి దానిఇష్టం వచ్చినట్టు
లెక్క లేనన్నీ అవతారాలు ఎత్తుతుంది.

ఒక్క క్షణంలో కోట్ల మైళ్ళు ప్రయాణించి రాగలదు. రాజ సభకైనా, దరిద్రుడి గుడిసెనైనా దూరగలదు, సుదూర తీరాలకి , దుర్భేధ్యమైన ప్రదేశాలకి అలవోకగా వెళ్లి రాగలదు.
మహోన్నత పర్వతాగ్రముల కెళ్ళి నిలబడ గలదు, పాతాళ సముద్రాన మునకేసి రాగలదు.
ఇది అది అని లేకుండా గ్రహరాశులని దాటుకుని సమస్త లోకాలకి నిరాటంకంగా పోయిరాగలదు. మనసుకున్నంత తీవ్రత గానీ ఆ వేగము గానీ ఈ ప్రపంచమున ఇక దేనికీ లేదని చెప్పచ్చు.

ఆకాశంలో మెరిసే మెరుపు యెంత క్షణికమైనా దాని కదలికని వేగాన్ని మనం చూడగలం. కానీ మనసు యొక్క వేగం దాని గమనం మనం గమనించ లేనంత తీవ్రంగా ఉంటుంది. దాని వేగాన్ని మనం ఏ మాత్రం కొలవలేము సరికదా కనీసం ఊహించలేము కూడా. ఇలాంటి చిత్ర విచిత్రమైన మనస్సుని ఆశ్రయించిన మనిషి తనగురించి తానూ తెలుసుకునే వరకు ఈ ప్రపంచంలో నిలకడ లేకుండా “పునరపి జననం పునరపి మరణం” అన్న రీతిగా ప్రాపంచిక వ్యవహారాలలో పడి తిరుగుతూఉంటాడు.

ఈ మనసు చేసే వింత పోకడలు నుంచి
మనం తప్పించుకోవాలి అంటే ఒక్కటే మార్గం
స్వచ్ఛమైన మనసుతో పవిత్రమైన ఆలోచనలతో
ఆ భగవంతున్ని మన హృదయంలో
ప్రతిష్టించుకోవావాలి. మురికిగా ఉన్న గదిలోకి మనమే ప్రవేశించలేము అలాంటిది పిచ్చి పిచ్చి భావాలతో నిండి ఉన్న మనసు అనే గదిలోకి భగవంతుడు ఎలాప్రవేశించాలని ఆశించుదం.
అందుకే మనసు పరిశుభ్రం చేసుకుందాం
మనసు పరిశుభ్రం అయితే భగవంతుడు
ఆ పవిత్ర ఆసననంలో వచ్చి కూర్చుంటాడు
మనసు మన కంట్రోల్ లోకి వస్తుంది
అప్పుడు ఎచ్చాక
ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు
*ఆనందమే ఆనందం

సేకరణ. మానస సరోవరం

సేకరణ

No comments:

Post a Comment