తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసా
పంచపదులలోకి అనువాదం
కే. పాండు రంగ విఠల్
అతులిత బలధామం
స్వర్ణ శైలాభ దేహం౹౹
దనుజ వన కృశానుం
జ్ఞానినామగ్రగణ్యమ్౹౹
అత్యంత బలసంపన్నుడైనట్టి వాడు
స్వర్ణ శైలాభ దేహం కలిగినట్టి వాడు
దానవవనం దహనం చేసినట్టి వాడు
జ్ఞానులందు అగ్రగణ్యుడైనట్టి వాడు
మారుతి!అంజనీ తనయుడు విఠల!
సకలగుణ నిధానం
వానరాణా మధీశం౹౹
రఘుపతి ప్రియభక్తం
వాతజాతం నమామి౹౹
సకల సుగుణ నిధియైనట్టి వాడు
వానరులందు శ్రేష్టమైనట్టి వాడు
రఘుపతికతి ప్రియమైనట్టి వాడు
వాయుదేవునికి సుతుడైనట్టి వాడు
మారుతీ!నామామి నమామి విఠల!
గోష్పదీకృత వారాశిం
మశకీకృత రాక్షసం౹౹
రామాయణ మహామాలా
రత్నం వందే అనిలాత్మజం
గో డెక్కలా భావించి సాగరం లంఘించిన
రాక్షసులను చంపి మశకాలుగా భావించిన
రామాయణంను మహామాలగా తలంచిన
దానినే అతి విలువైన రత్నముగానెంచిన
అనిలాత్మజా!వందనం శతవందనం విఠల!
యత్రయత్ర రఘునాథ కీర్తనం౹౹
తత్రతత్ర కృతమస్తకాంజలిం౹౹
భాష్పవారి పరిపూర్ణ లోచనం౹౹
మారుతిం నమత రాక్షసాంతకం ౹౹
ఎక్కడెక్కడ రఘునాథుడు కీర్తించ బడును
అక్కడక్కడ హనుమ మస్తకం దించుకొనును
కళ్ళ నీళ్ళతో రఘురాముణ్ణి అభిషేకించును
రాక్షస మూకలందరిని సంహారమొనర్చును
రామభక్తా!మారుతీ!నమస్కారము!విఠల!
శ్రీగురుచరణ సరోజ రజ
నిజమన ముకుర సుధారి౹౹
వరణౌ రఘువర విమల
యశ జో దాయక ఫలచారి౹౹
నేను నా గురు చరణములకు మ్రొక్కెదను
సరోజ రజమును మనసారా ధరించెదను
విమలుడైన రఘురామ వరం పొందెదను
యశస్సునందించు శ్రీరాముని కీర్తించెదను
సుఫలమునొసగును సీతారాముడు విఠల!
బుద్ధిహీన తను జానికై
సుమిరౌ పవన కుమార౹౹
బలబుద్ధి విద్యా దేహి మోహి
హరహు కలేస వికార౹౹
దశరథ తనయా!రామా!నేను బుద్ధిహీనుడను
నేను పవన కుమారుడైన నిన్నే ధ్యానించెదను
ప్రభూ!బలం బుద్ధి విద్యలనివ్వమని వేడెదను
సకల క్లేశాలు వికారాలు హరించమని కోరెదను
నా మొరనాలకించి నన్ను కరుణించు విఠల!
1.
జయ హనుమాన జ్ఞాణగుణ సాగర
జయకపీశ తిహు లోక ఉజాగర
జయము జయము హనుమా!నీకు జయము
జ్ఞానము గుణములలో సాగరుడా!జయము!
జయము జయము కాపీశా!నీకు విజయము!
ముల్లోకాలకు వెలుగులనిచ్చువాడా!జయము
అంజనేయా!మారుతీ తనయా!జయం విఠల!
2.
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా
శ్రీరామచంద్రునికి దూతవు నీవు
అతులిత బలవంతుడవు నీవు
హనుమా!అంజనీపుత్రుడవు నీవు
పవనసుత నామధేయుడవు నీవు
ఆ శ్రీరామబంటువు నీవేగా విఠల!
3.
మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివారా సుమతి కే సంగీ
మహా వీరుడవు పరాక్రమవంతుడవు
జైజైజై బజరంగీ!నీవు మహాబలుడవు
నీవే దుర్బుద్ధి కుమతి నివారకూడవు
సుమతులందరికి నీవు స్నేహితుడవు
నా ఇలవేల్పువు దైవము నీవే విఠల!
4.
కంచన వరన విరాజ సువేసా
కానన కుండల కుంచిత కేశా
బంగారు వర్ణముతో విరాజిల్లుతున్నావు
అందమైన రూపముతో ప్రకాశిస్తున్నావు
చెవుల కుండలాలతో శోభిల్లుతున్నావు
ఉంగరాలున్న జుట్టుతో వెలిగిపోతున్నావు
వాయునందనా!వరములివ్వుము!విఠల!
5.
హాథ వజ్ర అరు ధ్వజా విరాజై
కాంధే మూంజా జనేవూ సాజై
ఒక చేతిలో వజ్రాయుధమును చేపట్టావు
మరో చేత ధ్వజంతో విరాజిల్లుతున్నావు
హనుమా!భుజంపై జంద్యము ధరించావు
దాని వలన బహు సుందరంగా వున్నావు
హనుమంతుడు శ్రీరాముని భక్తుడు విఠల!
6.
శంకర సువన కేసరి నందన
తేజ ప్రతాప మహా జగ వందన
నీవు శంకరునుకి తనయుడవు
నీవు వీర కేసరికి కుమారుడవు
మహా తేజ ప్రతాపవంతుడవు
సమస్త జగానికి వందితుడవు
ముల్లోక పూజితుడవు విఠల!
7.
విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివే కో ఆతుర
నీవు గొప్ప విద్యావంతుడవు
గుణవంతుడవు చతురుడవు
శ్రీరామ కార్య నిర్వాహకుడవు
పనిలో ఆతృత కలిగినవాడవు
మారుతి సుగుణుడు!విఠల!
8.
ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా
రామచంద్ర ప్రభువు చరిత్రను వింటావు
అది విని నీవు ఎంతగానో సంతోషిస్తావు
రామ లక్ష్మణ హృదయాలలో వుంటావు
నీవు సీతమ్మ మదిలో సదా నివసిస్తావు
ముగ్గురిపట్లా భక్తి కలిగుండును విఠల!
9.
సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా
వికట రూప ధరి లంక జరావా
సూక్ష్మాతి సూక్ష్మ రూపాన్ని ధరించెదవు
నీవు మహా తల్లి సీతకు అగుపించెదవు
వికటమైన క్రూర రూపంను ధరించెదవు
లంకా నగరాన్ని సమూలంగా కాల్చెదవు
కార్య దక్షుడు హనుమంతుడు విఠల!
10.
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్రకే కాజ సంవారే
మహా భీకర భీమ రూపం ధరిస్తావు
నీవు అసురులందరిని సంహరిస్తావు
ప్రభు శ్రీరామచంద్రుని దరి చేరుతావు
సకల కార్యాలను పరిపూర్తి చేస్తావు
ఇలలో హనుమకు సాటి లేరు విఠల!
11.
లాయ సజీవన లఖన జియాయే
శ్రీరఘువీర హరషి ఉరలాయే
నీవు మృతసంజీవనిని తీసుకొనివచ్చావు
రామ సోదరుడు లక్ష్మణుణ్ణి బతికించావు
శ్రీరామ రఘువీరుణ్ని సంతోష పరిచావు
ఎదకు హత్తుకుంటే ఎంతో ఆనందించావు
రాముని హృదయంలో నిలిచాడు విఠల!
12.
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
కహా భరత సమ తుమ ప్రియ భాయీ
రఘుపతి నిన్ను గొప్పగా పగిడినాడు
నీవు మహాబలవంతుడవని అన్నాడు
భరతునితో సమానుడవని అన్నాడు
నీవూ ప్రియ సహోదరుడవే అన్నాడు
మారుతి రాము మెప్పుపొందె విఠల!
13.
సహస్ర వదన తుమ్హరో యస గావై
అసకహి శ్రీపతి కంఠ లగావై
జగమున నిను వేనోళ్లా పొగడుతారు
నీ యశస్సును కీర్తిని గానము చేస్తారు
రామ లక్ష్మణులు కౌగిలించుకుంటారు
మనసారా వారిరువురు చేరదీస్తారు
సీత మారుతిని చూసి మురిసె విఠల!
14.
సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా
సనకాది మునీశ్వరులందరు
బ్రహ్మాదులు మహర్షులందరు
నారద శారదాదులు అందరు
ఆదిశేషుడాది దేవతలందరు
హనుమను కీర్తించెదరు విఠల!
15.
యమ కుబేర దిగపాల జహాతే
కవి కోవిద కహి సకే కహా తే
యమ కుబేరులు నీ మహిత చెప్పుకుంటారు
అష్ట దిక్పాలకులందరు చరిత చెప్పుకుంటారు
కవికోవిదులందర కూడ నీకథ చెప్పుకుంటారు
భువిలో పండితులు నీ ఘనత చెప్పుకుంటారు
ఊరువాడ ప్రతిఇంటా నీ నామ గానమే విఠల!
16.
తుమ ఉపకార సుగ్రీవ హి కీన్హా
రామ మిలాయా రజపద దీన్హా
నీవు మహోపకారమును అందించినావు
సుగ్రీవునికి సహకారము నందించినావు
అతనిని శ్రీరామచంద్రునితో కలిపినావు
రాజపదవిని సుగ్రీవునికి ఇప్పించినావు
మారుతి స్నేహానికి ప్రాణమిచ్చు విఠల!
17.
తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా
నీవు చెప్పిన మాట మంత్రంగా భావించాడు
విభీషణుడు లంకకు మహారాజు అయ్యాడు
అతడు శ్రీరామునిదయకు పాత్రుడయ్యాడు
శ్రీరామ భక్తిని జగమంతటికి తెలియజేశాడు
భక్తికి పరాకాష్ట వాయునందనుడేగా విఠల!
18.
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహీ మధుర ఫల జానూ
సహస్ర యోజనముల దూరాన వున్నాడు
భానుడు వెలుగులీనుతూ ప్రకాశిస్తున్నాడు
హనుమ దానిని ఫలముగా భావించినాడు
దాని చెంతకెళ్లి చేత తీసుకొని మింగినాడు
అపారమైన శక్తిమంతుడు మారుతి విఠల!
19.
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ
జలది లాంఘి గయే అచరజ నాహీ
రామచంద్ర ప్రభు ముద్రిక తీసుకున్నావు
దానిని నీ నోటిలో గట్టిగా పట్టుకున్నావు
రాముని నామం బిగ్గరగా జపించినావు
నీవు మహా సాగరాన్ని లంఘించినావు
మారుతి దాటడమాశ్ఛర్యం కాదు విఠల!
20.
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
దుర్గమమైన కార్యాలన్ని పూర్తి చేస్తావు
అవసరమైతే జగత్తునే నీవు జయిస్తావు
సుగమమైన మార్గమును అనుగ్రహిస్తావు
నీవసాధ్యమును సుసాధ్యము చేసేస్తావు
ఇవన్నియు మారుతికే సాధ్యము విఠల!
21.
రామ దువారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే
రాముని దీవెనలను అందుకున్నవాడవు
ఆయన తరపున నీవేగా మా రక్షకుడవు
నీవేగా రాముని దర్శనం కల్పించువాడవు
నీవేగా ఆజ్ఞ అనుజ్ఞ ప్రవేశమిచ్చువాడవు
మారుతియే భక్తజన సంరక్షకుడు విఠల!
22.
సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డరనా
నీ శరణాగతి పొందినవారు ముక్తి పొందుతారు
అందరు సుఖము సౌఖ్యములను పొందుతారు
నీవు రక్షగా వుంటే భయము భీతిని వీడుతారు
నీఅండదండ వుంటే చింతలన్నియు వీడుతారు
ఆపదలుతొలగించును అంజనీసుతుడు విఠల!
23.
ఆపన తేజ సంహారో ఆపై
తీనో లోక హాంక తే కాంపే
హనుమంతునిలోని తేజస్సు ప్రకాశము
అనితరసాధ్యమైన బలం పరాక్రమము
శత్రువుపై చేసే భయంకర పెనుగర్జనము
దానిని విని కంపించునుగా ముల్లోకము
మారుతీ!రాక్షసులకు యముడవే విఠల!
24.
భూత పిశాచ నికట నహి ఆవై
మహావీర జబ నామ సునావై
నీ నామం జపిస్తే పిశాచాలు దరిచేరవు
నిన్ను స్మరిస్తే భూతాలు చెంతకు చేరవు
నీ పేరు వినిపిస్తే ప్రేతాలు దగ్గరకు చేరవు
మహావీరుడిని తలిస్తే దయ్యాలూ చేరవు
అన్నిటికి నీ నామం మహామంత్రం విఠల!
25.
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత్ వీరా
రోగాలన్ని పరిపూర్ణంగా నశించిపోవును
పీడలన్ని సమూలంగా హరించిపోవును
కష్టాలన్ని సంపూర్ణంగా తొలగి పోవును
పాపాలన్నియూ పటాపంచలై పోవును
వీరహనుమంతుణ్ణి నమ్ముకోవలె విఠల!
26.
సంకట సే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లగావై
27.
సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజా సకల తుమ సాజా
తాపసులలోకెల్లా గొప్పనైన వాడు
వారందరిలోను ప్రభులాంటి వాడు
రాముని కార్యాన్ని సాధించే వాడు
సమస్తమైన పనులు నెరవేర్చే వాడు
మారుతియే అందరి రక్షకుడు విఠల!
28.
ఔర మనోరథ జో కోయీ లావై
సోయి అమిత జీవన ఫల పావై
నిన్ను వేడినచో మనోరథము నెరవేరును
భక్తులు కోరుకున్న కోరిలన్నియు తీరును
నిన్ను సేవిస్తే జీవనము సఫలమైతీరును
ఆనంత ఫలములు తప్పక అందితీరును
వేరే వారిని భజించుటయే వ్యర్థం విఠల!
29.
చారో యుగ పరతాప తుమ్హారా
హై వరసిద్ధి జగత ఉజియారా
నాలుగు యుగాలయందు నీ ప్రతాపము
ముల్లోకాలయందు నీ భజన స్మరణము
జగతియందు వ్యాపించింది నీ ప్రకాశము
నీ నామమే వరదాయిని సిద్ధి దాయకము
అంజనీపుత్రుడు మహిమాన్వితుడు విఠల!
30.
సాధు సంత కే తుమ రఖ వారే
అసుర నికందను రామ దులారే
నీవు సాధువులందరి రక్షకుడవు
సంత్ సజ్జనులందరి సంరక్షకుడవు
అసుర జనులందరి సంహారకుడవు
రామ భక్తులందరి పరిపోషకుడవు
నిను తలిస్తే కష్టాలు తొలగు విఠల!
31.
అష్టసిద్ధి నవ నిధి కే దాతా
అసవర దీన జానకీ మాతా
నీవు అష్ట సిద్ధులను అందించు దాతవు
నవ నిధులను సమకూర్చు సంధాతవు
దీవెనెలనందించే దీనజన వర దాతవు
భక్తజన మహాశయులకు సిద్ధిదాతావు
జానకీమాతకు ప్రియమైనదూత విఠల!
32.
రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా
రామ నామము నిత్యం జపిస్తావు
రామ రసాయనమును సేవిస్తావు
రామునికి సదా దాస్యముచేస్తావు
రామ రూపము మదిలో ధరిస్తావు
రఘుపతికిష్టుడు మారుతి విఠల!
33.
తుమ్హరే భజన రామ కో పావై
జన్మ జన్మ కే దుఃఖ బిసరావై
నీ భజన చేసినవారు తరిస్తారు
అందరు రామున్నే పొందుతారు
జన్మ జన్మల దుఃఖం వీడుతారు
సుఖ సంతోషాలు పొందుతారు
వారు ముక్తినే పొందెదరు విఠల!
34.
అంత కాల రఘువర పుర జాయీ
జహా జన్మ హరి భక్త కహాయీ
మరణకాల సమయమున భక్తులందరు
రఘువరుని ధామమును చేరుకుంటారు
అక్కడ హరిభక్తులుగా కీర్తించబడుతారు
సకల పాపాలనుండి తొలగింపబడుతారు
హనుమద్భక్తుడే శ్రీరాముని భక్తుడు విఠల!
35.
ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేహీ సర్వ సుఖ కరయీ
అన్య దేవతలెవ్వరిని కొలవకు
వారిని చిత్తమ్మునందు తలవకు
హనుమంతుడినెప్పటికి వదలకు
సర్వ సుఖదాయకుడని మరవకు
మారుతి సకల దుఃఖహరుడు విఠల!
36.
సంకట కటై మిటై సబ పీరా
జో సుమిరై హనుమత బలబీరా
సంకటములన్ని తొలగి పోవును
సమస్త పీడలన్ని సమసి పోవును
హనుమంతుడిని స్మరించ వలెను
మహాబలవీరుణ్ణి ధ్యానించవలెను
కష్ట నష్టములు తొలగును విఠల!
37.
జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరో గురుదేవ కీ నాయీ
మహా హనుమాన్ గోసాయికి జయము
గురుదేవ సముడు మారుతికి జయము
కృప దయగల ఆంజనేయునికి జయము
పవనపుత్రుడు బజరంగీ బలీకి జయము
జగద్రక్షకుడు మారుతికి జయము విఠల!
38.
జో శత బార పాఠ కర కొయీ
చూటహి బంది మహా సుఖ హోయీ
వంద సార్లు ఎవరైతే చాలీసా జపించెదరో
ప్రతి నిత్యము ఎవరైతే దీనిని పఠించెదరో
రామనామము వలే ఎవరు ధ్యానించెదరో
ఎవరైతే వీరహనుమంతుడిని సేవించెదరో
బంధముక్తికలిగి సుఖం లభించును విఠల!
39.
జో యహ పడై హనుమాన చాలీసా
హోయా సిద్ధి శాఖీ గౌరీసా
జనుమాన్ చాలీసాను చదివిన వారు
హనుమను రాముడిని సేవించినవారు
పరమాత్మను పరమసిద్ధిని పొందుతారు
శివపార్వతులు దీనికి సాక్షిగావుంటారు
అంజనీసుతుడు ముక్తిదాయకుడు విఠల!
40.
తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా
తులసీదాసు ఎప్పటికీ హరి భక్తుడు
శ్రీరామచంద్రునికి ఎల్లవేళా దాసుడు
ఆయన నా హృదయంలో వుంటాడు
నాకు ఆ హనుమంతుడే సంరక్షకుడు
హనుమంతుడే నాకు దైవము విఠల!
పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసవు సుర భూప
పవన తనయుడు సంకతములు హరిస్తాడు
మంగళ మొయిర్తి స్వరూపుడై దీవెనలిస్తాడు
రామలక్ష్మణ సీతా సహితముగా నివసిస్తాడు
నా హృదయములో శాశ్వతముగా వసిస్తాడు
సురులకు రాజు నా శ్రీరామచంద్రుడు విఠల!
పవన తనయ హనుమాన్ కీ జై
తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా
పంచపదుల రూపములో....
రచన:
కాటేగారు పాండు రంగ విఠల్
హైదరాబాద్
9440530763
సేకరణ
పంచపదులలోకి అనువాదం
కే. పాండు రంగ విఠల్
అతులిత బలధామం
స్వర్ణ శైలాభ దేహం౹౹
దనుజ వన కృశానుం
జ్ఞానినామగ్రగణ్యమ్౹౹
అత్యంత బలసంపన్నుడైనట్టి వాడు
స్వర్ణ శైలాభ దేహం కలిగినట్టి వాడు
దానవవనం దహనం చేసినట్టి వాడు
జ్ఞానులందు అగ్రగణ్యుడైనట్టి వాడు
మారుతి!అంజనీ తనయుడు విఠల!
సకలగుణ నిధానం
వానరాణా మధీశం౹౹
రఘుపతి ప్రియభక్తం
వాతజాతం నమామి౹౹
సకల సుగుణ నిధియైనట్టి వాడు
వానరులందు శ్రేష్టమైనట్టి వాడు
రఘుపతికతి ప్రియమైనట్టి వాడు
వాయుదేవునికి సుతుడైనట్టి వాడు
మారుతీ!నామామి నమామి విఠల!
గోష్పదీకృత వారాశిం
మశకీకృత రాక్షసం౹౹
రామాయణ మహామాలా
రత్నం వందే అనిలాత్మజం
గో డెక్కలా భావించి సాగరం లంఘించిన
రాక్షసులను చంపి మశకాలుగా భావించిన
రామాయణంను మహామాలగా తలంచిన
దానినే అతి విలువైన రత్నముగానెంచిన
అనిలాత్మజా!వందనం శతవందనం విఠల!
యత్రయత్ర రఘునాథ కీర్తనం౹౹
తత్రతత్ర కృతమస్తకాంజలిం౹౹
భాష్పవారి పరిపూర్ణ లోచనం౹౹
మారుతిం నమత రాక్షసాంతకం ౹౹
ఎక్కడెక్కడ రఘునాథుడు కీర్తించ బడును
అక్కడక్కడ హనుమ మస్తకం దించుకొనును
కళ్ళ నీళ్ళతో రఘురాముణ్ణి అభిషేకించును
రాక్షస మూకలందరిని సంహారమొనర్చును
రామభక్తా!మారుతీ!నమస్కారము!విఠల!
శ్రీగురుచరణ సరోజ రజ
నిజమన ముకుర సుధారి౹౹
వరణౌ రఘువర విమల
యశ జో దాయక ఫలచారి౹౹
నేను నా గురు చరణములకు మ్రొక్కెదను
సరోజ రజమును మనసారా ధరించెదను
విమలుడైన రఘురామ వరం పొందెదను
యశస్సునందించు శ్రీరాముని కీర్తించెదను
సుఫలమునొసగును సీతారాముడు విఠల!
బుద్ధిహీన తను జానికై
సుమిరౌ పవన కుమార౹౹
బలబుద్ధి విద్యా దేహి మోహి
హరహు కలేస వికార౹౹
దశరథ తనయా!రామా!నేను బుద్ధిహీనుడను
నేను పవన కుమారుడైన నిన్నే ధ్యానించెదను
ప్రభూ!బలం బుద్ధి విద్యలనివ్వమని వేడెదను
సకల క్లేశాలు వికారాలు హరించమని కోరెదను
నా మొరనాలకించి నన్ను కరుణించు విఠల!
1.
జయ హనుమాన జ్ఞాణగుణ సాగర
జయకపీశ తిహు లోక ఉజాగర
జయము జయము హనుమా!నీకు జయము
జ్ఞానము గుణములలో సాగరుడా!జయము!
జయము జయము కాపీశా!నీకు విజయము!
ముల్లోకాలకు వెలుగులనిచ్చువాడా!జయము
అంజనేయా!మారుతీ తనయా!జయం విఠల!
2.
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా
శ్రీరామచంద్రునికి దూతవు నీవు
అతులిత బలవంతుడవు నీవు
హనుమా!అంజనీపుత్రుడవు నీవు
పవనసుత నామధేయుడవు నీవు
ఆ శ్రీరామబంటువు నీవేగా విఠల!
3.
మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివారా సుమతి కే సంగీ
మహా వీరుడవు పరాక్రమవంతుడవు
జైజైజై బజరంగీ!నీవు మహాబలుడవు
నీవే దుర్బుద్ధి కుమతి నివారకూడవు
సుమతులందరికి నీవు స్నేహితుడవు
నా ఇలవేల్పువు దైవము నీవే విఠల!
4.
కంచన వరన విరాజ సువేసా
కానన కుండల కుంచిత కేశా
బంగారు వర్ణముతో విరాజిల్లుతున్నావు
అందమైన రూపముతో ప్రకాశిస్తున్నావు
చెవుల కుండలాలతో శోభిల్లుతున్నావు
ఉంగరాలున్న జుట్టుతో వెలిగిపోతున్నావు
వాయునందనా!వరములివ్వుము!విఠల!
5.
హాథ వజ్ర అరు ధ్వజా విరాజై
కాంధే మూంజా జనేవూ సాజై
ఒక చేతిలో వజ్రాయుధమును చేపట్టావు
మరో చేత ధ్వజంతో విరాజిల్లుతున్నావు
హనుమా!భుజంపై జంద్యము ధరించావు
దాని వలన బహు సుందరంగా వున్నావు
హనుమంతుడు శ్రీరాముని భక్తుడు విఠల!
6.
శంకర సువన కేసరి నందన
తేజ ప్రతాప మహా జగ వందన
నీవు శంకరునుకి తనయుడవు
నీవు వీర కేసరికి కుమారుడవు
మహా తేజ ప్రతాపవంతుడవు
సమస్త జగానికి వందితుడవు
ముల్లోక పూజితుడవు విఠల!
7.
విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివే కో ఆతుర
నీవు గొప్ప విద్యావంతుడవు
గుణవంతుడవు చతురుడవు
శ్రీరామ కార్య నిర్వాహకుడవు
పనిలో ఆతృత కలిగినవాడవు
మారుతి సుగుణుడు!విఠల!
8.
ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా
రామచంద్ర ప్రభువు చరిత్రను వింటావు
అది విని నీవు ఎంతగానో సంతోషిస్తావు
రామ లక్ష్మణ హృదయాలలో వుంటావు
నీవు సీతమ్మ మదిలో సదా నివసిస్తావు
ముగ్గురిపట్లా భక్తి కలిగుండును విఠల!
9.
సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా
వికట రూప ధరి లంక జరావా
సూక్ష్మాతి సూక్ష్మ రూపాన్ని ధరించెదవు
నీవు మహా తల్లి సీతకు అగుపించెదవు
వికటమైన క్రూర రూపంను ధరించెదవు
లంకా నగరాన్ని సమూలంగా కాల్చెదవు
కార్య దక్షుడు హనుమంతుడు విఠల!
10.
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్రకే కాజ సంవారే
మహా భీకర భీమ రూపం ధరిస్తావు
నీవు అసురులందరిని సంహరిస్తావు
ప్రభు శ్రీరామచంద్రుని దరి చేరుతావు
సకల కార్యాలను పరిపూర్తి చేస్తావు
ఇలలో హనుమకు సాటి లేరు విఠల!
11.
లాయ సజీవన లఖన జియాయే
శ్రీరఘువీర హరషి ఉరలాయే
నీవు మృతసంజీవనిని తీసుకొనివచ్చావు
రామ సోదరుడు లక్ష్మణుణ్ణి బతికించావు
శ్రీరామ రఘువీరుణ్ని సంతోష పరిచావు
ఎదకు హత్తుకుంటే ఎంతో ఆనందించావు
రాముని హృదయంలో నిలిచాడు విఠల!
12.
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
కహా భరత సమ తుమ ప్రియ భాయీ
రఘుపతి నిన్ను గొప్పగా పగిడినాడు
నీవు మహాబలవంతుడవని అన్నాడు
భరతునితో సమానుడవని అన్నాడు
నీవూ ప్రియ సహోదరుడవే అన్నాడు
మారుతి రాము మెప్పుపొందె విఠల!
13.
సహస్ర వదన తుమ్హరో యస గావై
అసకహి శ్రీపతి కంఠ లగావై
జగమున నిను వేనోళ్లా పొగడుతారు
నీ యశస్సును కీర్తిని గానము చేస్తారు
రామ లక్ష్మణులు కౌగిలించుకుంటారు
మనసారా వారిరువురు చేరదీస్తారు
సీత మారుతిని చూసి మురిసె విఠల!
14.
సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా
సనకాది మునీశ్వరులందరు
బ్రహ్మాదులు మహర్షులందరు
నారద శారదాదులు అందరు
ఆదిశేషుడాది దేవతలందరు
హనుమను కీర్తించెదరు విఠల!
15.
యమ కుబేర దిగపాల జహాతే
కవి కోవిద కహి సకే కహా తే
యమ కుబేరులు నీ మహిత చెప్పుకుంటారు
అష్ట దిక్పాలకులందరు చరిత చెప్పుకుంటారు
కవికోవిదులందర కూడ నీకథ చెప్పుకుంటారు
భువిలో పండితులు నీ ఘనత చెప్పుకుంటారు
ఊరువాడ ప్రతిఇంటా నీ నామ గానమే విఠల!
16.
తుమ ఉపకార సుగ్రీవ హి కీన్హా
రామ మిలాయా రజపద దీన్హా
నీవు మహోపకారమును అందించినావు
సుగ్రీవునికి సహకారము నందించినావు
అతనిని శ్రీరామచంద్రునితో కలిపినావు
రాజపదవిని సుగ్రీవునికి ఇప్పించినావు
మారుతి స్నేహానికి ప్రాణమిచ్చు విఠల!
17.
తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా
నీవు చెప్పిన మాట మంత్రంగా భావించాడు
విభీషణుడు లంకకు మహారాజు అయ్యాడు
అతడు శ్రీరామునిదయకు పాత్రుడయ్యాడు
శ్రీరామ భక్తిని జగమంతటికి తెలియజేశాడు
భక్తికి పరాకాష్ట వాయునందనుడేగా విఠల!
18.
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహీ మధుర ఫల జానూ
సహస్ర యోజనముల దూరాన వున్నాడు
భానుడు వెలుగులీనుతూ ప్రకాశిస్తున్నాడు
హనుమ దానిని ఫలముగా భావించినాడు
దాని చెంతకెళ్లి చేత తీసుకొని మింగినాడు
అపారమైన శక్తిమంతుడు మారుతి విఠల!
19.
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ
జలది లాంఘి గయే అచరజ నాహీ
రామచంద్ర ప్రభు ముద్రిక తీసుకున్నావు
దానిని నీ నోటిలో గట్టిగా పట్టుకున్నావు
రాముని నామం బిగ్గరగా జపించినావు
నీవు మహా సాగరాన్ని లంఘించినావు
మారుతి దాటడమాశ్ఛర్యం కాదు విఠల!
20.
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
దుర్గమమైన కార్యాలన్ని పూర్తి చేస్తావు
అవసరమైతే జగత్తునే నీవు జయిస్తావు
సుగమమైన మార్గమును అనుగ్రహిస్తావు
నీవసాధ్యమును సుసాధ్యము చేసేస్తావు
ఇవన్నియు మారుతికే సాధ్యము విఠల!
21.
రామ దువారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే
రాముని దీవెనలను అందుకున్నవాడవు
ఆయన తరపున నీవేగా మా రక్షకుడవు
నీవేగా రాముని దర్శనం కల్పించువాడవు
నీవేగా ఆజ్ఞ అనుజ్ఞ ప్రవేశమిచ్చువాడవు
మారుతియే భక్తజన సంరక్షకుడు విఠల!
22.
సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డరనా
నీ శరణాగతి పొందినవారు ముక్తి పొందుతారు
అందరు సుఖము సౌఖ్యములను పొందుతారు
నీవు రక్షగా వుంటే భయము భీతిని వీడుతారు
నీఅండదండ వుంటే చింతలన్నియు వీడుతారు
ఆపదలుతొలగించును అంజనీసుతుడు విఠల!
23.
ఆపన తేజ సంహారో ఆపై
తీనో లోక హాంక తే కాంపే
హనుమంతునిలోని తేజస్సు ప్రకాశము
అనితరసాధ్యమైన బలం పరాక్రమము
శత్రువుపై చేసే భయంకర పెనుగర్జనము
దానిని విని కంపించునుగా ముల్లోకము
మారుతీ!రాక్షసులకు యముడవే విఠల!
24.
భూత పిశాచ నికట నహి ఆవై
మహావీర జబ నామ సునావై
నీ నామం జపిస్తే పిశాచాలు దరిచేరవు
నిన్ను స్మరిస్తే భూతాలు చెంతకు చేరవు
నీ పేరు వినిపిస్తే ప్రేతాలు దగ్గరకు చేరవు
మహావీరుడిని తలిస్తే దయ్యాలూ చేరవు
అన్నిటికి నీ నామం మహామంత్రం విఠల!
25.
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత్ వీరా
రోగాలన్ని పరిపూర్ణంగా నశించిపోవును
పీడలన్ని సమూలంగా హరించిపోవును
కష్టాలన్ని సంపూర్ణంగా తొలగి పోవును
పాపాలన్నియూ పటాపంచలై పోవును
వీరహనుమంతుణ్ణి నమ్ముకోవలె విఠల!
26.
సంకట సే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లగావై
27.
సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజా సకల తుమ సాజా
తాపసులలోకెల్లా గొప్పనైన వాడు
వారందరిలోను ప్రభులాంటి వాడు
రాముని కార్యాన్ని సాధించే వాడు
సమస్తమైన పనులు నెరవేర్చే వాడు
మారుతియే అందరి రక్షకుడు విఠల!
28.
ఔర మనోరథ జో కోయీ లావై
సోయి అమిత జీవన ఫల పావై
నిన్ను వేడినచో మనోరథము నెరవేరును
భక్తులు కోరుకున్న కోరిలన్నియు తీరును
నిన్ను సేవిస్తే జీవనము సఫలమైతీరును
ఆనంత ఫలములు తప్పక అందితీరును
వేరే వారిని భజించుటయే వ్యర్థం విఠల!
29.
చారో యుగ పరతాప తుమ్హారా
హై వరసిద్ధి జగత ఉజియారా
నాలుగు యుగాలయందు నీ ప్రతాపము
ముల్లోకాలయందు నీ భజన స్మరణము
జగతియందు వ్యాపించింది నీ ప్రకాశము
నీ నామమే వరదాయిని సిద్ధి దాయకము
అంజనీపుత్రుడు మహిమాన్వితుడు విఠల!
30.
సాధు సంత కే తుమ రఖ వారే
అసుర నికందను రామ దులారే
నీవు సాధువులందరి రక్షకుడవు
సంత్ సజ్జనులందరి సంరక్షకుడవు
అసుర జనులందరి సంహారకుడవు
రామ భక్తులందరి పరిపోషకుడవు
నిను తలిస్తే కష్టాలు తొలగు విఠల!
31.
అష్టసిద్ధి నవ నిధి కే దాతా
అసవర దీన జానకీ మాతా
నీవు అష్ట సిద్ధులను అందించు దాతవు
నవ నిధులను సమకూర్చు సంధాతవు
దీవెనెలనందించే దీనజన వర దాతవు
భక్తజన మహాశయులకు సిద్ధిదాతావు
జానకీమాతకు ప్రియమైనదూత విఠల!
32.
రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా
రామ నామము నిత్యం జపిస్తావు
రామ రసాయనమును సేవిస్తావు
రామునికి సదా దాస్యముచేస్తావు
రామ రూపము మదిలో ధరిస్తావు
రఘుపతికిష్టుడు మారుతి విఠల!
33.
తుమ్హరే భజన రామ కో పావై
జన్మ జన్మ కే దుఃఖ బిసరావై
నీ భజన చేసినవారు తరిస్తారు
అందరు రామున్నే పొందుతారు
జన్మ జన్మల దుఃఖం వీడుతారు
సుఖ సంతోషాలు పొందుతారు
వారు ముక్తినే పొందెదరు విఠల!
34.
అంత కాల రఘువర పుర జాయీ
జహా జన్మ హరి భక్త కహాయీ
మరణకాల సమయమున భక్తులందరు
రఘువరుని ధామమును చేరుకుంటారు
అక్కడ హరిభక్తులుగా కీర్తించబడుతారు
సకల పాపాలనుండి తొలగింపబడుతారు
హనుమద్భక్తుడే శ్రీరాముని భక్తుడు విఠల!
35.
ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేహీ సర్వ సుఖ కరయీ
అన్య దేవతలెవ్వరిని కొలవకు
వారిని చిత్తమ్మునందు తలవకు
హనుమంతుడినెప్పటికి వదలకు
సర్వ సుఖదాయకుడని మరవకు
మారుతి సకల దుఃఖహరుడు విఠల!
36.
సంకట కటై మిటై సబ పీరా
జో సుమిరై హనుమత బలబీరా
సంకటములన్ని తొలగి పోవును
సమస్త పీడలన్ని సమసి పోవును
హనుమంతుడిని స్మరించ వలెను
మహాబలవీరుణ్ణి ధ్యానించవలెను
కష్ట నష్టములు తొలగును విఠల!
37.
జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరో గురుదేవ కీ నాయీ
మహా హనుమాన్ గోసాయికి జయము
గురుదేవ సముడు మారుతికి జయము
కృప దయగల ఆంజనేయునికి జయము
పవనపుత్రుడు బజరంగీ బలీకి జయము
జగద్రక్షకుడు మారుతికి జయము విఠల!
38.
జో శత బార పాఠ కర కొయీ
చూటహి బంది మహా సుఖ హోయీ
వంద సార్లు ఎవరైతే చాలీసా జపించెదరో
ప్రతి నిత్యము ఎవరైతే దీనిని పఠించెదరో
రామనామము వలే ఎవరు ధ్యానించెదరో
ఎవరైతే వీరహనుమంతుడిని సేవించెదరో
బంధముక్తికలిగి సుఖం లభించును విఠల!
39.
జో యహ పడై హనుమాన చాలీసా
హోయా సిద్ధి శాఖీ గౌరీసా
జనుమాన్ చాలీసాను చదివిన వారు
హనుమను రాముడిని సేవించినవారు
పరమాత్మను పరమసిద్ధిని పొందుతారు
శివపార్వతులు దీనికి సాక్షిగావుంటారు
అంజనీసుతుడు ముక్తిదాయకుడు విఠల!
40.
తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా
తులసీదాసు ఎప్పటికీ హరి భక్తుడు
శ్రీరామచంద్రునికి ఎల్లవేళా దాసుడు
ఆయన నా హృదయంలో వుంటాడు
నాకు ఆ హనుమంతుడే సంరక్షకుడు
హనుమంతుడే నాకు దైవము విఠల!
పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసవు సుర భూప
పవన తనయుడు సంకతములు హరిస్తాడు
మంగళ మొయిర్తి స్వరూపుడై దీవెనలిస్తాడు
రామలక్ష్మణ సీతా సహితముగా నివసిస్తాడు
నా హృదయములో శాశ్వతముగా వసిస్తాడు
సురులకు రాజు నా శ్రీరామచంద్రుడు విఠల!
పవన తనయ హనుమాన్ కీ జై
తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా
పంచపదుల రూపములో....
రచన:
కాటేగారు పాండు రంగ విఠల్
హైదరాబాద్
9440530763
సేకరణ
No comments:
Post a Comment