నీ వాకిట నా జ్ఞాపకాలు!
---------------------------------------
తిరిగి రానిక నేస్తం
మరలి రాను!
సెలవిక మన ఊసులకు
సెలవు సెలవు మన బాసలకు!
వెళుతూ వెళుతూ
నీ ఇంటి వాకిట
నా జ్ఞాపకాలను విడిచి వెళుతున్నాను
నువ్వు ఉదయాన్నే వాటిని ఊడ్చివేసినా
సాయంత్రానికల్లా అవి ధూళిలా మరల రాలతాయి
జ్ఞాపకాలు కదా!
జన్మ ముగిసేవరకూ ఉంటాయి!!
ఇదో,
నేనీ రాతిరి బండికి వెళుతున్నాను
నాకిక ఉదయం లేదు
నా మనసిక చేదు
నువు తొక్కేసి వెళ్లిన నా మనసు
నువు విసిరేసి వెళ్లిన నా మనసు
ఇదో,
ఈ నా లేఖలో అక్షరాలుగా
అశ్రువులు కారుస్తోంది!
మరపు నీకు వాడిన మల్లెలు తీసేసినంత సులువు
మరపు నాకు మృత్యువంత వగపు!
ఏదోలే,
నీకు నీ జీవితం ఉంది
గడిపేస్తావు,
జ్ఞాపకాలను ఊడ్చేస్తూ!
అంతేలే,
నాకు నా హృదయం ఉంది
గాయాలకు మందు పూస్తూ!!
కానీ నేస్తం,
ఇది నిజం,
నువ్వు నిదురించే ముందు
నిట్టూరుపు విడుస్తావు!
నేను మరణించే ముందు
నిన్నే తలుస్తాను!!
--- దండమూడి శ్రీచరణ్
9866188266
సేకరణ
---------------------------------------
తిరిగి రానిక నేస్తం
మరలి రాను!
సెలవిక మన ఊసులకు
సెలవు సెలవు మన బాసలకు!
వెళుతూ వెళుతూ
నీ ఇంటి వాకిట
నా జ్ఞాపకాలను విడిచి వెళుతున్నాను
నువ్వు ఉదయాన్నే వాటిని ఊడ్చివేసినా
సాయంత్రానికల్లా అవి ధూళిలా మరల రాలతాయి
జ్ఞాపకాలు కదా!
జన్మ ముగిసేవరకూ ఉంటాయి!!
ఇదో,
నేనీ రాతిరి బండికి వెళుతున్నాను
నాకిక ఉదయం లేదు
నా మనసిక చేదు
నువు తొక్కేసి వెళ్లిన నా మనసు
నువు విసిరేసి వెళ్లిన నా మనసు
ఇదో,
ఈ నా లేఖలో అక్షరాలుగా
అశ్రువులు కారుస్తోంది!
మరపు నీకు వాడిన మల్లెలు తీసేసినంత సులువు
మరపు నాకు మృత్యువంత వగపు!
ఏదోలే,
నీకు నీ జీవితం ఉంది
గడిపేస్తావు,
జ్ఞాపకాలను ఊడ్చేస్తూ!
అంతేలే,
నాకు నా హృదయం ఉంది
గాయాలకు మందు పూస్తూ!!
కానీ నేస్తం,
ఇది నిజం,
నువ్వు నిదురించే ముందు
నిట్టూరుపు విడుస్తావు!
నేను మరణించే ముందు
నిన్నే తలుస్తాను!!
--- దండమూడి శ్రీచరణ్
9866188266
సేకరణ
No comments:
Post a Comment