Wednesday, March 23, 2022

🌹 స్నేహం 🌹from 🌺 జీవిత రహస్యాలు ( ఓషో) 🌺

🌺 జీవిత రహస్యాలు ( ఓషో) 🌺
🌷 Part -- 5 🌷
🌹 స్నేహం 🌹

🌳 నిజమైన స్నేహితుడెవరు? అని అడగకండి. నేను ఎవరికైనా నిజమైన స్నేహితుడినా? అని అడగండి. ఇది సరైన ప్రశ్న.ఇతరుల సంగతి నీకెందుకు? వారు నీకు స్నేహితులు అవునా? కదా? అన్న సమస్య ఎందుకు?

🍀 మన ప్రవర్తనను బట్టి మిత్రులు, శత్రువులు నిజమైన స్నేహితులు అని తయారవుతారు. కానీ ముందుగానే వారు ఆ విధంగా ఉండరు.

☘️ 'ఎవరైతే అవసరంలో ఆదుకుంటారో వారు నిజమైన స్నేహితులు' అయితే ఆ సామేతలో చాలా అత్యాశ కనిపిస్తుంది. అది స్నేహం కాదు. నీవు స్నేహితుడిని అవసరానికి ఉపయోగపడే వస్తువులా వాడుకోవాలనుకుంటున్నావు. ప్రతి మనిషి అతనికతడే ఒక లక్ష్యం. సహాయం చేసే పరిస్థితిలో నీ స్నేహితుడు ఉంటే అతను తప్పక సహాయం చేస్తాడు. ఆ పరిస్థితిలో అతను లేకపోతే అతను నిజమైన స్నేహితుడైన కూడా నీకు సహాయం చేయలేడు.

🏵️ ఏదో ఒకరి పట్ల ప్రత్యేకంగా స్నేహంగా ఉండనక్కర లేదు. అది కుళ్ళిపోయిన ఆలోచన. స్నేహ బంధాన్ని సృష్టించడం కంటే స్నేహాన్ని సృష్టించు.

🌸 ఎవరైనా మీతో స్నేహంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని గురించి భాధపడకండి.అది ఒక వ్యాపారం ఎందుకు భాధపడాలి?మొత్తం ఈ సృష్టిని నీ స్నేహితునిగా ఎందుకు మార్చుకోకూడదు?

🌿 ఈ సృష్టితో స్నేహంగా ఉంటే సృష్టి అంతకు కొన్ని వేల రేట్లు నీతో స్నేహంగా ఉంటుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సేకరణ

No comments:

Post a Comment