Tuesday, March 22, 2022

రక్షణ లేని లోకంలో రాలుతున్న పువ్వులు - విఠల పంచ పది

రక్షణ లేని లోకంలో రాలుతున్న పువ్వులు

యువకులు మొదలు వృద్ధుల వరకు నమ్మకూడదు
పొరుగు పురుషపుంగవులను విశ్వసించకూడదు
ఎదిగే ఆడపిల్లకు జాగ్రత్త చెప్పడం మరువకూడదు
మన దగ్గరి బంధువులతోనూ చనువు కూడదు
మానవుడెప్పుడు మృగమౌనో తెలియదు విఠల!

నమ్మించి వంచించేవారు మన చుట్టూవున్నారు
ప్రేమించి మోసగించేవారు అడుగడుగునవున్నారు
రక్షకులనుకున్నవారు రాక్షసులై భక్షకులౌతున్నారు
సినిమా సోషల్మీడియాతో పెడదారిపడుతున్నారు
చుట్టూ పాములు తోడేళ్ళు మేకవన్నె పులులున్నవి విఠల!


తల్లిదండ్రులు పుత్రులను సన్మార్గంలో పెట్టాలి
వారి దినచర్యపై నిరంతరం ఓ కన్నేసి వుంచాలి
పిల్లల ప్రవర్తన స్నేహాలను నిత్యం గమనించాలి
ఫోన్ వాడే విధానాన్ని నిశితంగా పర్యవేక్షించాలి
చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే వ్యర్థమే విఠల!

సేకరణ

No comments:

Post a Comment