Monday, March 21, 2022

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు.. అది దంపతులు పార్వతిపరమేశ్వరుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
సోమ వారం --: 21-03-2022 :--

మాట జారితే క్షమాపణ అడగవొచ్చు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ బంధం దూరమైతే మళ్ళీ తిరిగి దగ్గర అవ్వటం చాలా కష్టం మాట, డబ్బు కన్నా బంధమే విలువైనది

మనలో మంచి తనం ఉంటే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు, మనకు సొంతము అనుకున్నా వాటిపై నిర్లక్ష్యం సొంతం కానీ వాటిపై వ్యామోహం రెండు ప్రమాదమే ,

ఒక మనిషి గురించి మరో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు వి‌షయాలు.. ఒకటి చేతితో చేసిన సాయం రొండు మాటతో మనసుకు చేసిన గాయం

ప్రతి రోజూ మనం ఒకరి కన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి అది ఎవరో కాదు నిన్నటి నువ్వే .

ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదు అయిన అహంకారం పొగరు అసూయ గర్వం లాంటివి కొనే స్తోమత నాకు లేదు అందుకే చిరునవ్వు ప్రేమ ఆప్యాయత నమ్మకం సంతోషం లాంటి చవకైనా వాటితో సద్దుకు పోతాను , నిన్న గురించి భయపడే వారు,,, నేడు పోరాడ లేదు , నేడు పోరాడ లేని వారు,,,రేపు గెలువ లేడు , గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి అప్పుడే విజయం నీ సొంతమవుతుంది .

అబద్దాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి దురదృష్టం ఏంటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారు గా ముద్ర పడుతున్నారు...అబద్దాలు చెప్పేవారు మాత్రం మంచివారుగా చెలామణి అవుతున్నారు..ఇదే నేటి లోకం తీరు.. కానీ ఎదో ఒకనాటికి నిజం దెబ్బకు అబద్దం పారిపోక తప్పదు అని గ్రహిస్తే చాలు

మనం మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు...మనల్ని మనం మార్చుకోవాలి... అప్పుడు ప్రపంచం అదే మారుతుంది...కాబట్టి ముందు నీ తప్పుల్ని నువు సరిదిద్దుకొని తర్వాత ప్రపంచాన్ని సరిదిద్దు .

సేకరణ ✒️మీ ...ఆత్మీయ బంధువు.. AVB సుబ్బారావు 🚩🚩🚩

సేకరణ

No comments:

Post a Comment