మితి మీరిన విశ్వాసం
ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకముండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్టిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి భోధనలు చేయడానికి పల్లెటూళ్ల వైపు వెళ్లాడు.
అలా వెళ్లగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్లందరూ తామే మేధావులం అని అనుకునేవాళ్లే. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైనవాడని నిరూపించుకోవలసి ఉంటుంది. తన మేధస్సుపట్ల ఎంతో నమ్మకమున్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్లి తను ఆ వ్యక్తి కంటే తెలివైనవాడినని నిరూపించుకోదలిచాడు.
తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణాలు ఇవ్వాలి. అని యువకుడు షరతు విధించాడు.
యువకుడు ఆ వ్యక్తిని "ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న" అంటూ ఊరించాడు. ఊరు ఊరంతా ఆ క్విజ్‌ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు,' ఇంగ్లండ్ రాజధాని ఏది?'
"నాకు తెలియదు. నేను నీకు మూడు నాణాలిస్తాను" అని అవతలి వ్యక్తి అన్నాడు.
'లండన్' అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు.
"వేగంగా తిరుగుది, కానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు, ఏంటది? అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు.
"నాకు తెలీదు. నీకు మూడు నాణాలు ఇచ్చేస్తాను" అన్నాడా వ్యక్తి.
'భూమి' అని చెప్పి మరో మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు యువకుడు.
యువకుడు "పగలు పైకెళ్లి, రాత్రి కిందకు దిగేది ఏంటి? అని మూడో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి నాకు తెలీదు.
నీకు మరో మూడు నాణాలు ఇచ్చేస్తాను" అన్నాడు.
మొత్తం తొమ్మిది నాణాలు పొందిన యువకుడు సంతోషించగా, పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలెట్టింది.
ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే ఐదువేల నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు.
ఆ వ్యక్తి "ఉదయం రెండు కాళ్లతో, మధ్యాహ్నం నాలుగు కాళ్లతో నడిచేది ఏది"? అని అడిగాడు.ఆ ప్రశ్నవిన్న యువకుడి నోటి మాట పెగల్లేదు. జుట్టు గోక్కోవడం మొదలెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దనున్న ఐదువేల నాణాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు.
కుతూహలం పట్టలేక యువకుడు "ఉదయం రెండు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం ఆరు కాళ్లతోనడిచేది ఏంటి?" అని అడిగాడు ఆ వ్యక్తిని.
"ఏమో నాక్కూడా తెలీదు నీకు మూడు నాణాలు ఇస్తాను" అన్నాడా వ్యక్తి.
అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది.
సేకరణ

No comments:
Post a Comment