🌺 జీవిత రహస్యాలు ( ఓషో) 🌺
🌷 Part -- 4 🌷
🌹 పెళ్ళి చేసుకుని స్వేచ్ఛగా ఉండడం సాధ్యమేనా? 🌹
🍁 ఈ క్రింది విషయాలను తెలుసుకొని వాటిని విశ్వసించి , ఆచరిస్తే ఎవరైన పెళ్ళి చేసుకుని స్వేఛగా ఉండవచ్చు .
🌴 ఎవరూ మరొకరి కోసం పుట్ట లేదు .
💮 మీ ఆదర్శాలను , మీ అభిప్రాయలను అనుసరించడానికి , మీ ఆదర్శాలకనుగుణంగా జీవించడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు .
🏵️ నీవు ఎంత కావాలంటే అంత ప్రేమను ఇవ్వగలను . కానీ , నీవు ఇతరులను ప్రేమకోసం ఒత్తిడి చేయలేవు . ఇతరుల నుండి ప్రేమను ఒత్తిడితో పొందలేవు . ఎందుకంటే ఎవరూ ఇక్కడ బానిస కాదు .
🌸 ఈ పెళ్ళి ఆట మాత్రమే , దీన్ని పెద్ద విషయంగా తీసుకోవద్దు . పెళ్ళికి ముందు ఎంత స్వతంత్రంగా ఉన్నామో ఇప్పటి నుంచి అలాగే ఉండాలి . నా జీవితంలో నీవు నీ జీవితంలో నేను కలగజేసుకోకూడదు . ఇద్దరం స్నేహితుల్లో జీవిద్దాం . సంతోషాన్ని , దుఃఖాన్ని స్వేచ్ఛని పంచుకుందాం. ఎప్పటికీ ఒకరికి ఒకరం భారం కాకుండా బ్రతుకుందాం , మన మార్గాలు వేరయ్యె రోజు వచ్చినప్పుడు అది బాధాకరమైనదైతే విడిపోదాం " అని నీవు పెళ్ళి చేసుకునే వారితో ఈ విధంగా చెప్పాలి నువ్వు.
☘️ నేను నిన్ను నిజంగా ప్రేమిస్తే , నా ప్రేమ నీకు ఎప్పుడైతే వేదనగా పరిణమిస్తుందో ఆ క్షణమే నిన్ను నేను వదిలేస్తాను. నీవు నన్ను ప్రేమిస్తే నాకు నీ ప్రేమ ఎప్పుడైతే బంధంగా పరిణమిస్తుందో అప్పుడు నీవు నన్ను వదిలేస్తావు " అని చెప్పాలి.
🍀 నీవు దేనినైనా గంభీరంగా తీసుకుంటే అది నీకు స్వేచ్ఛగా అనిపించదు .
🌳 నీవు దేనినైనా గంభీరంగా తీసుకోకుంటే అది నీకు స్వేచ్ఛగా ఉంటుంది .
🌲 పేమ, స్వేచ్ఛ రెండూ కలసే ఉంటాయి . నీవు ఒక దాన్ని మాత్రమే తీసుకొని మరొక దాన్ని విస్మరించలేవు . ఎవరికైతే స్వేచ్ఛ తెలుసో , వారు ప్రేమ స్వరూపులవుతారు. ఎవరికైతే ప్రేమందో వారు స్వేచ్ఛ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటారు . నీవు ప్రేమించిన వ్యక్తికి స్వేచ్ఛను ఇవ్వలేకపోతే మరెవరికి ఇవ్వగలవు ?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సేకరణ
No comments:
Post a Comment