Sunday, March 20, 2022

మహాదేవా శరణు శరణు

శివయ్యా..!!!

నా బంధువులను
కుటుంబాన్ని
స్నేహితులను
సన్నిహితులను
మెప్పించలేనైతి

నన్ను నేనునూ
మెప్పించలేకున్నాను

మరి నిన్ను నేను
మెప్పించగలనా?
ఒప్పించగలనా ?

నీ పాదములు
పట్టిన ఎందరినో
కరుణతో కటాక్షించితివని
ఎరిగితిని

నీ స్మరణను
చేసిన ఎందరినో
దయతో ఆదరించితివని
విన్నాను

నిన్నే మదిలో
నిలిపిన ఎందరినో
వాత్సల్యముతో కలుపుకుంటివని
తెలుసుకున్నాను

ఒప్పుకోళ్లు, మెప్పుకోళ్లు
అలకలు, ఆక్రోశాలు
ఆవేదనలు, అభ్యర్ధనలు
కోపాలు, తాపాలు
ఎందుకు
శివయ్యా ??

అజ్ఞానమో
అమాయకత్వమో
అసూయో
అర్ధం లేని మూర్ఖత్వమో
నాది

నీవు
జ్ఞాన నిధివి
నాతో నీకు పంతమేల ?

నీది నాది
జీవునకు శివునకు
ఉన్న బంధము

నేను లేక నీవు లేవు
నీవు లేక నేను లేను
నేనే నీవు
నీవే నేను
అది చాలదా
ఆర్తితో అలమటించు
ఈ కింకరుని
నీ చెంతన చేర్చుటకు

మహాదేవా
శరణు శరణు

సేకరణ

No comments:

Post a Comment