Tuesday, March 22, 2022

మంచి మాట..లు

హనుమ స్తోత్రాః
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ।
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥

జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥

దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥


ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు 🌹💐🤝.. రామభక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి .. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ....
21-03-2022:-మంగళవారం
ఈ రోజు AVB మంచి మాట..లు

మనం చాలామందికి గొప్ప విలువను ఇస్తాం,, కానీ కొంతమంది విలువలు తెలియని మూర్కులు వారి వక్రబుద్ధిని చూపిస్తూనే వుంటారు, అందుకే అన్నారు కదా ఎనకటి పెద్దలు, చెప్పు తినే కుక్క చెరుకు తీపి ఎరుగునా అని,,


మనకు ఇష్టమైన వాళ్ళు మన పక్కన ఉంటే పల్లెవెలుగు బస్సులో అయినా హాయిగా ప్రయాణం చేస్తాం, అదే మనకు నచ్చని వారు మన పక్కన ఉంటే బెంజి కారులో కూడా ఇబ్బందిగానే ప్రయాణం చేస్తాం,,


జీవితంలో ఒకటి గుర్తుంచుకో,, మనం సమాధానంలో భాగం కావాలి, కానీ,, సమస్యలో భాగం కాకూడదు,,


రహస్యాన్ని కాపాడటం, తగిలిన గాయాన్ని మరిచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ మూడు చాలా కష్టతరమైన పనులు,,


మనం చేసిన మంచిని మరుక్షణంలోనే మరిచిపోవాలి, మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి,, కానీ కొంతమంది పొందిన మేలును మరుక్షణమే మరిచిపోతున్నారు,,పరవాలేదు దేముడు గుర్తుంచుకుంటాడు


మన కాలి గోటికి కూడా సరితూగని మనుషులే మనల్ని విమర్శిస్తారు, సమధీరులు ఎప్పుడు చిల్లర మాటలు మాట్లాడరు,,


జంగం దేవర పోతుంటే కుక్కలు మొరుగుతాయి, అట్లాగే మనం ఏదైనా మంచి పని చేస్తుంటే మనమంటే గిట్టని కొంతమంది విమర్షిస్తునే ఉంటారు, పెద్దగా పట్టించుకోకూడదు,, జంగం దేవరకు కుక్కలు ఎంతో, మనకు మనల్ని విమర్శించేవారు అంతే,,

ఎవరో ఒకరు మన రంగును, రూపాన్ని హేళన చేసినంత మాత్రాన మనకు ఉన్న విలువలు పాతాళానికి పడిపోవు, సముద్రంలో నీరు ఉప్పుగానే ఉండవచ్చు కానీ, దానిలో సంపదకు కోదువలేదు కదా, మనం కూడా అందంగా లేకపోవచ్చు, కానీ మన మంచితానానికి కొదవ లేదు కదా,,
సేకరణ ✒️ AVB సుబ్బారావు 📱9985255805🚩

సేకరణ

No comments:

Post a Comment