Saturday, October 1, 2022

12_రకాల_తపస్సులు

 #12_రకాల_తపస్సులు :-

12 రకాలైనటువంటి తపస్సులు ఉన్నాయి.. 

1. అస్వాద తపస్సు:- 

నాలికకి ఉప్పు, తీపి తగలనివ్వకపోవడం. ప్రతీ నెల ఒక మూడు రోజులు ఉప్పు, తీపి తినడం మానేయడం నేర్చుకోండి. 

2. తితిక్ష తపస్సు:- 

అంటే AC ఉంది కానీ వేసుకోరు, ఫ్యాన్ ఉంది కానీ వేసుకోరు, జోడు ఉంది ఎండాకాలం, కానీ జోడు లేకుండా నడుస్తారు ఎండాకాలం. తితీక్ష తపస్సు కష్టాలను భరించడం.

ఇవి ఎందుకు చేయమంటారు అంటే మన జీవితాలలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో తప్పు చేసి ఉంటారు. అవి పరిపాకం అవ్వడానికి చేయమంటారు. ఇష్టపడే భోజనం మానేస్తే దాని ఉపవాసం అంటాం. తినాలని ఉంది కానీ తినలేక పోతున్నారు అది శిక్ష అంటాం. భోజనం రోజుకి ఏదో ఒక టైం అనుకొని తినండి. ఈ రోజు 7 గంటలకి టిఫిన్ తింటాం అనుకుంటే 7 గంటలకే తినండి. రేపు 10 గంటలకు అనుకుంటే ఆ రేపు పది గంటలకే తినండి. మీకు వీలున్న సమయం అనుకొని ఆ సమయానికి ఆ పని అయ్యే విధంగా చేయండి. అది కూడా తితీక్ష తపస్సు అవుతుంది. కానీ కామన్ సెన్స్ ఉపయోగించండి. సకాలంలో చేయడం అంటాం దానిని.

3. కర్షణ తపస్సు:-

శుష్కింప చేసుకోవడం. మీరు చేయగలిగిన దాని కంటే ఎక్కువ సమయం కష్టపడటం. ఆ కష్టపడటం అనేది ఏదైనా కావచ్చు. మీరు ఒక రెండు గంటల పాటు ప్రశాంతంగా చదవగలరు అనుకుంటే మూడు గంటలు చదవండి. అది కర్షణ తపస్సు అంటే. ఇంట్లో పని చేస్తున్నపుడు కష్టంగా ఉన్నప్పుడు, ఈ వెదవ కర్మ ఇలా కష్టపెడుతోంది అనుకోకుండా చేసుకుంటే అది కర్షణ తపస్సు అవుతుంది. 

 4. ఉపవాసం:-

మనం ఈ ఉపవాసం అనెడి చాలా ఎక్కువగా సాధన చేయాలి. పౌర్ణమి రోజు అమావాస్య రోజున ఏదో ఒక రోజు అనుకొని, ఉపవాసం ఉండాలి. దాని వల్ల రోగాలు కూడా రావు, ఉన్నా తగ్గుముఖం పడతాయి. 

5 గవ్వకల్ప తపస్సు:-

ఇది ఇంద్రియాలకి సంబంధించిన ఒక విశిష్టమైన తపస్సు. ఏదో ఒక ఇంద్రియాన్ని మిగిలిన ఇంద్రియాలకంటే చాలా ఎక్కువగా వాడటం. చిన్నప్పటి నుంచి మనకి తెలియకుండానే ఈ తపస్సు చేస్తారు. చదువుకుంటున్న విద్యార్థులు కళ్ళకి ఎక్కువగా వాడుతారు మిగిలిన వాటి కంటే. 

6. ప్రదాతవ్య తపస్సు:-

మీకు ఉన్నది, మీ అవసరాలను తగ్గించుకొని ఇతరులకు ఇవ్వడం. మీకు ఉన్నది మీకు తగ్గించుకొని ఇతరులకు సహాయం చేయడం. 

7. నిష్కాసన తపస్సు:-

మన శరీరంలో ఉన్నటువంటి అనేక టాక్సిన్స్ తీసివేయడం. ఇది ఒక క్లీనింగ్ ప్రాసెస్ మన శరీరానికి. కానీ ఉత్తమమైన క్లీనింగ్ పద్దతి ఏంటి అంటే కేవలం పండ్లు, డ్రైఫ్రూట్స్ తినడం.

8. సాధనా తపస్సు:-

రోజుకి ఒక గంట సేపో లేక రెండు గంటలో లేక 5 గంటలో మన ఇష్టదేవతా మంత్రాన్ని ఒకే ఒక్క సిటింగ్ లో నియమిత సంఖ్యలో జపం చేస్తాను అనుకొని చేయాలి. అలా ఏదో ఒక మంత్రం, సాధనకి కొంత సమయం కేటాయించాలి ఇది సాధనా తపస్సు అనబడుతుంది. 

9. బ్రహ్మచర్యం:-

ఇంక దీనిని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ దీనిని గురించి కొంత అవగాహన ఉంది. 

10. చాంద్రాయణ తపస్సు:-

ఇది అద్భుతమైన తపస్సు. 12 సంవత్సరాల పాటు చాంద్రయాణ తపస్సు చేసిన వారికి ఏ పాపమ అంటదు అని చెప్పబడింది. వాడిని ముట్టుకున్న వాడికి కూడా పాపాలు నాశనం అవుతాయి అని చెప్పబడింది. గురువులని మనం ఎందుకు స్పర్శిస్తాం అంటే ఆ స్పర్శ చాలు మన పాపాలు పోగొట్టడానికి. చాంద్రాయణ తపస్సు లో చంద్రుని స్టెప్స్ తో పాటు మన ఆహరం తీసుకుంటాం మనం. పౌర్ణమి రోజు మాగ్జిమమ్ ఆహరం తీసుకుంటాం. ఆహరం కొలతలో రోజుకి 1/16 పార్ట్ తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య రోజున ఏమీ తీసుకోకుండా ఉండటం. మళ్ళీ అమావాస్య నాడు నుంచి రోజుకి 1/16 పార్ట్ పెంచుకుంటూ పోయి పౌర్ణమి రోజుకి మళ్ళీ ఫుల్ గా తీసుకోవడం. ఈ సైకిల్ ప్రాసెస్ లో పళ్ళు మాత్రమే తిన్నటువంటి వారికి జరిగే అద్భుతమైన అనుభవాలు, లాభాలు మనం ఊహించలేం. అమరత్వం దానితోనే వచ్చేస్తుంది ఏమో.. 

11. మౌన తపస్సు:-

రోజుకి ఒక గంట, లేక ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మిగిలిన సమయంలో కూడా అనవసరమైన పనికిమాలిన వాగుడు మానేయాలి. మాట్లాడే మాటలు కూడా ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా మాట్లాడటం, అవసరం అయితే తప్ప మాట్లాడం, ఈ సాధన లో భాగం! 

12. ఆర్జన తపస్సు:-

ఆర్జన అంటే సంపాదించుకోవడం. దేనిలోనయినా సరే విశేష జ్ఞానాన్ని ఆర్జిస్తే దానిని ఆర్జన తపస్సు అని అంటారు. 

13. అనుష్టానం:-

ఒక నియమిత కాలం పెట్టుకొని అంటే 41, 21,9, 11, రోజుల పాటు..ఒక లక్ష్యం తో ఇన్ని వేల సంఖ్యలో మంత్రం జపం పెట్టుకుని చేసేది అనుష్టానం. ఇన్ని రోజుల్లో రోజుకు ఒక నియమిత సంఖ్యలో జపం, ధ్యానం చేయడం వలన విశేషమైన ఫలితాలను మనం పొందుతాం..ఈ 108 రోజులు నేను చేసింది కూడా అదే.. ఇంకా ఎన్నో రకాల తపస్సులు ఉన్నాయి..వాటి గురించి కూడా చాలా వివరంగా పోస్ట్ చేస్తాను.. అంటే కేవలం శ్వాస ను మాత్రమే ఆహారంగా తీసుకొని జీవించడం, టోటల్ భోజనం మానేసి ఒక చీకటి గదిలో నుంచి బయటకు రాకుండా తపస్సు చేయడం వగైరా............ 

No comments:

Post a Comment