Xx. X2. 1-7. 021022-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀651.
నేటి…
ఆచార్య సద్బోధన:
➖➖➖✍️
పితృ ఋణం: తల్లితండ్రులు అడగకుండానే జన్మనిస్తారు.
జన్మనెత్తిన తర్వాత తనకున్న రూపు, గుణ, వయో విలాసాలతో వ్యక్తి ఆనందానికి గురి అవుతుంటాడు.
కాని ఆ రూపం ఏర్పడడానికి కారకులైన వారిని గుర్తు పెట్టుకొని వారికి తగిన విధమైన మర్యాదలు చేస్తూ, అన్ని సమయాలలో వారిని సేవించుకోవడం అవసరం.
జన్మనిచ్చినందుకు వారికి నిరంతరం సేవలు చేస్తూ మంచి సంతానంగా పేరు తెచ్చుకొని వారి ఋణం తీర్చుకోవచ్చు.
వారు శరీరాన్ని ఇచ్చినందుకే ఈ లోకంలో నివసించి, ఆలోచించగలిగే ఉత్తమ జన్మ కలిగింది కాబట్టి పితృ సంబంధమైన లోపాలు ఎన్నకుండా సేవ చేసి ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి.
భారతీయ పురాణాలన్నీ పితృసేవ వల్ల కలిగే ఉన్నతిని ఎన్నో కథల రూపంలో వ్యక్తీకరించడానికి కారణం ఇదే.
భారతీయమైన గొప్ప అంశాలలో పితృ సేవ కూడా చెప్పుకోదగింది. వారి మరణం వారికి జరగవలసిన క్రియలన్నీ సక్రమంగా జరపాలి. దీని వల్ల పితృ ఋణ విముక్తి కలుగుతుంది.
దైవ శాపానికి తిరుగు ఉంటుంది కానీ పితృ శాపానికి తిరుగుండదు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment