*అత్యంత పోషక విలువలు కలిగిన పదార్థం స్పిరులినా.. దీంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి..!*
స్పిరులినా (Spirulina) అనేది ఉప్పు నీటి జలాల్లో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క అని చెప్పవచ్చు. ఇది సయనో బాక్టీరియా జాతికి చెందినది. దీన్ని ఆల్గే అని కూడా పిలుస్తారు. ఇతర మొక్కల్లానే ఇది కూడా కిరణ జన్య సంయోగ క్రియను చేపడుతుంది. ఇక స్పిరులినాను పొడిగా, ట్యాబ్లెట్ల రూపంలో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇది అత్యంత పోషక విలువలు ఉన్న పదార్థం. దీన్ని నిత్యం 1 నుంచి 3 గ్రాముల మోతాదులో తీసుకోవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
*1. పోషకాలు:*
స్పిరులినాలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు బి1, బి2, బి3, కాపర్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్ తదితర పోషకాలు కూడా స్పిరులినాలో ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యాన్ని, పోషణను అందిస్తాయి.
*2. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ:*
స్పిరులినాలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.
*3. కొలెస్ట్రాల్:*
స్పిరులినాను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
*4. హైబీపీ:*
స్పిరులినాను తీసుకోవడం వల్ల హైబీపీని తగ్గించుకోవచ్చు. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్, కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి. దీని వల్ల రక్త నాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
*5. రక్తహీనత:*
రక్తహీనత సమస్య ఉన్నవారు నిత్యం స్పిరులినాను తీసుకోవాలి. దీని వల్ల హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
*6. కండరాలు:*
వ్యాయామం చేసేవారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి కండరాలు అలసి పోతాయి. ఒత్తిడికి గురవుతాయి. ఆ ఇబ్బందులను అధిగమించాలంటే రోజూ స్పిరులినాను తీసుకోవాలి. దీంతో కండరాలు ఆరోగ్యంగా మారుతాయి.
*7. డయాబెటిస్:*
స్పిరులినాను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ పరిశోధనల్లో వెల్లడించారు. 2 నెలల పాటు కొందరు మధుమేహ వ్యాధిగ్రస్తులకు రోజూ 2 గ్రాముల మోతాదులో స్పిరులినాను ఇచ్చారు. తరువాత పరీక్షించి చూస్తే వారిలో షుగర్ స్థాయిలు 9 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి స్పిరులినా మేలు చేస్తుంది.
No comments:
Post a Comment