300922f2142. 011022-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
జీవన విజయసూత్రం
➖➖➖✍️
కుబేరుడు శ్రీనివాసుడికి రుణం ఇచ్చిన కథ ఉంది.
అంతటి ధనసంపన్నుడూ ఎవరికీ ఎక్కడా దానధర్మాలు చేసిన కథలు కనిపించవు.
అందువల్ల కుబేరుడికి భక్తులుండరు.
సిరుల దేవత శ్రీమహాలక్ష్మిని ఎందరో ఆరాధిస్తారు. ఆ తల్లి చల్లనిచూపు పడితే చాలనుకుంటారు. ఎందుకంటే ఆ మహాదేవి అనుగ్రహమే అమోఘదానంతో సమానం.
ప్రపంచంలో కుబేర సమానులెంతమంది ఉన్నా- సత్కార్యాలు, దానధర్మాలు చేయనిదే వాళ్లకు గుర్తింపు ఉండదు.
కాబట్టి, తన సంపదను పంచడంతోపాటు, తోటివారిని ఆదుకునే తత్వాన్ని పెంచుకోవాలి! అవధులెరుగని దాత అనిపించుకోదగినవాడు భగవంతుడొక్కడే. ఆయన దాతలకే దాత.
ఎదుగుదలను భౌతికంగా, సిరిసంపదలు, అధికారహోదాలకు, విద్యాధిక్యత, జ్ఞానసంపదకు ముడిపెట్టుకున్నంత కాలం మనిషి సత్యానికి దూరంగా ఉంటాడు.
అసలు సత్యమేమిటంటే, మనలోని సంస్కారం ఒక్కో మెట్టు ఎదగాలి.
సంపూర్ణ సంస్కారవంతుడికి ఎవరి ఎదుగుదలపట్లా అసూయ, ద్వేషాలు ఉండవు.
తులసి మొక్క సర్వలోకపూజిత. అది ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది. తాడిచెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. కానీ, తులసి మొక్క పవిత్రత ముందు అది ఎందుకూ కొరగాదు.
అభివృద్ధి సోపానాలు ఎక్కడానికి ఆరాటపడటం కంటే మన అర్హతలు పెంచుకునేందుకు కృషిచేయడం చాలాముఖ్యం. ఎవరో మనల్ని మించిపోతున్నారనే దుగ్ధ మన ఎదుగుదలకు ప్రధాన అవరోధం కనుక, ఆ భావాన్ని మనలోకి రానివ్వకూడదు. మనం మనంగానే ఉండాలి. మనకు లభించాల్సినవి లభిస్తూనే ఉంటాయి. పెరగాల్సింది సంస్కారం. మరేవీ కావు. ఇదే జీవన విజయసూత్రం!...
ప్రజ్ఞ ఉన్నవాడు మాత్రమే ప్రపంచ యథార్థ స్థితిని గ్రహించగలడు. అప్పుడే కాలాన్నీ, కోర్కెల్నీ, ఇంద్రియ వాంఛల్నీ, ప్రపంచాన్నీ, చివరకు తనను తాను జయించుకోగలడు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment