Thursday, March 23, 2023

నాడు - నేడు.. ! (మన నాయకులు)

 నాడు - నేడు.. !
(మన నాయకులు)
"""""""""""""""""""""""""""""
తన ఇంట్లో అద్దెకు ఉన్న ఓ వృద్ధుడిని అద్దె బకాయి ఉందంటూ ఇంటి యజమాని వెళ్ల గొట్టాడు. వృద్ధుడి వయస్సు 94 సంవత్సరాలు. పాత ఇనుప మంచం, రెండు అల్యూమినియం ప్లేట్లు, ఓ ప్లాస్టిక్ బకెట్, చిరిగిన బెడ్ కవర్‌ను ఇంటి యజమాని రోడ్డుపై విసిరేశాడు.

వృద్ధుడు తనకు కొంత సమయం ఇవ్వాలని ఇంటి యజమానిని వేడుకున్నాడు. ఇతర వ్యక్తులు కూడా వృద్ధునిపై జాలిపడి, ఇంటి యజమానిని వృద్ధుడికి కొన్ని రోజులు సమయం ఇవ్వాలని కోరారు.

ఇంటి యజమాని అయిష్టంగానే అంగీకరించాడు. అక్కడ గుమిగూడిన కొందరు, చెల్లాచెదురుగా ఉన్న వృద్ధుడి వస్తువులను ఇంట్లోకి తీసుకెళ్లారు.

అటుగా వెళ్తున్న ఓ జర్నలిస్టు ఈ ఘటనను చూశాడు..

తాను పనిచేసే వార్తాపత్రికలో ఇలాంటి దుర్మార్గాన్ని ప్రచురించాలనే ఆలోచనతో తన పత్రికా కార్యాలయానికి వెళ్ళాడు. జరిగిన సుఘటనకు సంబంధించి అతను కొన్ని ఫొటోలు కూడా తీశాడు. తను రాసిన వార్తతో పాటు, ఆ ఫోటోలను కూడా అతను వాళ్ళ ఎడిటర్ కు అందజేశాడు. 

ఆ వార్తకు ఆ విలేకరి పెట్టిన హెడ్ లైన్ "క్రూరమైన ఇంటి యజమాని ద్వారా వృద్ధులకు అన్యాయం.. !"

తన రిపోర్టర్ తెచ్చిన రిపోర్టు చదువుతూ, అక్కడ జరిగిన సంఘటన ఫోటోలు చూసి, న్యూస్ పేపర్ ఎడిటర్ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. వెంటనే తన విలేఖరిని అడిగాడు.

"ఈ ఫోటోలో ఉన్న పెద్దాయన నీకు తెలుసా?"

రిపోర్టర్  'నో' అని తల ఊపాడు.

మరుసటి రోజు తన వార్తా పత్రిక మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో ఆ వార్త ప్రచురించ బడింది.

"దయానీయ స్థితిలో.. గుల్జారీలాల్ నందా; భారత మాజీ ప్రధాని!" అనే శీర్షికతో ప్రచురించబడింది.

ఆ రిపోర్టులో మాజీ ప్రధాని నందా తన ఇంటి యజమానికి అద్దె కట్టలేక పోవడంతో, ఆ ఓనర్ తన వస్తువులను రోడ్డుపై పడేసిన ఘటన గురించి రాసి ఉంది.

ఈ రోజు ఒకసారి ఎన్నికైన వారు కూడా కోటీశ్వరులు అవుతున్నారు.

అయితే రెండుసార్లు ఆపద్ధర్మ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి, ఎన్నో ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన నందా గారి కి నివసించడానికి సొంత ఇల్లు కూడా లేదు.

నిజానికి గుల్జారీలాల్ నందాకు ప్రతి నెలా ఐదు వందల రూపాయల భత్యం ఉండేది. కానీ ఆ భత్యానికి, 'తాను స్వాతంత్య్ర సమర యోధుడినని' చెప్పి ఐదు వందల రూపాయల భృతిని స్వీకరించేందుకు నిరాకరించాడు. అయితే అప్పుడు అతని స్నేహితులు కొందరు, మీరు ఐదు వందల రూపాయల భృతిని నిరాకరించినట్లయితే, మీ కడుపుని ఏమి చేస్తారు ? అని అతనికి చెప్పి, అతను భత్యం తీసుకునేలా చూశారు.

నివేదిక వెలువడిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయన నివాసముంటున్న ఇంటికి చేరుకున్నారు. అధికారుల హడావిడి, వారి వెంట వచ్చే ప్రభుత్వ వాహనాలను చూసి ఇంటి యజమాని ఆశ్చర్య పోయాడు. అప్పుడే అతనికి తెలిసింది. ఆయన ఇంట్లో అద్దెకుండేది మాజీ ప్రధాని తప్ప మరెవరో కాదు. ఆయనే గుల్జారీలాల్ నందా. వెంటనే ఇంటి యజమాని తనను క్షమించమని గుల్జారీలాల్ నందా కాల్లు పట్టుకున్నాడు.

ప్రభుత్వ నివాసం మరియు ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలని అధికారులు నందాను అభ్యర్థించారు.

కానీ గుల్జారీలాల్ నందా అంతే సున్నితంగా వారి అభ్యర్థనను తిరస్కరించాడు. ఆయన తన చివరి శ్వాస వరకు సాధారణ పౌరుడిలా జీవిస్తానన్నాడు. అలాగే జీవించాడు కూడా.

'నందా' ను 1997లో "భారతరత్న"తో సత్కరించారు.

ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులతో సరిపోలడం లేదు.

ఆయన మనల్ని విడిచిపెట్టి నేటికి 23 ఏళ్లైంది.

No comments:

Post a Comment