Thursday, March 23, 2023

సహనమే సంస్కృతి

 సహనమే సంస్కృతి
                ➖➖➖

* ఒక గింజను భూమిలో పాతి పెట్టామంటే, దానికి అంత్యక్రియలు చేసినట్లు కాదు. దానిని వెయ్యి రెట్లుగా పెంపొందమని ఆశీర్వదించినట్లు.*

*ఒకరి మెదడులో ఉద్భవించిన మంచి ఆలోచనలను పదిమందికి పంచడం కూడా అటువంటిదే. లక్షల మెదళ్ళను ఓవరాయిలింగ్ చేయడమే దీని లక్ష్యం.*                         

*భువిపై అన్నింటి ముఖాన మరణం శాసనం రాసిపెట్టబడి వుంది. కానీ చావులేనివి, రెండే వస్తువులు. అవి మంచి మాట, మంచి పుస్తకం.*

*క్షీర సాగర మధనం జరిగింది. హాలాహలం పుట్టింది. దేవతలు, రాక్షసులు భయపడి పరుగులు తీశారు. ఒక్క భోళా శంకరుడే గరళాన్ని గొంతులో పోసుకుని మహాదేవుడని ఖ్యాతి పొందాడు. మిగిలిన వాళ్ళంతా  చిల్లర దేవుళ్ళైనారు.*

*సాహసవంతులే చరిత్ర పుటలలో నిలిచిపోతారు.*                 

*మీరెన్నైనా చెప్పండి. సహనమే సంస్క్రతి; మానవత్వమే మర్యాద.*

 *రోజూ ఇంటిని చీపురుతో శుభ్రం చేస్తుంటావు గదా! మరి మనస్సు ను ప్రార్థనతో శుభ్రం చేసుకోవడానికి ఎందుకు బద్ధకిస్తావ్.?*

*మానవజాతి సంస్క్రతి కి శ్రమే మూలాధారం. చెమట బిందువు లే నాటి నుండి నేటి వరకు జీవజలాలు.*
.

No comments:

Post a Comment