తెలుగు సూక్తులు - మంచి మాటలు
1. ఎంతటివారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైనా ఈగల బెడద తప్పించుకోలేదు కదా.
2. మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం.
3. మరణించిన సింహం కన్నా, బతికున్న కుక్క మేలు.
4. స్వయం సమృద్ది సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం.
5. జ్ణానం వంశపారపర్య సంపద కాదు. ఎవరికివారు కష్టపడి ఆర్జించుకోవలసిందే.
6. ఎదుటివారిలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులూ స్నేహితులూ ఎవరూ మిగలరు.
7. మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన నిజం అబద్దమైపోదు.
8. గెలవాలన్న తపన బలీయంగా ఉన్నచోట ఓటమి అడుగైనా పెట్టలేదు.
9. నాయకత్వమంటే దారిపొడవునా ముందు నడవడం కాదు. బాట వెయ్యడం. త్రోవ చూపడం.
10. ఓటమి గురువులాంటిది. ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది.
11. మనసులో మాలిన్యం ఉన్నపుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం.. చేపలు రాత్రింబవళ్లు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా.
12. సక్రమంగా ఉండాలా దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయవైపే మొగ్గు, అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది.
13. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒదుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు.
14. తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ’ఎందుకో నాకీ రోజు అస్సలు ఆకలి వేయ్యడం లేదు’ అని చెప్పే వ్యక్తి.. అమ్మ
15. నీతిని బోధించడానికి అర్హతలేనివాళ్లు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే, ప్రజలకు ఆ వ్యక్తుల మీదే కాక అసలు నీతిమీదే నిరసన భావం ఏర్పడే ప్రమాదం ఉంది.
16. డబ్బు కాదు.. డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనార్థాలకు హేతువులు.
17. కనిపించేదాన్ని చూడటానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి.
18. దుష్టులకు దూరంగా ఉండాలి. కానీ వారితో విరోధంగా ఉండకూడదు.
19. ముందుకు వెళ్ళలేని ప్రతి మనిషీ వెనక్కు వెళ్ళాల్సిందే.
20. ఇప్పటివరకూ వచ్చిన మంచి పుస్తకాలన్నీ చదవటమంటే.. గత శతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖీ మాట్లాడటం.
21. ఒక గమ్యమంటూ లేనివారికి ఏ లాంతరూ దారి చూపలేదు.
22. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారికి నిరాశ అనేది కలగదు.
23. ఇంటికప్పులోని రంధ్రం ఎండలో కన్పించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది.
24. గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరయినట్లే.
25. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్శాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి.
26. నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు. తిట్టుకోనవసరం లేదు. నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి.
27. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకి వెనకా కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం.
28. పొరుగింటి గోడలు శుభ్రంగాలేవని విమర్శించడం కాదు. నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో.
29. నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.
30. రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని.
31. దురలవాట్లు మొదట్లో సాలెగూళ్లు, ఆపై ఇనుప గొలుసులు.
32. ఎదుటి వ్యక్తిని నోరెత్తకుండా చేసినంత మాత్రాన అతడిని నీ దారికి తెచ్చుకున్నట్లు కాదు.
33. తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనిషంటే మరీ ఇష్టం. -అబ్రహాం లింకన్.
34. చెప్పుల్లేని కాళ్లతో నడిచేవారు దారిలో ముళ్లచెట్లు నాటకూడదు.
35. కష్టాలను జయించడానికి నిస్పృకన్నా చిరునవ్వు బలమైన ఆయుధం.
36. ప్రకృతి, కాలం, సహనం.. ఈ మూడూ మాన్పలేని గాయం లేదు.
37. అనంతమైన ద:ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్కమాట తుడిచివేస్తుంది.
38. నువ్వు వెళ్లే దారిలో మొరుగుతూ ఉన్న కుక్కలన్నిటినీ నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు.
39. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు. కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది.
40. సాహసించేవాడి వెనుకే అదృష్టం నడుస్తూ ఉంటుంది.
41. అడ్డంకులకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం.
41. నిన్ను చూసి నవ్వే ప్రపంచాలన్ని చూసి నవ్వగలగడమే నీ తొలి విజయం.
42. విజయం, బద్దకం.. రైలు పట్టాల్లాంటివి. ఎన్నటికీ కలవవు. ఒకదానితో చెలిమి చేయాలంటే రెండోదానితో వైరం పూనాల్సిందే.
43. పర్వతం ఎత్తు చూసి జంకితే.. శాశ్వితంగా కిందనే.. సాహసించి ఒక్కో అడుగూ పైకి నడిస్తే.. శిఖరాగ్రం మీదనే.
44. హింసకు హింస సమాధానం కాదు.. కన్నుకు కన్నే జవాబైతే లోకమంతా గడ్డివారే మిగులుతారు.
45. దుష్టుల ఆప్యాయత పగకన్నా ప్రమాదం.
46. అన్ని వేళ్లా సింహలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడూ నక్కజిత్తులు కూడా అవసరమవుతాయి.
47. అన్నింటికీ దేవుడే ఆధారమట్లు ప్రార్థించు మొత్తం నీమీదనే ఆధారపడినట్లు పనిచెయ్యి.
48. నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం దేశమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడూ పడుకుని ఉంటే నీ చాపే నిన్ను ఏవగించుకుంటుంది.
49. ఆచరణలేని ఆలోచన, ఆలోచనలేని ఆచరణ.. రెండూ ఓటమికి రహదారులే.
50. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం.
51. బద్దకస్తునికి ఇష్టమైన పదం ‘రేపు’
52. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైనదాని కంటే తక్కువ తీసుకోవడం గౌరవం.
53. తప్పులు, పొరపాట్లతో ఓటమి రాదు. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడంవల్ల వస్తుంది.
54. సమస్త విజయాలకూ సహనమే సాధనం. గుడ్డును సాగదీస్తే పిల్లను పొందగలం కానీ పగులగొట్టి కాదు.5
55. ఎప్పుడూ నవ్వుతూ ఉండు. అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరూ నీకన్నా అందంగా ఉండరు.
56. నిన్ను చూసి భయపడేవాడు నీ వెనక నిన్ను ద్వేషిస్తాడు.
57. ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు. అలానే, ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు.
58. చేయవలసిన పనిని చేయకపోవడం, చేయకూడని పనిని చేయడం.. రెండూ తప్పే.
59. కుక్క మొరుగుతోందని సింహం వెనుదిరిగి చూడదు.
60. సాకులు చెప్పడం నేర్చినవాడు ఇంకేమీ నేర్చుకోలేడు.
61. ఎప్పుడూ కింద పడకపోవడం కాదు. పడిన ప్రతిసారీ తిరిగిలేవడమే గొప్ప.
62. మంచివాళ్ళతో స్నేహం చెయ్యి. నిన్నూ వాళ్లలోనే లెక్కిస్తారు.
63. ఇతరులకంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీకంటె నువ్వు మెరిగ్గా ఉండటానికి ప్రయత్నించు.
64. ఈరోజు చెయ్యాల్సిన పనిని రేపటికి వాయిదా వేసేవారు నిన్న కూడా అదే పని చేసి ఉంటారు.
65. తన పొరపాట్ల నుంచే కాదు, ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం.
66. తెలివిలేని నిజాయితీ, బలహీనం, నిరుపయోగం. నిజాయతీ లేని తెలివి.. భయానకం, ప్రమాదకరం.
67. వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా ఆలోచనా విధానమే మూలం.
68. సమాధానం చెప్పకపోవడం కూడా ఒక సమాధానమే.
69. ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు.
70. మురికినీళ్లయినా సరే మంటలను ఆర్పగలవు.
71. ఇతరుల ప్రాపకంతో పైకొచ్చి ఉన్నత పదవులు పొందిన వారివల్ల అందరికీ ఇక్కట్లే. స్వశక్తితో పైకొచ్చినవారికీ అల్ప బుద్ది ఉండదు. సూర్యుని వేడిని భరించగలం కానీ ఎండకు వేడెక్కిన బండరాళ్లమీద నడవలేం కదా.
72. తనకు ఏ విధంగానూ సహాయపడలేనివారిపట్లా, తనేం చేసినా ఎదిరించలేనివారిపట్లా ఒక మనిషి ప్రవర్తించే విధానమే అతని వ్యక్తిత్వానికి అసలైన కొలమానం.
73. మనం వెతకవలసింది చెప్పేవారి కులగోత్రాలు కాదు, చెప్పినదానిలోని మంచిచెడులు.
74. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారమవుతుంది.
75. ఎంత శిక్షణ ఇచ్చినా గాడిద యుద్దరంగానికి పనికిరాదు.
76. ఓడిపోతామేమోన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది.
77. మురికి నీటితో ఉతికిన దుస్తులు పూలతోటలో ఆరేసినంత మాత్రన శుభ్రం కావు.
78. ప్రపంచం బాగాలేదని నిందించడం కాదు. ఆ బాగోదో ముందు నీలో వస్తే అంతా బాగుపడుతున్నట్టే.
79. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఘానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం అజ్ఘానమే.
80. తోటివారితో కలసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించమే నాయకత్వం.
81. నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి.
82. ఈరోజు ఒక చిన్న అబద్దం చెబితే, దాన్ని కప్పిపుచ్చుకొవడానికి రేపు మరో పెద్ద అబద్దం చేప్పవలసిరావచ్చు.
83. ప్రయత్నించనిదే ఫలితం లభించదు. సింహమైనా పడుకుని ఉంటే ఆహారం వచ్చి నోట్లో పడదు.
84. వైఫల్యానికి కష్టాలో ఇబ్బందులో కారణమని సర్దిచెప్పడాన్ని చరిత్ర ఏనాడు ఒప్పుకోదు.
85. ధైర్యమంటే ప్రమాదాన్ని లెక్కచెయ్యకపోవడం కాదు. ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, అధికమించడం.
86. పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి.
87. మేథాశక్తి క్షీణించడం మొదలైందనడానికి విసుగు తొలి సంకేతం.
88. నిజం చెప్పడానికే కాదు, నిజాన్ని ఒప్పుకోవడానికీ ఎంతో ధైర్యం ఉండాలి.
89. అదృష్టం అందరి తలుపూ తట్టవచ్చు. కానీ ఆ పిలుపు వినగలిగిన నేర్పు కొందరికే ఉంటుంది.
90. ప్రతి చిన్న అవాంతరానికీ సంకల్పాన్ని మార్చుకునేవారు లక్షానికి దూరమవుతారు. అంతరాయాలు కలిగేకొద్దీ సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ పోవాలి.
91. ఒక్క అంగుళం దారిమళ్లినా లక్ష్యానికి మేల మైళ్లు దూరమయ్యే ప్రమాదం ఉంది.
శ్రీనివాసరావు సెక్రెటరీట్
92. ఇరవై ఏళ్లప్పుడు సాహసం, ముఫ్పైలలో శక్తి, నలభైలలో సంపద, యాభైలలో వివేకం లేనివారికి అవి ఎప్పటికీ ఉండవు.
93. విజేత వెనక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు.. కఠిన శ్రమ, అంకితభావం.
94. ఏదో జరగాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఓటమి తధ్యం. ఏది చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు సాధ్యం.
95. కొన్ని లోపాలు, కొందరికి అసౌకర్యాలు లేకుండా ఏ మార్పూ ఉండదు.. అది మంచికోసం జరిగే మార్పయినా సరే.
96. మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు. అదే చెడ్డ వాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు.
97. ఎంత అరగదీసినీ గంధపుచెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.
98. తనను చూసి కుక్క మొరిగినంత మాత్రన నిజాయితీపరుడు నేరస్తుడైపోడు.
99. తప్పుల్ని పదేపదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది.
100. ఒక్కోసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తాయి.. కళ్ళకు కమ్మిన మసకలను తొలగిస్తాయి.
101. విజయ శిఖరాలు సోమరులకు అందవు. పట్టుదలతో కృషి చేసేవారికి అవి తలవంచుతాయి.
102. నీ మనసులో నీకు ప్రశాంతత దొరకకపోతే మరెక్కడో దాన్ని వెతకడం వెర్రితనం.
103. ఎన్ని వంకలు తిప్పినా ఎన్ని రంగు పులిమినా ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్లీ బయటపడుతుంది.
104. నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యేనాటికి, మన మాటల్ని తప్పుపట్టే కొడుకులు సిద్దంగా ఉంటారు.
105. తెలివితేటలు, సామర్థ్యం ఉన్నా సాధించాలన్న తపన లేకపోతే మిగితేది వైఫల్యమే.
106. ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే. కానీ తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం.
107. స్నేహం చెయ్యడానికి ఒకటికి పదిసార్లు గమనించు. ఆ స్నేహాన్ని వదులుకోవలసివస్తే వందసార్లు అలోచించు.
108. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది.
109. అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది.
110. ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే రెండుసార్లు మోసం చేయగలిగితే ఆ లోపం నీదే.
శ్రీనివాసరావు, సెక్రెటరీట్
111. ఒక్క తప్పుకూడా చెయ్యని వ్యక్తిని మీరు చూపిస్తే ఒక్కపని కూడా చెయ్యని వ్యక్తిని నేను చూపిస్తాను. -హెచ్.ఎల్. వేలాండ్.
112. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు.
113. అధికారాన్ని ప్రేమించడమంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. స్వేచ్ఛను ప్రేమించడమంటే ఇతరుల్ని
ఇష్టపడటం.
114. బండి మందుకు సాగేటప్పుడు చక్రం అడుగుభాగం పైకీ పైభాగం కిందకి రాక మానవు. పీవనయానంలో సుఖదు:ఖాలూ అంతే.
115. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. అలోచనలు కుంటివో, గుడ్డివో అయితేనే సమస్య
116. ఔన్యత్యమంటే కోరికలను చంపుకోవడం కాదు. వాటిని అదుపులో ఉంచుకోవడం.
117. విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమీ నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాల్ని నిత్యం పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. -డా.బి.ఆర్. అంబేద్కర్.
118. చెయ్యి మనది కాకపోతే పాముని పట్టుకోవడం సులభం
119. మాట్లాడాల్సినచోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సినచోట మాట్లాడటం రెండూ తప్పే.
120. ఎగతాళి చెయ్యడం, వ్యంగ్యంగా మాట్లాడటం వాదనలో సత్తా లేదనడానికి రుజువులు.
121. స్నేహాన్ని నటించే మోసగాడికన్నా ద్వేషాన్ని వెలిగక్కే శత్రువు మేలు.
122. కత్తి చేసే గాయం కన్నా, మాట చేసే గాయం లోతు
123. నాలుకను అదుపులో పెట్టుకోవడమే నిమైన యోగసాధన
124. స్వభావాన్ని బట్టే అభిరుచులు ఉంటాయి.. కోయిల మామిడిపళ్ళను ఇష్టపడితే కాకి వేపపళ్ళను తింటుంది కదా.
125. ఏ ఆయుధాలూ వాటంతట అవి హానికరం కావు. కోపాల్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారతాయి.
126. తప్పు చేసీ సిగ్గుపడనివారిని సంస్కరించడం ఎవరివల్లా కాదు.
127. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోవడమంటే.. విమర్శ నిన్ను అంత తీవ్రంగానూ బాధపెట్టలదని అర్ధం.
128. చేసిన చెడ్డ పనులకే కాదు, చేయని మంచి పనులకు కూడా మనం సంజాయిషీ ఇచ్చుకోవాలి.
129. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోనివారే నిజమైన ధైర్యవంతులు
130. అనంతమైన దు:ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది.
No comments:
Post a Comment