Wednesday, May 3, 2023

 *🕉️🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🌹*

   *మనం భగవన్నామ స్మరణలోనున్న  మహాత్మ్యమును చక్కగా గ్రహించాలి. నామి గొప్పనా లేకా నామం గొప్పదా అని బాగుగా యోచన చేస్తే నామి కంటే నామమే గొప్పని మనం గ్రహించగలగుతాం. రాములు వారు కేవలం ఒక రూపము ధరించి ఒక లంకా పట్టణం మాత్రమే జయించగలిగారు. ఒక రావణుని మాత్రమే సంహరించ గలిగారు. కానీ 'రామ ' అను నామం అనేక మందిని సంసారములనే మహా సముద్రాలను దాటిస్తుంది. దుర్గుణములనే రావణులనేకమందిని వధిస్తున్నది. పవిత్రమైన రామ నామం విశ్వమంతా వెలసి జ్యోతిర్మయ స్వరూపముగా వెలుగొందుచున్నది.* 

*రామ నామమే భక్తుల జీవితానికి ఒక నావగా రూపొందినది. అందువలన భగవంతుని కంటే భగవన్నామమే గొప్ప. అని హనుమ కూడా నిరూపించాడు.నిరంతరమూ భగవంతుని నామ చింతన శ్రద్ధతో చేస్తుంటే మన పూర్వ జన్మల సంచిత కర్మలు మనల్ని వదిలి పారిపోతాయి. మన సమస్త చింతలూ సమసిపోతాయి. భగవంతుని నామము మన జీవితమునకు కంచువంటి కంచేవలే రక్షణగా నిలుస్తుంది. కనుక నామిని మరచినా నామంను మాత్రం మరువకండి ముందు నామం బలపడే కొద్దీ నామి కూడా మన హృదయంలో బలపడతా వస్తాడు ...*🌹🙏

No comments:

Post a Comment