Friday, October 18, 2024

*****ప్రతీ ఒక్కరు ఆచరించి మంచి ఫలితం పొందండి లేకపోతే సృష్టి కర్తకూడా మిమ్ములను కాపాడలేడు సుమా!!!!

 🙏🥸👩‍❤️‍💋‍👨🎉👩‍👦👨‍👩‍👧‍👧👨‍👦‍👦🌻👌🌺🙏

ఈ మెసేజ్ పెద్దది. నిదానంగా చదవండి. ప్రతీ ఒక్కరు ఆచరించి మంచి ఫలితం పొందండి లేకపోతే సృష్టి కర్తకూడా మిమ్ములను కాపాడలేడు సుమా !!!!!!!!!!!

వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న అమ్మాయిలు / అబ్బాయిలు మరియు వారి తల్లి తండ్రులు ఈ క్రింది వాస్తవాలను తప్పక గ్రహించాలి.

#వదువు / వరుడు గ్రహించాల్సిన అంశాలు.# 

👉వివాహం అంటేనే సర్దుకు పోవడం.

👉 వివాహం అంటే స్వర్గం అని భావించకండి. 

👉 వివాహం బాధ్యతలతో కూడిన జీవితం. అన్ని సమస్యలకు ధనం ప్రధాన కారణం. ఇద్దరు ఉద్యోగులైతే ఒకరిని మరొకరు గౌరవించుకుంటూ ఖర్చులు అదుపులో ఉంచుకుంటూ నీ వారు, నా వారు అనే భావాన్ని తొలగించుకుటూ మనకు అవసరమైన ఖర్చులు చేసుకుంటే ఎవరివద్దా చేయి చాచి అడిగే పరిస్థితి ఇద్దరూ తెచ్చుకోకూడదు సుమా. 

👉వివాహం అంటే నరకమే అనే నిర్ణయానికి రాకండి. 

👉ఆకతాయిగా తిరిగే అవకాశం అమ్మాయిలకు / అబ్బాయిలకు వివాహం తరువాత కుదరదు అనే వాస్తవాన్ని గ్రహించండి.

👉వివాహం తరువాత నాది, నీది అనే స్వార్థం ప్రతిఒక్కరు వీడాలి. 

👉 వివాహం తరువాత  మీ శరీరం , జీవితం పై జీవిత బాగాస్వామి కి హక్కులు వుంటాయని గ్రహించండి. 

👉వివాహం తరువాత ఫ్రెండ్స్ నీ / సహా ఉద్యోగులను బయటి వరకే వుంచడం మంచిది. 

👉మీరు కోరుకున్న అన్ని అంశాలు మీ జీవిత భాగస్వామిలో వుండటానికి అంగట్లో వస్తువు కాదని గ్రహించాలి. 

👉మీరు పరస్పరం ఇరువురి తల్లి తండ్రులకు, బందువులకు  గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి. 

👉సంతానం ను పొందటం బాధ్యత. వారికి నువ్వంటే నువ్వు అనుకోకుండా స్వయంగా ఇద్దరూ ట్యూషన్స్కు పంపకుండా మీరే స్వయంగా చెప్పుకోటం ఉత్తమం. అల్లుడుతో భోజనం కొడుకులకు చదువు చెప్పడం అదృష్టం. పూర్వజన్మ సుకృతం కూడా.అందరికీ లభించదు.

👉విడాకులు అనే ఆప్షన్ మీ బ్రెయిన్ లో వుంటే వివాహం చేసుకోకపోవడమే మంచిది.

👉వివాహం తరువాత మీ బాగా స్వామి మీ బానిస కాదు అని గ్రహించండి. ఒకరికి ఒకరు తోడు అని గ్రహించండి. 

👉జీవిత భాగస్వామిని మించిన నేస్తం ఎవరు లేరని గ్రహించండి.

👉ముఖ్యం గా అమ్మాయిలు మీ అత్త గారి కుటుంబ విషయాలను మీ తల్లి తండ్రులకు చెప్పకండి. వారికి మనః శాంతి లేకుండా చేయకండి వారెంత కోటేశ్వరులైన బీదవారైనా సుమా. 

👉భార్య భర్తలు తగువు ఆడటం సహజం . మళ్ళీ కలవటం మామూలే.. మీరు పడే గొడవలను మీ తల్లి తండ్రుల దృష్టికి తీసుకువెళ్ళవద్దు. 

వదువు బాధ్యతలు : 

👉వంట పని, ఇంటి పనులు, అబ్బాయి తల్లి తండ్రుల బాగోగులు ,  కుటుంబం లో ఇంకా మీ కంటే పెద్ద  వారు వుంటే వారి బాధ్యత కూడా మీదే. అత్త వారి కుటుంబమే మీ కుటుంబం అని మరువకండి.

👉 ప్రతి విషయం ను మీ పుట్టినింటితో పోల్చుకోవద్దు.

*వరుడు బాధ్యతలు.*

👉 వదువు తన తల్లి తండ్రులను వదిలి మిమ్మల్ని ,మీ తల్లి తండ్రులను నమ్మి వచ్చిందనే విషయం మరువకండి.

👉కుటుంబానికి కావాల్సిన ఆర్థిక వనరులు మీ బాధ్యత. 

👉 పెళ్లి అయిన కొత్తలో నా పెళ్ళాం మంచిది అని తొందరపడి కుటుంబం లో వున్న అన్ని విషయాలు విడమరిచి చెప్పకండి. 

👉మీ తల్లి తండ్రులు వలె మీ భార్య తల్లి తండ్రులను కూడా గౌరవించటం నేర్చుకోండి. మీ భార్యా మరియు వారితల్లితండ్రుల వద్ద మీ తల్లితండ్రులను, కుటుంబ సభ్యులను అగౌరవ పరచేలా మాట్లాడకండి. అప్పుడు మాత్రమే ఆడపిల్లల కుటుంబాలవారు వచ్చి మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయుటకు పూలదారి పరచిన మొదటి వ్యక్తిగా మిగిలిపోతారు. 

*అమ్మాయి తల్లి తండ్రులు*

👉అమ్మాయికి  నేరుగా  ఫోన్ చేసి సుత్తి వేయకండి. వియ్యపురాలిని వియ్యంకులును గౌరవించటం నేర్చుకోండి. 

👉కొత్తగా వెళ్లిన కుటుంబం లో కొన్ని ఇబ్బంది గా మొదట్లో అనిపిస్తాయని , సర్డుకోవడానికి సమయం పడుతుంది అని గ్రహించండి. ఆడపిల్ల అంటే పెళ్లిఅయిన పిదప అవతలివారి పిల్ల మాత్రమే అని గ్రహించండి. మీ పిల్ల కానేకాదు, మీకోడలు మాత్రమే మీ పిల్లని తెలుసుకోండి. 

👉భార్య భర్తల గొడవలో అమ్మాయి తల్లి తండ్రులు తల దుర్చారాదని తెలుసుకోండి. మీ అమ్మాయికి తల్లి తండ్రులు ఇకపై అత్త మామ అనే విషయాన్ని అమ్మాయికి చెప్పండి. మీ ఇంట్లో మీ అమ్మాయిని గారాబంగా చూసుకువచ్చు . అత్తవారింట్లో పుట్టింట్లో లాగా మారాం చెయ్యద్దని చెప్పడం మీ ప్రధమ కర్తవ్యం సుమా .

👉మీకు కూడా ఒక కోడలు వస్తుందని గ్రహించండి. 

👉అమ్మాయి చెప్పేవన్నీ నమ్మి ఆవేశపడి కూతురుకాపరంలో అతిగా జోక్యం చేసుకోకండి వారి కాపురం నాశనం (విడాకుల వరకు తీసుకువెళ్లవద్దు )చేయవద్దు. 

*అబ్బాయి తల్లి తండ్రులు.*

👉మీ కోడలికి మీ అమ్మాయి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మరువకండి. 

👉మీ వంశం నీ నిలబెట్టే సంతానం ను మీ కోడలు గర్భం ద్వారా జరుగుతుంది. అలాంటి మీ ఇంటి కోడలిని అపురూపం గా చూసుకోవాలి అని మరువకండి. 

👉మీ కొడలు బాగోగులు కుటుంబ పెద్దగా పూర్తిగా మామ గారివే. మీ కూతురు ,కొడుకు మీ ముందు కన్నీరు పెట్టిన పర్వాలేదు. కానీ కోడలు ఎప్పుడు కన్నీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే. 

👉మీ కోడలిని మీరు ఎలా చూసుకుంటారో , మీ కూతురుని వాళ్ళ అత్త గారు లాగే చూసుకుంటారని అబ్బాయి తల్లి గ్రహించాలి. మీ కూతురు కంటే మీకు మీ కోడలే ముఖ్యం నీ అర్థం చేసుకోండి. ఇదే పద్ధతి లో మీ కూతురు కి వర్తిస్తుంది అని గ్రహించండి. వాస్తవిక జీవితం లో ఇవి తప్పక పాటించాలి.

మీ వియ్యపురాలు, వియ్యంకుడు మీ ఇంటికి వచ్చి మీలో మీకు (ఎవరు బలహీన మనస్త్వత్వం కల్గిఉంటే వారి ద్వారా) మనస్పర్థలు సృష్టింస్తారో వారిని ఊరు పొలిమేరవరకు తరిమికొట్టే బాధ్యత (మామగారిదే) మీదే సుమా.

వధువు, వరుడుల తల్లితండ్త్రులు ఎవరైనా అనవసర పంతాలు పట్టింపులకు పోయి కుమారుల కుమార్తెల కాపరాలలో ఎట్టి అతిగా జోక్యం చేసుకోకండి. వారికాపురం చెడిపోతే మీరే మెదటి ముద్దాయిలవుతారు, ఏకోర్టులోనూ మీకు శిక్ష ఉండదు,మీ జీవిత చరమాంకంలో పశ్చాతాపం తప్పా .

వధువు వరులూ కూడా బాగా డబ్బుగర్వంతోనూ, అత్యధిక విద్యలవలనలతోను తొందరపాటుతో ఒకరినొకరు అగౌరవ పరచుకొని విడిపోతే జీవితంలో అమృతమైన ఘడియలు పోగుట్టుకున్న అతి మూర్ఖపు జంటగా చరిత్రలో మిగిలిపోతారు ఎంతవిద్యావంతులైనప్పటికీ. 

🙏♥️🌺👩‍❤️‍💋‍👨👨‍👩‍👧‍👧👩‍👦🧶🧵👨‍👦‍👦🥱🙏

No comments:

Post a Comment