Vedantha panchadasi:
ఇద మంశశ్చ సత్యత్వం శుక్తిగ రూప్య ఈక్షతే ౹
స్వయంత్వం వస్తుతా చైవం విక్షేపే వీక్షతేఽ న్యగమ్ ౹౹34౹౹
34. "ఇది రజితము"అనే భ్రాంతియందు వాస్తవముగ చూడబడినది ముత్యపు చిప్పయే.ఇదే సత్యముగ చూడబడినది.
నీలపృష్ఠ త్రికోణత్వం యథా శుక్తౌ తిరిహితమ్ ౹
అసంగానందతాద్యేవం కూటస్థేఽ పి
తిరోహితమ్ ౹౹35౹౹
35. ముత్యపు చిప్ప యొక్క నల్లటి వెనుక భాగము,త్రికోణాకారము, అదృశ్యములైనట్లే,కూటస్థ చైతన్యపు అసంగత్వము, ఆనందము మొదలగునవి కూడ అవిద్యావరణ వలన భాసింపవు.
ఆరోపితస్య దృష్టాంతే రూప్యం నామ యథా తథా ౹
కూటస్థాధ్యస్తవిక్షేపనామాహమితి నిశ్చయః ౹౹36౹౹
36. ఉదాహరణమున ఆరోపింపబడినది రజతము.అట్లే విక్షేపశక్తీచే కూటస్థముపై ఆరోపింపబడినది అహంత"నేను"అనే భావము.
ఇదమంశం స్వతః పశ్యన్ రూప్యమిత్యభిమన్యతే ౹
తథా స్వం చ స్వతః పశ్యన్నహమిత్యాభిమన్యతే ౹౹37౹౹
37. "ఇది" అనునంశమును చూచుచు దానిని రజితమని భ్రమించును అట్లే తనను తాను ఉద్దేశించుచు "నేను"అని అభిమానపడును.
సత్యత్వము వాస్తవమునకు లేనట్టి రజితమునకు అన్వయింపబడినది.
అట్లే కూటస్థ చైతన్యపు వస్తుత్వము స్వయంత్వము అనునవి కల్పితములైన శరీరములకు, అనగా జీవునకు, అవిద్యచే అన్వయింపబడుచున్నవి.
మాలిన్యములను తొలగించినప్పుడు యథార్థమగు పదార్థము అభివ్యక్తమగు విధముగాను,రాత్రిచీకటిని తొలగించినప్పుడు చీకటిచే కప్పబడిన వస్తువులు స్పష్టముగా కనిపించువిధముగాను,
అవిద్యావరణ తొలగినప్పుడు "బ్రహ్మచైతన్య" అసంగత్వము, ఆనందము తెలియబడును.
శుద్ధచైతన్యమే విక్షేపశక్తి వలన
'నేను'అను మలిన భావనను పెట్టుకొని నిజముగా అసత్యమైనను
(నేను అను)అహంకారము,అది యథార్థముగా ఉన్నట్లు నమ్మి భ్రాంతిజెందును.తనను తాను ఉద్ధేశించుచు "నేను"అని అభిమానపడును.
నేను అనుకొనునపుడు మనస్సున ఉండునవి శరీల లక్షణములే,
ఇంత అందగాడును,బలశాలిని, సంపన్నుడను,అధికారిని మొదలగునవి.
"ఇది రజతము"అనే భావములో "ఇది" అని చూడబడినది ముత్యపు చిప్ప. కాని దానిపై ఆరోపింపబడినవి రజతలక్షణములు.అట్లే "నేను"అనుటచే ఉద్దేశింపబడినది కూటస్థ చైతన్యమే.కాని దానిపై ఆరోపింపబడిన శరీర లక్షణములచే అహంత కలుగుచున్నది.
"అహం" యొక్క స్వీయతత్త్వము తెలిసినప్పుడు,అది అటుపైన అహంకారముగా అగుపించదు, అపరిచ్ఛిన్నతత్త్వముగానే అగుపించును.
వాస్తవముగా"నేను"గా వేరయిన "వ్యక్తి-తత్త్వము" లేదు.
ఈ సత్యము నిర్మల మనస్సుతో వ్యక్తికి అభివ్యక్యమయినప్పుడు అతని అజ్ఞానము తత్ క్షణమే తొలగును.
ఇట్లు"నేను"ఒక ప్రత్యేకవ్యక్తిగా అసత్యమని తెలిసినప్పుడు మానవుడు దానికి సంబంధించిన అన్యభావనలు ఎట్లు నమ్మగలడు?
ఆ విధముగా"నేను" ఉన్నంతకాలము వ్యక్తి జీవితములో దుఃఖమే ఉండును. మరియు "ఆత్మజ్ఞానము"ద్వారా తప్ప ఈ "నేను"అను భావనను వదిలించుకొనుట సాధ్యము కాదు.
వ్యక్తి ఈ "అహంతా" పిశాచావిష్టుడయినప్పుడు శాస్త్రములు,మంత్రములు ఏవియు అతనిని ఆ పిశాచమునుండి విడిపించుకొనుటకు సమర్థుని గావింపవు.
ఆత్మ అపరిచ్ఛిన్న చైతన్యమునందు కేవల ప్రతిబింబమను సత్యమును నిరంతరము గుర్తించూకొనుటవలన మాత్రమే
"అహంతా"వృద్ధి నశించును.
No comments:
Post a Comment