Friday, October 25, 2024

 ఒకరోజు కష్టం సుఖం తో ఇలా అన్నదంట...
నువ్వు చాలా అదృష్టవంతురాలివి...
ప్రతీ ఒక్కరు నిన్నే కావాలి అనుకుంటారు..
నేను చాలా దురదృష్టవంతురాలిని, నన్నెవరూ కావాలి అనుకోరు.. నా నుండి చాలా దూరంగా  వెళ్లాలని అనుకుంటారు అని..
అప్పుడు సుఖం ఇలా జవాబు ఇచ్చిదంట...
 అయ్యో!!
అదృష్టం అంతా నీదే అని అంది..
నిన్ను పొందిన వారందరు తమ వాళ్లందరినీ తలుచుకుంటారు..అసలైన తమ వాళ్ళేవరో తెలుసుకుంటారు...అదే నన్ను పొందినవారు తమ వారినే కాదు, తమని తామే మర్చిపోతారు...😔

No comments:

Post a Comment