Wednesday, October 30, 2024

 30-10-2024-బుధవారము - శుభమస్తు..
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹
జీవితము యొక్క నిజము ప్రస్తుతమే. ఇందులో గాఢ అనుభూతిని కలిగిస్తూ నేను అనిపించే శరీరముతోనే జీవించాలి అనేది నూటికి నూరుపాళ్ళు సత్యము వాస్తవము.
ఈ శరీరానికి అవసరమైన ధన సంపాదన - కుటుంబము అన్నీ అత్యవసరాలు..........
దేనిని అశ్రద్ధ చేయకూడదు. ధర్మముగా వీలైనంత స్వప్రయత్నముతో  అన్నిరకములుగా సుఖముగా, సంతోషముగా, శాంతిగా జీవించే ప్రయత్నం ఎప్పుడు చేయాలి...............................
ఈ ప్రయత్నలోపాలు - అశ్రద్దలు - అడ్డదారులు - అధర్మాలు మనను, మన కుటుంబాన్ని ఇబ్బందుల వైపు నెడతాయి..
ఇలా ఇబ్బంది, బాధ, దుఃఖము, భయము, అశాంతి లేకుండా జీవించటానికి అనువైన విషయాలను, అనేక విధములుగా విడమరచి మనుషులకు చెప్పే ప్రయత్నం అనుభవశీలురైన మనుషులే చేసారు.....
ఆ ప్రయత్నమే జ్ఞానము............
ఈ జ్ఞానానుభవములో - శరీరమునకు ఆధారముగా శక్తి వున్నది అన్న సత్యాన్ని అనుభూతి చెంది - మరల ఆ జ్ఞానాన్నిఅనేక రకాలుగా సామాన్య మనిషికి అర్ధమయ్యేలా తెలియచేసే ప్రయత్నం చేశారు.......
ఆ ప్రయత్నమే ఆధ్యాత్మికము.................
ఎన్ని రకాలుగా ఎంత మంది ఎన్ని చెప్పినా - మనము ఎన్ని రకాలుగా వాటిని తెలుసుకొని,అర్ధం చేసుకొని, ఆచరించే ప్రయత్నం చేస్తున్నా అది శరీరముతోనే - ఇప్పుడే,ఇక్కడే,ఈ జీవితములోనే చేయాలి. 
దీనినే సాధన అన్నారు.....................
జ్ఞానము,ఆధ్యాత్మికత, సాధన జీవితానికి భిన్నమైనవి కావు......................
నిత్య జీవితములోనే ప్రతి విషయములో వీటిని ఉపయోగిస్తూ - కుటుంబ జీవితం సక్రమముగా శరీరము ఉన్నంత వరకు జీవించాలి.................................
దీనినే తపస్సు అంటారు..................
ఇలా అందరితో, అందరి మధ్యలో సంతోషముగా, శాంతిగా జీవించగలిగితే 
వారిని జీవన్ముక్తులు అంటారు....
ఇదే మోక్షము.......................
ఇదే ఒక మనిషి చేరగలిగిన, పొందగలిగిన అంతిమ స్థితి.............................
ఇక్కడితో జీవితపు ఆట పూర్తి అవుతుంది.
ఆట ఎలా ఆడుతారు అన్నది - ఎవరిష్టం వారిది. ఎవరి ఆట వారిది...
🌹🌹🌹🌹 god bless you 🌹🌹🌹🌹

No comments:

Post a Comment